11, జులై 2013, గురువారం

పద్య రచన – 399 (రథయాత్ర)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....

“రథయాత్ర”

10 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    నేనింకా ప్రయాణంలోనే ఉన్నాను. ఈరోజు స్వస్థలం చేరుకోవచ్చు.
    దయచేసి పూరణల, పద్యాల పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  2. రథయాత్రకుఁ జనకున్నను
    కథలెన్నోవిని మొరలిడి ఘనునిన్ మదిలో
    వ్యథలనుఁ దీర్పగ వేడితి,
    పథమును దయతో నొసగెను భక్తిని మెచ్చెన్!

    రిప్లయితొలగించండి
  3. లక్ష్మీదేవి గారూ,
    రథయాత్రపై మంచి పద్యాన్ని చెప్పారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. పూర్వ సాగర తీరమున సుప్రసిద్ధమౌ
    ....వైష్ణవక్షేత్రమ్ము పరగుచుండు
    నతిపవిత్రంబైన యట్టి పూరీ నామ
    ....కపురమ్ము చూపరు కనులవిందు
    హరి జగన్నాథుడై యచట సుభద్రతో
    ....బలభద్రుతో గూడి యలరు చుండు
    నా సహజన్ము లత్యంత దయామయుల్
    ....భక్తుల బ్రోచెడి భద్రమతులు
    వత్సరమ్మున కొకసారి వారు వారి
    యాలయము వీడి రథముపై యరుగుచుందు
    రాదరమ్మున పినతల్లి యాశ్రమమ్ము
    వరకు నదె రథయాత్ర నా బడును లెస్స

    రిప్లయితొలగించండి
  5. పండిత న్నాను వారికి నమస్సులు.
    పూరీ జగన్నాథుని రథయాత్రపై చక్కని పద్యాన్ని చెప్పి మమ్మలరింపజేసారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. నే మాని వారూ,
    మన్నించాలి. నా ఫోన్ లో ఎన్నిసార్లు టైప్ చేసినా మీ పేరు తప్పుగా కనిపిస్తున్నది.

    రిప్లయితొలగించండి
  7. సాగు చుండెను రధయాత్ర చక్క గాను
    చూడ గనువిందు గావించె చూ డ్కులకును
    ఎంత మంది యుం డిరినేల యీ నినట్లు
    పుణ్య మంతయు వారిదే పూవుబోణి !

    రిప్లయితొలగించండి
  8. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. జగనాధుని రధ యాత్రట
    జగ మంతట కనుల విందు జాగృతి జేయన్
    నగధరుడు మెచ్చె ముదముగ
    జగనాధుడు పలుకరించె సర్వము తానై
    ---------------------------------------
    ఊరెరి గింపున కనివ
    త్సరమున కొకమారు తా నూరే గంగా
    పూరీ జగన్నాధు డనగ
    నూరంతయు దిరిగి జనుల కూరట నిడగన్ !

    రిప్లయితొలగించండి
  10. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం మెచ్చదగినదే...
    జగనాథుడు అనడం దోషమే. అది జగన్నాథుడు.
    రెండవ పద్యం రెండవ పాదంలో ప్రాస తప్పింది. మిగిలిన పాదాల్లో ప్రాస పూర్వాక్షరం గురువై, ఇక్కడ లఘువయింది.

    రిప్లయితొలగించండి