15, జులై 2013, సోమవారం

సమస్యాపూరణం – 1113 (రాముఁ డానంద మందె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.

25 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఆ ప్రురూరవుఁ, డతి మనోహరుఁడు, ఘనుఁడుఁ,
జంద్ర వంశజుఁ, డైలుండు, సాధుగుణుఁడు,
బుధ సుతుండుం, బ్రతిష్ఠాన పుర మనోఽభి
రాముఁ డానంద మందె నూర్వశిని బొంది!

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
పురూరవుని ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మేనకున్నది రంభయు మీద గలదు
స్వర్గ మందున సుత్రాము సరసమునకు
చేర రాగను మరియు శచీ మనోభి
రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఇంద్రుడు విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘మేనక + ఉన్నది’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘మేనక గలదు రంభయు మీద గలదు’ అందామా?

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

భరతమునిశాప వశమున ప్రణయమిటుల
సఫలమయ్యనటంచును సంతసించి
చక్రవర్తినిఁ జేరె నచ్చర; గుణాభిరాముఁ
డానందమందె నూర్వశినిఁ బొంది.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మాస్టరు గారూ ! ధన్యవాదములు... మీ సూచన..సవరణతో...

మేనక గలదు రంభయు మీద గలదు
స్వర్గ మందున సుత్రాము సరసమునకు
చేర రాగను మరియు శచీ మనోభి
రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.

subbarao చెప్పారు...

రాము డానంద మందె ను నూ ర్వశిని పొంది
అనగ దగునార్య ? యా రాముడనగ నేక
పత్ని యుతుడుగా దె లియుడు పరమ పురుష !
వంద నంబులు నిడుదును వంద లాది .

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

చక్రవర్తి సద్గుణ మూర్తి సమయ స్ఫూర్తి
ఇంద్ర లోకపు నర్తకి నిందు ముఖిని
రూపవతిని ప్రేమించి పురూరవుడభి
రాము డానంద మొందె నూర్వసిని పొంది

Seena చెప్పారు...

శంకరయ్య గురువర్యులకు నమస్కారములు. ఆర్యా ! మీరు ప్రస్తావించిన శీనా గారు నేను కానండి. మీ అభిమానానికి ధన్యుడను.


ఎంకి నొక కవి వలచెతా నెంత ఘనుడు
ఎంకి పాటలు పాడగ నెంత తీపి (నండూరి వారు)
కావ్య జగతిన విహరించె కవికులాభి
రాముఁ డానంద మందె నూర్వశిని పొంది. (దేవులపల్లి వారు).

మిస్సన్న చెప్పారు...

మూర్తిమిత్రమా! గురువుగారు శీనా గారిని అడిగితే గుర్తు వచ్చింది.
తెలుగువెలుగు జూలై మాసపత్రికలో 'గన్నవరపు నరసింహమూర్తి'(విశాఖపట్నమ్) గారి
రచన 'చరమాంకం' ప్రచురిత మైంది. ఆ రచన మీదేనేమోనని, ఫొటో మీ పాత రోజుల్లోదేమో నని
నా అనుమానం.

మిస్సన్న చెప్పారు...

మానవుడవని యెంచకు మానధనుడ!
పొందు మీయులూచిని పార్థ! పూర్వము, విను,
చంద్ర కులమణి యైలుడు సద్గుణాభి
రాముఁ డానంద మందె నూర్వశిని బొంది!

*****************************

చంద్ర కులమణి యైలుడు సద్గుణాభి
రాముఁ డానంద మందె నూర్వశిని బొంది
యట్లె నీవును నను బొందు మర్జున!
యని యులూచి విజయునితో ననెను వలచి.

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు. ఆయన వేఱు. శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారు కధ లద్భుతంగా వ్రాస్తారు. వారిది విశాఖ పట్టణమే ! అక్కడే ఉంటారనుకొంటాను. ఈ సారి ఎప్పుడైనా కలవాలి . బంధురిక ముందేమో తెలుసు కోవాలి. లేకపోతే నెయ్యము కలుపుకోవాలి. మా చెల్లెమ్మ ' ఎన్నెల ' కు బంధుత్వ ముందేమో !

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నేయి తినగను భరియించి నెయ్య మొంది
గొఱ్ఱె పిల్లల కాసిన గొప్ప రాజు
దేవ వేశ్యకు దాసుడై దివిజుల కభి
రాముఁ డానంద మొందె నూర్వశిని పొంది !

బొడ్డు శంకర్ చెప్పారు...

ఊర్వశి తన మనోహరి, ఊహ లందు
నామె అందచందముల నాహార్యము గని
పరవశించగ కనిపించె వరముగ నభి
రాము డానంద మందె నూర్వశిని పొంది!

కంది శంకరయ్య చెప్పారు...

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
కాని ఒక విషయం. సమస్యను మరో విధంగా పూరించే గత్యంతరం లేనప్పుడే అధిక్షేపాన్ని, క్రమాలంకారాన్ని ఆశ్రయించాలి.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సమయస్ఫూర్తి’ అన్నప్పుడు ‘య’ గురువై గణదోషం.
*
శ్రీనివాస్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. ఇప్పటివరకు మీరు చేసిన పూరణలలో ఇది ఉత్తమమైనదని నా అభిప్రాయం. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి పేరుతో ఒక కథారచయిత ఉన్నారు. మన గన్నవరపు వారు కవిసింహులు. ఈ విషయం గురించి మన బ్లాగులో గతంలోను ప్రస్తావన వచ్చింది. అప్పుడు కూడా మూర్తి గారే సందేహ నివృత్తి చేసారు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

మిస్సన్న చెప్పారు...

కవిసింహుల కభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గురువు లిచ్చిన బిరుదాంకిత ..... కవి కేసరి .....సోదరునకు అభినంద మందారములు

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

గురువుల దయ వలన అప్పుడప్పుడు సరదాగా పద్యాలు వ్రాసే నరసింహమూర్తినే. శిష్యులపై మమకారముతో గురువరేణ్యులు 'నర' తీసి ' కవి ' తగిలించారు. కవిత్వములో మీరంతా ఉద్దండులు. గురువుగారి శంకరాభరణము బ్లాగు వలన ఉత్సాహంగా యువతరము వారు , నా తరము వారు పద్యాలు వ్రాయడము నా కానంద దాయకము. బిరుదులకు మీఱే అర్హులు. మీ సహృదయతకు ధన్యవాదములు. గురువు గారికి నమోవాకములు.

వసంత కిశోర్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వసంత కిశోర్ చెప్పారు...

ప్రియమిత్రులు,కవిసింహులకు వందనాభినందనలు !

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

రైతు కొడుకు, రాముడు , ఊర్వశిని ప్రేమించి
స్నేహితుల సహాయముతో పెళ్ళాడిన వైనం :

01)
__________________________

రాఘవాపుర మందుండు - రైతు సుతుడు
రమణి నూర్వశి బ్రేమించి; -రమ్యమలర
రాణి,కాముడు, సుందర - రావు, సౌమ్య,
రాజు మొదలగు వారి పో- రామి వలన
రాత్రి , శుభవేళ , శంకరా - రామ మందు
రాము డానంద మొందె నూ - ర్వశిని బొంది !
__________________________
పోరామి = స్నేహము

కంది శంకరయ్య చెప్పారు...

వసంత కిశోర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

వసంత కిశోర్ చెప్పారు...

శంకరార్యా ! ధన్యవాదములు !