24, ఏప్రిల్ 2016, ఆదివారం

సమస్య - 2013 (కలుము లెడమైన...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.

39 కామెంట్‌లు:


  1. బాధలెన్నియోకలుగునుబ్రతియొకరికి గలుములెడమైనవేళ,సౌఖ్యములెసంగు నాయురారోగ్యంపదలన్నికలుగ బ్రదుకునన్నాళ్ళుహాయిగబ్రదుకవచ్చు

    రిప్లయితొలగించండి
  2. మదము దంబము నీర్ష్యయు మత్సరమ్ము
    అహము లోభము స్వార్ధము నాగ్రహముల
    కారణముగ మతి నశించు గాన యిట్టి
    కలుము లెడమైన వేళ సౌఖ్యములెసంగు

    కలుము = కలుషగంధము

    రిప్లయితొలగించండి
  3. ఇడుములను పొంద క్రుంగుదురెవ్వరైన
    సుఖము నొందగ తగ్గును సుంత బాధ ;
    నరుని బ్రతుకున నయ్యవి నైజమైన
    కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.

    రిప్లయితొలగించండి
  4. కొలువు దొరకంగ రూకల కొరతదీరె
    సరసమైన వధువు కోరి చక్క వచ్చె
    పిల్ల దంపతులకు పిల్ల పిల్ల నడుమ
    కలుము లెడమైన వేళ సౌఖ్యములెసంగు

    రిప్లయితొలగించండి
  5. తే**

    రాజ కీయము నేర్చియు రంజు గాను,
    సుఖము నొందెరు నేడది సుతుల గూడి,!
    కలుము లెడమైన వెేళ సౌఖ్యము లెసంగు,
    తట్టు కొనజాల రెప్పుడు నిట్టి జనులు.!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      ‘ఒందెరు’ అనడం సాధువు కాదు. ‘సుఖము నందిరి నాయకుల్ సుతుల గూడి’ అందామా?

      తొలగించండి
  6. కిలుము,కలుములు మాయ.పాత్రలకు కలుగు
    కిలుముమాయను తొలగింప వెలుగు పాత్ర
    మాయలో ముంచు గర్వా౦ఢ మదము లనెడి
    కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ముద్రారాక్షసమును మన్నించాలి
      సవరించిన పద్యము
      కిలుము,కలుములు మాయ.పాత్రలకు కలుగు
      కిలుముమాయను తొలగింప వెలుగు పాత్ర
      మాయలో ముంచు గర్వా౦ధ మదము లనెడి
      కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు

      తొలగించండి
  7. జీవ నావసర ధనము క్షేమ కరమె
    యధికమైన విభవము చౌర్య భయ దుఃఖ
    కరము నిత్యము సకలాఘ కారకములు
    కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.

    రిప్లయితొలగించండి
  8. . మోది సూత్రంబు ప్రజల కామోదమనుచు
    స్వచ్చభారతమార్గంబు సమ్మతాన
    చంద్రు లిద్దరియంత్రాంగ సమయమెంచి
    కలుము లెడ మైన వేళ సౌఖ్యము లెసంగు|

    రిప్లయితొలగించండి
  9. బంధు మిత్రులు నినుగాంచి భయము తోడ
    పారిపోయెదరను మాట వాస్తవమ్ము
    కలుము లెడమైన వేళ, సౌఖ్యములెసంగు
    నున్న దానితో సంతృప్తి నొందినంత

    గర్వ మీర్ష్యయ సూయలు ఘనమగు సిరి
    సంపదలనుచు భావించు జనులకిలను
    శాంతి యుసుఖము కరువౌను సత్యమట్టి
    కలుము లెడమైన వేళ సౌఖ్యములెసంగు

    రిప్లయితొలగించండి
  10. నలత గల్గిన మందుబిళ్ళలను మింగి
    జ్వరము తగ్గక హెచ్చిన వైద్యు కడకు
    బోయి పుడుకును చెల్లింప పోయె జ్వరము
    కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.

    రిప్లయితొలగించండి
  11. కపట మల్లదే వస్త్రమై గారవమిడు
    నలుగు నవ్వుగ మారును నయము గాను
    మునగ యాభరణమ్మయి మోద మిడును
    క,లు,ము లెడమైన వేళ సౌఖ్యమ్ము లెసగు.

    ( కపటము లో క ను తొలగిస్తే పటము = వస్త్రము
    నలుగు లో లు తొలగిస్తే నగు = నవ్వు
    మునగ లో ము తొలగిస్తే నగ = ఆభరణము )

    రిప్లయితొలగించండి
  12. లేని వాడిట, కలిమియె ప్రియముఁ గూర్చు
    భావనమ్మునఁ గుములుచు బ్రతుకునీడ్చు!
    కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు!
    ననును వ్యాపార వ్యాజ్యాల పెనగు వాడు

    రిప్లయితొలగించండి
  13. బంధువుల్ దరిచేరరు పలుక రెవరు
    కలుములెడమైన వేళ , సౌఖ్యము లెసంగు
    సన్నిహితుల తోడ్పాటుతో సంతతమ్ము
    తెలిసి మెలగవలయును కువలయమునను

    రిప్లయితొలగించండి
  14. BHANU PRAKASHఏప్రిల్
    తే**

    రాజ కీయము నేర్చియు రంజు గాను,
    సుఖము నందెరు నాయకుల్ సుతుల గూడి,!
    కలుము లెడమైన వెేళ సౌఖ్యము లెసంగు,
    తట్టు కొనజాల రెప్పుడు నిట్టి జనులు.!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      ‘రంజు’ అన్నది వ్యావహారికం. ‘రమణ గాను’ అనండి.

      తొలగించండి
  15. కలిమి కూడినంతనె కీర్తి కాముకుడగు
    కలిమి హెచ్చిన హెచ్చును కావరంబు!
    అక్రమాస్థులు చేరిన హద్దు లేని
    కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది.
      ‘అక్రమాస్థులు’ అంటే ‘అక్రమమైన ఎముకలు’ అని అర్థం. అవి ‘ఆస్తులు’ కాని ‘అక్రమాస్తులు’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘అక్రమార్జన చేరిన...’ అనండి.

      తొలగించండి
  16. శ్రీరాం కవి గారి పూరణ....

    ధనము ప్రక్కలో బల్లెమై దనరుచుండు
    సంపదలు వెంట నుండును సర్పములుగ
    కాటువేయును మనుజుల గరుణలేక
    కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.

    రిప్లయితొలగించండి
  17. కాంతికృష్ణ గారి పూరణ...

    ధనపు రక్షణ రందితో ధరను లోభి
    తిండి, నిద్రకు, సుఖముకు దేబరిల్లె
    తోడు యది చూచి యీరీతి బాడుచుండె
    కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణ బాగున్నది. కొన్ని లోపాలు...
      ‘రంది/రంధి’ వ్యావహారికాలు. ‘రక్షణ రంధి’ అని సమాసం చేయరాదు. ‘సుఖమునకు’ అనాలి. ‘సుఖముకు’ అనడం వ్యాకరణ విరుద్ధం. ‘తోడు+అది’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. మీ పద్యానికి నా సవరణ....
      ధనముఁ గాపాడు తపనతో ధరను లోభి
      తిండి, నిద్రాసుఖములకు దేబరించు
      తోడుగా జూచి యీరీతి బాడుచుండె
      కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.

      తొలగించండి
  18. బంధువులెవరు భువిలోన పల్కబోరు
    కలుములెడమైన వేళ,సౌఖ్యము లొసంగు
    నాప్తమిత్రుల నెయ్యము లాదరాన
    నట్టిహితులున్న వారకి హాయి కలుగు.

    రిప్లయితొలగించండి
  19. పర్యావరణ పరిరక్షణ:👇

    కలుగు దుర్గంధములు నీట గలుప...బొమ్మ
    కృత్రిమపు రంగుల గణేశు...కీడు గలుగు...
    వలచి మట్టి బొమ్మల నెప్డు వాడు మన్న!
    కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు!

    కలుము = కలుష గంధము (శబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి


  20. ఖచ్చితముగ సరియదియె కద! విబుధుల
    సొబగు జవ్వాది గంధము శోభిలుగద
    కలుము లెడమైన వేళ, సౌఖ్యము లెసంగు
    మానవాళికి మేలగు, మదియు సూవె!


    జిలేబి

    రిప్లయితొలగించండి