31, జులై 2013, బుధవారం

పద్య రచన – 419 (మయసభ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“మయసభ”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

10 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


మా 'తెలుగుమయ' సభ
మాయ మై రెండు అయినాది
ఒకటి మీది మరొకటి మాది
వెరసి మీకుమీరే మాకు మేమే !


జిలేబి

subbarao చెప్పారు...

మయుని సభను జూడ నరిగి మమత తోడ
ఉన్న దనుకొని దాకగ సున్న మిగిలె
లేదు లేయని నేగగ మీ ద కుఱు క
బల్లి నా మీ ద , మిక్కిలి భయ పడితిని

vsnmhari చెప్పారు...

మయసభ కేంద్రమై నిలిచె మంజుల సుందర చిత్రరాజికిన్
మయసభ కేంద్రమై నిలిచె మైమరపించు మహాద్భుతాలకున్
మయసభ కేంద్రమై నిలిచె మానధనాఢ్యుని భంగపాటు కా
మయసభ కేంద్రమై నిలిచె మానిని ద్రౌపది దు:ఖపంక్తికిన్.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీ హరివరూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
మయసభ కేంద్రమై నిలిచె మా హరి మిత్రు కవిత్వ దీప్తికిన్

Pandita Nemani చెప్పారు...

శ్రీమతి జిలేబి గారికి శుభాశీస్సులు.
మీ భావ వైవిధ్యమునకు ఢోకా లేదు. మీరు పద్య విద్యలో ఎప్పుడు అడుగు పెడతారో అని చూస్తున్నాము. స్వస్తి.

vsnmhari చెప్పారు...

ఆర్యా!
ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పొందు పరచిన మణులను బిందు నదము
ఇంద్ర నీలపు మెరుపులు నీటి పైన
పద్మ రాగపు మణిమయ పద్మ ములుగ
సాల భంజిక లమరెను సాజము గను
మాయ జాలమె యనునట్టి మయుని ప్రతిభ
సభను బొగడంగ తరమౌనె విభుని కైన ?

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

శ్రీమతి జిలేబీ గారూ మీభావము ప్రతిక్సేపించగలిగినానో లేదో తెలీదు కానీ.........

భరతజాతికి సౌభాగ్యభావమిచ్చు
తెలుగుజాతిని విడదీయ, తెలుఁగు నేల
వ్రక్కలైనది నేడిక దిక్కుకొకటి,
వీగిననుకూడ తెలుఁగును వీడబోము

Pandita Nemani చెప్పారు...

అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

2వ పాదములో యతి మైత్రి లేదు. 5వ పాదములో "మాయాజాలము" అనుటే సాధు ప్రయోగము.

శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు శుభాశీస్సులు.
జిలేబీ గారి భావమునకు పద్యరూప కల్పనకై మీరు చేసిన యత్నము బాగుగ నున్నది. అభినందనలు.

స్వస్తి.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మయసభ కురుపతి గన రస
మయసభగా దోచె, రాజ! మానిని గన వే
మయ, సభలో నవ్వెన ? విను
మయ సభలో రాగ నీడ్చి మదమందితివా !