17, ఏప్రిల్ 2016, ఆదివారం

పద్యరచన - 1197

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

21 కామెంట్‌లు:

 1. సొబగు లీను కలికి సోయగమ్మలు జూడ
  కురులె మూలమంద్రు కువలయమున
  కురుల రక్ష జేయు కుంకుడు కాయకు
  సాటీ రావు యెన్నిషాంపులున్న

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘రావు+ఎన్ని’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘రావు పెక్కు...’ అనండి.

   తొలగించండి

 2. కుంకుడుకాయలరసమును
  బింకముగాదలకునద్దిబిట్టునరుద్ద
  న్బంకముపూర్తిగదొలగుచు మంకెనపుష్పమ్మువోలెమరులనుగొలుపున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. కుంకుడు గాయలు దంచెడు
  సంకటముల విడి తలంటు షాంపూలద్దన్!
  పంకజముఖుల జడలవే
  ష్రింకై పోవుచు తరిగెను సింగారములున్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం (అన్యదేశ్యాలున్నా) బాగుంది. అభినందనలు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. షాంపూల జోలికి వెళ్లిన తర్వాత ష్రింకై పోక తప్పలేదండీ!

   తొలగించండి
 4. నీళ్ళను మరగించుచు కుం
  కుళ్ళను పొడిజేసివేసి కూర్చిన నురగన్
  వ్రేళ్ళను జుట్టును రుద్దగ
  కుళ్ళే వదలించి యిచ్చు కురులకు వన్నెన్.

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. తల తానమ్ముల కిప్పుడు
  సలలితముగ నురుగు నీయ జగమెల్ల గనన్
  చెలరేగె రసాయన సం
  కులమ్ము లేరి కెరుక యిక కుంకుళ్ళనినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. చిక్కని కుంకుడురసమును
  చక్కగ మరి తలకు రుద్ది స్నానము జేయన్
  మిక్కిలి మేలగు కురులకు
  నిక్కముగా చుండ్రు పోయి నిగనిగ లాడున్!!!

  రిప్లయితొలగించండి
 8. గుప్పెడు కుంకుడు కాయల
  నొప్పుగ వేన్నీళ్లతోడ నురుగులు గ్రక్కన్
  మెప్పుగ శిరమున రుద్దిన
  తప్పక నారోగ్యమిచ్చి తనరగజేయున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. . కురులకు రక్షణ తరచుగ
  కొరవడగా ?సృష్టిగాగ కుంకుడు కాయల్
  విరివిగ నురుగల తరగలు
  కురువగ?తలయందు కురులు కుదురుగ బెరుగున్
  2.పడతుల స్నానంబందున
  కడుముఖ్యము కురుల రక్ష గలిగినవనుచున్
  విడువక కుంకుడు రసమును
  తడ బడక తలంటు కొనగతలతురు విధిగా|

  రిప్లయితొలగించండి

 10. M]
  ఆ.వె:రుగ్మతలను బాపు రుద్దుకొనంగ కుం
  కుళ్ళ రసము తోడ ;కురుల సొబగు
  హెచ్చు ననగ తడవు యేల త్వర పడుడు
  కాంతలార మేని కాంతు లీన.

  కుంకుడు రసమున్న కురులకు సొగసౌను
  జుత్తు పెరుగు చుండు నొత్తుగాను
  తరతరముల నుండి తరుణల కెల్లను
  చక్కనైన కేశసంపదిదియె.

  పడతులకెల్లరకిలలో
  కడుముఖ్యమటంచునెంచి కళవళ పడకన్
  విడువక కుంకుడు రసమున్
  తడయక తలపైనవేయతంపును గలుగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘తడవు+ఏల’ అన్నపుడు యడాగమం రాదు. ‘హెచ్చు ననగను తడ వేల త్వరపడుడు’ అనండి.

   తొలగించండి
 11. కూరజేయు సుఖము కుంకుడు కాయలు
  సుండ్రునుండి తలను సుద్ధిజేసి
  దురదపోక్కులన్ని తొలగిపోవును
  సుమ్మ
  దానిరసముతోడ తప్పకుండ

  రిప్లయితొలగించండి
 12. బింకముతో చిన్నప్పుడు
  కుంకుడు కాయల రసమును కుందుచు వాడన్
  సంకటమై కండ్లు కమిలి
  చింకిరియై నాదు జుత్తు చిడిముడి చేసెన్!

  రిప్లయితొలగించండి