25, ఏప్రిల్ 2016, సోమవారం

ఖండకావ్యము - 9

శ్రీరామ స్తోత్రము
ప్రణీతము : పోచిరాజు కామేశ్వర రావు.

ద్విపద మాలిక :

శ్రీరామ! రఘురామ! సితదామ! రామ!
కారుణ్య వననిధీ! కాకుత్స్థ రామ!
జానకీవల్లభా! జనలోక రక్ష!
దానవ భంజనా! ధరణీశపుత్ర!
సీతా మనోహరా! శివచాప భంగ!
దాతాగ్రగణ్యేశ! దనుజేంద్ర దమన!
తాటక సంహార! తారక రామ!
పాటవ ధీశాలి! పరమాత్మ! రామ!
సత్యపరాక్రమ! శత్రుసంహార!
భృత్యానుకంపన పిశితాశనారి!
కోసల క్ష్మాభర్తకోదండ రామ!
కౌసల్య నందనా! కౌశిక శిష్య!
దశకంఠ సంహర్త! దాక్షిణ్య మూర్తి!
దశరధ నందనా! దయజూడు మమ్ము.

18 కామెంట్‌లు:

 1. పోచిరాజు కామేశ్వరరావు గారి ద్విపద యద్వితీయం

  రిప్లయితొలగించండి

 2. రామునికావ్యపుపఠనము నేమరువకజేయుకతననీశునిగరుణల్ గోముగనెప్పుడునుండును నీమాటలుసెప్పుచుంటినెంతయొనెమ్మిన్

  రిప్లయితొలగించండి
 3. రామ నామ మహిమ రహినెంత బొగడిన
  తనివిదీరదాయె ధరణియందు
  పాపహరము గాన పరిపరి సేవించి
  మురియుచుండ నదియె మోక్షమిచ్చు.
  ,,,,,,,,,
  కామేశ్వర రావు గారు, మీ మాలిక సుగంధభరితం.

  రిప్లయితొలగించండి
 4. కామేశ్వర విరచిత శ్రీ
  రాముని స్తోత్రమ్ము మిగుల రమ్యమ్మగుచున్
  సేమము గూర్చును మనకిల
  నీమముఁ దప్పక చదివిన నిశ్చల భక్తిన్!

  రిప్లయితొలగించండి
 5. బాగుందండి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ద్విపద.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదములండి. అవును మా అమ్మాయి సౌజన్య సంగీతపరముగా పాడుతుంది యిది.

   తొలగించండి
 6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సౌందర్యాతిశయవిలసిత జగదభిరాముని చిత్రముతో “శ్రీరామ స్తోత్రము” ప్రచురించిన మీకు శతాధిక వందనములు.

  రిప్లయితొలగించండి

 7. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ఘనుడగు శ్రీరఘు రాముని

  వినుతి౦చెడు నట్టి నీదు ద్విపద బఠి౦ప

  న్ననుదినము , లభి౦చు పరమ

  ధనము | నిజము . పోచిరాజ తనయా వినుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామ జగదభినుత రామ భార్గవ సువి
   రామ సంతత జప నామ రామ
   రామజానకీలలామ రామ పరాత్మ
   రాగ దయ్య బ్రోవ రామ చంద్ర

   గు రు మూ ర్తి ఆ చా రి గారు ధన్యవాదములు. నాశతక మకుటాన్ని నాకే వినిపించారు. చాలా సంతోషము. గురువు గారి కృప యుంటే నా శతకములోని కొన్ని నిత్య సత్య సూక్తులను ఖండిక గా పంప గలను.

   తొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. .కామేశ్వరరావిందున
  రాముని రామాయణంబు రసగుళికలనే
  క్షేమంబొసగగ దెలిపెను
  కామిత మీడేర్చురామ|కౌసల్య సుతా|

  రిప్లయితొలగించండి