14, ఏప్రిల్ 2016, గురువారం

సమస్య – 2003 (చలివేంద్రమ్ములలోనఁ బోసెదరు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చలివేంద్రమ్ములలోనఁ బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్.

41 కామెంట్‌లు:


 1. శుభోదయం !

  పద్య ద్రాక్షా పాకము ను చలివేంద్రము లలో విస్తారము గా బోసెదరు గాక !  నళినీ కావ్యపు లోక శంకరుని ఉన్మత్తంబు నిచ్చున్ సమ
  స్యల నీవీ విధ పూరణం గనుచు ద్రాక్షా పాక మందించుమా !
  అలివేణీ మధురాధరామృతపు నారాణీ ! జిలేబీ ! సదా
  చలివేంద్రమ్ములలోనఁ బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్!


  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   బాగుంది మీ పూరణ.
   ‘ఉన్మత్తంబు సేయున్’ అనండి.
   మూడవపాదంలో యతి తప్పింది. ‘నారాణీ’ అన్నదానిని ‘పద్మాక్షీ’ అంటే సరి!

   తొలగించండి
 2. కలలో గాంచెను త్రాగుబో తొకడు స్వర్గమ్మందు సీసాలతో
  చెలులే యిచ్చుట, చెప్పె మిత్రులకు, రాజీవాక్షులౌ యప్సరల్
  నిలు చేకొమ్మని దారినుందురని, వర్ణించెన్ సురాచిత్తుడై
  చలివేంద్రమ్ములలోనఁ బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మడిపల్లి రాజకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రాజీవాక్షులౌ నప్సరల్’ అనండి. అలాగే ‘సురాసక్తుడై’ అంటే ఇంకా బాగుంటుందని నా సూచన.

   తొలగించండి
  2. మీ సవరణలు ఒక విధంగ పద్యరచనలో పాఠాలు. ధన్యోస్మి.

   తొలగించండి

 3. చలివేంద్రమ్ములలోనబోసెదరువిస్తారమ్ముగామద్యము న్గలికాలమ్ముననట్లనేనగునుగాదేమీయసత్యంబును న్నిలలోద్రాగెడువారలందరునునీరీతిన్బ్రవర్తింతురే
  చెలియా!యీయదిమీరలందరకుచేతోమోదమున్నాయెనే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   ‘...నట్లనే యగును’ అనండి.

   తొలగించండి
 4. విలసత్కాంచనసన్నిభానన సదావేశాభి మానుండ నే
  సలిలమ్మంచని నెంచుచుం గుడువ నుత్సాహమ్ముగన్ మద్యమున్
  చలి వేంద్రమ్ములలోన బోసెదరు విస్తారమ్ముగా, మద్యమున్ (మత్ +యమున్ )
  బలవంతమ్ముగ గాంతుసత్వరము భీభత్సమ్ము దీపింపగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మద్యమును శ్లేషించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి సమస్య లో వరకట్నము సమాసము సాధువేనా? తెలుప గోర్తాను.సవరణ పాదము కూడ వ్రాసితిని. దురితము+అరణము అన్న అర్థాన్నే తీసుకున్న ట్లు తలస్తాను.

  రిప్లయితొలగించండి
 6. వలదన్నన్ విషమమ్మకమ్ము ప్రభువుల్ వాంఛించి నారాంధ్రలో
  పులియం జేతురు చౌక మద్యమును; సంపూర్ణమ్ముగా మజ్జిగన్
  చలివేంద్రమ్ములలోనఁ బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్,
  కలియున్ గాలిని పెక్కు ప్రాణములు ; సంఖ్యా యెన్నికల్ మేలగున్

  రిప్లయితొలగించండి
 7. కలికాలంబిది కల్మషాల మది సంకల్పంబు సూచించగా?
  చలివేంద్రమ్ములలోన బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్
  విలువల్ గాదిట నాశ దోషముల ప్రావీణ్యంబె నాదాయమై|
  కలిమిన్ బెంచుట లోపమే యనుచు సంకల్పంబు బోధించరే|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ప్రావీణ్యంబె యాదాయమై’ అనండి.

   తొలగించండి
 8. ఇలలో నెయ్యదసాధ్యమౌ కనగ, కామేశాది వర్గమ్ముకున్
  తలపుల్ పుట్టెను మద్యమున్ సరసతం ద్రావింప దాహార్తులన్
  కలికాలంబున పాప పుణ్యముల సుజ్ఞానంబు దీపించునా
  చలివేంద్రమ్ములలోన బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘వర్గమ్ముకున్’ అనడం దోషం. ‘వర్గమ్మునకున్’ అనవలసి ఉంటుంది. అక్కడ ‘వర్గాలకున్’ అందామా?

   తొలగించండి
 9. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  చలివే౦ద్రమ్ములు కానిపి౦చు గద - గ్రీష్మ౦ బ౦దు | నచ్చోట , శీ

  తల నీరమ్మును గ్రోలు , చెల్ల పధికుల్ తా పో ప శా౦ త మ్ము తా

  మెలమిన్ గా౦తురు | నేడు కన్పడు గదా
  యెల్లప్పుడున్ బెల్టు షా

  పు ల. సత్రమ్ములు | గ్రామ గ్రామములలో
  పొ ల్చే ప్రభుత్వ౦పు నా

  చలివే౦ద్రమ్ముల లోన బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్ !


  { పధికుల్ = ప్రయాణీకులు ;
  తాప + ఉపశా౦తము = తాప + ఉపశమనము
  = వేడిని ఉపశమి౦ప జేయుట. పొ ల్చు = స్థిరమగు , విలసిల్లు ; }
  ి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పొల్చే' అని వ్యావహారికం ప్రయోగించారు. 'పొల్చున్' అనండి.

   తొలగించండి
 10. సలిలమ్మేగద జీవరాశికరయన్ సంపోషకబట్టీ యీ
  కలికాలామృతమందజేసెదరు వేగన్ వెట్టకాలంబునన్
  చలివేంద్రమ్ములలోనఁ, బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్
  సులభంబౌనిది రాజకీయములలో చోద్యంబిదే చూడగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంపోషకబట్టీ' అన్నప్పుడు గణదోషం. 'సంతోషకం బౌచు నీ...' అందామా?

   తొలగించండి
  2. గురువుగారికి వందనములు. ధన్యవాదములు.
   సంపోషకంబు + అట్టి = సంపోషకంబట్టి యీ -- అని వ్రాసినాను కానీ టైపాటువలన అది సంపోషకబట్టి అయి గణదోషము అయింది.
   మీ సవరణ సర్వదా ఆమోదయోగ్యమే గురువుగారూ.

   తొలగించండి
 11. ఇలలో వేసవి కాలమందు జనులన్ సేవింపగానెంచుచున్

  జలమున్ దాహము గొన్నవారికి సదాచారమ్ము గాదల్చియున్
  చలివేంద్రమ్ములలోన బోసెదరు, విస్తారమ్ముగా మద్యమున్
  బలవంతమ్ముగ నిత్తురెన్నికల గెల్వందల్చు దుర్మార్గులే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   మొదటిపాదంలో యతిదోషం. ‘ఇలలో వేసవియందు లోకులను సేవింపంగ తా నెంచుచున్’ అనండి.

   తొలగించండి
 12. జలమున్ బంచిరి దాహముల్ దొలుగ స్వచ్చందంబుగా కేంద్రమున్,
  బలవంతంబుగ మద్యమున్ నిలిపి సంభాళింప భావించ గన్,
  కలి కాలంబిది దారులన్ వెదికి సౌకర్యంబు గా నెంచుచున్
  చలి వేంద్రమ్ములలోన cబోసెదరు విస్తారమ్ముగా మద్యమున్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సంభాళింప’ అన్నది ‘సంభావింప’ అయితే?

   తొలగించండి
  2. జలమున్ బంచిరి దాహముల్ దొలుగ స్వచ్చందంబుగా కేంద్రమున్,
   బలవంతంబుగ మద్యమున్ నిలిపి సంభావింప భావించ గన్,
   కలి కాలంబిది దారులన్ వెదికి సౌకర్యంబు గా నెంచుచున్
   చలి వేంద్రమ్ములలోన cబోసెదరు విస్తారమ్ముగా మద్యమున్
   కొరుప్రోలు రాధా కృష్ణ రావు

   తొలగించండి
 13. పలువేషమ్ముల వేయుచుంద్రు తమ పబ్బంమున్ గొనన్ నాయకుల్
  చలివేంద్ర మ్ముల బెట్టుచున్ ప్ర జలకున్ సంతోషమివ్వంగ తా
  గెలువంగన్ సతమున్ ధనమ్మునిడుచున్ కీర్తిన్ కొనంగన్ వే
  చలివేంద్రమ్ముల ల న బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘పబ్బంబున్/ పబ్బమ్మున్’ అనండి. బహుశా టైపాటు కావచ్చు.

   తొలగించండి
  2. పలువేషమ్ముల వేయుచుంద్రు తమ పబ్బంమ్మున్ గొనన్ నాయకుల్
   చలివేంద్ర మ్ముల బెట్టుచున్ ప్ర జలకున్ సంతోషమివ్వంగ తా
   గెలువంగన్ సతమున్ ధనమ్మునిడుచున్ కీర్తిన్ కొనంగన్ వే
   చలివేంద్రమ్ముల లో న బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్

   తొలగించండి
 14. మిత్రులందఱకు నమస్సులు!

  కలలోనన్ దగ మద్య సక్తుఁ డొకఁడున్ కాంక్షల్ విరాజిల్లఁగన్
  దలఁచెన్ మద్యముఁ ద్రావఁగాను మివులన్; దత్స్వప్నమం దొక్కఁ "డా

  చలివేంద్రమ్ములలోనఁ బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్!
  భళిరా!" యంచనఁగన్, జనంగ నటు వోవం బోన్, బడెన్ నేలపై!!

  రిప్లయితొలగించండి
 15. కొలమానమ్ములు లేక యిత్తురనుచున్ కోయంగఁ నొక్కండటన్!
  వెలనే గోరరు నన్నటంచునొకడున్ ప్రేలంగ! నింకొక్కడున్
  చలివేంద్రమ్ముల లోనఁ బోసెదరు విస్తార మ్ముగా మద్యము
  న్నలవోకంగ నటంచు వాగె! మదిరన్నాపోశనంబట్టగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. బండికాడి అంజయ్య గౌడ్ గారి పూరణ....
  వెలదుల్ బోరిన పంతమో విదితమో బీహారు రాజ్యంబునన్
  కలరా వ్యాధిని బోలు మద్యమును సర్కారెంతొ ధైర్యంబుతో
  నిలుపన్ రోగము బారినన్ బడగ మన్నింపంగ సర్కారు తా
  చలివేంద్రములలోన బోసెదరు విస్తారంబుగా మద్యమున్.
  (బీహారులో మద్యం నిషేధం కాగా అది దొరకక రోగగ్రస్తులైనవారికి సర్కారుకు చెందిన ఒక శాఖ ద్వారా వారానికి ఇన్ని బాటిళ్ళు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని వార్త!)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బండికాడి అంజయ్య గౌడ్ గారూ,
   శంకరాభరణం మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. అల భాగ్యానగరమ్ములో జనులహో హైరాణ యౌచుండగా
  విలవిల్లాడుచు నీటికై బెడిసి గంభీరమ్ముగా పోరగా
  తెలగాణమ్మొక రాష్ట్రమై ఘనముగా తీండ్రిల్లి యొప్పారగా
  చలివేంద్రమ్ములలోనఁ బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్!

  రిప్లయితొలగించండి
 19. చలిలో నెండల కాలమందునను నే జంజాటమున్ గానకే
  బలుపౌ ప్రేమను జల్లుచున్ ముదముతో బంగారు హస్తాలతో
  కలలో గాంచని రీతి భాగ్యనగరిన్ గారాబు లోటాలతో
  చలివేంద్రమ్ములలోనఁ బోసెదరు విస్తారమ్ముగా మద్యమున్

  రిప్లయితొలగించండి