2, ఏప్రిల్ 2016, శనివారం

సమస్య – 1991 (చెఱకు రసము మిగుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చెఱకు రసము మిగుల చేదు సుమ్ము.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
(నా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఆలస్యానికి మన్నించండి)

31 కామెంట్‌లు:



  1. వ్రాయటానికి మనసొప్పడం లేదండీ కంది వారు;
    త్వరలో మీరు కోలుకొని రండి !

    అంత దాకా సెలవు.

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యుల ఆరోగ్యము కుదురుపడుగాక!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. త్రాగతీయనుండుదాహముదీరును చెరకురసము,మిగులచేదుసుమ్ము కాకరరసముమరి,కానిషుగరురోగి వారలకుపయోగమారసమ్ము

      తొలగించండి
  3. భగవాన్! గురుదేవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ!

    రిప్లయితొలగించండి
  4. మనిషి బాధ చెందు మాయ రోగంబిది
    తీపి తిండి తినిన తెగులు హెచ్చు
    మరవ వలెను తీపి మధుమేహ మనిషికి
    చెఱకు రసము మిగుల చేదు సుమ్ము

    రిప్లయితొలగించండి
  5. శంకరాభరణం పట్ల మీకు ఎంత అంకితబావం గురువుగారు..ఇంతగా ఒంట్లో బాగులేకున్నా పూరణ నిచ్చారు...జిలేబి గారన్నట్లు వ్రాయాలనిపించడం లేదు.. త్వరగా మీరు కోలుకోవాలని ఆ భగవంతుడుని ప్రార్ధిస్తున్నా..

    రిప్లయితొలగించండి

  6. శంక రార్యులస్వాస్ధ్యముజక్కబడగ వేడుకొందునుశంకరువినయముగను
    స్వామిశంకర!దయనుమాశంకరయ్య నొప్పులన్నియుబరిమార్చియొప్పుజేయు

    రిప్లయితొలగించండి
  7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీకు త్వరగా స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నాము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీధివీధి నుండు వేప మనకు వంట
      చెఱకు, రసము మిగుల చేదు సుమ్ము
      దుష్ట క్రిముల నెల్ల నష్ట పఱచు వేగఁ
      బండ్లు తోముట కది పాడి సుమ్ము

      తొలగించండి
  8. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    అ మ్మా శా ర దా !

    సా హి తీ సే వ. చే స్తు న్న

    గు రు వు గా రి కి ఆ యు రా రో గ్య ము ల

    ని మ్మ ని నీ ప తి య గు బ్ర హ్మ తో

    చె ప్ప వ మ్మా

    రిప్లయితొలగించండి
  9. గురువుగారికి గారికి త్వరగా త్వరగా అరోగ్యము చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

    జ్వరము పెరిగి బలము తరిగిపోయిన వేళ
    లంకణమ్మున మరి లావు చెడిన
    ఏది తిన్న రుచికి నింపొదవదు కాన
    చెఱకు రసము మిగుల చేదు సుమ్ము!!

    రిప్లయితొలగించండి
  10. .శ్రీకంది శంకరయ్య గురువుగారి అస్వస్తతనుండి త్వరగాకోలుకోవాలనిశంకరునిప్రార్తన.మీకృషి అమోఘముసరస్వతీదేవి కృప
    1.చేయ చెరుకురసము మిగుల చేదు సుమ్ము ననకురా
    మాయగాదు వేడితగ్గు| మంచిమందు మనకురా
    తీయ నైనదనుచు దలచ దీనిరుచిని మర్తురా
    కాయమందు సుస్తి యున్న?కలల యందు చేదగున్|

    రిప్లయితొలగించండి
  11. గురువు గారికి నమస్కారములు, మీకు త్వరలోనే పూర్తి ఆరోగ్యం చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను .

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికి నమస్కారములు, మీకు త్వరలోనే పూర్తి ఆరోగ్యం చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను .

    రిప్లయితొలగించండి
  13. గురువులు త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించి అక్క .

    రిప్లయితొలగించండి
  14. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    ఉ త్సా హ ము =


    { ఏడు సూ „ గ „ + ఒక. గరువు
    ఐదవ గణము మొ „ అ. „ యతి
    ప్రాసకలదు . ప్రాస యతి లేదు }
    ……………………………………………………


    చెడిన చెరకు రసము మిగుల.
    చేదు సుమ్ము తినకు రా

    చెడిన వాని తోడ నీవు
    చెలిమి చేయ వమ్ము రా

    చెడు పథ౦బు న౦ జరి౦చి
    సిరిని పొ౦ద వలదు రా

    చెడుగర౦బు వదలి వైచి
    చిత్త శుధ్ధి న౦ద రా

    { చెడుగరము = క్రూరత్వము }

    రిప్లయితొలగించండి
  15. అన్నయ్యగారూ ఆరోగ్యం జాగ్రత్త.త్వరగాస్వస్థత చేకూరాలని కోరుతున్నాను

    రిప్లయితొలగించండి
  16. అన్నయ్యగారూ ఆరోగ్యం జాగ్రత్త.త్వరగాస్వస్థత చేకూరాలని కోరుతున్నాను

    రిప్లయితొలగించండి
  17. మండుటెండలోన మదికిహాయినొసగు
    చెరుకురసము :మిగుల చేదు సుమ్ము
    కాకరరసమిలను కటిక చేదౌనుగా
    నరయుమయ్య నీవు నాంధ్ర బాల.

    2.దాహమెంత యున్న త్రాగిన దీరేను
    చెరుకు రసము మిగుల చేదు సుమ్ము
    యనుట పాడిగాదు యరయుమో బాలక
    తనివి తీర ద్రాగ దాహ మణగు.

    రిప్లయితొలగించండి
  18. మునుపు సేంద్రియముల పూదేనియను బోలి
    మధుర రసము జిలికె మంచి చెరకు
    విషపు మందులన్ని విరివిగ జల్లంగ
    చెరకు రసము మిగుల చేదు సుమ్ము
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  19. మునుపు సేంద్రియముల భూమిని జల్లంగ
    మధుర రసము జిలికె మంచి చెరకు
    విషపు మందులన్ని విరివిగ జల్లంగ
    చెరకు రసము మిగుల చేదు సుమ్ము
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  20. శ్రీ నమస్కారములు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

    రిప్లయితొలగించండి
  21. శ్రీ శంకరయ్య గురు దేవుల ఆరోగ్యం తొందరగా బాగవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్య గురు దేవుల ఆరోగ్యం తొందరగా బాగవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  23. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    ఉ త్సా హ ము =


    { ఏడు సూ „ గ „ + ఒక. గరువు
    ఐదవ గణము మొ „ అ. „ యతి
    ప్రాసకలదు . ప్రాస యతి లేదు }
    ……………………………………………………


    చెడిన చెరకు రసము మిగుల.
    చేదు సుమ్ము తినకు రా

    చెడిన వాని తోడ నీవు
    చెలిమి చేయ వమ్ము రా

    చెడు పథ౦బు న౦ జరి౦చి
    సిరిని పొ౦ద వలదు రా

    చెడుగర౦బు వదలి వైచి
    చిత్త శుధ్ధి న౦ద రా

    { చెడుగరము = క్రూరత్వము }

    రిప్లయితొలగించండి
  24. మాస్టరుగారూ ! తగిన విశ్రాంతి తీసుకొనగలరు.మీరు త్వరగా కోలుకొనవలెనని భగవంతుని కోరుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  25. మిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. మందులు వాడుతున్నాను.
    మీ పూరణలపై స్పందించలేకపోతున్నందుకు బాధగా (ఒకవిధంగా చెప్పాలంటే హోంవర్క్ చేయని విద్యార్థి పొందే అపరాధభావం లాగా) ఉంది. మన్నించండి.
    నా స్వాస్థ్యాన్ని కోరుకుంటూ సందేశాలు పంపిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. మెరిసి చెట్టు నున్న మేటివౌ ద్రాక్షలు
    పొట్టి నక్క కెపుడు పుల్ల నవవె...
    చేత డబ్బు లేక చేరువై యున్నను
    చెఱకు రసము మిగుల చేదు సుమ్ము :)

    రిప్లయితొలగించండి