4, జులై 2013, గురువారం

పద్య రచన – 392 (బెత్తము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“బెత్తము”

13 కామెంట్‌లు:

  1. పొత్తములను జదువనిచో
    బెత్తము ఝళిపించు గురువు విద్యార్థులపై
    పెత్తనము జూపి, నేడా
    బెత్తమునకు బనులు తప్పె వింటివె గురుడా!

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ఈ కాలంలో ఉపాధ్యాయులు బెత్తం పట్టుకొనడం నేరమయింది మరి!

    రిప్లయితొలగించండి
  3. బెత్తము నుపయోగితురు
    పొ త్తములను జదువ కుండ పోకిరి వలెనున్
    పత్తనపు రోడ్ల వెంబడి
    ఉత్తిత్తుగ దిరుగు నెడల నొజ్జలు మిగులన్

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    శ్రీ నేమాని గురుదేవుల "బెత్తము" బహు జక్కగా నున్నది. శ్రీ సుబ్బారావు గారి "బెత్తము" పోకిరి వలె అదుర్స్
    =========*======
    బెత్తము నెత్తిన గురువును
    కత్తికి బలి జేయుచుండ కలియుగమున ను
    త్తుత్తిగ దిరుగుచు నుండిరి
    బత్తెము లేక పురమందు పండిత వర్యుల్।

    రిప్లయితొలగించండి
  5. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. బెత్తములకు నిచ్చినచో
    పెత్తనమును బెదరజేయు విశ్వమునెల్లన్
    చిత్తము కట్టడి చేసెడి
    బెత్తము కనుపింపదయ్యె విబుధ వరేణ్యా!

    రిప్లయితొలగించండి
  7. నేటి పిల్లల పొగరు ఇది కాదా?

    బెత్తముఁ జూచి బెదరరట,
    చిత్తము వచ్చిన కురీతిఁ జేయుచు పనులన్
    సత్తువ యుందను పొగరున
    నెత్తికి నెక్కుచును చాల నిక్కులు వోరే?

    రిప్లయితొలగించండి
  8. “చదువుకొనక పోతె చర్మ మూడగ గొట్టు
    చింతబరిగె తోడ పంతులయ్య"
    అనుచు బెదరిపోవు యా రోజులే వేరు !
    బెత్తమనిన మాకు భీతి గలుగు

    రిప్లయితొలగించండి
  9. విత్తము నెఱజూపి నేతలు
    బెత్తము ఝళిపించి జనుల బేరము లాడన్ !
    చిత్తము లేకను వారలు
    గుత్తముగా నోటు వేసి గోతిలొ పడగన్ !
    -----------------------------------
    కుత్తుక వఱకును యువతులు
    జుత్తును కత్తిరిని వేసి జూడగ వెగటౌ !
    మొత్తము నాగరి కతయని
    బెత్తము ఝళిపించి గెలువ పెద్దల నైనన్ 1

    రిప్లయితొలగించండి
  10. battemu guruvadi coocunu
    pottamu mari cooDarayyo pOkiri pillal
    bettamu coopina hatteri
    kaatulanE coopu vaaru kaalamu maaren.

    రిప్లయితొలగించండి
  11. బత్తెము గురువది చూచును
    పొత్తము మరి చూడరయ్యొ పోకిరి పిల్లల్
    బెత్తము చూపిన హత్తెరి
    కత్తులనే వారు చూపు, కాలము మారెన్.

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    ‘చిత్తము కట్టడి చేసెడి’ బెత్తమును గురించిన మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చిన్నప్పటి ‘చింత బరిగె’ను గుర్తుకు తెచ్చారు. బాగుంది పద్యం. అభినందనలు.
    పోతే.. ‘పోతె’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘చదువుకొనక యున్న’ అందామా?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యం మొదటి పాదంలో గణదోషం. ఆ పాదాన్ని ‘విత్తమును జూపి నేతలు’ అందాం. ‘గోతిలొ’ అని ‘లో’ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాసారు. అక్కడ ‘గోతిని’ అందాం.
    రెండవ పద్యం రెండవ పాదాన్ని ఇలా అందాం... ‘జుత్తును తెగ కత్తిరించి జూడగ వెగటౌ’
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చమత్కార భరితమైన మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి