14, జులై 2013, ఆదివారం

పద్య రచన – 402 (ఉపాయము)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“ఉపాయము”

17 కామెంట్‌లు:


  1. అయ్యవారు రీటైరు అయినా
    ఉపాయముగా బ్లాగు లోకమున
    రీ-టైరు అయి తమ హృదయ
    పద్యములను ఆవిష్కరించె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. అందని ఆకులుఁ జవిగొన
    నందెనుగా వాహనమ్ము! హా!హా! యనుచున్
    ముందటి కాళ్ళను పై నిడి
    విందులు దా గుడిచె నజము, విన్నాణి ! గనన్ !

    రిప్లయితొలగించండి
  3. చిత్ర మందున జూడుడు శిశువు లార!
    ఓ గిరంబున కొఱకునై నొక్క మేక
    ఎక్కి మోటారు బండిని చక్క గాను
    పత్రములనునం దుకొనెను జిత్ర ముగను

    రిప్లయితొలగించండి
  4. సతతంబు నుపాయంబున
    జతనంబులు సేయునె డల చక్కగ పనులన్
    హి తముగ జేయగ వచ్చును
    సుతరంబగు మేక సాక్షి చూడుము నరుడా !

    రిప్లయితొలగించండి
  5. పెక్కులగునుపాయమ్ములు పిలువకుండ
    తోచుచుండును- పొట్టను తుచ్ఛమనక
    నింపు ప్రాణికోటి; మృగము నేర్పు గనిన
    వింతఁ దోచు నాహా! కడు ప్రియముఁ గొల్పు.

    రిప్లయితొలగించండి
  6. జిలేబీ గారూ,
    ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘విన్నాణ’మైన పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యం చివరి పాదాన్ని ‘పత్రముల నందుకొనుచుండె జిత్రముగను’ అంటే బాగుంటుందని నా సలహా.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ప్రియము గొల్పెడి మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
    *
    ఆదిత్య గారూ,
    చమత్కారభరితమైన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ఆదిత్య గారూ,
    మీరు చెప్పేదాకా దానిమీద నా దృష్టి పడలేదు. మీ సవరణ బాగుంది. స్వస్తి!

    రిప్లయితొలగించండి
  8. ఆదిత్య గారూ,
    పద్యాన్ని తొలగించారెందుకు?

    రిప్లయితొలగించండి
  9. మేక తోక మేక" మెప్పుపొందె నపుడు
    మేక బైకు పైన మేసె నిపుడు
    తెలివి తెగువయున్న దేనికింక కొరత!
    మేక మాట వినుడు "మే"లు కొనుడు

    (మేకసూక్తి దుష్ట సమాసం అని మేకమాట గా మార్చాను )

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    గురువు గారికి ధన్యవాదములు
    శ్రీ శైలజ గారు గురువుగారు పామరుడనైన నన్ను ప్రోత్సహించి, తప్పులను సరిజేయుచున్నారు. ఇది అంతయు గురువుగారు పెట్టిన భిక్ష.
    =======*=======
    నేర్పు గల వారికి నెయ్యమైన బ్లాగు "శంకరాభరణము"

    పండితులకు,పామరులకు మెండుగాను
    శంకరాభరణము బల్కు స్వాగతమ్ము
    నేర్పు గల మేకలకు నేడు నెయ్యము గను
    వందన శతకములు జెప్పు వరుస గాను ।

    రిప్లయితొలగించండి
  11. బక్షించగ నజ మొక్కటి
    కుక్షిం భరిత్వమునకని కూరిమి తోడన్ !
    రక్షణ గాతిన గోరుచు
    లక్షణ మగు తెరువు నెంచి యత్నము జేయన్ !

    రిప్లయితొలగించండి
  12. ఆకలేమొ నేర్పు అవనిలో పాఠాలు
    సృష్టి వస్తువెల్ల సూటి గురువు
    ఓర్పు నేర్పు యున్న ఓటమే వుండునా
    మేక యైన నేమి కేక కేక

    రిప్లయితొలగించండి
  13. ఆకలి వేసెను మేకకు
    నాకులు కనబడెను చూడ నందనివాయెన్
    న్యాకుగ స్కూటరు నెక్కెను
    ఆ కడుపున కాల వచ్చు నైడియ లెన్నో !

    రిప్లయితొలగించండి
  14. చిత్రాన్ని చూచి స్పందించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.....
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    ఆదిత్య గారికి,
    వరప్రసాద్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు, (రెండవ పాదంలో ‘భరిత్వ’ అని జగణం దోషం)
    శైలజ గారికి, (‘వుండునా’ అని గ్రామ్యం. అక్కడ ‘యుండునా’ అంటే సరి)
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, (న్యాకుగ నెక్కెను స్కూటరు/ నా కడుపున... అనండి)
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి