10, ఏప్రిల్ 2016, ఆదివారం

సమస్య – 1999 (కూటి కేడ్చెడివాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె.

24 కామెంట్‌లు:

 1. సివిలెలక్ట్రికల్ సాప్టువేర్ సిస్టమింజ
  నీరు పలువిభాగములకు నెలవు కాగ
  ఫ్రీ చదువుల స్కీమువలన ఫియరు లేక
  కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె!!

  రిప్లయితొలగించండి

 2. వచ్చె నాధారు కార్డుట వరము గాను
  వచ్చునిక మీట నొక్కగ వసతు లంట !
  మోడి మ్యాజికు జూడుము మోత జేసె
  కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. ఆటొ నడుపుచు బ్రతికెడి కోటి గాడు
  లాట రీలోన గెలిచెను లక్ష లంట
  మోద మందున మతిలేని మూఢు డగుచు
  కూటి కేడ్చెడి వాఁడు కంప్యూటరుఁ గొనె

  రిప్లయితొలగించండి
 4. సాటి కంప్యూటరుల కేది నేటి రోజు
  విశ్వరూపము వలె విశ్వ వింతలన్ని
  కనుల ముందుంచుచుండెను క్షణములోనె
  కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె.

  రిప్లయితొలగించండి
 5. Tbs Sarma గారి పూరణ.....

  శ్రీగురువుగార్కి, అన్న మిస్సన్న గార్కి, కవిమిత్రశ్రేణికి నమస్సులతో...

  నేటి విద్యలు నేర్పున నేర్చు చుండి
  మేటి విద్యార్థు లందున పోటి పడగ
  నేటి సుతుని కోర్కెను దీర్ప నేరుగాను
  కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె.

  రిప్లయితొలగించండి
 6. లేదు లేదనుచు నుపాధి బాధఁ బడుచు
  వృత్తి శిక్షణ,మప్పుగన్ విత్తమొసఁగి
  ప్రభుత చేసెడు సాయమ్ము బడసి తాను
  కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁగొనె!

  రిప్లయితొలగించండి

 7. కూటికేడ్చెడువాడుకంప్యూటరుగొనె కూటికేలేనిచోవాడుకొనుటసాధ్య
  మగునె?వెక్కిరించుటయగునతనినార్య! కొదవలేకుండజేయుముకూడుగుడ్డ
  లతనికెప్పుడుశంకర!యంజలింతు

  రిప్లయితొలగించండి
 8. కవిమిత్రులారా,
  నేనీరోజు హైదరాబాదులో జరిగే ‘అయుత కవితాయజ్ఞ విజయోత్సవ సభ’కు వెళ్తున్నాను. ప్రయాణంలో ఉండి మీ పూరణలపై వెంటవెంటనే స్పందించక పోవచ్చు. మన్నించండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. కంది వారు !

   క్షేమం గా వెళ్లి లాభం గా రండి :)

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
 9. కూలిపనిజేసి చదివించె కొడుకునొకడు
  స్నాతకోత్తరవిద్యకు నాతడదిగొ
  చేరుకొనియెను, విద్యలో పేరుబొంద
  కూటి కేడ్చెడు వాఁడు కంప్యూటరుఁ గొనె.

  రిప్లయితొలగించండి
 10. .వలదు వలదన్ననువినక బాలుడొకడు
  తల్లి దండ్రులకధిక బాధలను యిడుచు
  కూటి కేడ్చెడివాడు కంప్యూటరుగొనె
  పెద్దల హితవు మాటలు వినక చెడియె


  తాను పేదరికమునందు తపనబడుచు
  పైచదువులు నేర్వంగను పట్టు బట్టి
  లక్ష్యసాధనకు నిశి వేళలశ్రమించె
  కూటి కేడ్చెడి వాడు కంప్యూటరు గొనె.

  రిప్లయితొలగించండి
 11. నేర్చి డీటీపి,ప్రింటింగు నేర్పుగాను
  నౌకరీలేక బ్రతుకను నౌక నడుప
  లోనుబ్యాంకున దొరుకంగ లోనమెచ్చి
  కూటి కేడ్చెడు వాఁడు కంప్యూటరుఁ గొనె.

  రిప్లయితొలగించండి
 12. పరమ పాపియు పిసినారి పరుల ముంచి
  ధనము నార్జించి దాచుచున్ దాను దినక
  దాన మిడక సతతము పేదనని వగచి
  కూటికేడ్చెడు వాడుకంప్యూటరు గొనె

  ఉన్నత చదువుల్ చదివెడు కన్నపుత్రు
  డవసరమ్మని తండ్రిని యడిగినంత
  కూటికేడ్చెడు వాడు కంప్యూటరు గొనె
  నంట తనయింటిస్థలమునె యమ్మియపుడు

  రిప్లయితొలగించండి
 13. “గణనయంత్రము” గర్వ కారణము గూడ
  “లెక్కలబిస” యనియు నందు రక్కజముగ
  అప్పు జేసి దర్పముగను గొప్ప జూప
  కూటి కేడ్చెడువాఁడును గొనెనుదాని
  [కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె.]

  రిప్లయితొలగించండి
 14. ముష్టి వానికి చేతిలో '' మొబయి '' లొకటె !
  పిండములు పెట్టించు వానికి రెండు '' స్మార్ట్లు ''
  నెట్టు లో జూడ భుక్తి కై గట్టి స్థలము
  కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె !

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ్,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  స్క్రీ ను ట చ్.శా మ స ౦గు. సెల్ ఫోను కొనియె

  చేత. చిప్ప. తోడ. స్టెయిలు గా తిరిగెడు > >

  కూటి కేడ్చెడు వాడు || క౦ప్యూటరు కొనె

  ఇ౦జనీ రను దానిలో యేమి వి౦త ? ?

  రిప్లయితొలగించండి
 17. . చింతయందునచింతాకుచిగురు దినియు
  ఎండ వేడికి నీడలో బండుకొనగ?
  కలలయందునతానొక విలువగలుగు
  కూటి కేడ్చెడివాడు కంప్యూటరుగొనె|
  2.బ్యాంకు ఖాతాను దెరిపించె ప్రభుత,ప్రగతి
  అప్పులందించుపద్ధతుల్ నాదుకొనగ?
  కూటి కేడ్చెడివాడు కంప్యూటరుగొనె|
  మార్గ మేదేని వాడికి మంచి జరిగె|

  రిప్లయితొలగించండి
 18. జగతిలో నున్న విజ్ఞాన సంపదలకు
  పుట్టినిల్లయె గాదె కంప్యూటరిపుడు
  బ్రతుకు సాగింప తగిన మార్గమ్ము వెదుక
  కూటి కేడ్చెడివాడు కంప్యూటరుగొనె|

  రిప్లయితొలగించండి
 19. కూటి కేడ్చెడు వాఁడు కంప్యూటరుఁ గొనె
  దాని వాడుట నేర్వ నాధారమునయ్యె
  తల్లి దండ్రుల మెప్పును తాను బడయ
  జనులు మెచ్చిరి ముదమార జగతి యందు

  రిప్లయితొలగించండి
 20. ఓట్లు వేసిన వారల కుచితమనుచు
  బడుగు జనులకు నేతలు పంచిపెట్ట
  కూటికేడ్చెడు వాడు కం ప్యూటరుగొనె
  అశనమునుగొన వాడది యమ్మి వేసె

  రిప్లయితొలగించండి
 21. శ్రీగురువుగార్కి, అన్న మిస్సన్న గార్కి కవిమిత్రశ్రేణికి నమస్సులతో...

  నేటి విద్యలు నేర్పున నేర్చుచుండి
  మేటి విద్యార్థు లందున పోటి పడగ
  నేటి సుతుని కోర్కెను దీర్ప నేరుగాను
  కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె.

  రిప్లయితొలగించండి
 22. సాటి లేని యువతి తన చదువు కొరకు
  ప్రేమ మీరంగ నడుగగ పెండ్లి కొప్పి...
  అప్పు జేయుచు మీసము త్రిప్పు కొనుచు
  కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె :)

  రిప్లయితొలగించండి