శివప్రియ
దండకము
కైలాస లోకాధివాసాయ తేనమః  హృద్యాయ
వేదాంత వేద్యాయ తేనమః || 
శ్రీదక్షిణామూర్తి రూపాయ తేనమః  త్ర్యక్షాయ
లోకైక రక్షాయ తేనమః | 
సత్యాయ దేవేంద్ర వంద్యాయ తేనమః  నిత్యాయ
విశ్వస్వరూపాయ తేనమః || 
రుద్రాయ సంపూర్ణ భద్రాయ తేనమః  నందీశ
వాహాయ సాంబాయ తేనమః | 
నాగేంద్ర భూషాయ శర్వాయ తేనమః  శాంతాయ
భీమాయ సోమాయ తేనమః || 
మృత్యుంజయాయ త్రినేత్రాయ తేనమః  ముక్తిప్రదాయ
త్రినాథాయ తేనమః | 
విశ్వేశ్వరాయ ప్రసిద్ధాయ తేనమః  విజ్ఞాన
సర్వస్వ సాంద్రాయ తేనమః || 
నారాణాప్తాయ మాన్యాయ తేనమః  వేదస్వరూపాయ
ప్రాజ్ఞాయ తేనమః |
మన్మానసాబ్జాత వాసాయ తేనమః  మాంగళ్య
తేజోనిధానాయ తేనమః || 
శుభాశీస్సులు.  ఒక
దండకమును వ్రాయుదమనుకొని మొదలిడితిని.  కాని వేరొక ఛందస్సులో పద్యములు తయారయినవి.  త త త ర గణములు.  సంస్కృతములో
కావున యతి ప్రాసలను పాటించలేదు.  ఈ నూతన ఛందస్సునకు "శివప్రియ దండకము" అను పేరిడి మీకు పంపుచున్నాను.  స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసిరావు

ఆర్య ! నేమాని వంశజ ! యాద్యు డీవు
రిప్లయితొలగించండిక్రొత్త గణముల తోడన క్రొత్త రచన
దండ కం బది శివప్రియ , తనరె మిగుల
అందు కొనుమయ్య ! నతులను నందు కొనుము
Sree subbaaravu gaariki
రిప్లయితొలగించండిabhinandanalu - blessings.
అవధాన సరస్వతి శ్రీ పండితుల వారికి ప్రణామములు
రిప్లయితొలగించండినూతన చందస్సులో శివ ప్రియ దండకము భక్తి బావము నోలలాడించు చున్నది ధన్య వాదములు
శ్రీ నేమాని గురువు గారి శివ ప్రియ దండకము అద్భుతముగా నున్నది నిత్య ము మహా దేవుని పూజించుటకు ఈ దండకము ఉపయోగపడునని వ్రాసుకొంటిని. మంచి దండకమును మాకందించిన మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅయ్యా మీ శివ ప్రియ దండకము లో " నారాయణాప్తాయ మాన్యాయ తేనమః" అని ఉండాలి అనుకుంటున్నాను. తప్పైన యడలక్షమించగలరు
రిప్లయితొలగించండిశివప్రియ స్రష్టకు వందన శతము.
రిప్లయితొలగించండిశ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు గమనించినది నా టైపు పొరపాటే. నారాయణాప్తాయ మాన్యాయ తేనమః అనుటయే సరియైనది. స్వస్తి.
మాన్యులు మిత్రులు శివప్రియ దండకమును మన బ్లాగులో ప్రచురించిన శ్రీ శంకరయ్య గారికి తమ స్పందనలను దెలిపిన శ్రీమతి రాజేశ్వరి గారికి, శ్రీ మిస్సన్న గారికి, శ్రీ వరప్రసాద్ గారికి, శ్రీ సుబ్బా రావు గారికి శుభాభినందనలు.
రిప్లయితొలగించండిపూజ్యనీయులు అన్నయ్య గారికి నమస్సులు. మీ శివప్రియ దండకము ప్రతిదినము పఠించుకొందుకు చాలా బాగుంది. ఆ సర్వేశ్వరుని కృపకు ప్రాప్తులయిన మీకు అభివాదనములు.
రిప్లయితొలగించండితమ్ముడు
నరసింహ మూర్తి