సాహితీసమితి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, శేరిలింగంపల్లి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో
స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భముగా నిర్వహించు
అష్టావధానము
అవధాని : అవధానరత్న డా. మలుగ అంజయ్య శతావధాని.
తేది : 05-4-2016, మంగళవారం, సాయంత్రం 5 గంటలకు.
వేదిక : శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, చందానగర్.
సంచాలకులు : శ్రీ చింతా రామకృష్ణారావు గారు.
ఆశువు : ప్రొ. శర్మ గారు
దత్తపది : శ్రీ శ్రీధర్ గారు.
సమస్య : శ్రీ చిక్కా రామదాసు గారు.
వర్ణన : శ్రీ శివరాత్రి యాదగిరి గారు.
నిషిద్ధాక్షరి : శ్రీ వాడ్రేవు సత్యప్రసాద్ గారు.
ఛందోభాషణ : శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు.
అప్రస్తుత ప్రసంగము : శ్రీ కామేశ్వరరావు గారు.
వార గణనము : శ్రీ మంగిపూడి వేంకటరమణమూర్త
సహృదయ సాహితీ ప్రియులందరూముందుగావిచ్చేసి, ఈ అవధాన కార్యక్రమమునపాల్గొని, భావితరాలకు అందించాలని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
కన్వీనర్ : తాడిబోయిన రామస్వామియాదవ్, 9440053859
కార్యదర్శి : ఎం.రామమోహన్ రావు 9866605378
విజయోస్తు.
రిప్లయితొలగించండిచక్కని కార్యక్రమమిది
రిప్లయితొలగించండియెక్కడగలదో వెదుకుచు యెక్కడ కైనన్
జక్కగ నేగుటె మేలగు
చక్కని సాహిత్య క్రీడ జగతిన వెలుగన్
అష్టావధాన విద్యా
రిప్లయితొలగించండిపుష్టిని-వినగోరు చెవుల వోర్పగు నేర్పే
నిష్టా నియమపు ధారణ
దృష్టిని సమకూర్చగలుగు దేవీ కృపయే.
శుభాభి నందనలు
రిప్లయితొలగించండిపై అష్టావధానంలో సమస్యా పూరణకు నేను పృచ్ఛకునిగా పాల్గొన్నాను.
రిప్లయితొలగించండిచాలా సంతోషం... మీరిచ్చిన సమస్య, అవధాని గారి పూరణ తెలియజేయండి.
తొలగించండిసమస్యః కొట్టెడు పతిఁగొరుచుంద్రు కోమలులెపుడున్
రిప్లయితొలగించండిఅవధాని గారి పూరణః
తిట్టక అడిగిన దెల్లను
అట్టే తామందజేసి హాయిని గూర్చే
గట్టిగ తమతో తగ నూ
కొట్టేడు పతిఁగొరుచుంద్రు కోమలులెపుడున్
నాపూరణః
కట్టడి చేయక సతతము
పెట్టుచు కోరిన నగలను, విశ్వాసముతో
గట్టిగ తమ మాటల కూ
కొట్టెడు పతిఁగోరుచుంద్రు కోమలులెపుడున్
రిప్లయితొలగించండిపట్టితి అయ్యరు జేతిన్
మొట్టితి వారిన్ వలపుల మోముల గానన్
గట్టిగ జిలేబి జేజే
కొట్టెడు పతిఁగోరుచుంద్రు కోమలులెపుడున్ :)
ఈ అష్టావధానంలో దత్తపది నిచ్చిన పృచ్ఛకునిగా నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా వుంది.
రిప్లయితొలగించండి'తమన్న ' 'సమంత ' 'కాజల్ ' ' నయనతార ' అనే పదాలను వుపయోగిస్తూ ఉగాదిని గూర్చి చెప్పే యొక పద్యాని చెప్పవలసిందిగా అవధాని గారిని కోరగా వారు తగు విధంగా పూరించి సభను రంజింప చేశారు.
అవధాని గారి పూరణ:
నయన తారల మెప్పించు వయన మిదెయె,
ధర తమన్నది తప్పుగా తలచి చూడ
వింత కాజల్లు లిలపైన శాంతి కూర్చు
దోసమంతయు తీర్చుమా దుర్ముఖమ్మ!
నా పూరణ:
గీతమన్నది కోకిల కీర్తనయ్యె!
మల్లెలు నయన తారకలల్లె విరియ
నవ యుగాది కా జల్తారు నాణ్యమొసగె,
చైత్ర మాసమంత నిటులె సాగు చుండు!
మొట్టుచు చెల్లియలనెపుడు
రిప్లయితొలగించండితిట్టుచు నమ్మను వదినను...తియ్యగ నత్తన్
ఘట్టిగ పొగడుచు...గ్యాసును
కొట్టెడు పతిఁగోరుచుంద్రు కోమలులెపుడున్!