నాకు తెలిసినంత వరకు తమాటాలు, రామములక పండ్లు వేరు వేరు. రామములకలు చిన్నగా గుండ్రంగా పిల్లలాడుకొనే గోళీకాయల్లా ఉంటాయి. తెలంగాణాలో వీటిని వేరువేరుగా గుర్తిస్తారు. రామములకలను ఎవరూ పండించరు. చేల గట్టుల్లో స్వేచ్ఛగా పెరుగుతాయి.
అన్నా! ఇదంతా మీ ప్రెరణతో మీ అడుగులో అడుగు వేసికొంటూ నడక నేర్చుకుంటున్నాను. మీ కామెంట్ నాకు టానిక్కులా పనిచేతుంది. గురువుగారికి మీకు మనఃపూర్వక ధన్యవాదములు.
రంగు లీనెడు టమాట రసము మెండు
రిప్లయితొలగించండిమంచి ఔషధ గుణమంట యెంచి జూడ
కంటి జబ్బులు నయమౌను కలత వలదు
సర్వ రోగని వారణి పర్వ మనగ
అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. రంగు లీనునట్టి తమాట... అనండి.
'పర్వము'...?
పద్యము చాలా బాగుంది అక్కయ్య గారు."సర్వ రోగని వారణి యుర్వి ననగ" అనండి బాగుంటుంది.
తొలగించండిరంగు లీనునట్టి తమాట రసము మెండు
తొలగించండిమంచి ఔషధ గుణమంట యెంచి జూడ
కంటి జబ్బులు నయమౌను కలత వలదు
సర్వ రోగని వారణి యుర్వి ననగ
---------------------------
గురువులకు కామేశ్వర రావుగారికి ధన్య వాదములు
క్షమించాలి " పర్వము = పండుగ { ఆరోగ్యం బాగుంటే పండుగే గా ? " అదన్నమాట అసల్ సంగతి }
రిప్లయితొలగించండివగలాడివోలెబండ్లవి
నిగనిగతోమెరయుచుండెనీరజ!కంటే? లగనముదగ్గరయాయెను సగమున్గలపండ్లదెమ్ముచారునవేతున్
చిత్ర!చూడుటమాటలుచిత్రమందు
తొలగించండినెంతయోనిగనిగలతోవింతగొలిపె
దోరపండ్లవితినగనునూరుచుండె
నాదువక్త్రముతెమ్ముమానాల్గుపండ్లు
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిచట్ని నుప్మాను పప్పునన్ చారులోను
రిప్లయితొలగించండిరుచిని పెంచును కూరలన్ రోజు రోజు
రాజు కూరలలోజూడ రామములగ
తేట మాటల జెప్పితి తే!టమాట.
తే'టమాట'ల మీ పద్యం చాలా బాగుంది. తమాట మన దేశపు పంట కాదు. విదేశీయులు తెచ్చినదే. 'రామములగ' పండు మనది. దానిని ప్రస్తావించారు. సంతోషం.
తొలగించండికొన్ని ప్రాంతాల్లో టమాటను రామమునగ అనడం కద్దు. మా నాన్నగారు దీన్ని పుల్లొంకాయ (పుల్ల వంకాయ) అనేవారు.
తొలగించండిశాస్త్రిగారూ మీపద్యం ఉప్మాలో చట్నీ నల్చుకుని తింటున్నట్లుగా బలేఉంది.
నాకు తెలిసినంత వరకు తమాటాలు, రామములక పండ్లు వేరు వేరు. రామములకలు చిన్నగా గుండ్రంగా పిల్లలాడుకొనే గోళీకాయల్లా ఉంటాయి. తెలంగాణాలో వీటిని వేరువేరుగా గుర్తిస్తారు. రామములకలను ఎవరూ పండించరు. చేల గట్టుల్లో స్వేచ్ఛగా పెరుగుతాయి.
తొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారు నమస్సులు.. తేటమాట తే టమాట మీవిరుపు ప్రయోగం అద్భుతం. పూరణలో ఎక్కడో ఒక చోట మీ మార్కు గోలి ఖచ్చితంగా తగులుతుంది. అభినందనలు.
తొలగించండిశంకరయ్యగారూ...నమస్సులు. టొమాటోలు విదేశీజాతి వంగడమైన మన రామముల(న)గలే.
తొలగించండిశంకరయ్యగారూ...నమస్సులు. టొమాటోలు విదేశీజాతి వంగడమైన మన రామముల(న)గలే.
తొలగించండిమాస్టరుగారికీ, మిస్సన్నగారికీ ధన్యవాదములు. శర్మగారూ ! బహుకాల దర్శనం....ధన్యవాదములు.
తొలగించండిఆలుమగలుల యనుబంధ మల్లి నటుల
రిప్లయితొలగించండినిమిడి, రుచినిడు గూరల నిచ్చగించి,
ప్రతి దినంబును వాడెడి అచ్చమైన
రామములగలు నిజమవి రసఫలములు!
అన్ని కాలంబు లందున మన్ని నిలచి
రిప్లయితొలగించండియమరు నాదరు వగునది యన్నమునకు ,
అద్భుతంబగు శాకంబు అవని పైన
రమ్య రుచిరాజ ఫలమది రామములగ!
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిభూదేవి రత్న సన్నిభ
రిప్లయితొలగించండిమోదక సదృశములు ముగ్ధ మోహన రుచులన్
ఖాదన శాక విశేషము
స్వాదు రుచి సుసంహి తామ్ల శాకము లవియే
మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండికామేశ్వర రావుగారూ.....నమస్కారములు...మీ పద్యమందలి వినూత్న వర్ణనలు హృద్యముగా నున్నవి
తొలగించండికామేశ్వర రావుగారూ.....నమస్కారములు...మీ పద్యమందలి వినూత్న వర్ణనలు హృద్యముగా నున్నవి
తొలగించండిశర్మ గారు నమస్కారము. ధన్యవాదములండి.
తొలగించండికామేశ్వర రావుగారూ!నమస్కారములు.ఏసమస్యాపూరణనైననూ సంస్కృతపదనిచయముగా మీ ప్రయోగములత్యంత శోభ గూర్చుచున్నవి. హృదయాభినందనములు..
తొలగించండిబాలసుబ్రహ్మణ్య శర్మ గారు నమస్కారములు. మీకు హృదయపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅన్ని వేళలందు అందరిష్ట పడెడి
రిప్లయితొలగించండిచక్కనైన పండు జగతియందు
కొత్తిమెరతొ కలిపి కూరలలో వేయ
నావురావు రనుచు నారగింత్రు.
సకల జనులు మెచ్చు సహజశాకమిదియె
పలురకంబులుగను వండ వచ్చు
చిన్నముక్కలుగను చేసి పచ్చడి చేయ
తినగ రండు మీరు తీరుబడిగ.
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘కొత్తిమెరను కలిపి...’ అనండి.
పెరటిలో నందరు పెంచుచుంద్రు
రిప్లయితొలగించండికూరలన్నిటికిని రుచి కూరజేయు
పప్పుసాంబారులకునిడు నొప్పిరుచిని
పేదవారల యిండ్లలో పెన్నిదిదియె
noppu ruchini
రిప్లయితొలగించండిperaTi tOTalO
రిప్లయితొలగించండిసవరణలతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
తొలగించండి‘పెన్నిధి+ఇది’ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘పెన్నిధి యిది’ అనండి.
ఎఱ్ఱగా పండిన వెంచుక కొనిదెచ్చి
రిప్లయితొలగించండి.....యూరుగాయను జేయ నూరు నోరు
దోరకాయల నెంచి చేరిచి కొతిమిర
.....పచ్చడి జేసిన మెచ్చు జిహ్వ
గరిటెజారెడు రీతి కందిపప్పును జేర్చి
.....కళపెళా యుడికింప కలుగు రుచులు
లేతపిందెల దెచ్చి ప్రీతిగా పచ్చడి
.....బద్దలు చేసిన బహుపసందు
చారు సాంబారు పులుసున చేరి మించు
కలుప బంగాళదుంపకు ఘనమె యగును
మేలు మధుమేహులకు నని మేటిమాట
మంచి జాణవు నీవో టమాట! నుతులు.
సీసపద్యంలో తమాట ప్రయోజనాలన్నీ చక్కగా వివరించారు. బాగుంది పద్యం. అభినందనలు.
తొలగించండినన్నార్జీ గారికి నమస్సులు. కాయలు చూస్తేనే నోరూరుచుండ మీపూరణ దాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. అభినందనవందనము.
తొలగించండిమేటి పద్యంబు జెప్పిన మీకు నుతులు
తొలగించండిమేటి పద్యంబు జెప్పిన మీకు నుతులు
తొలగించండిగురువుగారికి, తమ్ముడు శర్మకి, శిష్ట్లా శర్మ గారికి ధన్యవాదములు.
తొలగించండిగురువుగారికి, తమ్ముడు శర్మకి, శిష్ట్లా శర్మ గారికి ధన్యవాదములు.
తొలగించండిమిస్సన్న గారూ ! టమాటను ఇన్నిమాటలతో "ఉడికించారు"
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరామనామ రుచిని రసనకుజూపించి
రిప్లయితొలగించండికాంచనంపు రుచిర కాంతులీను
రామములగ దేశ రత్నంబెచూడగా
కలలపంట మనదు కర్షకులకు.
మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.
తొలగించండికృతజ్ఞతలండి.
తొలగించండికృతజ్ఞతలండి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘అందుబాటుగ+ఉన్న=అందుబాటుగ నున్న; విందు+అగును=విందగును’ అవుతాయి. ‘అందుబాటుగ గడు విందుసేయు’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘జగడ మయ్యె’ అనండి.
అమెరికా “పెరునియా” యందు పుట్టిపెరిగి
రిప్లయితొలగించండివ్యాప్తినొందె”టమాట” వసుధ యందు
లవ్ యాపి లందురు లైంగికారోగ్యము
నిచ్చును త్తేజము నింపునింపు
అలసిసొ లసినంత యధిక పుష్టిని యిచ్చు
రసమునొక్క గ్లాసు త్రాగి నంత
మధుమేహ, మెసిడిటి, మాయమవ్వగ మందు
బలపడ నెముకలు, పక్షవాత,
మధికభా రము తగ్గు ,క్యాన్సరు పోగొట్టు ,
రక్తపీ డన,తగ్గ రక్ష చేయు
గుండెజబ్బు,కు మంచి గుణము చేకూర్చును
నేత్రరో గములకు, నేటి మందు
చర్మ సౌం దర్యము ,చక్కగా నుండును
రోగని రోధక, రూపమగుచు
“రామము నగ” యంచు ప్రేమగ బిల్తురు
కన “సీమ రేగు” ” తక్కాళి” యంచు
యాంట్యా క్సిడెంటుగ, యాక్టుచే యుచునుండు
ఔషధీ గుణముల, నలరు చుండి
రసము, సాంబారు, పచ్చడి, పసను పెంచు
ఊరగాయగ నుండినోరూర జేయు
సకలజన గృహాలంకార సార్వజనిక
రామమునగ యన తెనుగా రామ మందు
తమాట యొక్క పుట్టుపూర్వోత్తరాలు, ప్రయోజనాలు అన్నీ చక్కని సీసంలో పొందుపరిచారు. చాల బాగుంది. అభినందనలు.
తొలగించండితమ్ముడూ టమాటపై సమగ్ర పరిశోధన చేశావా? సూపర్ సీసం!
తొలగించండితమ్ముడూ టమాటపై సమగ్ర పరిశోధన చేశావా? సూపర్ సీసం!
తొలగించండిఅన్నా! ఇదంతా మీ ప్రెరణతో మీ అడుగులో అడుగు వేసికొంటూ నడక నేర్చుకుంటున్నాను. మీ కామెంట్ నాకు టానిక్కులా పనిచేతుంది. గురువుగారికి మీకు మనఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిశర్మా గారూ ! ఏమాటకామాటే..ఇన్ని మాటలు ఇన్ని మాట్లు చెప్పినతర్వాత కూడా టమాటా తినని వాడి నేమాటనాలి.
తొలగించండిశ్రీకందిశంకరయ్యగురువర్యులకు సవరించినపద్యములు
రిప్లయితొలగించండి29.4.16.రామమునగ చారు సామాన్య జనులకు
అందుబాటుగకడువిందు సేయు |
నిత్యసుఖము బంచునిరుపేద రక్షణ|
పల్లెవాసులకది-ముల్లెయగును.
2.పండుటమోటాల కండగ నిండుగ గనుపించ రైతుకు కలల పంట
పసుపు కాయలుజూచి పరవసించగ రైతు పసిడి పంటయనుచు పడతి బలికె.
రైలు నాపెడిరంగు రంగరించెడిపొంగు గిట్టుబాటు ధరలు పట్టుదప్ప?
అమ్మబోవగ డబ్బు ఆదరించని జబ్బు కొనబోవ ప్రజలకు కొరివి ధరలు
మధ్యవర్తుల లాభ మీమధ్య బెరుగ?నష్టబోయెను రైతన్న పుష్టిలేక
జనులకందని ధరలతో జగడ మయ్యె రామమునగ రైతులకుసరాగమటుల
రుచికర మైన కూరలకు రూపము,రంగు-టమోట బెంచగా
రిప్లయితొలగించండిసచివులు మెచ్చకుందురటె? సర్వేజనాళికి మోదమివ్వదా?
పచనము నందు పద్దతుల పక్వత బెంచ పసందు గూర్చ-సద్
వచనము రీతిగా రుచిగ వండిన?కండను బెంచుమార్గమౌ.
పప్పుకట్టులోన పండు మాగినయట్టి
రిప్లయితొలగించండియీ టమాట పళ్ల గోట చిదిమి
రసముఁ గలిపి చేయు రసపూరితమ్మైన
చారుఁ దినగ లేని జన్మమేల?
లేలేత కొమ్మల లీలగా మెరియుచు
రిప్లయితొలగించండి…………పాలికాపుకు నీవె పచ్చ గాదె
రత్నగర్భ నుదుట రత్నమై రాజిల్లు
………….కల్పతరువె నీవు కర్షకులకు
నీవు లేక రసము నిరసింతు రందరు
…………నిన్ను కలుప పప్పు నిత్యమలరు
నిలువ పచ్చడి బెట్ట నీసాటి లేదిల
………నీదు సూపును ద్రాగ నిండు బలము
రైసు సాంబారు కూరయు రసము లందు
చట్ని శాండువిచ్ పిజ్జాయు ఛాటులందు
ఎట్టి వంటలోనయిన తానిట్టె యొదిగి
రాణియై చెలగు టమాట రసను జూడ!!!
శైలజగారూ దోరటమాట లాటి మవోజ్ఞమైన సీసాన్నిఅందించారు. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు సర్..మీ పద్యము చదివిన స్ఫూర్తితో ఇలా వ్రాయాలనిపించింది.. లేటుగా వ్రాసాను గురువుగారు చూడరేమో అనుకున్నా.. మీరు చూసారు కృతజ్ఞతలు....
తొలగించండిశైలజ గారూ,
తొలగించండిఅన్ని రచనలలోనఁ దా నమరి యొదిగి
రాణియై వెల్గు పద్యమున్ వ్రాసినావు
మధుర భావ సుశబ్ద సంభరిత మగుచు
శైలజా! నీ కవిత్వము సరస మగును.
ప్రణామములు గురువుగారు... పద్యరూపంలో మీ ఆశీస్సులు పొందినందుకు చాలా సంతోషంగా వుంది..ఇదంతా మీరు పెట్టిన బిక్షే..చాలా చాలా కృతజ్ఞతలు..
తొలగించండికూరలకు:
రిప్లయితొలగించండిఉల్లి పాయ యంట చల్లని మిత్రుడు
శత్రు వంట టమట సకలమునకు...
ఉల్లి యిచ్చు తనదు మల్లెల వాసన
టమట యిచ్చు తనదు యమపు రంగు :)