29, ఏప్రిల్ 2016, శుక్రవారం

సమస్య - 2018 (విఱ్ఱవీగెడి వారలే...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
విఱ్ఱవీగెడి వారలే విజ్ఞు లనఁగ.

87 కామెంట్‌లు:

 1. "తు" యన "తా" రాదు పలుకును తోపు వోలె
  పొట్ట కోయ యక్షరముల ముక్క లేదు
  వీసమెత్తు విద్యయు లేక విత్తమొంది
  విఱ్ఱవీగెడి వారలే విజ్ఞు లనఁగ??

  రిప్లయితొలగించండి
 2. నేటి యుగలక్ష ణమ్మది మేటి యనగ
  కపట యుక్తులతో నుండి కల్ల లాడి
  దాడి జేయుచు జనులను దండు కొనుచు
  విఱ్ఱ వీగెడి వారలే విజ్ఞు లనగ

  రిప్లయితొలగించండి
 3. బు ఱ్ఱ తక్కువ ఘనులంచు కఱ్ఱ పెత్త
  నంబు జేయు ధనకులమదంబు తోడ
  దుష్ట కార్యకలాప సంతుష్ట జనులు
  విఱ్ఱవీగెడి వారలే విజ్ఞు లనఁగ??
  కనరె కలియుగంబున నహో గతులు మారె.

  రిప్లయితొలగించండి
 4. విఱ్ఱ వీగెడి వారలే విజ్ఞులనగ
  నెటుల యొప్పును?! పదుగురి నెనరు లేక!
  ప్రజ్ఞ తోడుత నిలబడి ఫలములంది
  సుగతి నొందని బ్రతుకది వెగటు గాదె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '... నెటుల నొప్పును' అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు....ఎటులన్+ఒప్పును....గమనించలేకపోయాను

   తొలగించండి
 5. డుష్టులనగ నక్రమముగ దుడ్డుగొనుచు
  విర్ర వీగెడు వారలె విజ్ఙు లనగ
  సిరులతోతులదూగుచు నిరతము జడు
  నమ్రత కలిగి యిలలోన నడచు వారు

  రిప్లయితొలగించండి
 6. పండితుడనని నుదుటను పిండికట్లు
  కాంతులీనెడు ముంజేతి కంకణమ్ము
  వేష భూషల జూపుచు వీట దిరిగి
  విఱ్ఱవీగెడి వారలే విజ్ఞు లనఁగ.

  రిప్లయితొలగించండి

 7. అనుభవింతురుకష్టాలననవరతము విర్రవీగెడివారలే,విఙ్ఞులనగ శాంతిసహనముగలుగుచుసాటిమనిషి యందుదైవముజూచువారార్య!భువిని

  రిప్లయితొలగించండి
 8. అంద రొకటన్న నిజమేను ఆణిపూస
  అహము లేకను చరింతు అవని మీద
  అనుచు గైకొన్న నిర్ణయం అమలు పరచి
  విఱ్ఱ వీగెడి వారలే విజ్ఞులనగ

  నేను ఎవరని ప్రశ్నించి నెలవు తెలిసి
  దేహ మన్నది వేరని దేహి కెపుడు
  అహము మేల్కొన్న ఆచిత మనచు దెలిపి
  విఱ్ఱ వీగెడి వారలె విజ్ఞు లనగ

  వీరా గుడిపల్లి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   పద్యం మధ్యలో అచ్చులు రాకుండా అవసరమైన యడాగమ నుగాగమ సంధులతో వ్రాయండి.

   తొలగించండి
 9. మిత్రులందఱకు నమస్సులు!

  "నేనె పండిత వర్యుండ! నేను భువిని
  గలుగు జ్ఞాను లందఱ లోనె ఘనుఁడ! నన్ను
  మించువారలు లేరయ్య మేదిని" నని

  విఱ్ఱవీగెడి వారలే, విజ్ఞు లనఁగ?

  రిప్లయితొలగించండి
 10. అమరవాది రాజశేఖర శర్మ గారి పూరణము:

  బహుళ రంగాల ప్రతిభను ప్రజ్ఞ నరసి
  యీసుజెందక ప్రోత్సాహమిచ్చు చుండి
  భరతమాత సుపుత్రుల గరిమ యంచు
  విఱ్ఱవీగెడి వారలే విజ్ఞులనగ!

  రిప్లయితొలగించండి
 11. విద్య వినయమ్ము లేకున్న విత్తమున్న
  తామె సర్వజ్ఞులనిదల్చు ధరణిలోన
  విఱ్ఱవీగెడి వారలే, విజ్ఞులనగ
  నిండుకుండవోలె మెలగు నెఱిని గలిగి!!!

  రిప్లయితొలగించండి
 12. డబ్బుచదువుకు మార్కుల జబ్బు వచ్చె
  మొదటి మార్కులన్నియు వచ్చె మాకె యనుచు
  గొప్పలెన్నియొ చెప్పుచు గోల చేసి
  విఱ్ఱ వీగెడి వారలేవిజ్ఞులనగ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మురళి గారూ-రెండవ పాదంలో మొ కు మా కు యతిచెల్లదు. గమనించండి.

   తొలగించండి
  2. నిజమే... నేను గమనించలేదు. ధన్యవాదాలు.
   ఆ పాదాన్ని ‘మాకె వచ్చెఁ గద మొదటి మార్కు లనుచు’ అంటే సరి.

   తొలగించండి
 13. వె‍‌‍ఱ్ఱి రాజుల కొలువున పెద్ద లెవరు?
  గొఱ్ఱెలగు ప్రజ నెవ్వరి గొలుచు? నట్టి
  కఱ్ఱి కాలాన దేశాన ఘనుల మనుచు
  విఱ్ఱవీగెడి వారలే విజ్ఞు లనఁగ.

  రిప్లయితొలగించండి
 14. సంస్కృతాంధ్ర భాషలతాము చక్కనేర్చి
  సకల శాస్త్రమ్ములందున జయము పొంది
  తపన చేత నెపుడు తమ్ముతామెరిగియు
  విఱ్ఱవీగెడి వారలే విఙ్ఞలనగ
  "మధుర కవి "

  ఆ:- సంస్కృతాంధ్ర భాష చక్కగా నేర్చియు
  సకల శాస్త్రమందు జయము పొంది
  తపన చేత నెపుడు తన్నుతానెరగియు
  విఱ్ఱవీగు వాడు విఙ్ఞడగును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బద్రిపల్లి శ్రీనివాసులు గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 15. సుంత దెలియ బెద్దయనంగ వింత గాను
  జంకు గొంకు లేకను వెట్ట వంక లెన్నొ
  వారి వీరి మేర లెఱుగ నేర కుండ
  విఱ్ఱవీగెడి వారలే? విజ్ఞు లనఁగ.

  రిప్లయితొలగించండి
 16. కొండా యాదగిరి గారి పూరణ...

  జగతి యందున శ్రేష్ఠంబు జన్మభూమి జన్మనిచ్చిన పుణ్యాంగ జనని యంచు పలుకు పలుకున పలుకుచు పలువిధంబు విఱ్ఱ వీగెడి వారలే విజ్ఙు లనగ

  సమస్యాపూరణకు చిన్న ప్రయత్నం చేస్తున్నాను తప్పులుంటె సరిచేయగలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొండా యాదిగిరి గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ఆవగి౦జ౦త వెలచేయ నట్టి క౦చు

  పగిది , కదిలి౦చి న౦తనే వాగు జనులు

  విర్రవీగెడు వారలే | విఙ్ఞు లనగ =

  ముదితల గళముల౦దు నమూల్యములయి

  యొదుగు హేమకాభరణము లో యన౦గ

  ను౦డి " మెదలక - మెరయు " వా రుర్వి లోన

  { హేమకము = హేమము }

  రిప్లయితొలగించండి
 18. భర్త సేవయే పడతికి భవ్యపథము
  కాను బకమును దహియింప కౌశికాఖ్య!
  తపసులై యుండి వీడక తామసమును
  విఱ్ఱవీగెడి వారలే విజ్ఞు లనగ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిన్నప్పుడు చదువుకున్న కథను గుర్తుకు తెచ్చింది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 19. జ్ఞాన మరయుచు సంధాన ఘనత నొంది
  శాస్త్ర రీతుల నెరుగంగ శ్రద్ధ గలిగి
  పాత్రతను బొంది గమియించు పండితులయి
  విఱ్ఱ వీగెడి వారలే , విజ్ఞు లనగ!
  వట్టి మాటల సరిపెట్టు వారు కాదు!

  రిప్లయితొలగించండి
 20. సద్గురువు సంగతినిబొంది సౌమ్యులయ్యి
  దాన ధర్మాల జేయుచు తనరు కతన
  పొగడ బడుచుండె; నొకనాడు పొగరుతోడ
  విర్ర వీగెడువారలే ; విజ్ఞులనగ

  రిప్లయితొలగించండి
 21. బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ...

  తెల్ల దొరల పాలనలోన క్రుళ్ళినట్టి
  భారతాంబ విముక్తికై పాటు బడిన
  గొప్ప వారల చరితలు చెప్పు కొనుచు
  విఱ్ఱ వీగెడి వారలె విఙ్ఞులనగ!!

  రిప్లయితొలగించండి
 22. ‘సందిత’ గారి పూరణ....

  విర్రవీగువార్ని విజ్ఞులడ్ధుకొనరు
  మంచితనమువారి నైజ మగుటఁ
  విర్రవీగువార్నె విభులుగుర్తితురు
  విర్రవీగువారె విజ్ఞులనగఁ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘వార్ని, వార్నె’ అనడం వ్యావహారికం. రెండవపాదంలో యతి తప్పింది. మీ పూరణకు నా సవరణ.....

   విఱ్ఱవీగు జనుల విజ్ఞు లడ్డుకొనరు
   మంచితనము వారి మహితగుణము
   విఱ్ఱవీగు జనుల విభులు గుర్తింతురు
   విఱ్ఱవీగువారె విజ్ఞు లనఁగ.

   తొలగించండి
 23. ‘సందిత’ గారి తేటగీతి పూరణ...

  విజ్ఞులడ్దుపడరు విర్రవీగువార్కి
  మంచితనము వారి నిలువరించ నకట!
  చెట్టులేమి నాముదచెట్టె చెట్టు యయ్యె!
  విర్రవీగెడు వారలే విజ్ఞులనగ!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరు వాట్సప్ లో నేను పొరపాటున ఇచ్చిన ఆటవెలది సమస్యను, ఆ తరువాత ఈ తేటగీతి సమస్యను పూరించారు. సంతోషం.
   ఈ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 24. కురవని మొయిలు చిందించు మెరుపు వోలె
  కరవని శునకరా జము మొరుగు రీతి
  విఱ్ఱవీగెడి వారలే విఙ్ఞులనగ
  వెలుగుదురు, కనుల పొరలు తొలగు వరకు!

  రిప్లయితొలగించండి
 25. కఱ్ఱ పెత్తన మెన్నాళ్ళుగలసిరాదు|
  అంద మహమును బెంచగ విందుగాదు
  విఱ్ఱ వీగెడి వారలే విజ్ఞులనగ
  చెప్ప రెవ్వరు దుర్నీతి గొప్పగాదు.

  రిప్లయితొలగించండి
 26. మఱ్ఱి మాటున ప్రబలిన మావివోలె
  కఱ్ఱి నెదిరింప సమకట్టు కర్ణుపగిది
  విఱ్ఱ వీగెడు వారలే విజ్ఞలనగ?
  గర్వమొక్కింత చూపడు ఘనుడెవండు.

  రిప్లయితొలగించండి
 27. సకల సంపదలు సుఖము సంతసమ్ము
  మెండుగా నున్న వారలు మిక్కిలిగను
  విర్రవీగెడి వారలె విజ్ఞలనగ
  పొగడ బడుదురు భారత భువిని యందె


  రిప్లయితొలగించండి
 28. అంబటి భానుప్రకాశ్.
  దుప్పల్లి.

  అంబటి భానుప్రకాశ్ గారి పూరణలు.....

  1)
  ఏకలవ్యుని రీతిగ నేకతమున,
  విద్య లన్నియు నేర్చియు వీర్య మొంది,!
  జనుల కీర్తిని బొందెడు శక్తి గలిగి,
  విర్ర వీగెడి వారలె విజ్ఞు లనగ, !!
  2)
  తండ్రి తాతల ఘనతను తాము గొనక,
  స్వంత శక్తిని నమ్ముకు సాగు వారు,
  పుడమి యందున కీర్తినిి పొంది నేడు,
  విర్ర వీగెడి వవారలె విజ్ఞు లనగ,!!

  రిప్లయితొలగించండి
 29. శ్రీరాం కవి గారి పూరణ....

  ⁠⁠⁠నాకు ధనముగలదటంచు నొకడు, కాదు
  నేను పేరెంతొగలపెద్దననెమరొకడు
  చెప్పుగొప్పలువినుచును చెప్పగలమ
  విర్రవీగెడువారలేవిజ్ఞులనగ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరాం కవి గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం.
   మొదటి రెండు పాదాల్లో యతి తప్పింది. మీరు ప్రాసయతి వేశాననుకున్నారు. కాని రెండు చోట్ల ప్రాస ముందున్న అక్షరం అయితే లఘువులు, లేదా గురువులు ఉండాలి.

   తొలగించండి
 30. మంత్రి వరులు పలికెదరు మాట లెన్నొ
  పొగడి వ్రాయు పత్రికలన్ని పూర్తిగాను
  కానరాడు కారణమైన కార్యదర్శి
  విఱ్ఱ వీగెడి వారలే విజ్ఞులనగ

  రిప్లయితొలగించండి
 31. ఎవరు దుర్యశము నొందుదు రీపృథివిని?
  ధనము మదమును యధికారమును గలదని
  విర్ర వీగెడి వారలే.విజ్ఞులనగ
  వినయ మొప్పగ తమ పనుల్ పెనుచు కొంద్రు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   మొదటిపాదంలో గణదోషం. ‘ఎవరు దుర్యశ మందుదు రీ...’ అనండి. అలాగే ‘మదమును నధికారమును..’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులసూహన మేరకు సవరించిన పద్యము
   ఎవరు దుర్యశమ0దుదు రీపృథివిని?
   ధనము మదమును నధికారమును గలదని
   విర్ర వీగెడి వారలే.విజ్ఞులనగ
   వినయ మొప్పగ తమ పనుల్ పెనుచు కొంద్రు

   తొలగించండి
 32. సంధి కూర్చెదో! కాదని సమర మనెదొ!
  మీరలెవ్వరు పాండవ వీరులకును
  సాటి రారంచు ధర్మంపు సారమెరిగి
  విఱ్ఱ వీగెడు వారలే విజ్ఙులనగ!

  రిప్లయితొలగించండి
 33. చేపూరి శ్రీరామారావు (శ్రీరామ్) గారి [సవరించబడిన] పూరణ:

  నాకు ధనమున్నదని యొకం డనును; కాదు
  నేను పేరున్న పెద్ద ననెను మరొకడు;
  గొప్ప జెప్ప, విజ్ఞులటంచు జెప్పగలమె?
  విర్రవీగెడు వారలే విజ్ఞులనగ??

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. మొదటి పాదంలో యతి అర్థంకాలేదు. దయతో తెలియ జేయండి.

   తొలగించండి
  3. అది ‘అనునాసికాక్షర యతి’. టవర్గలోని మొదటి నాలుగక్షరాలు బిందుపూర్వకాలై..( ంట, ంఠ, ండ, ంఢ ) నకారానికి, తవర్గలోని మొదటి నాలుగక్షరాలు బిందుపూర్వకాలై.. ( ంత, ంథ, ంద, ంధ ) ణాకారానికి యతి చెల్లడం అనునాసికాక్షర యతి.

   తొలగించండి
 34. ప్రజల ధనమును దోచుచు పరవశాన
  విర్రవీగెడ వరలే? విజ్ఞులన
  వినయ సుగుణవర్తనులై వివేకులైన
  జనులె నిజమైన సుజనులు జగతి యందు

  రిప్లయితొలగించండి
 35. వరము పొందిన యసురులు బలము చేత
  విర్ర వీగెడి వారలే విజ్ఞులనగ
  మంచితనముచే పదుగురి మన్ననంది
  మసలు వారలె నిజమైన మనుజులయ్య.

  రిప్లయితొలగించండి
 36. బానిస బతుకులు బతికెడి పౌరులెల్ల
  తెల్లదొరల పీచమణచి తెగున చూపి
  విర్రవీగెడి వారలే విజ్ఞులనగ
  నాటి వీరుల శౌర్యము నరయుడయ్య.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. ‘బానిస బ్రతుకు బ్రతికెడి...’ అనండి.

   తొలగించండి
 37. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ రెండవ పూరణ

  ఆకసమునంటు ధరలను నదుపు చేసి,
  మండు వేసవి కాలాన మంచినీరు ,
  పవరునందించి, ధీరులై ప్రజల మధ్య
  విర్ర వీగెడి వారలే, విజ్ఞులనగ!

  రిప్లయితొలగించండి
 38. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారి రెండవ పూరణ:

  ఆకసమునంటు ధరలను నదుపు చేసి,
  మండు వేసవి కాలాన మంచినీరు ,
  పవరునందించి, ధీరులై ప్రజల మధ్య
  విర్ర వీగెడి వారలే, విజ్ఞులనగ!

  రిప్లయితొలగించండి
 39. బీటుకూరు శేషుకుమార్ గారి పూరణ:

  ముప్పు తిప్పలు బెట్టుచు మోరలెత్తి
  తీరు తీరుగ తిరుగుచు తిక్కజూపు
  రుద్ర హయమును యుక్తితో లొంగదీసి
  విఱ్ఱవీగెడు వారలే, విజ్ఞులనగ!

  రిప్లయితొలగించండి
 40. బుఱ్ఱ లేదుర నీకని బుసలు గొట్టి
  వెఱ్ఱి బాగుల వాడని విసిరి కొట్టి
  బండి "వ్ఱాయగ" లేవని భగ్గు మనుచు
  హద్దు మీఱుచు జనులను హడల గొట్టి
  విఱ్ఱవీగెడి వారలే విజ్ఞు లనఁగ!

  రిప్లయితొలగించండి