9, జులై 2013, మంగళవారం

పద్య రచన – 397 (రాజమహేంద్రి)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“రాజమహేంద్రి”

10 కామెంట్‌లు:

  1. గోదావరి దరి నగరిది
    రాదారిది తెనుగు కావ్య రచనల పురికిన్
    ఆదికవి భారతమ్మును
    మోదముతో తెలుగులోన మొదలిడె నిచటే.

    రిప్లయితొలగించండి
  2. వేదనాదములతో గోదావరీనది
    ....పావనమ్మొనరించు పత్తనమ్ము
    మంచి గాలియు నీరు మంచి యాహారమ్ము
    ....పుష్కలమ్ముగనుండు పురవరమ్ము
    విద్యాలయమ్ములు విజ్ఞాన సంస్థలు
    ....నాసుపత్రులు కలయట్టి నగరి
    వాణిజ్య కేంద్రాలు వాహన సౌకర్య
    ....ములు రాజకీయముల్ వెలయు సీమ
    భారతము తెనుగున వ్రాయబడిన తావు
    రాజరాజనరేంద్రాది రాజ ముఖ్యు
    లేలినట్టి పురమ్మది యెల్ల కళల
    కేంద్రమై యొప్పు రాజమహేంద్రవరము

    రిప్లయితొలగించండి
  3. గోదావరి పుష్కరముల
    నే దర్శించితి నదికతి నికటము నుండెన్
    మోదమ్మందితి కవిజన
    మా దారిని నడచి పోయి రంచను దలపున్.

    రిప్లయితొలగించండి
  4. రమ్య హర్మ్యాల విలసిల్లు రాజ మండ్రి
    చూడ చక్కని పురమది చూడ రండి
    రాజ రాజ నరేంద్రుని రాజ్య మచట
    రామ రాజ్యము పగిదిని రాణ కెక్కె .

    రిప్లయితొలగించండి
  5. రాజరాజ నరేంద్రుని రాజ ధాని
    కావ్య పంటలు పండించు కవుల నెలవు
    గౌతముని పేర నిలచిన గౌతమి నది
    కోటి లింగాలు వెలసిన మేటి నగరు

    రిప్లయితొలగించండి
  6. రాజరాజ నరేంద్రు రాజ్యవైభవ దీప్తి
    ................నన్నయ ఘంటపు నవ్య మూర్తి
    సారంగధరు దీన చారిత్ర ఘటనలు
    ................చిత్రాంగి రత్నాంగి చిత్ర కథలు
    వీరేశలింగము నారీ సమాన్యత
    ................గోదావరీ నది గొప్ప నడత
    శ్రీపాద కృష్ణమూర్తి గ్రంధ మాలిక
    ................చిలకమర్తి యశస్సు శ్రీల చిలుక

    కోటిలింగాల సన్నిధి గొప్ప వరము
    కళల కాణాచి కైతల కమ్మని రుచి
    చేరి చెడువాడు లేడను చెడని కీర్తి
    ఘనత రాజ మహేంద్రిదే కల్ల గాదు.

    గలగల పారు దివ్య నది గౌతమి యొడ్డున గొప్ప దీక్షతో
    మిలమిలలాడు వెన్నెలలు మేలిమి జల్తరు వన్నె లీనగా
    జలజల జాలు వార తన చల్లని ఘంటము నుండి వాక్సుధల్
    తొలికవి భారతాఖ్యమను తొల్లిటి కావ్యము చేసె నిచ్చటన్..

    రిప్లయితొలగించండి
  7. తమ యూ రనగానే తన్మయముతో మిస్సన్న గారు వర్ణించిన రాజమహేంద్రి శోభాయమానముగా నుంది.

    రిప్లయితొలగించండి
  8. 'రాజమహేంద్రియె ' రమ్యము
    వాజ గలుగు 'రాజమండ్రి ' పరనామంబున్
    దేజస్సుల నోజమ్ముగ
    'రాజమహేంద్రి నగరి ' యనరె రాజస మలరన్ !

    రిప్లయితొలగించండి

  9. చిన్న సవరణతో...

    రాజరాజ నరేంద్రు రాజ్యవైభవ దీప్తి
    ................నన్నయ ఘంటపు నవ్య మూర్తి
    సారంగధరు దీన చారిత్ర ఘటనలు
    ................చిత్రాంగి రత్నాంగి చిత్ర కథలు
    వీరేశలింగము నారీ సమాన్యత
    ................గోదావరీ నది గొప్ప నడత
    శ్రీపాద కృష్ణమూర్తి గ్రంధ మాలిక
    ................చిలకమర్తి యశస్సు శ్రీల చిలుక

    కోటిలింగాల సన్నిధి గొప్ప వరము
    కళల కాణాచి కైతల కమ్మని రుచి
    చేరి చెడువాడు లేడను చెడని కీర్తి
    ఘనత రాజ మహేంద్రిదే కల్ల గాదు.

    గలగల పారు దివ్య నది గౌతమి యొడ్డున రాణ్మహేంద్రిలో
    మిలమిలలాడు వెన్నెలలు మేలిమి జల్తరు వన్నె లీనగా
    జలజల జాలు వార తన చల్లని ఘంటము నుండి వాక్సుధల్
    తొలికవి భారతాఖ్యమను తొల్లిటి కావ్యము చేసె దీక్షతో.

    రిప్లయితొలగించండి