15, ఏప్రిల్ 2016, శుక్రవారం

సమస్య – 2004 (భద్రాచల రాముఁ డుండు...)

కవిమిత్రులారా,
శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భద్రాచల రాముఁ డుండు బాసరయందున్. 
ఈ సమస్యను పంపించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు. 

40 కామెంట్‌లు:

  1. క్షేత్రము గౌతమి తీరము
    భద్రాచల రాముఁ డుండు, బాసరయందున్
    చిద్రూపిణిగా తల్లియు
    పత్రము పుష్పములు గొని పదవె జిలేబీ !

    రిప్లయితొలగించండి
  2. భద్రుడు భక్తుని కోరిక
    భద్రాచల రాముఁ డుండు , బాసర యందు
    న్నుద్రేకము వీడి జనులట
    భద్రముగా బోయి మ్రొక్క బారతి పలుకున్




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      మూడవపాదంలో గణదోషం. ‘వీడి జనులు’ అనండి.

      తొలగించండి

  3. భద్రాచలమనుబురమున భద్రాచలరాముడుండు,బాసరయందున్ హృద్యమ్ముగగనిపించెడు
    భద్రమ్ములశారదమ్మవాసముజేసెన్

    రిప్లయితొలగించండి
  4. భద్రగిరి పైన వెలయుచు
    భద్రాచలరాముడుండు, బాసర యందున్
    భద్రముగ నుండు భారతి
    చిద్రూపమ్మున వెలుగుచు చేతన నిడుచున్!!!

    రిప్లయితొలగించండి
  5. భద్రగిరిలోవసించును
    భద్రాచలరాముడుండు బాసర యందున్
    చిద్రూపిణిగా శారద
    భద్రము లొసగుచు జనులను పరిరక్షించున్.

    రిప్లయితొలగించండి
  6. చిద్రూపుడు రక్షకుడై
    భద్రాచల రాముడుండ! బాసర యందున్
    క్షుద్రత్వమ్మును వీడగ
    నిద్రాణత బాపు వాణి నిలిచెను మనకై!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మడిపల్లి రాజకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రాముఁడుండు’ అన్నది టైపాటు వల్ల ‘రాము డుండ’ అయినట్టుంది.

      తొలగించండి
  7. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { " భద్రాచల -- రాముడు " అనే వ్య క్తి బ౦గారు నగ లమ్ము వ్యాపారస్తునిగా మరియు రాజకీయనాయకునిగా
    బాసరలో ఉ౦టున్నాడు . }


    భద్రయ్య కుమారు డతడు ,

    భద్రాభరణముల. నమ్ము వణిజుడు మరియున్

    భద్రత నిడు నాయకు డా

    " భద్రాచల--రాము " డు౦డు బాసర లోనన్

    …………………………………………………………

    భద్రము = బ౦గారు ; భద్రాభరణములు = బ౦గారు నగలు ; వణిజుడు = వ్యాపారి ;

    ....................................................

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  8. బద్రముగను కాపాడుచు
    భద్రాచల రాముఁ డుండు బాసరయందున్
    చిద్రూపుడు భువి నంతట
    నిద్రించక నుండు బ్రోచు నిక్కము జనులన్

    రిప్లయితొలగించండి
  9. భద్రాద్రిని పతకము గొని
    భద్రాచల రాముఁ డుండు ;బాసరయందు న్
    చిద్రూపి శారదాంబయు
    భద్రంబుగ విద్య నొసగు భక్తిని గొలువన్

    రిప్లయితొలగించండి
  10. చిద్రూపుడు రాముండు జ
    గద్రక్షకు డచ్యుతుండు కరుణా మయుడున్
    భద్రగతి నుండు జగతిని
    భద్రాచల రాముడుండు బాసర యందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. భద్రముగ కలశ నుంచితి
    చిద్రూపుని రామవిభుని చేర్చితి ముద్రన్
    క్షుద్రము కాదది నమ్మర
    భద్రాచల రాముఁ డుండు బాసర! యందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కలశ నుంచితి’...?

      తొలగించండి
    2. కలశము నుంచితి అని నా భావం గురువుగారూ. కలశస్థాపన చేసి దేవుణ్ణి ఆవాహన చేసి పూజిస్తారు కదా ....అలా భావించి వ్రాసాను.

      తొలగించండి
    3. ముప్రత్యయం లేకుండా వ్రాశారు. అందుకే నాకు సందేహం కలిగింది. ‘భద్రముగ కలశ ముంచితి’ అనవచ్చు గదా!

      తొలగించండి
  12. భద్రకరుడు లోకులకిల
    భద్రాచలరాముడుండు|”భాసరయందున్
    భద్రతగూర్చెడి చదువు|న
    భద్రత మాన్పించు బుద్ది భారతి నొసగున్|”.

    రిప్లయితొలగించండి
  13. క్షుద్రుల నణచిన వాడట
    భద్రాచల రాముడుండు బాసర యందున్
    రుద్రాణియు రమయు మరియు
    చిద్రూపిని శారదవెలసిరిమువు రమ్మల్

    రిప్లయితొలగించండి
  14. మిత్రులందఱకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు!

    భద్రము లనిశము నిచ్చుచు
    భద్రాచల రాముఁ డుండు; బాసరయందున్
    సద్రచనలఁ జేయించెడి
    చిద్రూపిణి వాణి యుండి శ్రేయము లొసఁగున్!

    రిప్లయితొలగించండి
  15. భద్రముగ శంఖ చక్రము
    చిద్రూపుఁడుఁ దాల్చ జనులఁ సేవకుఁ జేర్చన్
    తద్రక్షకు గుడివారలు
    భద్రాచల రాముడుండు బాసర యందున్!
    (తిరుమల వెంకన్న జనపదములకు వచ్చినటుల.. భక్తుల వద్దకే భగవంతుడు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శంఖ చక్రము 'లు' ప్రత్యయం లేకుండా ప్రయోగించారు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      భద్రుడుఁ గోరిన రూపమె
      చిద్రూపుఁడుఁ దాల్చ జనుల సేవకుఁ జేర్చన్
      తద్రక్షకు గుడివారలు,
      భద్రాచల రాముడుండు బాసర యందున్!

      తొలగించండి
  16. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { " భద్రాచల -- రాముడు " అనే వ్య క్తి బ౦గారు నగ లమ్ము వ్యాపారస్తునిగా మరియు రాజకీయనాయకునిగా
    బాసరలో ఉ౦టున్నాడు . }


    భద్రయ్య కుమారు డతడు ,

    భద్రాభరణముల. నమ్ము వణిజుడు మరియున్

    భద్రత నిడు నాయకు డా

    " భద్రాచల--రాము " డు౦డు బాసర లోనన్

    …………………………………………………………

    భద్రము = బ౦గారు ; భద్రాభరణములు = బ౦గారు నగలు ; వణిజుడు = వ్యాపారి ;

    ....................................................

    రిప్లయితొలగించండి
  17. నిద్రావస్థను చదువుచు
    రుద్రుండనువాడు పలికె లోలోపల - శ్రీ
    మద్రామాయణ వాక్కని
    "భద్రాచల రాముడుండు బాసరయందున్!"

    రిప్లయితొలగించండి
  18. అద్రింది సమస్య గురుడ!
    కుద్రదుగా విరుపు లేక...కుందుండైనన్
    చెద్రును పూరణ జేయగ: 👇
    "భద్రాచల రాముఁ డుండు బాసరయందున్" :)

    కుందుడు = విష్ణువు

    రిప్లయితొలగించండి