16, ఏప్రిల్ 2016, శనివారం

ఖండకావ్యాలు

కవిమిత్రులారా!
ఇంతవరకు సమస్యలను పూరిస్తూ, పద్యరచనలు చేస్తూ వచ్చారు. పద్యరచనశీర్షికలో ఇచ్చిన శీర్షికపై కొందరు ఖండకృతులను వ్రాశారు కూడా.
మీలో కవితోత్సాహం పెల్లుబికినపుడు ఏదైనా అంశంపై ఖండకృతులు వ్రాసి ఉంటారు. అలా వ్రాసినవారు వాటిని ప్రకటించే వేదిక లేక అలాగే ప్రక్కన పెట్టి ఉంటారు. కొందరు తమ స్వంత బ్లాగుల్లో ప్రకటించినా వీక్షకులు తక్కువగా ఉండి నిరుత్సాహానికి గురియై ఉంటారు. కొందరికి ఖండకావ్యాలు వ్రాయాలని ఉన్నా వేదిక లేదు కదా అని వెనుకాడుతుండవచ్చు. అలా నచ్చిన అంశంపై ఖండకావ్యాలను వ్రాసేవారికి వేదిక మన బ్లాగులో క్రొత్తగా ప్రారంభిస్తున్న ఖండకావ్యాలు’.
శీర్షికకు మీరు అంశాన్నైనా తీసుకొని నాలుగుకు తక్కువ కాకుండా, పదికి మించకుండా పద్యాలు వ్రాసి నా మెయిల్ చిరునామాకు పంపండి. చూసి, అవసరమైన సవరణలను సూచించి శుద్ధప్రతిని బ్లాగులో ప్రకటిస్తాను.
అలా ప్రకటించిన ఖండికలపైన మిత్రుల సమీక్షలు ఉంటాయి. గుణదోషాల చర్చ జరుగుతుంది. ఇది మీ కవిత్వ రచనకు అభ్యాసం అవుతుంది. విమర్శలు చేసే వారు సంస్కారవంతమైన భాషను ఉపయోగించ వలసిందిగా మనవి. అలాగే ఆ విమర్శలను సహృదయంతో స్వీకరించి సరిదిద్దుకొనే గొప్ప మనసును కవులూ అలవరచుకోవాలి. వివాదాలకు తావివ్వవద్దని మనవి. ఖండకావ్యాలకు వస్తువులు వివాదాస్పదం కానివై ఉండాలి.

మీ ఖండికలను shankarkandi@gmail.com కు పంపించండి.

14 కామెంట్‌లు:


 1. కంది వారు

  ఖండ కృతి అనగా ఏమిటి ? వాటి లక్షణాలు ఏమిటి ? దయచేసి తెలుప గలరు ; ప్రయత్నిస్తాను

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. సరిగ్గా నేను అదే ఖండగతి లక్షణాలను అడగాలనుకున్నాను గురువులు తెలుప గలరు
  రిప్లయితొలగించండి
 3. పరిమిత పద్యాలలో, ఒక వర్ణనాంశాన్ని కాని, సంఘటనను కాని, కథను కాని చెప్పడం ‘ఖండకావ్యం’. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, జాషువా, దువ్వూరు రామిరెడ్డి, శ్రీశ్రీ, రాయప్రోలు సుబ్బారావు, సినారె మొదలైనవారు ఖండకావ్యకర్తలలో ప్రముఖులు.
  ఖండకావ్య లక్షణం, చరిత్ర గురుంచి క్రింది లింకు చూడండి.
  ఖండకావ్య లక్షణము

  రిప్లయితొలగించండి

 4. కందివారు ,

  నెనర్లు !

  మీ మెయిల్ ఐడీ కి పంపించాను ;

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. ప్రణామములు గురువుగారు.. చాలా మంచి యోచన తలపెట్టారు...ధన్యవాదములు..

  రిప్లయితొలగించండి
 6. మిత్రులందఱకు నమస్సులు!

  మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్సులు!ఖండకావ్యాలు శీర్షికన ఖండకావ్యాలను ప్రకటించుట ముదావహము. అభినందనలు.

  తొలుతగా... నేను గతంలో మన శంకరాభరణంలో ప్రకటించిన శ్రీకృష్ణదేవరాయల ఖండకృతినిం బ్రచురించుట నా మహద్భాగ్యముగా భావించుచున్నాను. ఇందులకు మీకు నా కృతజ్ఞతలు మఱియు ధన్యవాదాలర్పించుకొంటున్నాను.

  భవదీయుఁడు
  గుండు మధుసూదన్

  రిప్లయితొలగించండి
 7. చిన్న సందేహం గురువుగారు..గతంలో శంకరాభరణంలో వ్రాసిన ఖండికలు కూడా పంపవచ్చా..లేక కొత్తగా వ్రాసినవే పంపాలా..దయచేసి తెలుప ప్రార్ధన..

  రిప్లయితొలగించండి
 8. తప్పకుండా పంపవచ్చు. అవి అప్పుడు ఏదో పద్యరచన శీర్షిక క్రింద వ్యాఖ్యాలుగా వచ్చాయి. ఇప్పుడు పోస్టుగా వస్తాయి. ఈనాటి గుండు వారి ఖండిక గతంలో మన బ్లాగులో శ్రీకృష్ణదేవ రాయల చిత్రం ఇచ్చి పద్యరచన చేయమన్నపుడు వ్రాసినదే!

  రిప్లయితొలగించండి
 9. శ్రీ కంది శంకరయ్యగారూ, క్రొత్త శీర్షిక మంచిదే! పద్య రచనాసక్తిని పెంపొదిస్తుందనడంలో సందేహమేం లేదు. అదే సమయంలో ఈ శంకరాభరణాన్ని సందర్శించే 'ఔత్సాహిక పాఠక శ్రేణిలో' పద్య పఠనాసక్తిని కూడా పెంపొందింపజేయగలరు. మొహమాటమేం లేదు, నేటి కాలంలో వ్రాసే వారి సంఖ్య పెరిగింది, చదివే వారి సంఖ్య తగ్గింది. ప్రతి ఔత్సాహిక కవికి కనీసం 50 వేమన పద్యాలు , 50 సుమతి పద్యాలు అయినా వచ్చుండాలి. ఇది అధమ పక్షం. వీలైతే కరుణశ్రీ జాషువా పద్యాలు ఒక పది పది నోటికి రావాలి. ఇంకా కుదిరితే పోతన భాగవతం , కవిత్రయ భారతంలోని ముఖ్యమైన ఘట్టాల్లో నాలుగో అయిదో పద్యాలు మొత్తం కంఠోపాఠం కావాలి. అప్పుడు కదా కవితలల్లడం ? ఆ కవితలను చూసి జనాలు సంతసించడం?

  ప్రాచీనాధునాతన కవిత్వాన్ని చదివించడానికి మాస్టారి లాగా ప్రణాళిక సిద్ధం చేయగలరు.

  "కవిత్వాన్ని చదవకుండా కవిత్వం వ్రాయడం అసంభవం".

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. విష్ణునందన్ గారూ,
   మీ సూచనలు సర్వదా శిరోధార్యాలు. ధన్యవాదాలు.

   తొలగించండి
 10. కవిమిత్రులకు మనవి...
  మీ ఖండికలు నాలుగుకు తక్కువ, పదికి ఎక్కువ కాకుండా పద్యాలు ఉండే విధంగా చూడండి. మరీ ఎక్కువగా ఉంటే పేజీ అంతా ఆ ఒక్క పోస్టే వ్యాపించి సమస్యాపూరణం, పద్యరచన శీర్షికలు కనిపించవు. గమనించి సహకరించగలరు.

  రిప్లయితొలగించండి
 11. ఖండ కావ్యం అంటే ఏమిటి దాని లక్షణాలు

  రిప్లయితొలగించండి