డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీరు శైలజ గారి సామ్రాజ్యంలో అడుగుపెట్టారు. అందువల్ల మీ పద్యాలను చూడలేకపోయాను. మీరు మీ పద్యాలను ఈ పేజీ అట్టడుగున ఉన్న ‘వ్యాఖ్యను జోడించండి’ అన్నదానిని క్లిక్ చేసి అక్కడ వచ్చిన బాక్సులో పెట్టండి. అంతే ఇతరుల వ్యాఖ్యల క్రింద ఉన్న ‘ప్రత్యుత్తరాలు’ను క్లిక్ చేయకండి. మీ పద్యాలపై మీరు ఏమైనా వ్యాఖ్యానించాలంటే మీ పద్యాల క్రింద ఉన్న ప్రత్యుత్తరాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇతరుల పద్యాలపై వ్యాఖ్యానించాలంటే వారి పద్యం క్రింద ఉన్న ప్రత్యుత్తరాన్ని క్లిక్ చేయండి. మీ ఐదు పద్యాల ఖండకృతి బాగుంది. అభినందనలు. ‘పెరుగు+అన్నము’ అన్నపుడు యడాగమం రాదు.
శ్రీ శంకరయ్య గురు తుల్యులకు ధన్యవాదములు గత పూరణ సంది దోషము సవరించినాను మానవునియశాంతికి మూల మర్మ మిదియె పరుగు లిడుచుండు డబ్బుకై పగలు రేయి డబ్బుతో పాటు వత్తిడి జబ్బు పెరుగు కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.
పచ్చని యరిటాకు శుభమని
రిప్లయితొలగించండినచ్చిన భోజనము నుంచి నైవేద్య మిడన్
మెచ్చును దైవము మనలను
ఇచ్చును వరమంచు బలుక యితి హాసమునన్
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది.
మొదటిపాదంలో గణదోషం. ‘...యరటాకు శుభము’ అనండి. ‘మనలను+ఇచ్చును’ అని విసంధిగా వ్రాశారు. ‘దైవమ్ము మనల| నిచ్చును... బలుక నిది సత్యమగున్’ అనండి.
రిప్లయితొలగించండిఅరటియాకునుజూడుముహరిత!నీవు నెంతమృదువుగానుండెనో,సుంతయైన చిరుగుగానలేదెచటనుజివరివరకు భోజనంబునుజేయగబుష్టికలుగు
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిహరిత వర్ణమ్ము నలరారు నద్భుతమగు
రిప్లయితొలగించండిఅరటి యాకున భుజియించ నమృత సమము
మంగళమ్ముగ భాసిల్లు మహిని యరటి
మనసు దోచుచు బొందును మన్ననలను!!!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండిఅరటి యాకునందు నన్నము బహురుచి
రోజు దినుచు నున్న రుజలు తొలగు
పూర్వకాలమందు బూజపు బంతిలో
వేడుకలర తినగ బెట్టువారు.
2.అరటి యాకు జూడ నందముగానుండు
పెరుగు యన్నము దిన పెరుగు నాయు
వనెడి వారు పెద్దలనుదినము దినిన
ఆలసింపకాకు నందుకొమ్ము
3ఆకు పచ్చనైన యరిటాకు నందున
వడ్డన మొనరించి వాసిగాను
దేవునెదుట నుంచి దినగ నైవేద్యమున్
మంచి జరుగు నంచు మదిని దలచు/యెంచు.
4.స్వేచ్ఛగ నొకచో కూర్చొని
పచ్చని యరిటాకు లోన పరమాన్నంబున్
మెచ్చుచు మక్కువ తోడను
యిచ్ఛగ తినగా గృహస్తుయెంతో మెచ్చెన్
5.మక్కువ తోడను నందరు
చక్కని యరిటాకులందు సంబారములన్
మిక్కుటముగ వడ్డింపగ
ముక్కల పులుసును తినెదరు మోదము తోడన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీరు శైలజ గారి సామ్రాజ్యంలో అడుగుపెట్టారు. అందువల్ల మీ పద్యాలను చూడలేకపోయాను. మీరు మీ పద్యాలను ఈ పేజీ అట్టడుగున ఉన్న ‘వ్యాఖ్యను జోడించండి’ అన్నదానిని క్లిక్ చేసి అక్కడ వచ్చిన బాక్సులో పెట్టండి. అంతే ఇతరుల వ్యాఖ్యల క్రింద ఉన్న ‘ప్రత్యుత్తరాలు’ను క్లిక్ చేయకండి. మీ పద్యాలపై మీరు ఏమైనా వ్యాఖ్యానించాలంటే మీ పద్యాల క్రింద ఉన్న ప్రత్యుత్తరాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇతరుల పద్యాలపై వ్యాఖ్యానించాలంటే వారి పద్యం క్రింద ఉన్న ప్రత్యుత్తరాన్ని క్లిక్ చేయండి.
మీ ఐదు పద్యాల ఖండకృతి బాగుంది. అభినందనలు.
‘పెరుగు+అన్నము’ అన్నపుడు యడాగమం రాదు.
అంబటిభానుప్రకాశ్.
రిప్లయితొలగించండిగద్వాల.
అరటి యాకు జూడ! నందము,నగుపించు,
అరటి భోజ నంబు !నమృత సమము, !
కంటి కింపు నైన! కనులకే పండువౌ,
మహిని మెచ్చ దగును !మనసు నందు !!
మీ పద్యం బాగున్నది.
తొలగించండి‘...జూడ నందమై తోచును’ అంటే బాగుంటుందేమో?
సప్తఛద పత్ర మా?యది
రిప్లయితొలగించండితప్తాగ్నిస్థాల నిభము ధరణిన్ వెలుగున్
తృప్తిగ నశనము గుడువం
గుప్తము సేయ పనిలేదు కుదురుగ దానిన్
చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.
తొలగించండిఅరటిని అందమొప్పగను అమ్రు త తుల్యపు ఓగిరంబుతో
రిప్లయితొలగించండిసరసపు ఆకులోన మనసారగ కోరిభుజింప మేలులే
వరవడి యైన సంస్కృతిని వాడుకగా కొనసాగ నిచ్చినన్
సిరులును సంపదల్ గలుగు సజ్జనులార భుజింప రండహో
మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
తొలగించండి‘అమృత’ను ‘అమ్రుత’ అన్నారు. ‘అమృత’ అంటే గణదోషం. ‘అరటిని నంద మొప్పగ నవామృత తుల్యపు టోగిరంబుతో...’ అనండి.
అలాగే "సరసపు టాకులోన" అనండి.
తొలగించండికామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
తొలగించండి. అరిటాకు భోజనంబన
రిప్లయితొలగించండిఅరుదెంచిన యథితి కెపుడు ఆరోగ్యంబే|
“అరిగించు ఆమ్ల గుణమును
అరుదుగ మనకంద జేయు నరిటాకుసుమా”.|
మీ పద్యం బాగుంది. అభినందనలు.
తొలగించండి. అధిక జనులవిందు” యరిటాకు” లందునే
రిప్లయితొలగించండిరిక్థ హారి ,తగని రిపువు కైన
టాటుగున్ననేమి టక్కరి కైనను
కుక్షి నింప దగిన కూర్పు లాకు. {. రిక్థహారి=దాయాది. టాటు=ఠీవి}
పద్యపాదముల మొదటక్షరములు అరిటాకుగానుపూరించడ మైనది
మీ రెండవ పద్యం మీ నూత్నప్రయోగోత్సాహాన్ని తెలియజేస్తున్నది. సంతోషం. పద్యం బాగుంది. అభినందనలు.
తొలగించండిస్వచ్ఛతకు మారు పేరగు
రిప్లయితొలగించండిపచ్చనిదౌ యరటి యాకు బాటిగ జనులే
మెచ్చుచు శుభకార్యమ్మున
ముచ్చటగా వేతురంట మోదము తోడన్
శుభకార్యములకు మరియున
శుభకార్యమ్ము కైన శుచియంచు జనుల్
విబుధులు మెచ్చెడు వారణ
పుబుసల పత్రముల లోన బోనము సేతుర్
నిన్నటి కొత్తిమీరపై పద్యాలు
కొత్తిమీర తోడ కొంగ్రొత్త రుచులతో
చేయు వంట గనుము చేర్చి పచ్చి
మిరప చింత కొత్తి మీరలన్ గలుపుచు
నూరి నంత నోట నీరు నూరు
మీ పద్యాలు (నిన్నటిదానితో పాటు) బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవపద్యం రెండవపాదంలో గణదోషం. ‘శుభకార్యమ్మునకు నైన...’ అనండి.
అరటియాకున వేడియన్నము తిన్నచో
రిప్లయితొలగించండి.....నారోగ్యమని పెద్ద లనెడి మాట
నైవేద్య సమయాన నదరుగా భక్ష్యముల్
.....చిగురుటాకున నుమ్చ శ్రీలు గల్గు
శిష్టులు భోజనాల్ చేయరు కమ్ఛాల
.....నరటియాకే వారి కర్హమగును
శుభముల నైన నశుభముల నైనను
.....వెలితియే యరటాకు వేయకున్న
మారె కాలమ్ము ప్లాస్టిక్కు మార్చె మనల
నరటి యాకుల నితరమ్ము లాక్రమిమ్చె
పల్లెటూళ్ళలో నేటికిన్ ప్రతిగ్ఋహమున
నరటియాకును వాడుట నరయవచ్చు.
అరటియాకున వేడియన్నము తిన్నచో
రిప్లయితొలగించండి.....నారోగ్యమని పెద్ద లనెడి మాట
నైవేద్య సమయాన నదరుగా భక్ష్యముల్
.....చిగురుటాకున నుమ్చ శ్రీలు గల్గు
శిష్టులు భోజనాల్ చేయరు కమ్ఛాల
.....నరటియాకే వారి కర్హమగును
శుభముల నైన నశుభముల నైనను
.....వెలితియే యరటాకు వేయకున్న
మారె కాలమ్ము ప్లాస్టిక్కు మార్చె మనల
నరటి యాకుల నితరమ్ము లాక్రమిమ్చె
పల్లెటూళ్ళలో నేటికిన్ ప్రతిగ్ఋహమున
నరటియాకును వాడుట నరయవచ్చు.
అరటియాకును గురించిన సమస్త సమాచారాన్ని ఒక్క సీసంలో వివరించారు. బాగుంది. అభినందనలు.
తొలగించండితన శత్రువె వడ్డించిన
తొలగించండిననుమానములేక తినడె యరటాకైనన్!
తినబోయెడు నన్నమ్మున
నణుమాత్రమ్ము విషమున్న నగుపడు నలుపై!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురు తుల్యులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిగత పూరణ సంది దోషము సవరించినాను
మానవునియశాంతికి మూల మర్మ మిదియె
పరుగు లిడుచుండు డబ్బుకై పగలు రేయి
డబ్బుతో పాటు వత్తిడి జబ్బు పెరుగు
కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.
పంటి కింపును గూర్చు నీ పచ్చ నైన
రిప్లయితొలగించండిఅరటి యాకులో భోజన మారగించ
నొంటికిని మంచిదని యంటె వింటి నేను
దీనిలో పండుగల రోజు తినుదురెల్ల.
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమన్నించండి అన్నయ్యగారూ.నాకు తెలియలేదు
రిప్లయితొలగించండిఅ రటి యా కులోన అన్నమున్ గుడిచిన
రిప్లయితొలగించండిమనసు తృప్తి నొందుననవరతము
బంతి భోజనముల పల్లెటూరుల లోన
వాడుచుందు రివ్వె వేడుకలను
నకిలీ కాటుక కండ్ల
రిప్లయితొలగించండిన్నికిలించును వెక్కిరించి నిగనిగ మనుచున్
వికలమ్ము గాని వెఱ్ఱిది
నకిలీ యరటాకు చూసి నవ్వదె విందున్!
(అఖండ యతి కూడా నకిలీదే 😊)
రిప్లయితొలగించండిఅరిటాకువలె నణగుము జ
వరాల జీవితము లోన ప్రగతిని గానన్
పరమాత్ముడు వట పత్రము
న రమించె జగద్గురువుగ నట్టుకొనంగన్
జిలేబి