ఒక చిన్నమాట, మొన్నటి సమస్య గురించి. యముఁ గని జను లెల్ల మోద మందెదరు భువిన్ గురించి మా మావయ్యగారు శ్రీ ప్రసాద్ ఆత్రేయ గారితో నేను జరిపిన లేఖా చర్చను ఈ టపా రూపంలో శ్యామలీయంలో ఉంచాను. ఆసక్తి కలవారు దయచేసి అక్కడ పరిశీలించ గలరు. ధన్యవాదాలు.
కావరము చేత ద్రౌపది కరముబట్టి నెత్తు కొనిపోవు సైంధవున్ చిత్తుజేసి కట్టి తెచ్చిన భీముని కాదటంచు కట్లు విడదీసె ధర్మజు కరుణ జూపి త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు!!! 1
మరియొక పూరణ
మేత లేదని పశువుల మేలుమరచి కటికె వానికి నమ్మిరి కర్షకులును అట్టివేళలో ఎవడైన అడ్డు కొనుచు త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు! 2
బండికాడి అంజయ్య గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో ‘కరము బట్టి +ఎత్తుకొని’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘ధర్మజు’ అని డుప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘కట్లు విడదీసె ధర్మజుం డట్లు వాని’ అందామా? రెండవ పూరణలో ‘కర్షకులును+అట్టి’ అని విసంధిగా వ్రాశారు. ‘కర్షకాళి| యట్టి...’ అందామా?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘వర్గములు+ఎ’ అన్నపుడు యడాగమం రాదు. ‘వసుధలో నరుని యరిషడ్వర్గము లవి| పతనమునకు...’ అనండి. రెండవపూరణలో ‘పాశము’ టైపాటు వల్ల ‘పాషము’ అయింది.
గుండు మధుసూదన్ గారూ, శ్రమకోర్చి వాట్సప్‍లో కవిమిత్రులకు మన బ్లాగును పరిచయం చేసి, వారు వాట్సప్‍లో పెట్టిన పూరణలను పరిష్కరించి బ్లాగులో పోస్ట్ చేస్తూ పద్యకవిత్వానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ధన్యవాదాలు.
ఇది నాకొక మహద్భాగ్యంగా భావిస్తున్నాను శంకరయ్య గారూ! మన ధ్యేయం ఒక్కటే కదా! "తెలుఁగుఁ బద్యంబు నిత్యమై తేజరిల్లు" సాంప్రదాయిక పద్య కవితను నిలబెట్టడమే మనకు కావలసినది. ఇలా ఈ యజ్ఞంలో పాలుపంచుకో గల్గుతున్నందుకు నేను గర్విస్తున్నాను. కృతజ్ఞతలతో...
బాల్యమందున చేసెడు పనుల వల్ల బాల వధువులు విధవలై బాధపడగ గొప్ప సంస్కర్త యరుదెంచి కూర్మిఁబలుపు త్రాడు తెంపు పురుషుండు దైవసముడు. శిలగ మారిన సుదతిని స్త్రీ మార్చి గాది సుతుడొనరించుయాగమును పూర్తి చేసి జనకుని సభలోన శివుని ధనువు త్రాడు తెంపు పురుషుడు దైవసముడు.
ఆత్మ పరమాత్మ లనడుమ నడ్డుగోడ
రిప్లయితొలగించండి“మాయ” యను బంధనముగాదె మానవునకు
మూలమౌ నరిషడ్వర్గ ములనబడెడి
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవసముఁడు
అరిషడ్వర్గ సూత్రచ్ఛేదనమును గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమనుజ జన్మకు గావలె మదిని భక్తి
రిప్లయితొలగించండినీది నాదను భావన నీడ వీడి
పంచ క్లేశము లనెడిఈ బంధ నముల
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు
అక్కా!
తొలగించండిపంచక్లేశాల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘క్లే’ వల్ల ‘చ’ గురువై గణదోషం. ‘పంచసంతాపము లనెడి బంధనముల’ అందామా?
మనుజ జన్మకు గావలె మదిని భక్తి
తొలగించండినీది నాదను భావన నీడ వీడి
పంచ సంతాపము లనెడి బంధ నముల
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు
ధన్య వాదములు
ఆత్మయందున నొగ్గిన అఘమునంత
రిప్లయితొలగించండియణచి వేయగ మనసునందగ్గలించి
భవము, మరణమ్ము మధ్యలో బంధనముల
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు!
భవబంధాలను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిదక్కె నెప్పుడో మనకు స్వాతంత్ర్య లక్ష్మి
రిప్లయితొలగించండివీడ లేదింక నప్రాచ్య పీడ మనను
భరత మాతకు పాశ్చాత్య బంధనాల
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవసముఁడు.
దాస్యబంధనాలను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపరమమూర్ఖునిగనిలనుబరగుగాదె! త్రాడుదెంచినపురుషుండు,ధైవసముడు కష్టమేమియుభార్యకుగలుగకుండ కంటికినిరెప్పవోలెనుగాచుభర్త
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిరయమును జేరు నెవరైన నిశ్చయముగ
రిప్లయితొలగించండిత్రాగితిరుగుచు తాను సతమ్ము సతిని
త్రాడు దెంచిన పురుషుండు, దైవసముడు
వ్యసనములవీడి శుద్ధిగా బ్రతుకువాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాన భంగాలు హత్యలు మాన కుండ
రిప్లయితొలగించండిసంఘ విద్రోహ శక్తియై సాగునట్టి
నరకు డుండుట తగదంచు నట్టి వాడి
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు
డా.ఎన్.వి.ఎన్.చారి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒక చిన్నమాట, మొన్నటి సమస్య గురించి. యముఁ గని జను లెల్ల మోద మందెదరు భువిన్ గురించి మా మావయ్యగారు శ్రీ ప్రసాద్ ఆత్రేయ గారితో నేను జరిపిన లేఖా చర్చను ఈ టపా రూపంలో శ్యామలీయంలో ఉంచాను. ఆసక్తి కలవారు దయచేసి అక్కడ పరిశీలించ గలరు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిAdbhutamaina vivarana. Dhanyavadamulu.
తొలగించండిసుకవి మిత్రులు తాడిగడప శ్యామలరావు గారూ...నమస్సులు....ధన్యవాదాలు!
తొలగించండిశ్యామల రావు గారూ,
తొలగించండినా సందేహాన్ని తీర్చడమే కాక, సమస్యాపూరకులకు ఉపయోగపడే పూరణా విధానాలను వివరించిన మీ మామయ్య శ్రీ ప్రసాద్ ఆత్రేయ గారికి, మీకు ధన్యవాదాలు.
మగడు మరణించ బానిస మృగములైన
రిప్లయితొలగించండితద్వితంతు వివాహముల్ తగునటంచు
పూనె వీరేశలింగమ్ము తానె, పలుపు
త్రాడు దెంచిన పురుషుండు దైవసముఁడు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితే**
వెట్టి చాకిరి జేయుచు వెతల నొంది,
యాలు పిల్లల కగుపడ నాస లేక,!
నరక కష్టము బొందెడి నరుని,,వెతల
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు.!!
🌺🙏🌺
అంబటిభానుప్రకాశ్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రూరులు ధన మోహ మద వికారుల చెలి
రిప్లయితొలగించండిమి నత డక్కట దారుణ మిత్ర వంచి
తుండు శిక్షితుడైన నిర్దోషికి యురి
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవసముఁడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమానుషాదులు, స్త్రీలకు మానభంగ
రిప్లయితొలగించండిమాచరించెడి వారలు యజ్ఞములను
ధ్వంస మొనరింప జేసెడి దనుజ సతుల
త్రాడు దెంచిన పురుషుండు దైవసముఁడు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండితాటకను దున్మి, ఱాతినిఁ దరుణిఁ జేసి,
సీతఁ బెండ్లాడి, వని కేఁగి, సీతఁ గొనియు
లంక నునిచిన దనుజుని రాణి గళపుఁ
ద్రాడుఁ ద్రెంచిన పురుషుండు దైవ సముడు!
మంచి పూరణ చేశారు. అభినందనలు. దైవ సముడే కాదు సాక్షాత్తు దైవమే.
తొలగించండిమధుసూదన్ గారు చిన్న సందేహము. గళము+ త్రాడు= గలపు త్రాడు కర్మధారయ సమాసము గద దృతమునకులోపము రాదా? సందేహ నివృత్తి జేయగోర్తాను.
తొలగించండిసుకవులు కామేశ్వర రావు గారూ...నమస్సులు...ధన్యవాదములు!
తొలగించండిచిన్నయసూరి గారి యీ సూత్రాన్ని చూడండి...
సూ. సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుం బుంపులకుం బరుష సరళంబులు పరంబులగు నపుడు నుగాగమంబగు.
ఉదా:
పున్నెము + పస...పున్నెపు + పస...పున్నెపు + న్ + పస...పున్నెపుఁ బస
గరళము + త్రాడు...గరళపు + త్రాడు...గరళపు + న్ + త్రాడు...గరళపుఁ ద్రాడు
ఇప్పుడు అవగతమైనదా మిత్రమా.
స్వస్తి.
కామేశ్వర రావు గారూ...మీ రన్నట్లుగా శ్రీరాముఁడు సాక్షాత్తు దైవమే యైనను నతఁడు నరావరాతమున నున్నాఁడు గదా! అందుకే దైవ సముఁ డతఁ డనఁబడుచున్నాఁడు!
తొలగించండిచిన్నయసూరి గారి సూత్రమును దెలిపి సందేహ నివృత్తి జేశారు. ధన్యవాదములు. “దైవసము”డన్న దానిలో నా కెట్టి యభ్యంతరము లేదు. దైవము కూడాయని నా మతము.
తొలగించండిదైవమే యగుచో రావణుఁడు చావఁడు. వరబల మటు లున్నది. కాన, శ్రీరాముఁడు నరుఁడే యనవలెను. అందుకే యతఁడు దైవసముఁడు.
తొలగించండిమధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దైవసముడు’ అన్నదానికి మీ సమర్థన ఆమోదయోగ్యం. సలక్షణంగా, సాధికారంగా సుశబ్ద ప్రయోగం మీ సొత్తు.అభినందనలు.
మధురకవీ! మీ పూరణ మహాద్భుతం...చాలా బాగుంది
తొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించండిధన్యవాదాలు శిష్ట్లా వారూ!
తొలగించండిమొసలి వంకను నదిలోన మునుగబోయి
రిప్లయితొలగించండితల్లి యానతి గైకొని తక్షణంబె
సన్న్యసింపగ నడ్డమౌ జంధ్య మనెడు
త్రాడు దెంచిన పురుషుండు దైవసముడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేపూరి శ్రీరామారావు గారి పూరణము:
రిప్లయితొలగించండిముదిత జానకి మదినిల్చు పూరుషుండు
రామచంద్రుడు దశరథ రాజ సుతుడు
వచ్చి యా స్వయంవరపు ధన్వమును ద్రుంచి
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు!
చేపూరి శ్రీరామారావు గారూ, (శీరాం కవి గారు, మీరు ఒకరేనా?)
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరయ్యగారూ...చేపూరి శ్రీరామారావు ... శ్రీరామ్ ...రెండు పేర్లూ ఒక్కరివే!
తొలగించండిబీటుకూరు శేషుకుమార్ గారి పూరణము:
రిప్లయితొలగించండినాదు దుఃఖంబు బాపుట నాయ మనుచు
దయను గురిపించి మురిపించ దలచి నేడు
వలపు జూపుచు వచ్చి నా పంజరంపు
ద్రాడు ద్రెంచిన పురుషుండు దైవసముడు!
బీటుకూరు శేషుకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బండికాడి అంజయ్య గారి రెండు పూరణలు:
రిప్లయితొలగించండికావరము చేత ద్రౌపది కరముబట్టి
నెత్తు కొనిపోవు సైంధవున్ చిత్తుజేసి
కట్టి తెచ్చిన భీముని కాదటంచు
కట్లు విడదీసె ధర్మజు కరుణ జూపి
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు!!! 1
మరియొక పూరణ
మేత లేదని పశువుల మేలుమరచి
కటికె వానికి నమ్మిరి కర్షకులును
అట్టివేళలో ఎవడైన అడ్డు కొనుచు
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు! 2
బండికాడి అంజయ్య గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. అభినందనలు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘కరము బట్టి +ఎత్తుకొని’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘ధర్మజు’ అని డుప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘కట్లు విడదీసె ధర్మజుం డట్లు వాని’ అందామా?
రెండవ పూరణలో ‘కర్షకులును+అట్టి’ అని విసంధిగా వ్రాశారు. ‘కర్షకాళి| యట్టి...’ అందామా?
అమరవాది రాజశేఖర శర్మ గారి పూరణ:
రిప్లయితొలగించండిదొంగతనమును తలమోపి రంగినింట
స్తంభమునగట్టి బాధించ తాతగారు
కట్టు తెంచిన నారంగి కరము మోడ్చె
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవసముడు!
అమరవాది రాజశేఖర శర్మ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సారసాక్షికి నె౦చ నీ జగతి య౦దు
త్రాడు మెడలోన ముడివేయ ధవు డత౦డె |
మగ డయిష్టత జె౦దుచు మధ్య లోన
త్రాడు దె౦చిన , పురుషుడు దైవ సము డ
ట౦చు నతని మార్చ౦గ బ్రయత్న మూన -
వలయు నర్ధా౦గి > సహనదేవతగ నగుచు |
…………………………………………………
కనుడు " నా పేరు మీనాక్షి " యనెడు కథను
దూర దర్శను న౦దున మీరు కూడ
……………………………………………………
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘అయిష్టత’ కాదు ‘అనిష్టత’ అనడం సాధువు.
జాతి కులమత భేదాలు జగములోన
రిప్లయితొలగించండిపెరుగు చుండెను శాంతియు తరుగుచుండె
ప్రబలమైన దురాచార బంధనాల
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివ్యసన మన్నది బంధ మై వ్యతలునింప?
రిప్లయితొలగించండిపతనమందున పయనమే పద్దతగును
.అట్టిసంబంధ బంధమే గట్టి దనెడి
త్రాడు తెంచిన పురుషుడు దైవసముడు|
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘పద్ధతి+అగు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘పద్ధతి యగు| నట్టి...’ అనండి.
గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ .
రిప్లయితొలగించండిమొదటి పూరణ:
నిండు వేసవి దినముల నీరు లేక
తల్లడిల్లెడి జనములు త్రాగుటకును
ప్రభుత బంపిన ట్యాంకరు పంపు మూత
త్రాడు త్రెంచిన పురుషుండు దైవ సముడు!
రెండవ పూరణ:
ప్రేమఁ, జదువున, బతుకు, పరీక్షలోన
నెదురు దెబ్బలు దగులగ బెదురు జెంది
యురిని బిగియించు కొనబోవు వాని మెడను
త్రాడు త్రెంచిన పురుషుండు దైవ సముడు!
గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వసుధలో న నరుని యరిషడ్వర్గములుయె
రిప్లయితొలగించండిపతనమునకు మూల మనుట వాస్తవమ్ము
నిగ్రహమ్మును జూపుచున్ నేర్పుతోడ
తాడు ద్రెంచిన పురుషుండు దైవ సముడు
ఆలు బిడ్డలు స్నేహితులనెడు ప్రేమ
పాషమందున బంధియై వసుధ నరుడు
పాపి యై చరించునిజము పాషమనెడు
తాడు ద్రెంచిన పురుషుండు దైవసముడు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘వర్గములు+ఎ’ అన్నపుడు యడాగమం రాదు. ‘వసుధలో నరుని యరిషడ్వర్గము లవి| పతనమునకు...’ అనండి.
రెండవపూరణలో ‘పాశము’ టైపాటు వల్ల ‘పాషము’ అయింది.
గురిజాల వి వి ప్రసాద్ గారి పూరణ:
రిప్లయితొలగించండికరవు రక్కసి కోరలు కరము సాచ
కంట నీరు కురిసె రైతు పంట రాక
యప్పుతీర్చలేక మెడకు నల్లిన యురి
త్రాడుఁ ద్రెంచిన పురుషుండు దైవ సముడు!
గురిజాల వి వి ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిసాధు పుంగవు లెల్లరు చక్కగాను
బోధనమ్ములు చేయుచు పుడమియందు
బంధనమ్ములనెడి భవపాశములను
త్రాడు తెంపు పురుషుండు దైవ సముడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘బంధనములు, పాశములు, త్రాళ్ళు’ పునరుక్తి దోషం ఉందేమో?
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిశ్రమకోర్చి వాట్సప్‍లో కవిమిత్రులకు మన బ్లాగును పరిచయం చేసి, వారు వాట్సప్‍లో పెట్టిన పూరణలను పరిష్కరించి బ్లాగులో పోస్ట్ చేస్తూ పద్యకవిత్వానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ధన్యవాదాలు.
ఇది నాకొక మహద్భాగ్యంగా భావిస్తున్నాను శంకరయ్య గారూ! మన ధ్యేయం ఒక్కటే కదా!
తొలగించండి"తెలుఁగుఁ బద్యంబు నిత్యమై తేజరిల్లు"
సాంప్రదాయిక పద్య కవితను నిలబెట్టడమే మనకు కావలసినది. ఇలా ఈ యజ్ఞంలో పాలుపంచుకో గల్గుతున్నందుకు నేను గర్విస్తున్నాను. కృతజ్ఞతలతో...
గుండు మధుసూదన్
(మధురకవి)
బాల్యమందున చేసెడు పనుల వల్ల
రిప్లయితొలగించండిబాల వధువులు విధవలై బాధపడగ
గొప్ప సంస్కర్త యరుదెంచి కూర్మిఁబలుపు
త్రాడు తెంపు పురుషుండు దైవసముడు.
శిలగ మారిన సుదతిని స్త్రీ మార్చి
గాది సుతుడొనరించుయాగమును పూర్తి
చేసి జనకుని సభలోన శివుని ధనువు
త్రాడు తెంపు పురుషుడు దైవసముడు.
మొసలి వంకను నదిలోన మునుగబోయి
రిప్లయితొలగించండితల్లి యానతి గైకొని తక్షణంబె
సన్న్యసింపగ నడ్డమౌ జంధ్య మనెడు
త్రాడు దెంచిన పురుషుండు దైవసముడు.
"ఓయమ్మ నీ కుమారుడు"
రిప్లయితొలగించండిగొల్ల భామల కుండలు గుల్ల చేసి,
ఉట్టి గొట్టుచు, సతతము మట్టి దినుచు,
గొంతు జూపుర నీవన వింత జూపి,
పొరుగుటమ్మలతో దెచ్చి పోరు...నాదు
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవసముఁడు :)