పోచిరాజు కామేశ్వర రావు గారూ, నా పద్యాలు మీ ఆమోదాన్ని పొందినందుకు ధన్యుడను. ధన్యవాదాలు. ‘పరిత’ శబ్ద ప్రయోగం దోషమే. పర్యాయపద నిఘంటువులో వెదికితే అది కనిపించింది. తత్సమమే అని భ్రమపడ్డాను. ఇక అక్కడ కోయిల పద్యాయపదాలేవీ సరిపోవు. అందుకని పక్షిని ఆశ్రయిస్తున్నాను. ‘సుస్వరాంచిత పతగ మంజులరవములు’ అంటే ఎలా ఉంటుందంటారు? ఇక ‘వర్ణప్రసూన ప్రకీర్ణంబులై...’ అన్నచోట ప్రాసయతిలో దోషం లేదు. ప్రాస పూర్వాక్షరం లఘు గురు సామ్యం కలిగి ఉండాలే తప్ప హ్రస్వ దీర్ఘాలు కావు. క్రింది పోతన పద్యం చూడండి. మొదటి రెండు పాదాల్లో ప్రాసాక్షరానికి ముందు లఘువులుంటే, తరువాతి రెండు పాదాల్లో గురువుంది. దక్షిణదిశాధినాయక! శిక్షం దగఁ జేయువారు క్షితిఁ బెక్కం డ్రే నీ క్షయము న్నక్షయమును సాక్షాత్తుగ రెండు నెందు సంపన్న మగున్? (భాగ. ౬స్కం.౧౬౩)
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణకు ధన్యవాదములు. సవరణ కూడా చాలా బాగున్నది. అయితే ప్రాశయతి విషయములోనే ఇంకా సందేహమున్నది. తీర్పగోర్తాను. మీరు చెప్పినట్లు ప్రాసకి గురువైతే చాలు. చాలా పద్యాలలో మనకి కన్పిస్తుంది. కానీ ప్రాస యతికి హ్రస్వ, దీర్ఘ సామ్య మవసర మనుకుంటాను. ఇదివరలో నేనంతర్జాలము నుండి దిగుమతి చేసినది యీంక్రింద యిస్తున్నాను. దయచేసి సందేహ నివృత్తి చేయగోర్తాను. ప్రాసయతి వాడునప్పుడు ఈ క్రింది లక్షణాలు గమనించాలి. 1.ప్రాస పూర్వాక్షరం దీర్ఘమైతే ప్రాసయతిలోని యతిస్థానాక్షరం దీర్ఘమే కావాలి, అలాగే హ్రస్వమైతే హ్రస్వమే కావాలి. 2.ప్రాస పూర్వాక్షరం గురువైతే ప్రాసయతికి ముందున్న యతిస్థానాక్షరం గురువే కావాలి, అలాగే లఘువైతే లఘువే కావాలి 3.ప్రాసాక్షరం ద్విత్వాక్షరం,సంయుక్తాక్షరం, బిందుపూర్వకం,విసర్గపూర్వకం గాని అయితే ప్రాసయతిగా వాడే యతిస్థానాక్షరం తరువాతవేసే ప్రాసాక్షరం కూడ అలాగే ఉండాలి. 4.ప్రాసయతిలో ప్రాసాక్షరంలోని హల్లు సామ్యమేకాని అచ్చు సామ్యం పాటించ బడదు.
ప్రాసయతి విషయంలోనూ పూర్వాక్షర గురు లఘు సామ్యమే కాని, దీర్ఘ హ్రస్వాలు కావని నా విశ్వాసం. ఈ విషయమై గతంలో శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారితో కొంత చర్చ జరిగింది. అప్పుడు కొన్ని ఉదాహరణలు కూడా చూపాను. కొద్దిగా ఆరోగ్యం కుదుట పడగానే ఆ ఉదాహరణలను వెదకి తెలియజేస్తాను. ధన్యవాదాలు.
మీరు చెప్పిన కట్టుపల్లి ప్రసాద్ గారి ‘తెలుగు వ్యాకరణం - ఛందశ్శాస్త్రం’ బ్లాగు చూశాను కూడా. అయినా నా అభిప్రాయంలో (ప్రస్తుతానికి) మార్పు లేదు. ధన్యవాదాలు.
కామేశ్వర రావు గారూ, ప్రస్తుతానికి ఒక ఉదాహరణ దొరికింది... *వాండ్ర వెన్న లేల *తండ్రి నీకు (అనం.ఛంద.౧-౫౩) పై ఆటవెలది పాదంలో ప్రాసయతి ప్రాసాక్షరం అనుస్వారంతో కూడిన ‘డ్ర’. దానికి ముందు ‘వా’ అనే దీర్ఘం, ‘త’ అనే హ్రస్వం ఉన్నాయి.
మధుసూదన్ గారూ, ధన్యవాదాలు. ***** కామేశ్వర రావు గారూ, ఇప్పటికీ మీకు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వలేదనే నేను భావిస్తున్నాను. భారత, భాగవతాల్లో ఉదాహరణలు వెదకి చూపించినపుడే నాకు తృప్తి. తొందరలోనే ఈ పని చేస్తాను.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవపద్యంలో ‘సలిపేటి’ అనే గ్రామ్యం స్థానంలో ‘సలిపెడు’ అనండి. ‘అమృతోపమయమైన’ అనడం దోషం. ‘అమృతోపమ్మైన’ అనండి.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. వృత్తంలో ‘మునుంగు+అటుల=మునుంగు నటుల’ అవుతుంది. ‘...న్భోగముల న్మునుంగునటు ముద్దుగ...’ అనండి. అలాగే ‘నమస్కరింతు నిదె’ అనండి. చివరిపద్యంలో ‘ఉగాది+ఇల’ అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘వచ్చు నుగాదులు’ అనండి.
ఆంజనేయ శర్మ గారూ, మీ ఖండిక బాగున్నది. అభినందనలు. మొదటి పద్యంలో ‘పికం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘నిరుడు కూసిన పిక మరుదైన రాగాలు...’ అనండి. ‘నవనవోన్మేషమ్ము’ అని ఉండాలి. మూడవ పద్యంలో ‘దుర్ముఖి+అంచు’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘దయతో జేరగ వచ్చె దుర్ముఖియె మోదంబయ్యె...’ అనండి. నాల్గవ పద్యంలో ‘పేర్మిని’ అనండి. ఐదవపద్యం మొదటి పాదంలో మధురస్వరము అన్నచోట స్వకు ముందున్న ర గురువై గణదోషం. ‘కలకంఠి కలస్వరమున’ అందామా? ఆరవపద్యంలో ‘పేర్మిని’ అనండి. ‘వత్సరమ్’ అని హలంతంగా వ్రాశారు. ‘దుర్ముఖి యను సాలు’ అనండి.
వసంత శోభను సాక్షాత్కరింపజేస్తున్న కవిమిత్రులు విరించి గారి, చంద్రమౌళి గారి,మిస్సన్న గారి పద్యాలు చాలా బాగున్నాయి. ఆశావహ దృక్పథాన్ని ఆవిష్కరిస్తున్న ఇతర కవకవిమిత్రుల పద్యాలన్నీ బాగున్నాయి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ గర్భ కవిత్వం బాగున్నది. అభినందనలు. గర్భిత స్వాగతోక్తిని కూడా ఇస్తే బాగుండేది. నాకు స్వాగత వృత్తం (శీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్) తెలుసు. కాని స్వాగతోక్తి ఎక్కడా కనిపించలేదు. దాని లక్షణాన్ని చెప్పండి.
. * * దుర్ముఖి కిదే స్వాగతం * *
రిప్లయితొలగించండిపల్లవించిన నవ పల్లవముల తోడ
. పాదపముల శోభ పరిఢ విల్లె
విరియ గాసిన మావితరువులే గుర్విణై
. వాయువుల్ వీచెను బరువు గాను
పూపచివురు మేసి పులుగు కోయిల తాను
. నవరాగ మొలికించి నవ్య తొసగ
గ్రీష్మ సోదరి వామ కేలుబట్టుకు వచ్చె
. నామనిముదముతో నవని తలము
తీయ దనములొలికెడు నా తెలుగు నేల
వీడి పోయెడు మన్మథన్ వీడమనుచు
వచ్చెదుర్ముఖి యనునామవత్సరమును
స్వాగతించెను గద తాను సంతసమున
*** దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు ***
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిదుర్ముఖిని స్వాగతిస్తున్న మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
‘గుర్విణి+ఐ, నవ్యత+ఒసగ’ అన్నపుడు సంధి లేదు. ‘విరియ గాచిన మావి వ్రేకటి పడతియై, నవ్యత నిడ...’ అనండి. ‘వామ కేలు’ అనడం దుష్టసమాసం. ‘గ్రీష్మసోదరి యెడకేలు...’ అనండి.
ఉ.
రిప్లయితొలగించండివచ్చె నుగాది పర్వ మిదె పల్లెలలో నగరాలలో ముదం
బచ్చుపడన్ శుభాభినుతు లందరుఁ దెల్పి పరస్పరానురా
గచ్చతురానుమోద మొలుకన్ సమతన్ మదిఁ గోరి షడ్రుచుల్
పచ్చడిలోన రుచ్యమగు వైఖరిఁ గష్టసుఖమ్ము లెంతురే!
ఉ.
దుర్ముఖి పేర వచ్చినది తోరముగా నిదె నూత్నవత్సరం
బర్మిలితోడ మానవులయందు బరస్పర మైత్రిఁ బెంచి ప్రా
తర్ముఖ దివ్యరోచులకుఁ దప్పక స్వాగత దివ్యగీతముల్
బేర్మినిఁ బాడఁగా వలె నభీష్ట శుభావళి నెల్ల రందఁగన్.
కం.
కష్టముల పీడ మన క
స్పష్టమ్మై భోగభాగ్యశాంతిశుభములే
యిష్టములై యీ దుర్ముఖి
నష్ట సకల దుష్టభావనల్ గల దగుతన్.
కం.
గత సంవత్సరపు టసం
గత విషయము లెన్నొ జరిగెఁ గాబోలు సమ
ర్థతతోఁ దప్పులు దిద్ది వి
మత కృత వివిధాహిత జిత మాన్యతఁ గొనుమా!
కం.
ద్రుమ జీర్ణపర్ణ ధవళత
క్రమత నిరామయము నంది కాంచుఁ జివుళ్ళన్
సుమ దరహాసము సెలగెడు
సమయ మిదే జనసుఖద వసంతము వచ్చున్.
కం.
వేకువనె కమ్మతెమ్మెరఁ
జేకొని సుమసౌరభములఁ జిన్మోదకరం
బై కొనసాగఁగఁ జంద్రుఁడు
వే కురియున్ చంద్రికలను వేడుక నిశలన్.
కం.
శుకపికశారిక లెల్లన్
ప్రకట మనోజ్ఞానులాపవైఖరి సెలఁగన్
సుకవిజన రచిత గీతము
లకళంక రసానుభూతి నందించు నిఁకన్.
కం.
రేలను బరుండి వేకువ
మేలుకొని వినూత్నయత్నమే సేయు జనున్
బోలి వినూత్నాబ్దం బిక
మేలగు జీవనము నిడ సమీపించె నిదే.
సీ.
నిత్యనూతన పర్ణ నివహ శోభిత తరుల్
..........జనులకుఁ జైతన్యమును వచింప
వర్ణ ప్రసూన ప్రకీర్ణంబులై నింబ
..........పరిమళామోదముల్ పరిఢవిల్ల
సుకుమార చూత ప్రసూనముల్ భావిఫ
..........లావాప్తిఁ బ్రకటించి యలరుచుండ
శోణిత వర్ణ కింశుక పుష్ప సంఘమ్ము
..........నూత్న వికాసమున్ నొక్కి చెప్ప
తే.
సుస్వరోపేత పరిత (కోకిల) మంజుల రవములు
నూత్నకర్తవ్య బోధనన్ నూలుకొలిపి
మలయ మందమారుతములు మారుచున్న
జీవనమునకు సౌభాగ్య భావమిడును.
సుకవి మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారూ...నమస్సులు!
తొలగించండిమీ యుగాది పద్యములు చక్కని ధారతో లలిత పదములతో నందమొలుకుచున్నవి.
శుభాభినందనలు.
అద్భుత పద్యములతో సాహితీవసంతంలో విహరింపజేసిన గురువు గారికి అభినందనలు
తొలగించండిగురువుగారూ మీ పద్యాల్లో వసంతం వెల్లివిరుస్తోంది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమాస్టరుగారూ! " సుస్వరోపేత పరిత (కోకిల) మంజుల రవములు.
తొలగించండినూత్నకర్తవ్య బోధనన్ నూలుకొలిపి " న మీ పద్యములు నూత్న వసంతాన్ని మా "కందిం" చాయంండి.
గురవుగారూ,'అకళంక రసానుభూతి' నందించాయి మీపద్యములు./\
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పద్యమాలతో యుగాది కన్యను రమ్యముగ నలంకరించి శోభ జేకూర్చారు. మాకందరకు మహదానందమును కలుగ జేశారు. నాయీ చిన్న సందేహము.
తొలగించండి1. “వర్ణ ప్రసూన ప్రకీర్ణంబులై నింబ” లో ప్రాస యతి కి కళంకమేర్పడినదని నా అనుమానము.
2. “సుస్వరోపేత పరిత మంజుల” లో “సుస్వరోపేత పరిత” సమాసమైతే సాధువేనా?
“పరితమంజుల” మిశ్రమ సమాసము గా సాధువనుకుంటాను. పరిత వైకృతము కదాయని.
సందేహ నివృత్తి జేయ గోర్తాను.
నా పద్యాలను మెచ్చుకున్న మిత్రులు గుండు మధుసూదన్ గారికి, ఆంజనేయ శర్మ గారికి, మిస్సన్న గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, లక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు.
తొలగించండిపోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండినా పద్యాలు మీ ఆమోదాన్ని పొందినందుకు ధన్యుడను. ధన్యవాదాలు.
‘పరిత’ శబ్ద ప్రయోగం దోషమే. పర్యాయపద నిఘంటువులో వెదికితే అది కనిపించింది. తత్సమమే అని భ్రమపడ్డాను. ఇక అక్కడ కోయిల పద్యాయపదాలేవీ సరిపోవు. అందుకని పక్షిని ఆశ్రయిస్తున్నాను. ‘సుస్వరాంచిత పతగ మంజులరవములు’ అంటే ఎలా ఉంటుందంటారు?
ఇక ‘వర్ణప్రసూన ప్రకీర్ణంబులై...’ అన్నచోట ప్రాసయతిలో దోషం లేదు. ప్రాస పూర్వాక్షరం లఘు గురు సామ్యం కలిగి ఉండాలే తప్ప హ్రస్వ దీర్ఘాలు కావు. క్రింది పోతన పద్యం చూడండి. మొదటి రెండు పాదాల్లో ప్రాసాక్షరానికి ముందు లఘువులుంటే, తరువాతి రెండు పాదాల్లో గురువుంది.
దక్షిణదిశాధినాయక!
శిక్షం దగఁ జేయువారు క్షితిఁ బెక్కం డ్రే
నీ క్షయము న్నక్షయమును
సాక్షాత్తుగ రెండు నెందు సంపన్న మగున్? (భాగ. ౬స్కం.౧౬౩)
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణకు ధన్యవాదములు. సవరణ కూడా చాలా బాగున్నది.
తొలగించండిఅయితే ప్రాశయతి విషయములోనే ఇంకా సందేహమున్నది. తీర్పగోర్తాను. మీరు చెప్పినట్లు ప్రాసకి గురువైతే చాలు. చాలా పద్యాలలో మనకి కన్పిస్తుంది.
కానీ ప్రాస యతికి హ్రస్వ, దీర్ఘ సామ్య మవసర మనుకుంటాను. ఇదివరలో నేనంతర్జాలము నుండి దిగుమతి చేసినది యీంక్రింద యిస్తున్నాను. దయచేసి సందేహ నివృత్తి చేయగోర్తాను.
ప్రాసయతి వాడునప్పుడు ఈ క్రింది లక్షణాలు గమనించాలి.
1.ప్రాస పూర్వాక్షరం దీర్ఘమైతే ప్రాసయతిలోని యతిస్థానాక్షరం దీర్ఘమే కావాలి, అలాగే హ్రస్వమైతే హ్రస్వమే కావాలి.
2.ప్రాస పూర్వాక్షరం గురువైతే ప్రాసయతికి ముందున్న యతిస్థానాక్షరం గురువే కావాలి, అలాగే లఘువైతే లఘువే కావాలి
3.ప్రాసాక్షరం ద్విత్వాక్షరం,సంయుక్తాక్షరం, బిందుపూర్వకం,విసర్గపూర్వకం గాని అయితే ప్రాసయతిగా వాడే యతిస్థానాక్షరం తరువాతవేసే ప్రాసాక్షరం కూడ అలాగే ఉండాలి.
4.ప్రాసయతిలో ప్రాసాక్షరంలోని హల్లు సామ్యమేకాని అచ్చు సామ్యం పాటించ బడదు.
http://kattupalliprasad.blogspot.in/2015/06/blog-post_22.html
తొలగించండిప్రాసయతి విషయంలోనూ పూర్వాక్షర గురు లఘు సామ్యమే కాని, దీర్ఘ హ్రస్వాలు కావని నా విశ్వాసం. ఈ విషయమై గతంలో శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారితో కొంత చర్చ జరిగింది. అప్పుడు కొన్ని ఉదాహరణలు కూడా చూపాను. కొద్దిగా ఆరోగ్యం కుదుట పడగానే ఆ ఉదాహరణలను వెదకి తెలియజేస్తాను. ధన్యవాదాలు.
తొలగించండిమీరు చెప్పిన కట్టుపల్లి ప్రసాద్ గారి ‘తెలుగు వ్యాకరణం - ఛందశ్శాస్త్రం’ బ్లాగు చూశాను కూడా. అయినా నా అభిప్రాయంలో (ప్రస్తుతానికి) మార్పు లేదు. ధన్యవాదాలు.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిప్రస్తుతానికి ఒక ఉదాహరణ దొరికింది...
*వాండ్ర వెన్న లేల *తండ్రి నీకు (అనం.ఛంద.౧-౫౩)
పై ఆటవెలది పాదంలో ప్రాసయతి ప్రాసాక్షరం అనుస్వారంతో కూడిన ‘డ్ర’. దానికి ముందు ‘వా’ అనే దీర్ఘం, ‘త’ అనే హ్రస్వం ఉన్నాయి.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సందేహము నివృత్తి అయినది. ప్రాస లో వలె ప్రాస యతిలో గూడ గురు లఘుసామ్యమున్న చాలునన్నమాట.
తొలగించండిశ్రీ శంకరయ్య గారు...మఱియు...కామేశ్వర రావు గారలకు నమస్సులు!
తొలగించండి1. "సుస్వరోపేత పరభృత శుభ రవములు" అనిన సరిపోవును. పతగ...అవసరము లేదు.
2. ప్రాసయతి విషయము: ...వర్ణ-UI....కీర్ణ-UI...రెండును సమానముగ నున్నవి. కావున నిందే దోషమును లేదు. ప్రాసాక్షరమునకు పూర్వాక్షరము దీర్ఘమైనను, హ్రస్వమైనను...అనవసరము. ప్రాసాక్షరమునకు పూర్వమున్న యక్షరము గుర్వక్షరమా...లఘ్వక్షరమా యనునది చూడవలెను. అంతియ.
శంకరయ్యగారి ప్రయోగమున దోషము లేదు.
స్వస్తి.
మధుసూదన్ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
*****
కామేశ్వర రావు గారూ,
ఇప్పటికీ మీకు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వలేదనే నేను భావిస్తున్నాను. భారత, భాగవతాల్లో ఉదాహరణలు వెదకి చూపించినపుడే నాకు తృప్తి. తొందరలోనే ఈ పని చేస్తాను.
గుండు మధుసూదన్ గారు నమస్సులు. మీ సవరణబాగుంది. వివరణకు ధన్యవాదములు. కానీ “మంజుల” మంజులత్వాన్నికోల్పోతున్నాము.
తొలగించండిస్వాగతమిదే యుగాది
రిప్లయితొలగించండిస్వాగతమిదె చూత నింబ ఫల్యమ్ములకున్
స్వాగతముచైత్రమునకు
స్వాగతమిదె దుర్ముఖి యను వత్సరమునకున్!!!
వందనమమ్మా దుర్ముఖి
నందనముగ జేయుమమ్మ నాభారతమున్
సుందర కుసుమాకరమున
విందును జేయంగ రమ్ము విద్వత్తునకున్ !!!
లోకములో సుఖశాంతులు
సాకతముగ శుభము లీయ జనులందరకున్
శ్రీకరమౌ దుర్ముఖిలో
ప్రాకాశ్యముగా నుగాది పండుగ వచ్చెన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి.
మొదటి పద్యం మొదటి, మూడవ పాదాల్లో గణదోషం. ‘...యుగాదికి, ... చైత్రమునకును’ అనండి.
అందరికి శుభాకాంక్షలతో
రిప్లయితొలగించండిఇదిగో వచ్చెను దుర్ముఖి
ఇదియెల్లరికిని శుభముల నిచ్చును గూడన్
పదవే యుగాది ముగ్గులు
విధముల వాకిట జిలేబి విరివిగ వేయన్
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
చిగురులు మేసిన కోయిల
రిప్లయితొలగించండిపొగరుగ తాకూయు చుండు పోటీ బడుచున్
గగనము నంటిన గళమది
నిగళము నేవేయు నెంత నేర్పరి యౌరా !
------------------------
నిగళము = సంకెళ్ళు
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిలేత చిగుళ్ళతోడ తరులీ భువి పచ్చదనంబు నింపగా
కూతల తోడ కోకిలల గొంతులు సందడి చేయుచుండగా
భూతలమంత స్వర్గముగ ముచ్చట గా కను విందు చేయగా
నూతన వత్సరంబును మనోజ్ఞ వసంతము స్వాగతించెడిన్
కూర్మిని రాజకీయముల కుళ్ళుకుతంత్రములేవగించుచున్
ధర్మము తప్పకుండ భరతావనినేలెడు నేతలెల్లరున్
నిర్మలమైన పాలనను నిత్యము చేయుచు నుండగోరుచున్
దుర్ముఖి నామవత్సరము దూసుకువచ్చెను స్వాగతించుమా
వేప పూవుల చేదు వివరించుమనకెల్ల
జీవితమ్మున గల్గు చీకు చింత
బెల్లమ్ములోతీపి విచ్చేయగానున్న
సంతసమ్ముల తెల్పు సలలితముగ
కోపతాపాలకు కొరివి కారమ్మును
ఉత్సాహమునకుప్పునొప్పునప్పు
పచ్చి మామిడిముక్క వగరు కొత్త సవాలు
చింతపండు తెలుపు చెలియ వలపు
షడ్రుచుల మేళవించుచు సమముగాను
నూత్న సంవత్సరమ్ము మనోహరముగ
సాగవలెనంచు కాంక్షించి సకల జనులు
నీ యుగాది పచ్చడి తినునెలమితోడ
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
చివరిపద్యం చివరిపాదంలో ‘తిందు రెలమితోడ’ అనండి.
మిత్రులందరికీ దుర్ముఖినామ సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి1.వందనమమ్మా దుర్ముఖి
నందన మొనరించ ముదమున తరలి వేగన్
సుందర వనమున మాకను
విందొనరించి వరములిడ వేగమె రమ్మా!.
2.వత్సరాది యంచు భక్తితో సలిపేటి
పర్వమిదియె గనుడు బంధులార
ఆరురుచులతోడ అమృతోప మయమైన
వేప పచ్చడి తిన వేగరండు
3.పుడమిలోని జనులు పులకించు హృదయాల
సంబరమ్ముతోడ జరుపు చున్న
వత్సరాది యిదియె బంధువులను గూడి
యాచరింతు రెల్ల రనవరతము.
4.ఇష్టముతో పచ్చడి దిన
కష్టము లెల్లను తొలగునుకాదిది కలయున్
స్పష్టము లీవాక్యంబులు
౹నష్టంబెప్పుడు జరుగదు నమ్ముము పుత్రా.
5.చెట్లు చేమలన్ని చిగురులేయుచునుండ
శుకములారగించె చూతఫలము
కోయిలమ్మ పాడు కూని రాగాలతో
అంబరమ్ము నంటె సంబరమ్ము.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవపద్యంలో ‘సలిపేటి’ అనే గ్రామ్యం స్థానంలో ‘సలిపెడు’ అనండి. ‘అమృతోపమయమైన’ అనడం దోషం. ‘అమృతోపమ్మైన’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపోచిరాజు సుబ్బారావు గారి పద్యములు:
తొలగించండిదుర్ముఖియనునీవర్షముదురితములను
బాపిసుఖములనిచ్చుత!ప్రజకుభువిని
నాయురారోగ్యసంపదలన్నియిచ్చి
కరుణతోడననెల్లరగాచుగాత!
స్వాగతమునీకుదుర్ముఖి!స్వాగతమ్ము
వచ్చికాపాడుమమ్ములవర్షమంత
నిన్నునమ్మితిమిటమేముమిన్నగాను
శుభములిత్తువుమాకనిసురుచిరముగ
స్వాగతమమ్మ!నీకిపుడు స్వాగతమిత్తునువచ్చిమమ్ముల
న్భోగము లన్మునుంగటుల ముద్దుగ జేయుము నీకు నేనుగా
సాగి నమస్కరింతునుగ సాదరమొప్పగ నోయి దుర్ముఖీ!
వేగమె రమ్ముమా యిపుడు వేచుచు నుందును రాకకై సుమీ
వత్సవత్సరమ్మువచ్చునుగాదిల
మన్మధుండువెడలిమనకువచ్చు
దుర్ముఖియనునతడుదుష్టుడోశిష్టుడో
చెప్పలేముఫలితమిప్పుడార్య!
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
వృత్తంలో ‘మునుంగు+అటుల=మునుంగు నటుల’ అవుతుంది. ‘...న్భోగముల న్మునుంగునటు ముద్దుగ...’ అనండి. అలాగే ‘నమస్కరింతు నిదె’ అనండి.
చివరిపద్యంలో ‘ఉగాది+ఇల’ అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘వచ్చు నుగాదులు’ అనండి.
లేదా ‘వచ్చు నుగాదియె’ అనండి.
తొలగించండిమిత్రులందఱకు నవ్య త్రిలింగ వత్సరాది శుభాకాంక్షలు!!!
రిప్లయితొలగించండిశీర్షిక:- నవయుగాదీ...దుర్ముఖీ...స్వాగతం...!!!
శార్దూలము (పంచపాది):
స్వస్తిశ్రీ నవ దుర్ముఖీ! శుభద! స♦త్సంపత్కరీ! వత్సరీ!
అస్తోకోజ్జ్వల దివ్య నవ్య భవితా♦హార్య ప్రభావోదరీ!
ప్రస్తుత్యాధిక ముఖ్య కావ్య లహరీ! ♦ వాణీ శివానీ రమో
పాస్తిత్యంకిత ధాత శంభు బలివి♦ధ్వం సీద్ధ భద్రంకరీ!
ప్రస్తావింతును నేఁడు మా కొసఁగు మీ ♦ పర్వాన సర్వోన్నతుల్!! 1
తే.గీ.
ఈ యుగాది దినాన నే♦నేమి వ్రాఁతు?
పర్వమన మది మెదలు నిం♦బామ్రతరులు;
శుకపికమ్ముల రవము; కిం♦శుక సుమాలు;
కొదమ తేఁటుల నృత్యాలు, ♦ పదములన్ని!! 2
తే.గీ.
జనము పెరిఁగియు, వనము ♦ భోజనము సేసి,
ప్రకృతి శోభలఁ గసితీఱ ♦ వికృతపఱచి,
నగరములఁ బెంచి, నవయుగ ♦ నాగరకులయి,
యెదిగి పోయితి మందు రి♦దేమి మాయొ? 3
తే.గీ.
కుహుకుహూ రావముల తోడఁ ♦ గోకిలమ్మ
చిగురుటాకుల ముక్కునఁ ♦ జేర్చుకొనుచు,
"రార, వాసంతుఁడా, రార, ♦ రమ్ము రమ్మ"
టంచు ముదముతోఁ బిలిచెనే ♦ యంగలార్చి? 4
తే.గీ.
కిలకిలా రావముల తోడఁ ♦ గీరములును
దోర పండ్లను దినుచునుఁ ♦ దోరముగనుఁ
జెట్ల పుట్టల గుట్టలఁ ♦ జేరఁ బిలిచి
మాటలాడెనే సంతస ♦ మంది నేఁడు? 5
తే.గీ.
దూరముగ నున్న కొండపైఁ ♦ దోచి, నిత్య
మగ్ని కీలలఁ దలఁపించు ♦ నట్టి వైన
మోదుగుల పూఁత లీనాఁడు ♦ మోము దాచి,
పాఱిపోసాఁగె వేగాన ♦ వనము విడచి!! 6
తే.గీ.
పూవుఁ దోటలఁ దిరుగాడి, ♦ పుప్పొడులను
మేనికినిఁ బూసికొనుచును ♦ మేలమాడి,
యాడి పాడెడి తుమ్మెద ♦ లేడఁ బోయె?
నవియె పూఁ దేనె లేకయే ♦ యలిగెనేమొ!! 7
తే.గీ.
పూర్వ మున్నట్టి ప్రకృతి య♦బ్బురముగాను
మాయమాయెను; మనిషియు ♦ మాఱిపోయె;
మాయమాయెను సంస్కృతి; ♦ మాయమాయెఁ
బండుగల తీరు తెన్నులు ♦ భారతమున! 8
తే.గీ.
మార్పు రావలె నేఁడైన ♦ మనిషిలోన;
సంస్కృతుల్ సంప్రదాయాల ♦ సంస్కరించి,
ప్రకృతిఁ బూజించి, మనమునఁ ♦ బరవశించు
దినము దుర్ముఖీ యీయవే ♦ ఘనముగాను! 9
ఉత్పలమాల:
జీవులకెల్ల సౌఖ్యములు, ♦ క్షేమము శాంతి శుభాది వైభవాల్,
జీవన మిచ్చి, ప్రోచి, విర♦చించిన ధాన్య ధనాది సంపదల్
దీవన తోడుతన్ మనిచి, ♦ తృప్తియు, తోషణ సమ్ముదమ్ము, ప
ర్యావరణమ్ముఁ గూడ కడు ♦ రమ్యత నీయవె మాకు దుర్ముఖీ! 10
-:శుభం భూయాత్:-
గుండు మధుసూదన్
ప్రబోధాత్మకమైన యుగాది మీది మిత్రమా మధుసూదనా!
తొలగించండిసుకవి మిత్రులు మిస్సన్న గారూ...నమస్సులు...ధన్యవాదములు!
తొలగించండిగుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమనోహరమైన పద్యాలతో మీ ఖండకృతి ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ!
తొలగించండివీక్షకులకందరికీ శ్రీ దుర్ముఖి నామ వత్సర ఉగాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిచంపకమాల:
ముఖమది చంద్రబింబముగ ముచ్చట కొందరికుండినన్ భువిన్
సుఖమును బంచలేరు మరి జూడగ, దుర్ముఖమంచు నెంచకన్
సఖులుగ మమ్ము జూచియిక సన్మతి సౌఖ్యములందజేయ దు
ర్ముఖియను నామ వత్సరమ మోడ్చుచు చేతులు స్వాగతింతు, రా !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిచక్కని భావంతో మంచి పద్యాన్ని వ్రాశారు.అభినందనలు.
దుర్ముఖియనియెడు పేరున
రిప్లయితొలగించండిదుర్ముఖ వత్సరము వచ్చె దుష్టుల కెల్లన్
దుర్మదమణచుచు బాపుచు
కర్మము,సుపథము దెలుపగ కలుషములణగెన్
డా. బాల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.
సముఖం బాయెను దుర్ముఖి
రిప్లయితొలగించండిప్రమదమ్ముగ భారతాన రాగ సుధా ధా
ర మహీ తలముం దనుపగ
సమంచిత శుభప్రదాయి సకల జనులకున్
వచ్చును బోవును సమములు
ఖచ్చితము మరణము బుట్టఁ గరుణా మతియై
నిచ్చలు పుణ్య యశమ్మున
చచ్చిన బ్రతుకంగ వలయు జగతిని పేర్మిన్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిసందేశాత్మకమైన మీ పద్యాలు మనోరంజకాలు. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిధర్మము దప్పువారలను దాపున నుంచక మానవాళి స
రిప్లయితొలగించండిత్కర్మల జేయునట్టు లవగాహన బెంచి సమాజమందునన్
నిర్మలమైన జీవనము నిత్యము నీతిగ వెళ్ళబుచ్చ నో
దుర్ముఖి నామ వత్సరమ! త్రోవను జూప సమాగమించుమా!
బొడ్డు శంకరయ్య గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నిరుడు కూసిన పికం సరిగమ రాగాలు
రిప్లయితొలగించండి. తిరిగియాలాపించు తరుణ మిదియె
నవపల్లవమ్ముల నవ నవో ణ్మేషమ్ము
. నేలనే మురిపించు వేళ యిదియె
ఖగ జాతి కువకువల్ కమనీయ దృశ్యముల్
. మేలవింపుల మేటి వేళ యిదియె
మంచుతెరల్ తొల్గి మరులు గొలిపెడు రీతి
. కౌముదుల్ వర్షించు కాలమిదియె
పడతి తనువు జేరు పరువాల వోలెను
వంపు సొంపులన్ని వసుధకమరె
కులుకు లీను చుండె కువలయమీ వేళ
మదిని దోచు మాస మాగమించె
3.
శ్రియమున్ గూర్చగ నెంచెనో జనుల సంక్షేమమ్మునే గోరెనో
పయనమ్మై తన చెల్లితొ దెనుగు సౌభాగ్యమ్మునే పెంచునో
జయనాదమ్మున స్వాగతమ్మనగ నే సత్కార్యమాశించియో
దయతో జేరెను దుర్ముఖంచు కడు మోదమ్మయ్యె నీ ధాత్రికిన్
4.
హరితాంబరములు దాల్చిన
తరువులు పేర్మిన బిలవగ ధరణిన్ జేరన్
పరుగున దుర్ముఖి వచ్చెను
మురిపము తో స్వాగతింపు మోదము గూర్చున్
5.
కలకంఠి మధురస్వరమున
పిలువగ దుర్ముఖియె యిలకు విచ్చేసెనుగా
తెలుగింటి తలుపు తట్టెను
వెలుగులనే పంచనెంచి వేడ్కగ జేరెన్
6.
దుర్ముఖి యనుచును తలవకు
దుర్మతి గాదదియు వినుము దుష్టత్వమునే
పేర్మిన ద్రుంచగ వలెనని
కూర్మిగ జేరెనట తెలుగు కువలయమునకున్
7.
వచ్చి నిల్చెను నవ వత్సరాంగన నేడు
తెలుగు జాతి కదియె తేజమగుచు
పేర్మి గలిగినట్టి దుర్ముఖి వత్సరమ్
శుభము గూర్చు మనకు శుక విహారి
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ ఖండిక బాగున్నది. అభినందనలు.
మొదటి పద్యంలో ‘పికం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘నిరుడు కూసిన పిక మరుదైన రాగాలు...’ అనండి. ‘నవనవోన్మేషమ్ము’ అని ఉండాలి.
మూడవ పద్యంలో ‘దుర్ముఖి+అంచు’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘దయతో జేరగ వచ్చె దుర్ముఖియె మోదంబయ్యె...’ అనండి.
నాల్గవ పద్యంలో ‘పేర్మిని’ అనండి.
ఐదవపద్యం మొదటి పాదంలో మధురస్వరము అన్నచోట స్వకు ముందున్న ర గురువై గణదోషం. ‘కలకంఠి కలస్వరమున’ అందామా?
ఆరవపద్యంలో ‘పేర్మిని’ అనండి. ‘వత్సరమ్’ అని హలంతంగా వ్రాశారు. ‘దుర్ముఖి యను సాలు’ అనండి.
గురువుగారికి, మిత్రులకు నూతన వత్సరాది శుభకామనలు.
రిప్లయితొలగించండినలుదెసల్ క్రొంగ్రొత్త వెలుగులు నిండగా
...........ధరణికి శోభలు తరలి వచ్చె !
శోభిల్లు ధరణిని జూచిన పవనుండు
...........పరిమళవీచికల్ పంచ దెచ్చె !
పరిమళవీచులు పురికొల్ప పులకలై
...........ముదమున మావిళ్ళు మోసులెత్తె !
మోసులెత్తిన మావి మురిపింప కొమ్మపై
...........కోయిల కమ్మగా కూయసాగె !
కూయసాగిన కోయిల హాయి నీయ
పచ్చచీరను ధరియించె ప్రకృతికాంత!
ప్రకృతికాంతను గని తాను వలచి వచ్చె
చూడు డల్లదే వాసంతు డాడి పాడ!
*** *** ***
దుర్ముఖి యైన నేమి యిక దుర్మతి యైనను నేమి సర్వదా
ధర్మము దప్పకన్, పరుల దండన సేయక, లోకరీతిలో
మర్మము లెన్నుచున్, తగిన మాలిమి నెల్లర జూచుచుండు స-
త్కర్మపథానుగాములకు కాలము నెచ్చెలి కాకపోవునే!
మిస్సన్న గారూ,
తొలగించండివహ్వా! ముక్తపదగ్రస్తంగా మొదటి పద్యం, సందేశాత్మకమై రెండవ పద్యం శబ్దభావాలు లాస్యం చేయగా రచించి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదాలు
తొలగించండిగురువులు శ్రీకంది శంకరయ్య గారికి మరియు సుకవి మిత్రులకు దుర్ముఖినామ వత్సర ఉగాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిశ్రీకరంబగుచున♦శేష సౌభాగ్యముల్
.......... వర్ధిల్లజేయు ♦సంవత్సరంబు
కులమతాచార సం♦కుచిత భావావేశ
.......... దౌష్ట్యంబు ద్రుంచు వ♦త్సర శిఖంబు
విజయపరంపరా♦విర్భూత ధరహాస
.......... ములు పెంపుజేయు దు♦ర్ముఖి సమంబు
భేదభావములెల్ల ♦బేధించి ప్రేమాను
.......... రాగంబు బెంచు వ♦ర్ణము, యుగాది
ప్రజలకెల్లను భోగ సౌ♦భాగ్యములను
కర్షకులకెల్ల సత్కాల వ♦ర్షములను
సకలజీవులకెల్లను ♦శాంతిగొలుపు
క్రొత్త ఋతువృత్తి యరుదెంచె ♦చిత్తమలర
దుర్ముఖి నామవత్సరము ♦దుష్టములన్నియు బారద్రోలి స
త్కర్మయుతంబుగా జనుల ♦గాచుచు జీవిత పారమార్థమౌ
ధర్మము సత్యమున్ నెఱపి ♦తత్వవిచారము పెంపుజేసి దు
ష్కర్మఫలంబు బాపుచును ♦శాశ్వత సౌఖ్యములిచ్చుగావుతన్.
గడచిన వర్షమునందున
పొడచూపిన బాధలెల్ల ♦పోగొట్టి శుభం
బిడి జీవితమున శాంతియు
కడువైభవముల్ ఘటించ గణుతింతు నినున్.
ఈశ్వరపాదధ్యానము
శాశ్వత శుభకీర్తి రుచిరసాహిత్య కళా
విశ్వాసమతిశయించగ
నైశ్వర్యప్రాప్తినొందురనిశము సుకవుల్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిచక్కని పద్యాలతో మంచి ఖండిక నందించారు. అభినందనలు.
వసంత శోభను సాక్షాత్కరింపజేస్తున్న కవిమిత్రులు విరించి గారి, చంద్రమౌళి గారి,మిస్సన్న గారి పద్యాలు చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిఆశావహ దృక్పథాన్ని ఆవిష్కరిస్తున్న ఇతర కవకవిమిత్రుల పద్యాలన్నీ బాగున్నాయి.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
లక్ష్మీదేవిగారికి ధన్యవాదములు
తొలగించండిమన్మధపదవీ విరమణ
రిప్లయితొలగించండిసన్మానముదుర్ముఖి కిల సంతోషమునన్
చిన్మయ తత్వము నిలుపగ
చిన్మీలిత యూహ లుంచచేరగరమ్మా
2తీపి మాటలు మరిమరి తిరగదోడి
మంచి మమకారమెంచెడి వంచనాన
చేదు ననుభవ మందించ మోదమగున?
పొగరు వగరున వెళ్ళిన పోరువచ్చు|
3.ఉప్పు నుపకార మట్లుగ నుంచు ప్రజకు
పులుముకొనవద్దు పులుపును వలపులాగ
మంచి ఆరోగ్య పచ్చడి బంచినపుడె
నిలనుగాది దుర్ముఖి మన కళలుబంచు|
4.మన్మ దాజ్ఞకు బలియైరి మగువ లిలను
దుర్ముఖంబు|యుగాదికి దూకి రమ్ము
భ్రూణ హత్యలు మాన్పగ బుద్ది నిమ్మ
నీతి నిర్మల తత్వము నెగడు నట్లు
5.యుగయుగాలకు నాదిగా తెగువ బెంచి
ప్రజల బాగోగు లెంచెడి ప్రతినబూని
రక్ష గూర్చగ దుర్ముఖీ రమ్ముభువికి
మన్మదీ నాడు విడ నాడె|మదనబడుచు|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఆరోగ్య పచ్చడి’ అనడం దుష్ట సమాసం. ‘మంచిదై మించు పచ్చడి పంచినపుడె’ అనండి.
కవి మిత్రులకు, గురు దేవులకు దుర్ముఖి ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిముసలి శిశిరమ్మురంగులు పూసికొనుచు
అడుగు మోపెను గాదిగా హాయనమున
యువప్రకృతితో సంపర్క మేర్పడంగ
నవవసంత వధూటిగా నమరే నేడు
2.పంకమందునజనియించు ప0కజముల
పంకిలము తొలగి0చు పావన వనమ్ము
కాల వాహిని మునుగన0దాల బొమ్మ
గాసుముఖి యాయెదుర్ముఖి యవతరించి
3. స్వాగతింపుము కోయిలా పాట పాడి
పలుకు వన్నెల బాసల చిలుక రాణి
కైపు ఊపిరి నింపుమా గంధవాహ!
వలపు పన్నీరు జీలుకుమా పొలతి పైన
4. పులుపు,వగరును,తీపిని కలిపి కొనుచు
చేదు,కారము,క్షారము చేర్చి జీవి
తమున కష్టసుఖమ్ములు తారస పడు
ననుచుబోధించునుగాది నీ జనుల కెల్ల
5.కలిసి యుండుము కాపురుషుల సహించి
తీపి స్నేహమ్ము పంచుము నోపు జూపి
కలహముల పెంచుకోకుము కులమతముల
భేద మెంచకు భారతి విశ్వ జనని.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ ఐదు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యం మూడవపాదంలో గణదోషం. ‘యువ ప్రకృతితోడ సంపర్క...’ అనండి.
కల్తీకాలాన్ని మార్చుటకురారమ్మని కోరుతూ
రిప్లయితొలగించండితీపి-కారము-చేదునుప్పు-దెలుప రుచులుమారెలే|
పాపమొగరు పులుపుగాగ|ఫలితమేమని జూడగా?
ఆపరైరి నాశపరుల ఆస్తి పాస్తి పెంపుకై
రూపుమాప రమ్మునిలకురోత,”కల్తి”దుర్ముఖీ
2.ఆదియుగాది నాదనుచు నాశగ వచ్చిన మన్మదుండు|యే
వేదన మాన్ప లేదిచట|వేల్పుగరమ్మిల దుర్ముఖీ సదా
మోదము లంద జేయగల ముఖ్యుడ వీవనినమ్మిబిల్వగా
ఆదరణంబు బెంచుటకు ఆప్తుడుగాసుఖమివ్వరమ్మిలన్
3.స్వాగతమ్మని సర్వు లెంతురుసాగిరమ్మిల దుర్ముఖీ
భోగ భాగ్యము లందజేయగ పూర్తిగామిమువేడగా
త్రాగువారలు దాహమెంచగ ?ధర్మమేయనిబంచగా
వేగ రమ్మిల వర్ష ధారల వేల్పుతో జతగట్టుచున్.
కె.ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూర్మిని నింపనెంచి యిల కోకిల పాటల నాలకింపగన్
తొలగించండినిర్మలకాంతులీనుచు యనిర్వచనీయ సుఖమ్ము పంచు చున్
పేర్మిని గల్గివచ్చినది వేడ్కగ ధాత్రియె స్వాగతింప నా
దుర్మిఖి వత్సరాంగన వధూటిగ జేరె ధరాతలమ్మునన్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాజేటి సుమలత గారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘బిరాన నేలగ...’ అనండి.
రెండవపద్యంలో ‘పిలచిన| నలుగక’ అనండి.
మూడవపద్యం రెండవపాదంలో గణదోషం. ‘జిలుగుల హొయల్ నాలుకపై’ అనండి.
నాల్గవపద్యం ‘వసంతతిలక’లో రెండవపాదంలో ప్రాస తప్పింది.
గురువర్యులకు వారి కుటుంబ సభ్యులకు, తోటి కవమిత్రులకు ఉగాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిఅమెరికానుండి మీ శుభాకాంక్షలు అందుకొన్నందుకు ఆవందంగా ఉంది. మీకు కూడా నూతనాంధ్రసంవత్సర శుభాకాంక్షలు!
సీ||
రిప్లయితొలగించండిఫాల్గుణమ్ము పిదపె వచ్చెను చైత్రము
నాలస్యమేలేదు కాలగతికి!
కొమ్మల్లు చిగురించ కోయిలమ్మలు మెక్కి
యామని పాటల నాలపించె!
చింత పుల్లగె నుండి చెఱకు తీపియె పంచి
మావిళ్లు వగరునె మరువ కుండి!
చేదును వేపయె చిందించె! మిరియమ్ము కారమ్మె,
లవణమ్ము యుప్పునె రంగరించె!
ఆ||వె||
ప్రకృతి సిద్ధమైన పక్షులున్ వృక్షాలు
యెవరి కర్మల నవె యవధరించి
గుర్తెఱుగుచుఁ జేయ కర్తవ్యనిష్టల
నదె యుగాది పర్వమయ్యెఁ గాదె!
దుర్ముఖి నామమ్మున గల
తొలగించండిమర్మమ్మేమన? యుగాది, "మనసా వాచా
కర్మన శుద్ధిగ నుండని
దుర్మతులకు విన, సుజనుల తోషముఖి ననెన్!"
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పిదప+ఎ=పిదపయె/పిదపనె (పిదప వచ్చెను), కొమ్మల్లు (కొమ్మలు), పుల్లగ+ఎ=పుల్లగనె (పుల్లగనుండి), లవణమ్ము+ఉప్పునె=లవణ మ్ముప్పునె (లవణమే యుప్పునె), వృక్షాలు+ఎవరి=వృక్షా లెవరి (వృక్షమ్ము లెవరి)... బ్రాకెట్లలో నున్నవి నా సవరణలు.
గురుదేవులకు ప్రణామములు. సవరించిన పద్యం:
తొలగించండిసీ||
ఫాల్గుణమ్ము పిదప వచ్చెను చైత్రము
నాలస్యమేలేదు కాలగతికి!
కొమ్మలు చిగురించ కోయిలమ్మలు మెక్కి
యామని పాటల నాలపించె!
చింత పుల్లగ నుండి చెఱకు తీపియె పంచి
మావిళ్లు వగరునె మరువ కుండి!
చేదును వేపయె చిందించె! మిరియమ్ము కారమ్మె,
లవణమే యుప్పునే రంగరించె!
ఆ||వె||
ప్రకృతి సిద్ధమైన పక్షులున్ వృక్షమ్ము
లెవరి కర్మల నవె యవధరించి
గుర్తెఱుగుచుఁ జేయ కర్తవ్యనిష్టల
నదె యుగాది పర్వమయ్యెఁ గాదె!
స్వాగతోక్తి గర్భ మత్తేభము.
రిప్లయితొలగించండిఐదు పదమూడవ అక్షరములు – దుర్ముఖికి స్వాగతము.
మః క్షరపై సాదు జనమ్ము నిత్యమును స్వాచ్ఛంద్యమ్ము పొందన్ వలెన్
వరుణుండుర్ముల తోడుతన్ ఘనముగన్ వర్షంబు నియ్యన్ వలెన్
ధరపై శాఖి నశింపనీయకను తత్వజ్ఞుల్ శ్రమించన్ వలెన్
వరభూమిన్ కిరణుండనుగ్రహణమున్ ప్రాప్తింప జేయన్ వలెన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ గర్భ కవిత్వం బాగున్నది. అభినందనలు.
గర్భిత స్వాగతోక్తిని కూడా ఇస్తే బాగుండేది. నాకు స్వాగత వృత్తం (శీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్) తెలుసు. కాని స్వాగతోక్తి ఎక్కడా కనిపించలేదు. దాని లక్షణాన్ని చెప్పండి.
మిత్రులు శంకరయ్యగారూ....నమస్సులు!
తొలగించండిఇందు స్వాగతవృత్తము లేదు. నాలుగు పాదాల్లోని యైదవ యక్షరములను కలుపగా "దుర్ముఖికి" యనియు, పదమూడవ యక్షరములను కలుపగా "స్వాగతము" అనియు గర్భితమై యున్నవి. అంతే.
స్వస్తి.
చాలా ధన్యవాదములు మాష్టారు. సవరించిన పద్యాలు.
రిప్లయితొలగించండివేదాగ్రణి! దేవి! సదా
నీ దారిని గని మనమున నెరనమ్మి న మా
పై దాక్షిణ్యమొసంగుచు
ఈ దాసుల నిట బిరాన నేలగ రావే
పలుకుకలికి! నే పిలచిన
నలుగక తెలుగు జిలుగుల హొయల్ నాలుక పై
చిలుకంగ జూడు సుమ్మీ
నలువ రమణి! పద్య సరుల నల్లి కొలిచెదన్
శ్రీరమ్యమై నవ విశేష యుగాది వచ్చెన్
సారస్యమౌ శుభ వసంత వెలుంగు దెచ్చెన్
ధీరత్వచింతనము, ధీయుత భక్తి తోడన్
సారంగ పాణి పదసాంగత పట్ట మిచ్చున్
దుర్ముఖివై యరుదెంచుచు
మర్మము లేకను సమగ్ర మానవుల కిటన్
ధర్మము భోధన జేయుమ!
నిర్మలమైన భరతావని వెలయగ భువిన్
చైత్రము వచ్చె, మావి ప్రియ శ్యామము కూసె, మరుత్తు వీచగా
ధాత్రి వికాసమొంది నవ తావిని జిందె, వసంతుడంతటన్
మైత్రిని వాంచ జేసి మృదు మంజుల వన్నెల మానినీ మణిన్
చిత్రము గాను కౌగిటను జేర్చె, జగాన సుదీప్తులొప్పగాన్