25, ఏప్రిల్ 2016, సోమవారం

పద్యరచన - 1205

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. వింతేమున్నది గాంచిన
    సంతసమే మనకు గాద సాహసులగుచున్
    పంతము తో పరు గెత్తెడి
    యింతుల ఘనకార్య చిత్ర మిదియే సుమ్మీ

    2.
    ఫ్యాటు దగ్గ దలచి వాకింగు జేయును
    ఫ్యామిలీని మేప వంట జేయు
    చిలిపి దనము జూప స్కేటింగు జేయుచున్
    స్త్రీల ఘనత తెలుపు చిత్రమిదియె

    3.
    అబల యబల యముచు నవమాన పరచ బో
    కాడ దనిన నేమి యాదిశక్తి
    సాహసములు సేయు సబలయే పడతిరా
    గౌరవించ వలెను నారి నిలను

    4.
    ప్రగతి పథము వెదక పరుగు దీయుచునున్న
    కలికి యామె భావి కాంతి గాద
    రయము తోడ తాను రహదారి పైనను
    సరళ యంత్రములకు సాటిగాను.

    5.
    గాలికెగసి హనుమ కడలిదాటినరీతి
    వీధు లెన్నొ దాటె విమల మతియె
    చక్క నైన యట్టి చక్రాల బల్లపై
    తాను జేరి యురికె తన్వి జూడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అయిదు పద్యాల ఖండకృతి బాగున్నది. అభినందనలు.
      అవసరార్థం కొన్ని అన్యదేశ్యాలు వాడారు.పరవాలేదు.

      తొలగించండి

  2. చక్రాలబండిమీదను
    వక్రముగాగాకనామెభద్రముగానే
    చక్రాలత్రయపుబండిని
    సక్రమముగబట్టుకొనుచుసాగుటగనుడీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది.
      ‘...గాక యామె’ అనండి. మూడవపాదాన్ని ‘చక్రత్రయ వాహనమును’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. శంకరయ్యగారికినమస్కారములు.మీసూచన బాగుందండి.బ్లాగులోమారుస్తాను

      తొలగించండి
  3. అనవరత వాహ నావృత
    ఘన జన సమ్మర్ధ రాజ గమథం బదివో
    కన బహు సాహసి గద యా
    వనితయు నాట లవి యేల బథ రాజములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనవరత రసావిష్కృత
      ఘన జన మోదార్హ మధుర కవనం బిదివో
      కన కామేశ్వర రావుదె
      వనితాసమ్మితముగా సుభాషిత మాయెన్.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ కవన ప్రశంసార్హుడ నయినందుల కానంద భరితాత్ముడ నయ్యాను. ధన్యవాదములు.

      తొలగించండి
  4. అంబటిభానుప్రకాశ్.
    తే**
    చేత రొక్కము లేదని, చింత గలిగె,
    నబల కాదని యెరిగెను యవని పైన,
    నాల సించక గదిలెను నతని వెంటె,
    రిక్ష తోడుగ పయనించె రీతి నేర్చి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది.
      ‘ఎరిగెను+అవని’ అన్నపుడు యడాగమం రాదు. ‘ఎరిగెఁ దా నవనిపైన’ అనండి. అలాగే ‘...గదలిన దతన వెంట’ అనండి.

      తొలగించండి
  5. దూరమయ్యె పోవు చోటు దుడ్డులేని దాననున్
    దారి కూడ తెలియదయ్య తప్పదింక కష్టమున్
    భారమవ్వ కుండ నీకు పట్టుకొందు బండినిన్!
    జారి పోక పట్టుకొమ్మ జాగ్రతన్న నీదియే!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
      చివర ‘నీదెపో’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      దూరమయ్యె పోవు చోటు దుడ్డులేని దాననున్
      దారి కూడ తెలియదయ్య తప్పదింక కష్టమున్
      భారమవ్వ కుండ నీకు పట్టుకొందు బండినిన్!
      జారి పోక పట్టుకొమ్మ జాగ్రతన్న నీదెపో!!

      తొలగించండి
  6. అంబటిభానుప్రకాశ్.
    తే**
    చేత రొక్కము లేదని, !చింత గలిగె,!
    నబల కాదని యెరిగెదా !నవని పైన,!
    నాల సించక గదలిన ! దతని వెంట,
    రిక్ష తోడుగ పయనించె! రీతి నేర్చి.!!

    ధన్యవాదాలు.సర్

    రిప్లయితొలగించండి
  7. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    { రి క్షా లో పో వు వా డు వి క లా ౦ గు రా లి
    కొ డు కు . త ల్లి ని సా క లే ని వె ధ వ. }
    ………………………………………………………


    అరయన్ దా వికలా౦గ యై కనె ని నత్య౦త
    స్ఫురద్రూపిగా |

    కరుణ మ్మి౦చుక లేదె తల్లి పయి ?
    సాకన్ జాల కీ రీతిగా :-

    అరెరే నీచుడ ! ప్రత్యహ౦ బుదయమే యాచి౦పగా బ౦పి ని

    క్కరణిన్ స౦ధ్య పడ౦గ దోడ్కొని చన౦గా
    సిగ్గు లేదొక్కొ ! ఛీ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం అద్భుతంగా ఉంది. కాని చిత్రంలో ఆమె యాచకురాలిగా లేదు.
      ‘...బంపి యి|క్కరణిన్...’ అనండి.

      తొలగించండి
  8. కనికర మందు కార్మికుని కౌతుక మేగద?రిక్ష లాగుచున్
    తనకిది కష్ట మైన నొక తన్వికి సాయము జేయు దృష్టితో
    మనుగడ యందు మానవత మాయక జేసెడి మంచి కూర్పునన్
    గనబడ గర్వమే గద?సకాలము నందున సాయమెంచగా|

    రిప్లయితొలగించండి
  9. 1

    బస్తి నేలగలదు బండి నెక్కగలదు
    అవసరమ్ము నేర్పు నతివ కన్ని
    చక్రముల శకటము చక్కగా నెక్కుచూ
    దారి నడువగలదు ధైర్యముగను.

    2.కష్టసాధ్యమైన కార్యంబు లెల్లను
    సులువు గానె చేసి చూపగలదు
    ఆడదబల కాదు సబలన్న తీరుగా
    వీధిలోన సాగు వింతగాను/వింత గనుము.

    3 .పొట్టకూటి కొరకు పుడమిపై పడుచున్న
    పడతి పాట్లు చూడ బాధ కలుగు
    తప్పు లెన్ని వున్న తప్పదు సాపాటు
    అందు కొరకె పట్టె నతివ రిక్ష.
    ఆమె కదియె రక్ష యయ్యె గనుము.

    4ఆసరాగ పట్టె నలివేణి రిక్షాను
    సాగుచుండె తాను జాగు లేక
    చుట్టునున్న ప్రజ చూచేనువింతగా
    చూడ నేగుదుమట సుదతు లార.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ నాల్గు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      కొన్నిసంధిగత దోషాలు, వ్యావహారికాలు ఉన్నాయి.
      ‘ఎక్కుచూ (ఎక్కుచున్), వున్న (ఎన్నియున్న), మూడవపాదంలో ఐదవ పాదం అదనంగా ఆటవెలదిలో ఉండదు.

      తొలగించండి
  10. సరదా సరదాగా:👇

    చూచితిని పేర గ్లైడరు
    చూచితిగద పేర షూటు షోకుగ వ్రాలన్
    చూచితిని పేర సైలుర...
    చూచితినిట పేర సైటు సుఖమును నేడే!

    (paraglider, parachute, parasailor, parasite)

    రిప్లయితొలగించండి


  11. నెక్కితి బోర్డును పట్టితి
    చక్కగ బండిని భళారె సాహసమిదియే!
    చుక్కమ్మ! జిలేబమ్మా
    పక్కాగా రోడ్డు గతికి పద్ధతి యిదియే :)


    జిలేబి

    రిప్లయితొలగించండి