23, ఏప్రిల్ 2016, శనివారం

పద్యరచన - 1203

కవిమిత్రులారా,


పైచిత్రాన్ని (బాగుగా) పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.
హతవిధీ! పూలుండడం వల్ల గుర్తించలేకపోయారు. 
ఇప్పుడు పూలు లేకుండా ఇచ్చాను. 

26 కామెంట్‌లు:

  1. అందము చిందెడి సుమములు
    విందును జేయుచు కనులకు వేలకు వేలౌ
    నందన వనమే మనకిది
    కందర్పుని నిలయ మంట గాంచిన చాలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. కాని అది కొత్తిమిరి అన్నవిషయాన్ని గుర్తించలేదు.

      తొలగించండి
  2. కరువుకాలము నందున తరలివచ్చె
    నమెరికా నుండి మనదేశ హద్దుదాటి
    పంపినట్టి గోధుమల లోపలను జేరి
    కలుపు మొక్కగా పెరుగును కంచెలందు
    (మాచర్ల కంప, పార్థీనియమ్ అనిపిలుస్తారు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా దగ్గర పట్నంతుమ్మ అంటారు. నిజమే దాని పూలు కూడ ఇలాగే ఉంటాయి. మీ పద్యం బాగుంది. కాని అది కొత్తిమిర.

      తొలగించండి

  3. గోధుమలబూతచక్కగగోచరించె నలరుచుండెనువనమంతసలలితముగ జూడచక్కనిదృశ్యముచూపరులకు సేదదీర్చుకొనుడుమీరుచేరియటకు

    రిప్లయితొలగించండి
  4. చిన్ని చిన్ని పూలు చిత్తజుశరములు
    గంథమనగ నిచట కలదొ లేదొ.
    ఏదియేమియైన ఇవ్వనిజూడంగ
    మనసు పరవశించి మరులుగొలుపు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరులుగొలిపే పూలపై చక్కని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  5. హరితా భర శాద్వల సా
    గర నిభ వన యవస కుసుమ కర ధవళా ఫే
    న రుచిర దృశ్యము రత్నా
    కర లీల మెరసె నితాంత కమనీయముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొత్తిమిరి నింపు గించుక
      మత్తిడు రసమందు వేయ మన మలరించున్
      విత్తనములు ధనియాలను
      చిత్తొనరించఁ బొడియిడు రుచిని కూరలకున్

      తొలగించండి
    2. మీ రెండు పద్యాలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. అందమైన విరులు యవనిలో విరబూయ
    ప్రకృతికాంత గాంచి పరవశించె
    హరితమున్నచోట హర్షమొదవు నన్న
    మాట నెప్పుడీవు మరువ బోకు.



    పుష్క లంబుగ నట పూలు పూయుచునుండు
    మహళ లెల్ల పూలు మమత తోడ
    తెంపి మాల మంచి తీరుగా గట్ట్టుచూ
    స్వామి మెడను వేసి సంతసింత్రు.

    రిప్లయితొలగించండి
  7. కొత్తిమీరికట్ట
    --------
    నిగనిగలాడుచునుండెను చిగురించినగొత్తిమీరిచెలువముతోడన్ మగువలుపచ్చడిజేతురు తగువిధముగబాళ్లుకలిపితమతమయిండ్లన్

    రిప్లయితొలగించండి
  8. ముదమున ధ్యానముఁ జేయగ
    మెదడున కణకణము విచ్చి మెరిసెడు సుమముల్
    గద!యని పించెను జూడన్
    తదుపరి విచ్చును సహస్ర దళపద్మమటన్!

    రిప్లయితొలగించండి
  9. ధనియము విత్త?కొత్తిమిర దర్పము నందున ఆకులల్లగా?
    అనువుగ పూలు తెల్లగను అందగ పచ్చని పైరు కుంచగా?
    వనితయు గట్టు చీరకు సవాలుగ పైటను వేసి నట్లుగా|
    కనబడు చున్నదీకుసుమ కానుకచిత్రము సంతసంబుగన్|
    2.ఆకుపచ్చని చీరనె నంటి పూలు
    వసుధ వనితకుగట్టగ?విసుగురాదు
    పూల వన్నెల, వెన్నల పులకరింత
    కొత్తి మీరయుగల్పించె ?కొత్తగాదె|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘కుసుమ కానుక’ దుష్ట సమాసం.
      ‘చీరనె నంటి’...?

      తొలగించండి
  10. కొత్తి మీర వేయ కొద్దిగా నైనను
    పరిమళమ్ము గలుగు వంటలకును
    అనువుగాను దొరుకు నారోగ్యదాయిని
    పెరటిలోన పెరుగు విరివిగాను!!!

    రిప్లయితొలగించండి
  11. బెంగాలీలో ఇట్టి పద్యాలను "కొణిక" (కణిక) అంటారు:👇

    అయ్య వార్కి చాలు నైదు రూపాయలు
    నమ్మ గార్కి చాలు కమ్మలారు
    మామ గార్కి చాలు మందు సీసాల్రెండు
    నత్త గార్కి చాలు కొత్తిమిర్రి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "రథ యాత్ర" పై రవీంద్రుని కొణిక:👇

      రథ్ భాభే అమీ దేబ్
      పథ్ భాభే అమి
      మూర్తి భాభే అమీ దేబ్
      హెషే అంతర్జామి :)

      తొలగించండి