మిస్సన్న గారూ! భేష్ ! ఎంత చక్కని పద్యం? ఇదే భావం మరియు విరుపుతో - మోహ ముద్గరం నేపథ్యంలో పూరించాలని అనుకుంటూ తక్కిన పూరణలు చదవడం మొదలు పెట్టి , మీ పూరణ చూచిన తరువాత ఆ ప్రయత్నం అనవసరం అనిపించి మానివేస్తున్నాను .
భావ ప్రకటన సౌలభ్యం కోసం , శయ్య కోసం మీ పద్యాన్ని ఇలా మారిస్తే మరింత స్పష్టంగా ఉంటుందని సూచన.
డాక్టర్ విష్ణునందన్ గారూ! మీ సౌజన్యతకు కడుంగడు ధన్యవాదములు. మీ బోటి ఉద్దండపండితుల ప్రశంసను పొందగలగటం నా అదృష్టం గా భావిస్తున్నాను. మీ సూచన నాకు శిరోధార్యం.
మీ పూరణ కూడా దయచేస్తే మాకు మార్గదర్శకం గా ఉండగలదని భావిస్తున్నాను.
గురువు గారికి నమస్కారములు అభినదనలు
రిప్లయితొలగించండిపరుషపు మాటలనాడక
పుర హితమును గోరువాడు పురజన మదిలో
స్థిరమై నిలుచున్నవ్విధి
మరణము లేనట్టి వాడె మర్త్యుడనదగున్
నరజన్మమె దుర్లభమని
యెరుగుచు స్వార్థమ్ము వీడి యెల్లరి హృదీలో
మరణించకతా నిల్చును
మరణము లేనట్టి వాడె మర్త్యుడనదగున్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నిరతము భయ కంపితుడై
రిప్లయితొలగించండిమరణము మదిలోన తలచు మనుగడ కంటెన్
అరయన్ మృతిగూర్చి యను
స్మరణము లేనట్టి వాడె మర్త్యుడనదగున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిరకాలము యశము మిగుల
రిప్లయితొలగించండిపరహితమును కోరువాడు పరమేశు డనన్
నరుడై బుట్టిన పరిణతి
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్ .
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్ఫురియించె విగ్రహమువలె
రిప్లయితొలగించండిధరపై మూర్తీభవించి ధర్మము తానై
హరి తానేననియెడు సం
స్మరణము లేనట్టి వాడె మర్త్యుఁడన దగున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తానే యనియెడు’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
తొలగించండిస్ఫురియించె విగ్రహమువలె
ధరపై మూర్తీభవించి ధర్మము తానై
హరి తానే యనియెడు సం
స్మరణము లేనట్టి వాడె మర్త్యుఁడన దగున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
రిప్లయితొలగించండిస్మరణను జేసెను రాముని
నరులకు నేర్పెను నహింస నాతడు గాంధీ !
చిరకాలము మది నిలచే
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్ !
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఒరులకుజేయుచునుపకృతి నిరవుగదూషించకెపుడునీప్సితములదా నెరవేర్చుచుమరిమదిసం స్మరణములేనట్టివాడెమర్త్యుడనదగున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శరణాగత రక్షకుడగు
రిప్లయితొలగించండికరుణాకరు రామచంద్రు కమలాక్షుని సం
బరముగ నుతి యించు నతడె
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ నీ తి - స ౦ దే శ ము }
…………………………….......
హరి c దలచెడు వాడే , యే
మరకన్ బోషి౦చు వాడె > మాతా పితలన్ ,
నిరతమ్ము ధర్మ పథ - వి
స్మరణము లేనట్టివాడె మర్త్యు డన దగున్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సన్మతులయందుశ్రేష్ఠుడ!
రిప్లయితొలగించండిసన్మానమునొందితీవుసరసులుసేయన్
దన్మయముకలిగెనాకది
జన్మంబున్నీదియికనుసార్ధకమయ్యెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
రిప్లయితొలగించండి1.పరునింద చేయకుండగ
పరుల హితంబు కొరకు పాట్లును పడుచున్
త్వరగా మరణంబొందినఁ
మరణము లేనట్టివాడె మర్త్యుడనదగున్.
2.కరుణను జూపుచు నొక్కడు
చిరకాలంబు జీవనంబు చేయుచు ఖ్యాతిన్
నిరతము నందెను జగతిన్
మరణము లేనట్టివాడె మర్త్యుడనదగున్.
3.ధరనెందు వెదకిజూచిన
పరోపకార మొనరించి బ్రతికినదాతల్
నెరవేర్చుచు కోర్కెల నిల
మరణమ లేని వాడె మర్త్యుడనదగున్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణ రెండవపాదంలో గణదోషం. ‘పరహితమును జేయుకొరకు...’ అనండి.
రెండవపూరణ రెండవపాదంలో గణదోషం. ‘చిరకాలము జీవనంబు...’ అనండి.
అరయన్ దేవత యనినన్
రిప్లయితొలగించండిమరణము లేనట్టివాఁడె; మర్త్యుఁ డనఁ దగున్
నిరతము శ్రీహరి నామ
స్మరణము మోక్షార్ధియగుచు సలిపెడు వానిన్.
తొపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తరచి జూడ జీవ తత్త్వము వెదుకంగ
రిప్లయితొలగించండిజగతి యందు జనుల జనన కార
కుండు, సకల జీవ కోటి జ నకుడను
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.
............షేక్ అమీర్ భాషా
షేక్ అమీర్ బాషా గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిరజీవుడు పవన సుతుడు
రిప్లయితొలగించండిమరణము లేనట్టివాఁడె;,మర్త్యుఁ డనఁ దగున్
మరణము స్వాభావికమౌ
నరజాతి,సమస్తసృష్టి నాశము నొందున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
.నిరతము-స్వాతంత్ర్యంబుకు
రిప్లయితొలగించండిశరముగ నుపయోగబడిన శాంతియె|గాంధీ
వరముగ జయమును నిలుపగ?
మరణము లేనట్టి వాడె మర్త్యుడన దగున్|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి. కరుణా భావము గలుగుటె
రిప్లయితొలగించండివరమని భావించి మసల ?వసుధకుమార్గం
బరయికగౌతమ బుద్దుడు
మరణము లేనట్టి వాడె| మర్త్యుడనదగున్|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘స్వాతంత్ర్యంబుకు’ అనరాదు. ‘స్వాతంత్ర్యంబునకు’ అనాలి. అక్కడ ‘స్వాతంత్ర్యమునకు’ అనండి.
కరుణాంతరంగ తత్త్వము
రిప్లయితొలగించండిపర బాధల బంచుకొనుచు ప్రాపున జేరున్
వరదునిగా ఖ్యాతిగనిన
మరణము లేనట్టి వాడె మర్త్యుడనదగున్.
కరుణాంతరంగ తత్త్వము
రిప్లయితొలగించండిపర బాధల బంచుకొనుచు ప్రాపున జేరున్
వరదునిగా ఖ్యాతిగనిన
మరణము లేనట్టి వాడె మర్త్యుడనదగున్.
పొన్నెకంటి సత్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరిహరులను మది దలచుచు
రిప్లయితొలగించండిదరుమముగా నడచుకొనుచు ధారుణి లోనన్
నిరతము పరహితమును వి
స్మరణము లేనట్టివాడె మర్త్యుఁ డనఁ దగున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిరతమ్ముండుట కామా
రిప్లయితొలగించండితురుడై పురుషునకు జాల దోషము సుమ్మీ
సరసుడ! హృదయస్థలి కా-
మ రణము లేనట్టివాడె మర్త్యుఁ డనఁ దగున్!!!
మిస్సన్న గారూ! భేష్ ! ఎంత చక్కని పద్యం? ఇదే భావం మరియు విరుపుతో - మోహ ముద్గరం నేపథ్యంలో పూరించాలని అనుకుంటూ తక్కిన పూరణలు చదవడం మొదలు పెట్టి , మీ పూరణ చూచిన తరువాత ఆ ప్రయత్నం అనవసరం అనిపించి మానివేస్తున్నాను .
తొలగించండిభావ ప్రకటన సౌలభ్యం కోసం , శయ్య కోసం మీ పద్యాన్ని ఇలా మారిస్తే మరింత స్పష్టంగా ఉంటుందని సూచన.
"నిరతము కామాతురుఁడై
వరలుట పురుషునకుఁ జాల పాపము సుమ్మీ! "
డాక్టర్ విష్ణునందన్ గారూ! మీ సౌజన్యతకు కడుంగడు ధన్యవాదములు. మీ బోటి ఉద్దండపండితుల ప్రశంసను పొందగలగటం నా అదృష్టం గా భావిస్తున్నాను. మీ సూచన నాకు శిరోధార్యం.
తొలగించండిమీ పూరణ కూడా దయచేస్తే మాకు మార్గదర్శకం గా ఉండగలదని భావిస్తున్నాను.
డా.విష్ణునందనుల సూచన మేరకు సవరించిన పూరణ:
తొలగించండినిరతము కామాతురుఁడై
వరలుట పురుషునకుఁ జాల పాపము సుమ్మీ!
సరసుడ! హృదయస్థలి కా-
మ రణము లేనట్టివాడె మర్త్యుఁ డనఁ దగున్!!!
మిస్సన్న గారికి,
తొలగించండివైవిధ్యమైన మీ పూరణ విష్ణునందన్ గారి ఆమోదాన్ని పొందింది. అంతకంటె అదృష్టమేమున్నది? అభినందనలు.
మిస్సన్న గారూ ! అభినందనలు.
తొలగించండిగురువుగారికి, హనుమఛ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.
తొలగించండిగురువుగారికి, హనుమఛ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.
తొలగించండిపోచిరాజు కామేశ్వరరావుగారి రచనలు
రిప్లయితొలగించండినిన్నటిపద్యము
ప్రాణమిత్రుడడుగబయనించెదోడ్తేర
బట్నమునకుదనదుపల్లెనుండి
ముచ్చటగనుంతముగ్గురదనతల్లి
తండ్రులిద్దరతనితల్లియొకతె
నేటిపద్యము
వరకట్నాశావిహ్వల
నరాధములునిజసతులనునరకవ్యధలన్
గురిసేయుటఘోరదురిత
మరణములేనట్టివాడెమర్త్యుడనదగున్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
Modati padamunaku savarana:
తొలగించండిVarakatnamu dushta samasa manna anumaanamu tho
Varunkidu katnamum goni
మరణము స్థిరమని తెలిసి ని
రిప్లయితొలగించండికరముగ మృతిలేని ఖ్యాతికై తగు సం
స్కరణలు సలుపుచు జనుచో
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
రెండవపాదంలో గణదోషం. ‘ఖ్యాతికై యోగ్యపు సం...’ అందామా?
నరుడై పుట్టియు సతతము
రిప్లయితొలగించండిపరుల సుఖము కోరునతడె భగవంతుడిలన్!
చిరకాలము తన కీర్తికి
మరణము లేనట్టి వాడె మర్త్యు డనదగున్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మరణము తప్పదు ప్రాణికి
రిప్లయితొలగించండిమరణము లేదయ్య భువిని మనచేతలకే
మరువక మంచిని సలుపుచు
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్ !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వరముల యభిషేకముతో,
రిప్లయితొలగించండిస్థిరమగు శీలమునునిల్పి శివునిగ మారన్,
సురలోకము చూపి cఇచట
మరణము లేనట్టి వాcడె మర్త్యు c డన c దగున్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
స్వరముల యభిషేకముతో,
రిప్లయితొలగించండిస్థిరమగు శీలమునునిల్పి శివునిగ మారన్,
సురలోకము జూపి cఇచట
మరణము లేనట్టి వాcడె మర్త్యు c డన c దగున్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘జూపి’ తరువాత అరసున్నా ఎందుకు? ‘జూపి యిచట’ అంటే సరి!
స్వరముల యభిషేకముతో,
తొలగించండిస్థిరమగు శీలమునునిల్పి శివునిగ మారన్,
సురలోకము జూపి యిచట
మరణము లేనట్టి వాcడె మర్త్యు c డన c దగున్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినరునిగ, నున్నత జీవిగ,
రిప్లయితొలగించండిధరపై నున్నట్టి జీవతతి రక్షకుడై,
స్థిరునిగ, తన చేతల నే
మరణము లేనట్టి వాడు, మర్త్యుడనదగున్!
మడిపల్లి రాజకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎరుగుచు జననము మరణము
రిప్లయితొలగించండినరయగ కాయమ్మునకని నందము మీరన్
పరిపరి జననము పునరపి
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్
కిరికిరి జేయుచు నెప్పుడు
రిప్లయితొలగించండికరివరదుని నమ్మ కుండ కమ్మగ తనవౌ
నరిషడ్వర్గమ్ములనున్
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్