8, ఆగస్టు 2012, బుధవారం

సమస్యాపూరణం - 787 (రాలు కరగించు నెదను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
రాలు కరగించు నెదను వరాల నిచ్చు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

9 కామెంట్‌లు:

  1. శిలగ నున్నాడు దేవుడు శివుడటంచు
    కలత లేల నమక చమక ముల నిష్ఠ
    తోడ నభిషేక ములజేసి వేడ చెడుగు
    రాలు, కరగించు నెదను వరాల నిచ్చు.

    రిప్లయితొలగించండి
  2. రాలనెడు ఘోరమగు దుర్గుణాలు చాల
    కలవు నాలోన, భక్తితో గొలువ శివుని
    నా మహాదేవు కరుణా కటాక్ష మహిమ
    రాలు కరగించు నెదను వరాల నిచ్చు

    రిప్లయితొలగించండి
  3. త్యాగ రాజయ్య గానమ్ము రాగ మలరి
    రాలు కరగించు నెదను, వరాల నిచ్చు
    కొన్ని రాగాలు బలుకంగ నెన్ను కొనుచు
    తనివి తీరంగ పాడిన తప్ప కుండ.

    రిప్లయితొలగించండి
  4. భక్తి తోపాడు గీతము పరవశమున
    ముంచి వేయంగ; భక్తుని మొఱల వినుచు
    కఠిన శిల్పమయిన దేవి కంట నీరు
    రాలు, కఱగించు నెదను, వరాలనిచ్చు.

    రిప్లయితొలగించండి
  5. సవరణతో....
    భక్తి తోపాడు గీతము పరవశమున
    ముంచి వేయంగ; భక్తుని మొఱల వినుచు
    కఠిన శిలగనున్నను దేవి కంట నీరు
    రాలు, కఱగించు నెదను, వరాలనిచ్చు.

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    గోపికా లోలుఁడు, యశోద కూర్మి సుతుఁడు
    సేయు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ; విని
    పించు నట్టి మృదు మధుర వేణు సుస్వ
    రాలు, కరఁగించు నెదను; వరాల నిచ్చు!

    రిప్లయితొలగించండి
  7. రామమూర్తియే వినకున్న రమణి సీతఁ
    ప్రేమఁజూపి కావుమనియెఁ రామ దాసు
    భక్తుల వెతలఁ దీర్చని ప్రభువుల సఖు
    రాలు కరగించు నెదను వరాల నిచ్చు!

    రిప్లయితొలగించండి
  8. అక్షరముల౦దనిర్వచ నాత్మకమగు
    శక్తి గలదను పూర్వుల యుక్తిఁ గంటి
    సబల మంత్ర సమాన బీజావృతాక్ష
    రాలు కరగించు నెదను వరాల నిచ్చు!

    రిప్లయితొలగించండి
  9. రాగతాళ సుస్వర లయ రంజితమ్ము,
    మేలు సంగీత వాద్య సమ్మేళనమ్ము
    హద్దులనుదాటి మనుజుల హత్తుకొనును
    రాలు కరగించు నెదను వరాలనిచ్చు.

    రిప్లయితొలగించండి