20, జులై 2013, శనివారం

పద్య రచన – 408

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. శునకమ! కడు శ్రమతో సా
    ధన చేసితిగాదె మెచ్చదగు నిను, యత్న
    మ్మున నే కార్యము నేనియు
    ఘనముగ సాధించవచ్చు గద నీ వలెనే

    రిప్లయితొలగించండి
  2. కుక్కను చూడండెంతో
    చక్కగ తా శిక్ష బొంది సర్కస్ చేసెన్
    తిక్కల నరుడా సాధన
    చిక్కులనే దాటజేసి చేర్చును గమ్యం.

    రిప్లయితొలగించండి
  3. సాధనంబున సముకూరు సర్వులకును
    అన్ని పనులును జక్కగ నడ్డు లేక
    శునక రాజము సాక్షియే చూడు డార్య !

    ఎటుల నిలబడె వాటిపై నెత్తు లోన .

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    గురువు గారికి ధన్యవాదములు
    ==========*========
    సాధన జేయంగ నరులు
    సాధించిరి గంగ తోడ శంభుని భువికిన్|
    సాధన జేసిన శునకము
    సాధించె నసాధ్యమును సుసాధ్యమ్ముగనన్.

    రిప్లయితొలగించండి
  5. పెరిగి పోవు చున్న పేకమేడల కన్న
    స్థిరము గానె యుంది చింత లేదు
    నరుని తోడ కలసి చిరకాల ముండగా
    యిట్టి పిల్లచేష్ట లేమి లెక్క!

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘చక్కగ శిక్షణను బొంది..’ అంటే బాగుంటుందేమో.
    ‘గమ్యం’ అని అనుస్వారాంతంగా పదాన్ని వ్రాసారు. అది వ్యావహారికం. అక్కడ ‘చేర్చు విజయమున్’ అందామా?
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సర్వులకును + అన్ని’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘సర్వజనుల/కన్ని పనులును...’ అందాం.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    ఆదిత్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఉంది’కి బదులు ‘కలదు’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. చక్కగ జెప్పిన మాటను
    మక్కువగా నేర్చి నంత మంత్రించి నటుల్
    మిక్కిలి విశ్వాసము గను
    నిక్కముగా జేయ నెంచె నేర్పుగ వింతల్ ! !

    రిప్లయితొలగించండి
  8. చక్కని నైపుణ్యముతో
    నెక్కితివి పిరమిడు పైన నెందుకు కుక్కా?
    రొక్కము నాశించితివా
    కుక్కా! నీ కెందు కంత కోరిక చెపుమా!

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  10. కార్యనిష్ఠ శ్రమయు క్రమశిక్షణివ్వగ
    శునకరాజ మొకటి సోకుమీర
    ఆరుడబ్బాల పై ఆరోహణముచేసి
    జనులు మెచ్చుకొనగ ఘనత నొందె

    రిప్లయితొలగించండి
  11. విశ్వాసమ్మున కీవు దర్పణము గావే ! శ్వానమా! బొందిలో
    నీ శ్వాసాడెడు నంత కాలమును, రానీ యాపదల్, భక్తుడా
    విశ్వేశున్ మది వీడబోని పగిదిన్, వేయేల నీ స్వామినిన్
    విశ్వాసమ్మున గొల్చు చుందుగదవే వెన్నంటి యో ముద్దకై.

    కుక్కకు నైన శిక్షణను కూరిమి నీయ నొకింత యోర్పుతో,
    నక్కజమైన భంగిమల నాడును చెప్పిన చొప్పు! సజ్జనుం-
    డక్కరణిన్ మనస్సును మహర్షులు చూపిన సత్పథమ్ములో,
    ప్రక్కల కేగకుండ నడుపన్ పరమార్థము నొందు మిత్రమా!


    రిప్లయితొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘శిక్షణ + ఇవ్వగ’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘క్రమశిక్షణ నొసంగ’ అందాం.
    మూడవ పాదంలో ‘డబ్బాలపై’ అన్నప్పుడు గణదోషం. ‘ఆరు డబ్బల పయి నారోహణము..’ అంటే ఎలా ఉంటుంది? నిజానికి ‘డబ్బా’ దీర్ఘాంతమే కాని మరో దారి కనపడలేదు.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    పరమార్థానికై చక్కని పథాన్ని చూపిన మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    జాలిగుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా :

    01)
    __________________________

    చుక్కల నంటు విచిత్రము
    చిక్కెనుగా మనకు నేటి - చిత్రము నందున్
    చక్కగ నేర్పించుటచే
    చొక్కముగా నిక్కి నట్టి - శునకము గనుడీ !
    __________________________

    02)
    __________________________

    చెక్కులు తే తెమ్మంచును
    చిక్కులు బెట్టెడి తనయుల - చేతల కంటెన్
    చిక్కుల నధిరోహించెడి
    చిక్కిన కుక్కే నయముర - సృష్టిని గనినన్
    __________________________
    చెక్కులు = cheques

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పద్యాలూ చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి