10, జులై 2013, బుధవారం

సమస్యాపూరణం – 1108 (వట్టి రాకపోక లొనర్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వట్టి రాకపోక లొనర్చువాఁడె భర్త.

14 కామెంట్‌లు:

  1. కొంగు ముడి వేసి చూపులో కూర్మి నింపి
    యేడడుగులు కలసి సాగి యెదను మీటి
    అత్తమామల జూడంగ నామె కేలు
    వట్టి రాకపోక లొనర్చువాఁడె భర్త.`

    రిప్లయితొలగించండి
  2. భార్య నెంతయుఁ గష్టమ్ముఁ బడఁగ నీఁకఁ,
    గష్టములఁ గొని, సుఖములు కలుగఁ జేయు
    వాఁడెపో "భర్త"; భరియించువాఁడు కాన!
    వట్టి రాక పోక లొనర్చువాఁడె? భర్త.

    రిప్లయితొలగించండి
  3. వట్టి రాకపోక లొనర్చు వాడె భర్త
    యనెడు భ్రమలను కలిగించె నాదిలోన
    పిదప మగసిరుల్ సిరులను వెల్లువలుగ
    కలుగు వాడంచు నలరారె కాంత మిగుల

    రిప్లయితొలగించండి
  4. వట్టి రాకపోక లొనర్చువాఁడె భర్త
    యైన, నర్థాంగి తోడను అనుదినంబు
    కలసి మెలసి జీవించుచు గారవమును
    అంద జేసెడి వాడస లైన భర్త.

    రిప్లయితొలగించండి
  5. వట్టి రాక పోకలొనర్చు వాడె భర్త
    కాక , వలచియు వలపించి కాంత నతడు
    భోగ భాగ్యాల దేలగ భువిని నామె
    చేయ దగి నట్టి యేర్పాటు చేయ వలయు .

    రిప్లయితొలగించండి
  6. కష్ట సమయము లందును కలికి తోడ
    బుట్టినట్టి వారల చేయి బట్ట నెంచి
    కుశలమును విచారించగ కూర్మిఁ గేలు
    వట్టి రాకపోక లొనర్చువాఁడె భర్త.

    రిప్లయితొలగించండి
  7. మూడు ముడులకు బందియై మోద మలర
    పుట్టి నింటను విడనాడి మెట్టి నట్టి
    సతిని ప్రియముగ దరిజేర్చి సౌఖ్య మిడగ
    వట్టి రాకపోక లొనర్చు వాడె భర్త !

    రిప్లయితొలగించండి
  8. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న ఉదయం బయలుదేరి విశ్రాంతి లేకుండా ప్రయాణం చేస్తూ బ్లాగును చూడటం, వ్యాఖ్యలు పెట్టడం చేయలేకపోతున్నాను.
    రేపటినుండి సక్రమంగా బ్లాగును నిర్వహిస్తాను. అసౌకర్యానికి మన్నించండి
    (మొబైల్ ఫోను ద్వార ..పంపబడిన సందేశం)

    రిప్లయితొలగించండి
  9. మొబైల్ ఫోన్ ద్వార క్రొత్త పోస్టు బ్లాగులో పెట్టడానికి ఉదయం ప్రయత్నంచి విఫలమయ్ాను.
    వ్యాఖ్య పెట్టడంలో సఫలమయ్యాను. అంటే ఇకనుండి ప్రయాణంలో ఉన్నా మీ పూరణలను, పద్యాలను సమీకషిచవచ్చునన్నమాట!

    రిప్లయితొలగించండి
  10. మొబైల్ ఫోన్ ద్వార క్రొత్త పోస్టు బ్లాగులో పెట్టడానికి ఉదయం ప్రయత్నంచి విఫలమయ్ాను.
    వ్యాఖ్య పెట్టడంలో సఫలమయ్యాను. అంటే ఇకనుండి ప్రయాణంలో ఉన్నా మీ పూరణలను, పద్యాలను సమీకషిచవచ్చునన్నమాట!

    రిప్లయితొలగించండి
  11. దూరప్రాంతపు నౌకరీ దొరకినపుడు
    పిల్లలందరి చదువుల వీలు కొరకు
    పట్నమందున నున్నట్టి భార్య తోడు
    వట్టి రాకపోక లొనర్చువాఁడె భర్త.

    రిప్లయితొలగించండి
  12. మాస్టారూ, మీరు మొబైల్ లో తెలుగు లిపి వ్రాయటం తెలుసుకొని కొంచెం ఆశ్చర్యపోయాను. ఎలా వ్రాయగాలుగుతున్నారో చెప్పండి. నేను తెలుగు లిపి చదవగలను మొబైల్ లో, కానీ వ్రాయలేక పోతున్నాను.

    రిప్లయితొలగించండి
  13. చిరు సవరణతో ...

    వట్టి రాకపోకలొనర్చు వాడె భర్త
    యైన, నర్థాంగి తోడ తా ననుదినంబు
    కలసి మెలసి జీవించుచు గారవమ్ము
    నంద జేసెడి వాడసలైన భర్త.

    రిప్లయితొలగించండి
  14. ప్రేమ మీరగ యిల్లాలి ప్రేమ గొనుచు
    సర్వ సౌఖ్యము లన్నియు సతికి గూర్చి
    అత్త వారింటికి సతితో నప్పు డపుడు
    వట్టి రాక పోక లొనర్చు వాడె భర్త

    రిప్లయితొలగించండి