24, జులై 2013, బుధవారం

పద్య రచన – 412 (కాకి - కేకి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము.....
“కాకి - కేకి”

15 కామెంట్‌లు:

  1. కాకు లెల్ల నుండు నైకమత్యము తోడ
    బంధుజనుల రాక వార్త తెలుపు
    ఖ్యాతి గాంచె కేకి జాతీయ పక్షిగా
    నృత్యమందు మిగుల నేర్పు జూపి

    రిప్లయితొలగించండి
  2. కాకికి కేకే ' కాకా '
    కేకికి ' కాకాక ' కాక ' కీకీ కీకీ '
    కాకీక కాటుకేయిక
    కేకికి కోకల్ని జూడ కేకే కేకౌ.

    రిప్లయితొలగించండి
  3. కాకి కేకులు రెండును గాఱు నలుపు
    కూత మాత్రము భిన్నపు గూ త లుండు
    కాకి కాకా యనగ మఱి కేకి 'కూ' యనునులె
    కాకి పొదుగును దన యొద్ద కేకి గ్రుడ్లు .

    రిప్లయితొలగించండి
  4. కావు శాశ్వతములు సిరులు కాయములును దైవమున్
    కావు మనుచు వేడుడనుచు కాకి చేయు బోధలన్
    రావు మరల మరల మంచి రంగు రంగు దృశ్యముల్
    నా విధమ్ము గాంచుడంచు నాట్యమాడు బళి శిఖుల్

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సుబ్బా రావు గారు కేకి అంటే కోకిలగా పొరబడి నట్లున్నారు. కేకి అంటే నెమిలి కదా. పద్యమును మార్చితే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. కాకా యని యఱచి యఱచి
    కాకానిగ తనదు పేర గ్రామమె వెలసెన్ !
    కేకికి లోటే లేదన
    యా కార్తి కేయునికి తాను వాహన మయ్యెన్ !

    రిప్లయితొలగించండి
  7. గురువు గారు క్షమించాలి. సస్యాపూరణలో పెట్టితిని
    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
    ======*======
    చిన్న నాడు జదివిన పాఠమొకటి గుర్తుకు వచ్చి

    కేకిని గని కాకియు కే
    కీకల తోడ దిరుగాడ యేకాకయ్యేన్
    కాకుల గుంపున, కాకికి
    కేకియు రూపము వలదుగ కీర్తిని పొందన్

    రిప్లయితొలగించండి
  8. కాకా సురు నకు వరమిడె కాలు డనగ
    పిండము లను దిను మంచు దండి గాను
    లేదు కేకికి కొదవన జాతి కంత
    పక్షి రాజుగ వెలుగొందు నక్ష యముగ

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    దేని ప్రత్యేకత దానిదే అన్నట్టు చక్కని పద్యాలను వ్రాసారు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం ‘కెవ్వు కేక..."
    కానీ.... అర్థం కాలేదు. :-)
    *
    సుబ్బారావు గారూ,
    పద్యం బాగుంది,.
    కానీ నేమాని వారన్నట్టు మీరు నెమలిని కోయిల అనుకున్నారు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి ప్రయత్నం. అభినందనలు.
    చివరి పాదంలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ.....
    కాకా యని యఱచి యఱచి
    కాకానిగ తనదు పేర గ్రామమె వెలసెన్ !
    కేకికి లోటా యా కా
    ర్తికేయునకు వాహన మయి దీపించెఁ గడున్!

    మీ రెండవ పద్యం బాగుంది. రెండవ పాదంలో గణదోషం. ‘‘తినుమంచు’ను ‘తిను మటంచు’ అంటే సరి!
    *
    వరప్రసాద్ గారూ,
    ‘కాకీక కాకికి కాక కేకికా?’ చిన్నప్పుడు చెప్పుకున్నది. మళ్ళీ గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. కేకి విహగరాజు కాకి ఁ యతని వేగు
    నీటిపక్షికోట నిప్పుపెట్టె
    ప్రాణహాని కల్గె పక్షుల జాతికి
    విగ్రహమ్ము నెపుడు నిగ్రహించు

    రిప్లయితొలగించండి
  11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    పంచతంత్ర కథను ప్రస్తావించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. కాకికి బంధువు లెక్కువ
    కాకా యని నంత గూడు కాకములెల్లన్
    కేకికి అందం బెక్కువ
    కేకించుచు నాట్యమాడు కేరింతలతో

    రిప్లయితొలగించండి
  13. బొడ్డు శంకరయ్య గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘కేకించు.." ?

    రిప్లయితొలగించండి
  14. కవి మిత్రులందరికీ అభినందనలు ....హనుమచ్చాస్త్రి గారు మీ పద్యం అద్భుతం గా ఉంది ...నేను అర్ధం చేసుకున్న భావన అయితే ఇది
    " కాకి "కా కా " అని కేక పెడుతుంది ..
    కేకి " కా కా" అని కాక "కీ కీ కీ కీ " అంటుంది
    కాకీక నల్లగా ఉంటె
    కేకి కి మాత్రం కోక అందం గా ఉంటుంది (కేకో కేక ? )
    అంతేనా గురువు గారూ ! తప్పైతే సారీ

    రిప్లయితొలగించండి
  15. మాస్టరుగారూ ధన్యవాదములు.
    వంశీ కృష్ణ గారూ ! నా కాకి, కేకి కేకల్ని చీకాకు పడకుండా చక్కగా అర్థం చేసుకున్నారు...కెవ్వు కేక...
    అర్థం సుబోధకం కోసం చిన్న సవరణ...

    కాకికి కేకే ' కాకా '
    కేకికి ' కాకాక ' కాక కేకే వేరౌ
    కాకీక కాటుకేయిక
    కేకికి కోకల్ని జూడ ' కేకే కేకౌ '

    రిప్లయితొలగించండి