2, ఆగస్టు 2015, ఆదివారం

సమస్యాపూరణ - 1749 (ఈఁగ పడిన పాలు హిత మొసంగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ఈఁగ పడిన పాలు హిత మొసంగు.

31 కామెంట్‌లు:

  1. ఆలి చూచె వేడి పాలలో నొక యీగ
    వెళ్లి పార బోయ పిల్లి త్రాగె
    విషము గలిసె నేమొ పిల్లిచచ్చె! నొకచో
    నీగ పడిన పాలు హితమొసంగు!
    (పొరబాటున ఆపాలు ఇంటిల్లిపాది త్రాగి వుంటే?)

    రిప్లయితొలగించండి

  2. చెత్త, కుళ్ళు పైన చేరిదిరిగి వచ్చి
    నీదు పాల లోన నీదులాడె
    నేమికాదననుచు నెత్తి త్రాగకున్న
    నీగ పడిన పాలు, హిత మొసంగు.

    రిప్లయితొలగించండి
  3. కీటకములు పడిన క్రిములు చేరునుపాల
    రోగకారకమ్ము తాగ నవియె
    మేలుగాదు తాగ పాల నీగ పడిన,
    పాలుహిత మొసంగు పదుగురకును!!!

    రిప్లయితొలగించండి
  4. ఈగ పడిన పాలు హిత మొ సంగు ననుట
    తప్పు నందు కలియు దాని మలము
    సకల రోగ ములును సంభవించుమనకు
    త్రాగ వలదు సామి ! త్రాగ వలదు

    రిప్లయితొలగించండి
  5. త్రాగరాదు పానీయము లీగపడిన
    పాలుహితమొసంగును సుమ్మ పలువిధముల
    పిల్లలున్ పెద్దలు కరము ప్రీతితోడ
    ప్రతిదినమ్ముఁగొనవలెను పాలు పెరుగు

    రిప్లయితొలగించండి
  6. పూల తోడ కలిసి పుష్కర స్నానమ్ము
    జేసి శివుని శిరసు క్షీర మధువు
    నారికేళ జలమునందున సిక్తమౌ
    ఈగ పడిన పాలు హిత మొసంగు

    రిప్లయితొలగించండి
  7. గురువుగారు, మీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?

    (పెండింగ్ పద్యాలు)
    హాయిగ నుండక పాకముఁ
    జేయగ నొప్పుకొనితిట్లు చిక్కులఁ బడితిన్,
    హా! యెఱుగనన, నదెట్టుల (యెఱుగననన్ అదెట్టుల)
    పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ? (జులై 28)

    కాసులకై యమాయకులఁ గష్టములన్ పడఁదోయుచున్, సదా
    మా సములెవ్వరంచు, మరి మభ్యపు మాటల నాడువారు, నే
    దోసమెఱుంగబోమనుచు దూషణలన్ పలుకాడుచున్, మహా
    మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్? (జులై 29)

    పదములమ్రొక్కి దీవనల భాగ్యముఁ బొందగలేకపోతి , నే
    సదమలమైన పల్కులను సమ్ముఖమందున నాలకించి, స
    మ్ముదమునుఁ బొందనైతి, నొక పోలిక లేని సభాంగణమ్మునం
    దదె కొఱ నా మనంబు, నసహాయత నుంటి, మరేమి చేయుదున్? (జులై 31)

    ఛందశ్శాస్త్ర చర్చలో గురువుగారు అస్వస్థత కారణంగా పాల్గొనలేరన్న కొఱత శిష్యులమైన మాది.

    రిప్లయితొలగించండి
  8. శ్రేష్ట మైన పాలు చేవ నిచ్చును గాన
    త్రాగవలెను రోజు తప్పకుండ
    ఈఁగ పడిన పాలు హిత మొసంగుట కల్ల
    త్రాగ వలదు వచ్చు తగని జబ్బు

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. త్రాగబోకు మెపుడు రోగము దెచ్చెడు
      ఈగ పడిన పాలు, హిత మొసంగు
      శ్రేష్ఠ మైన పాలు, ఇష్టమై త్రాగుడీ
      పోషకాల నిచ్చు బూరిగాను.

      తొలగించండి

  10. చిన్న సవరణతో....

    చెత్త, కుళ్ళు పైన చేరిదిరిగి వచ్చి
    నీదు పాల లోన నీదులాడె
    నేమికాదటంచు నెత్తి త్రాగకుమయ్య
    ఈగ పడిన పాలు, హిత మొసంగు.

    రిప్లయితొలగించండి
  11. “ఆగు-త్రాగకయ్య నారోగ్య మొసగదు
    ఈగపడినపాలు”హితమొసంగు
    మంచిజున్నుపాలు-మరిమరి సేవించ
    పుష్టినిచ్చు మనకు పూర్తిగాను.

    రిప్లయితొలగించండి
  12. 2.క్రొత్త యల్లు డింట-కోర్కెల తోరాగ?
    ఈగపడిన పాలు-హితమొసంగు
    త్రాగుమనుచుమరిది-తనవంతుగా నిచ్చి
    నవ్వుబంచె నచట నలుగురందు.

    రిప్లయితొలగించండి
  13. ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగిం
    మోసగాడు యొకడు ముల్లె దోచి
    పల్కె నిటుల "మీకు భాగ్య మొదవు తాగ
    నీగ పడిన పాలు";హితమొసంగ

    రిప్లయితొలగించండి
  14. ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగిం
    మోసగాడు యొకడు ముల్లె దోచి
    పల్కె నిటుల "మీకు భాగ్య మొదవు తాగ
    నీగ పడిన పాలు";హితమొసంగ

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పారవేయదగును పండంటి పాలలో
    నీగ పడిన; పాలు హితమొసంగు
    పాపకైన గాని పండు ముసలికైన
    పోషకముల విధియె పొందు పరచ

    రిప్లయితొలగించండి
  16. మాంస భక్షణమ్ము మరిగన వారైన
    ఇచ్చగించరైరి యిాగ పడిన
    పాలు హితమొసంగు బలము చేకూర్చుచున్
    శ్రేష్ఠమైన జాలు క్షేమ మొసగు.

    రిప్లయితొలగించండి
  17. మాంస భక్షణమ్ము మరిగన వారైన
    ఇచ్చగించరైరి యిాగ పడిన
    పాలు హితమొసంగు బలము చేకూర్చుచున్
    శ్రేష్ఠమైన జాలు క్షేమ మొసగు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    రోగముక్తుఁడైన భోగికి నీయంగఁ
    బుష్టికరమునయ్యు, నిష్టపడెడు,
    కమ్మనైనవి, కనకపుఁ గలశాన, గో
    వీగ, పడిన పాలు, హిత మొసంగు!
    (అన్వయము: గోవు+ఈగ[=గోవు ఈయగా], కలశాన-పడిన-పాలు, హిత మొసంగు)

    రిప్లయితొలగించండి
  19. ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగి
    మోసగాడు యొకడు ముల్లె దోచి
    పల్కె నిటుల "మీకు భాగ్య మొదవు తాగ
    నీగ పడిన పాలు";హితమొసంగు

    రిప్లయితొలగించండి
  20. ఆ.వె:మూఢ జనుల యొక్క మూర్ఖతనుయెఱింగి
    మోసగాడు యొకడు ముల్లె దోచి
    పల్కె నిటుల "మీకు భాగ్య మొదవు తాగ
    నీగ పడిన పాలు";హితమొసంగు

    రిప్లయితొలగించండి
  21. కుళ్ళిపోవు పండ్లు కూరలు నైనను
    పచనమైన నవియు బాగుగాదు
    వదలవలయు వేగ,వానిలో దూష్యమౌ
    నీగపడిన-పాలు హితమొసంగు

    గోవు పోషణంబు గొప్పదౌనిలలోన
    కానిదానికింపు గడ్డినిడమి
    పాపమంటు మేత,వలసినంత కుడితి
    నీగ పడిన పాలు హితమొసమొసంగు

    దూడ లేనియావు దు:ఖంబు నందుచు
    నిడినపాలు రుచికి నింపు గనము
    దూడబ్రతికియున్న,దొడ్డగా దానికి
    నీగ పడిన పాలు హితమొసంగు

    పసుల మేతలందు పచ్చికమేలౌను
    మీదటీయ,నగును మేలుమేత
    తౌడు తెలగపిండి,తగినంతదాణాను
    నీగ,పడిన పాలు హితమొసంగు

    రిప్లయితొలగించండి