30, జులై 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1128 (లలిత కళాభిమానము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్.

21 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    కాసేపట్లో నా శిరిడీ ప్రయాణం. రేపు బుధవారం శిరిడీలో, గురువారం శని శింగణాపూర్, నాసిక్, శుక్రవారం బాసర జ్ఞానసరస్వతీ దర్శనం, శనివారం తిరుగు ప్రయాణం. పునర్దర్శనం ఆదివారం.
    ఈ నాలుగు రోజులూ క్రమం తప్పకుండా పోస్టులు ఉంటాయి. ప్రతిరోజూ సరిగ్గా ఉ. 5.30 కి ‘పద్య రచన’, 6.00 గం.కు ‘సమస్యాపూరణం’ ప్రకటింపబడతాయి.
    ప్రయాణంలో అవకాశం ఉన్నప్పుడల్లా బ్లాగును చూస్తూ ఉంటాను. కాకుంటే సమీక్షించడానికి సాధ్యం కాకపోవచ్చు.
    ఈ నాలుగు రోజులు మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసుకొనవలసిందిగా మనవి. ముఖ్యంగా క్రొత్తగా వ్రాస్తున్న వారు తమ పూరణలపై, పద్యాలపై స్పందన లేకుంటే నిరుత్సాహ పడతారు.
    పోయిన ప్రతి క్షేత్రంలోను బ్లాగు మిత్రులకు శుభాలు కలిగించాలని ఆయా దేవుళ్ళను వేడుకుంటాను.
    స్వస్తి!

    రిప్లయితొలగించండి
  2. మిత్రులారా!
    ఈ నాటి సమస్యలో ఒక చిన్న సవరణ చేస్తున్నాను (చంపకమాలగా - టైపు పొరపాటును సవరిస్తూ):

    లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్ల వారికిన్
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. కలతల బాధలన్ కరడు గట్టిన గుండె ద్రవింపజేయ క
    న్నుల రుధిరమ్ము చింద మది నొచ్చిన గాయము మాన్పజేయగా
    తలపుల దుర్గుణమ్ములవి తామర తంపరలైన నాపగా
    లలితకళాభిమానము హలాహలసన్నిభమెల్లవారికిన్

    పాము విషము గుండెలోని గడ్డలను కరిగించడానికి, రక్తం కట్టి గాయం త్వరగా మానడానికీ, కేన్సర్ తగ్గించడానికీ ఉపయోగిస్తారు.
    cancer -దుర్గుణము -- బూదరాజు ఆధునికవ్యవహారకోశం

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ ఆదిత్య గారూ! శుభాశీస్సులు.
    మీదే ఈనాటి ప్రథమ తాంబూలము. అభినందనలు. మీ పూరణ ప్రశంసనీయముగా నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. సలలిత మోద దాయకము, సద్రస బంధుర సత్ఫలమ్ము స
    ల్లలితకళాభిమానము! హలాహల సన్నిభ, మెల్లవారికిన్
    జ్వలిత హృదంతర హ్రదము, సంచలితాత్మ నికృంతనమ్ము, దు
    ష్ఫలితద, మా కళారహిత సత్త్వ మదెంతయు దుఃఖ దాయియౌ!!

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
    మీ పూరణ మంచి పద బంధముతో రాణించుచున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. పిలచిరి చౌర్యమున్ కళగ పెద్దలు గావున నాదరింతు నే
    తలపుల చేతలన్ సతము తప్పగునే యని పల్కుటొప్పునే?
    తలుపక మేలుగీళ్ళ, కళ తత్త్వము నేరక నీతి బాహ్యమౌ,
    లలిత! కళాభిమానము హలాహలసన్నిభమెల్లవారికిన్.

    రిప్లయితొలగించండి
  8. సలలిత రాగ భాసురము జాబిలి రేయిని సంత సించగా
    కలతలు రేపి మానసము గాసిలి దీర్చక బాధ బెట్టినన్
    మలినపు భావముల్ మదిని మానని గాయము రేపినంతనే
    లలిత కళాభి మానము హలాహల సన్నిభ మెల్లవారికిన్ !

    రిప్లయితొలగించండి
  9. పలువురు రోయ కర్ణముల బ్రద్దలు జేసెడి ఘాతుక ధ్వనుల్
    సలుపుచు పిచ్చివారి వలె సైయని గెంతుచు దుస్సహాంగిక-
    మ్ముల దరిశింప జేయ గని మోదము జెందుట మేలె? యట్టిచో
    లలిత కళాభిమానము హలాహలసన్నిభమెల్లవారికిన్.

    రిప్లయితొలగించండి
  10. లలిత కళా విశేషమని లజ్జను వీడి యసభ్య రీతి వే-
    ల్పుల యపురూప రూపముల బొమ్మల జేసిన పాపి జూపగా
    లలిత కళా విలాసమని లజ్జను వీడి నుతింప జూచుచో
    లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్.

    రిప్లయితొలగించండి
  11. పలుకులరాణి సత్కళలవాణికి మోదము గూర్చనట్టిదౌ
    జలనిధిపైననూగుజలజాయత నేత్రునికిచ్చగాని, లో
    కులకురసానుభూతులను గూర్చగలేని వికార పూరమౌ
    లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్!!!

    రిప్లయితొలగించండి
  12. లలిత కళాభిమానులయి రాజులు పోషణ జేయ నెంచుచున్
    నిలిపిరి పండితార్యులను నిత్యము కొల్వున, విస్మరించి రా
    యలసిన పేదవారలకు నన్నము పెట్టుట, పొట్టనింప నీ
    లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్ల వారికిన్!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు. మీ మూడు పూరణలు --
    (1) నీతి బాహ్యములౌ లలిత కళలు;
    (2) కర్ణ కఠోరములైన శబ్దములతో కూడిన ప్రక్రియలు; మరియు
    (3) గుడుల వద్ద వేల్పుల అసభ్య రూపములకి సంబంధించిన లలిత కళలు --
    గురించి వ్రాసిన పద్యములు చాలా బాగుగ నున్నవి. అభినందనలు.

    అమ్మా రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చక్కగా నడచినది. మానసములను బాధించే మలినపు భావనలకి సంబంధించిన లలిత కళాభిమానము గురించి పేర్కొన్నారు. అభినందనలు.

    శ్రీ పీతాంబర్ గారూ! శుభాశీస్సులు.
    సరస్వతి గాని విష్ణుమూర్తి గాని ఇచ్చగించనవియు, మరియు లోకులకు రసానుభూతిని కలిగించలేని లలిత కళలను గూర్చి పేర్కొనినారు. చాలా బాగున్నది - మంచి భావము - అభినందనలు.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    ఈ కాలము రాజపోషణలేని కవిత్వము వంటి లలిత కళలని గూర్చి ప్రస్తావించేరు. భావము చక్కగా నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. ఉలి కదిలించు శిల్పములు ఉత్తమ నాట్యకళావిలాసముల్
    కల కరగించు కావ్యములు, కమ్మని గానరసామృతమ్ము సం
    చలనము సృష్టి జేయుచు ప్రజాదరమున్ తగ పొందలేనిచో
    లలితకళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ తిమ్మాజీ రావు గారు! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగగ నున్నది. ప్రజాదరణ లేని లలిత కళల స్థితిని వర్ణించేరు. అభినందనలు. స్వస్తి.




    రిప్లయితొలగించండి
  17. నమస్కారములు
    అ,ఆ , లు రాని నేను గురువుల ప్రసంసలను పొందడమా ? ఏమి నా భాగ్యము. ?
    పూజ్య గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  18. తొలి చిగురాకువోలె మదిఁ దోచెడు నవ్యపు భావనావళిన్
    పలు తెరగుల్ వెలుంగు కళ; పండిత పామరకోటి మెచ్చగా
    కలల ప్రపంచమొండ్రు నిల గానగఁ జేయు, నదెవ్విధంబునన్
    లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్?

    అసమాన ప్రతిభగల కవిమిత్రులందరూ వ్రాసిన సమధానాలన్నింటికి ఒక ప్రశ్న వేసినట్టుంది.

    రిప్లయితొలగించండి
  19. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    ప్రశ్న రూపముతో ముగించిన మీ పూరణ మెచ్చుకొన దగినది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. నేమాని పండితార్యా! ధన్యవాదములు.
    నా మూడవ పూరణ హిందూ దేవతలను నగ్నముగా చిత్రములలో
    జూపిన ధూర్తుని దృష్టిలో ఉంచుకొని చేశాను.

    రిప్లయితొలగించండి
  21. కలుపుచు గంజ భంగులను గ్లాసుల త్రాగుచు సోడలోనహా
    వలపుల రాణులెల్లరును వంకర టింకర రీతులందునన్
    తలుపులు మూసి డ్రమ్ములను దద్దర గొట్టెడి డిస్కొ డాన్సులన్
    లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్

    రిప్లయితొలగించండి