8, ఏప్రిల్ 2016, శుక్రవారం

సమస్య – 1997 (జనగణ బాధాకరము...)

కవిమిత్రులారా,
నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జనగణ బాధాకరము వసంతము వచ్చెన్.

40 కామెంట్‌లు:

  1. జనగణ మనంబులు నిరం
    జన నిర్మల నిశ్చలమగు సంతసమౌ, రం
    జనగణ రమణీయము, భం
    జనగణ బాధాకరము వసంతము వచ్చెన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      ‘జన’ శబ్దావృత్తితో మీ పూరణ వినసొంపుగా నున్నది. అభినందనలు.
      కాకుంటే భంజనగణానికి, వసంతునికీ సంబంధం అర్థం కాలేదు.

      తొలగించండి
    2. రంజన గణము = (ఇతరులకు) సంతోషమును కలిగించు వారు
      రంజనగణ రమణీయము = ఈ వసంతము ఇతరులకు సంతోషమును కలిగించు వారలకు రమణీయము (అగుగాక!!)

      భంజన గణము = చెడగొట్టువారు లేక విడగొట్టువారు
      భంజనగణ బాధాకరము వసంతము = ఈ వసంతము చెడగొట్టువారలకు బాధాకరము (అగుగాక!!)

      తొలగించండి
  2. గురువు గారికి కవిమిత్రులకు దుర్ముఖి ఉగాది శుభాకాంక్షలు

    పెనుకరువు యె వాటిల్లుట
    జనగణ బాధా కరము, వసంతము వచ్చెన్
    కనువిందగు శోభలతో
    నునికిని చాటి సరి కొత్త ఊహలు పెంచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది.
      ‘కరువు+ఎ’ అన్నపుడు సంధి నిత్యం. ‘పెనుకరువే వాటిల్లుట’ అనండి.

      తొలగించండి
  3. అందరికీ ఉగాది శుభాకాంక్షలు
    -----------------------------------
    ఇనుడట మాడ్చిన యెండకు
    జనగణ బాధాకరము, వసంతము వచ్చెన్
    మనమున సంతస మొందగ
    కనులకు విందొన గూర్చు కాంతుని శోభల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      విరుపుతో మీ పూరణ బాగున్నది.
      ‘...యెండయె... బాధాకరము’ అని ఉండాలి కదా!

      తొలగించండి
  4. శుభోదయం !

    వినుమ! జిలేబీ ! తొలగును
    జనగణ బాధాకరము! వసంతము వచ్చెన్,
    మన యధినాయకులు తెలివి
    గొని యెల్లర మేలు గూర్చ గోరిన మేలౌ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తొలగును...బాధాకరము’ అన్వయం కుదరడం లేదు. ‘వినుమ! నిరంకుశ పాలన| జనగణ బాధాకరము...’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  5. అనిశము వేసవి యెండలు
    జనగణ బాధాకరము, వసంతము వచ్చెన్
    మనములు పులకించునటుల
    ఘనముగ నరుదెంచె భువికి కమనీయముగన్!!!

    రిప్లయితొలగించండి
  6. పూజ్య గురుదేవులకు , కవిమిత్రులందరికీ ..... ఉగాది శుభాకాంక్షలు ....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      ధన్యవాదాలు.
      విరుపుతో మీ పూరణ బాగున్నది. కాని ‘వచ్చెన్... అరుదెంచె’ అనడం పునరుక్తి. ‘ఘన శుకపిక కూజితముల కమనీయముగన్’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి

  7. కనుమావేసవితీవ్రత
    జనగణబాధాకరము,వసంతమువచ్చెన్ మనములుసంతసమొందగ దినబోవుదునిపుడుచేదుతీపులువగరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. ఘన వేడిమి , ఘర్మ జలము
    జనగణ బాధాకరము ;వసంతము వచ్చెన్
    మునుగగ నదీ జలమ్మున
    తనువుకు మనసునకు గలుగు తాపము తొలగున్

    రిప్లయితొలగించండి
  9. అని శాసంతృప్త మతులు
    ఘన మోహాంధులు కుమతులు కరుణా హీనుల్
    ధన ధాన్య లుబ్ధ మత్సర
    జనగణ బాధాకరము వసంతము వచ్చెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. మననీయవు చెలి తలపులు
    కనరాదే తాను కలల గానీ యిస్సీ
    మను టెట్లను యువక విరహ
    జనగణ బాధాకరము వసంతము వచ్చెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      అసలు ఈ సమస్యను ఇస్తున్నపుడే నా మనస్సులో ‘విరహజనులు’ మెదిలారు. ఇప్పటిదాకా పూరించిన మిత్రులెవరూ ఈ ప్రస్తావన తేలేదు. మీ ఆలోచనలే వైవిధ్యంగా ఉంటాయని ఎప్పుడో చెప్పాను. ఆ మాటను నిజం చేస్తూ చక్కని పూరణ నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి
    2. ఎవరూ ప్రస్తావించకుంటే ‘విరహ జనగణ’ముల పూరణ నేను చేద్దామనుకున్నాను. ఆ పని మీరు చేసి అస్వస్థుడినైన నాకు శ్రమ తప్పించారు. మరోసారి ధన్యవాదాలు.

      తొలగించండి
    3. గురువుగారూ మీ అభిమానానికి ధన్యవాదాలు.

      తొలగించండి
  11. తన జన్మభూమిఁ దలచుచు
    ననలేరట జైయటంచు నాశ్చర్యమదే
    వినలేని మాటల నడుమ
    జనగణ బాధాకరము వసంతము! వచ్చెన్!

    రిప్లయితొలగించండి
  12. 16తనదగు ప్రతాప మంతయు
    మనుగడలో సూర్యు డుంచ మండెడి కిరణాల్
    దినదిన మందున బెరుగగ?
    జనగణ బాధాకరము-వసంతము వచ్చెన్|

    రిప్లయితొలగించండి
  13. మనకవిరాజ వరేణ్యులు
    ఘనముగ కీర్తించినారు గాదిని,గానీ
    అనుభవ మయ్యెను కవితను
    జనగణ బాధాకరము వసంతము! వచ్చెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కీర్తించినా రుగాదిని’ అని టైపు చేయవలసింది. లేకుంటే ‘కీర్తించినారు గాదిని’ అనడం ‘రామునితోక పివరుండు..’ వలె అవుతుంది.

      తొలగించండి
  14. మనుజులలో కుల మనుచును
    జనగణ బాధాకరము , వసంతము వచ్చెన్
    దనతోడుగ దెచ్చెనదియు
    ఘన సమతా భావమదియె కలతలు దీర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది.
      ‘కులమనునది|...బాధాకరము’ అనండి.

      తొలగించండి
  15. అనయము మండెడి వేసవి
    జనగణ బాధాకరము వసంతము వచ్చెన్
    తనువునకుపశాంతి కల్గి తాపము
    మనమున తగ్గగ ముదమది మంచిగ హెచ్చెన్.

    రిప్లయితొలగించండి
  16. నమస్కారం. నా పేరు మధిర మూర్తి. పదాలను క్రమబద్ధంగా విడగొట్టడం లేదనిపిస్తోంది, ఎందువల్లో అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధురమూర్తి గారూ,
      మీరు శంకరాభరణం బ్లాగును వీక్షిస్తున్నందుకు సంతోషం.
      కాని మీరు చెప్పిన ‘పదాలను క్రమబద్ధంగా విడగొట్టడం’ ... అర్థం కాలేదు.

      తొలగించండి
    2. 'కీర్తించినారుగాదిని' అని వ్రాయాలని అనుకుంటున్నాను. 'కీర్తించినా రుగాదిని' అని
      వ్రాయాలన్నారు - వివరించ గోర్తాను.

      ఇలాగే అనుభవ మయ్యెను అన్నారు. 'అనుభవమయ్యెను' అని వ్రాయకూడదా?

      తొలగించండి
    3. మూర్తి గారూ,
      తిమ్మాజీ రావు గారు తమ పద్యంలో ‘కీర్తించినారు గాదిని’ అని టైపు చేశారు. నేను ఈ ‘గాదిని’ ఎక్కడిది? దీని అర్థం ఏమిటి అని కాసేపు ఆలోచించాను. అది గాదిని కాదు ఉగాదిని అని అర్థం అయింది. వారు ‘కీర్తించినా రుగాదిని (లేదా) కీర్తించినారుగాదిని’ అని టైప్ చేస్తే సందేహానికి తావు ఉండేది కాదు.
      ‘అనుభమయ్యెను/అనుభవ మయ్యెను’ అనవచ్చు. కాని ‘అనుభవమ య్యెను’ అనకూడదు కదా! తిమ్మాజీరావు గారు చేసిన పొరపాటు (కీర్తించినారు గాదిని అనడం) అదే.

      తొలగించండి
    4. శంకరయ్య గారూ,

      మీరిచ్చిన వివరణకు ధన్యవాదములు.
      నేను అమెరికాలో వారాంతంలో తెలుగు పాఠాలను నేర్పుతుంటాను.

      నాకు ఉన్న సందేహాలకు మీకు విద్యుల్లేఖ పంపవచ్చా?

      తొలగించండి
  17. విన నామము, క్లేశంబగు;
    చనియెన్ గత వత్సరము ప్రశాంతతతో; నూ
    తన "దుర్ముఖి" యటులుండునె?
    జనగణ బాధాకరము వసంతము వచ్చెన్!!

    రిప్లయితొలగించండి
  18. వనమున కోయిల కూయగ
    మనమున కోరికలు హెచ్చి మైమరపించన్
    పనిలేని రోడ్డు రోమియొ
    జనగణ బాధాకరము వసంతము వచ్చెన్ :)

    రిప్లయితొలగించండి