కవి వరేణ్యుడొకడు తన కావ్యమందు వెన్నెలను కురిపించెను వేడి గాను పూల వర్షమ్ము కురియగ న్నేల మురిసె మండు వేసవిఁ గ్రమ్మెను మంచు తెరలు కవులు తలచినన్ జాలదే కానిదేమి?
ఆంజనేయ శర్మ గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిపూరణలో ‘మదిని’ అనండి. రెండవపూరణలో ‘కాలమ్ముము’ అనరాదు. అది ‘కాలమ్మునకు’. అక్కడ ‘గ్రీష్మఋతువు కాలమ్మున కేది...’ అనండి. మూడవపూరణలో ‘తలచినన్ జాలును’ అనండి.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘వెన్నెల+అట’ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘పండు వెన్నెలలు కురియుచుండ..’ అనవచ్చు కదా!
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణకు ధన్యవాదములు.ముంద”వెన్నెలలు” అనే వ్రాసాను. అక్కడ అంటే బాగుంటుంది కదా యని యలా మార్చాను. అత్వ సంధి యెప్పుడూ సంశయాత్మకమే నాకు.
వట్టి వేళ్ళతో పరదాలు కట్టి నారు, మట్టి కుండలో నింపిరి మంచి నీరు , పడక గదిలోన చలినింపి వరుసగాను మండు వేసవి c గ్రమ్మెను మంచు తెరలు కొరుప్రోలు రాధా కృష్ణ రావు
మండె నెండలు తలమీద! మత్తు గ్రమ్మె,
రిప్లయితొలగించండికవివరులు నిదురన జారి కలలు గనెర !
మండు వేసవిఁ గ్రమ్మెను మంచుతెరలు
పండు వెన్నెల దెచ్చెను పరిమళములు :)
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘కలలు గనిరి’ అనండి.
గురువుగారికి ప్రణామములు
రిప్లయితొలగించండినిన్నటి నా ఉగాది పద్యములలో గల దోషాలను యెంతో ఓపికతో సవరించి నందులకు ధన్యవాదములు.
ఈ రోజు నా పూరణములు
వేళ దప్పియె తిరుగాడు విభుని పట్ల
నెలత కనుమాన బీజాలు మొలక లెత్త
శాంతి యనునదె కరువయ్యె సతికి మదిన
మండు వేసవిఁ గ్రమ్మెను మంచు తెరలు
గ్రీష్మ ఋతువున కాలమ్ము కేమి పేరు?
ముసురు కొనుటకు పర్యాయ మొకటి తెలుపు,
శిశిర మందున పుడమిని ముసురు నేమి?
మండు వేసవిఁ గ్రమ్మెను మంచు తెరలు.
కవి వరేణ్యుడొకడు తన కావ్యమందు
రిప్లయితొలగించండివెన్నెలను కురిపించెను వేడి గాను
పూల వర్షమ్ము కురియగ న్నేల మురిసె
మండు వేసవిఁ గ్రమ్మెను మంచు తెరలు
కవులు తలచినన్ జాలదే కానిదేమి?
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘మదిని’ అనండి.
రెండవపూరణలో ‘కాలమ్ముము’ అనరాదు. అది ‘కాలమ్మునకు’. అక్కడ ‘గ్రీష్మఋతువు కాలమ్మున కేది...’ అనండి.
మూడవపూరణలో ‘తలచినన్ జాలును’ అనండి.
తరణి వేడికి తరువులు కాలి పోయె
రిప్లయితొలగించండినీటి నదములు భాష్పమై నింగి కెగసె
మలయ మారుత మరుదెంచె హేల గాను
మండు వేసవిఁ గ్రమ్మెను మంచు తెరలు
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిత్ర భానుడొక వలను చెండు చుండ
రిప్లయితొలగించండిపయన మైతిని నేప ర ప్రాంతమునకు
చేరి మిలిపిటాసు ను కంటి చిత్రముగను
మండువేసవి గ్రమ్మెను మంచు తెరలు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ అమెరికా అనుభవాలను పూరణలలోనూ చూపిస్తున్నారన్నమాట! సంతోషం! మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎండ లెంతయొ మండగ నెల్ల జనులు
రిప్లయితొలగించండిఏసి కూలర్లు గొనగాను యిష్ట మలర
పవరు చార్జీల దడవక పండుకొనగ
మండు వేసవిఁ గ్రమ్మెను మంచుతెరలు.
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కొనగాను+ఇష్టము’ అన్నపుడు యడాగమం రాదు. ‘కొనసాగి రిష్ట మలర’ అంటే ఎలా ఉంటుంది?
యడాగమం తో పెద్ద పేచీ వచ్చేస్తోంది మాస్టారూ!!!!
తొలగించండి
రిప్లయితొలగించండిమండువేసవిగ్రమ్మెనుమంచుతెరలు హిమముతెరలుతెరలుగామహినిబడగను నంధకారబంధురమయ్యెనాకసంబు నేమియాపదవచ్చునోనెరుకకాదు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏండవేడిమి తాళక నేగి నేను
రిప్లయితొలగించండితెచ్చినానుర "ఏసీ"ని తెగువజేసి
గదిని బెట్టగ మాయింట, మదిని గూడ
మండువేసవి గ్రమ్మెను మంచు తెరలు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అక ప్రత్యయాంతావ్యయము కళ’. కనుక ‘తాళక యేగి’ అనండి.
మాస్టరుగారూ ! ధన్యవాదములు.మీరు చూపిన సవరణతో...
తొలగించండిఎండవేడిమి తాళక యేగి నేను
తెచ్చినానుర "ఏసీ"ని తెగువజేసి
గదిని బెట్టగ మాయింట, మదిని గూడ
మండువేసవి గ్రమ్మెను మంచు తెరలు
మండువా యింటి మధ్యన చెండుమల్లె
రిప్లయితొలగించండిదండ చేకొని మామిడి పండు తినుచు
పండు వెన్నెలట కురియు చుండ భళిర
మండు వేసవిఁ గ్రమ్మెను మంచుతెరలు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వెన్నెల+అట’ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘పండు వెన్నెలలు కురియుచుండ..’ అనవచ్చు కదా!
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణకు ధన్యవాదములు.ముంద”వెన్నెలలు” అనే వ్రాసాను. అక్కడ అంటే బాగుంటుంది కదా యని యలా మార్చాను. అత్వ సంధి యెప్పుడూ సంశయాత్మకమే నాకు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమండువా యింటి మధ్యన చెండుమల్లె
తొలగించండిదండ చేకొని మామిడి పండు తినుచు
పండు వెన్నెలనిండారియుండ భళిర
మండు వేసవిఁ గ్రమ్మెను మంచుతెరలు.
ధనము దేశమ్ము దాటించి దాచ, పెట్టు
రిప్లయితొలగించండిబడులఁ బెట్టిరని 'పనామ'ప్రతులుఁ జెప్ప
పదవులందున్న దేశాది పతుల భవిత
మండు వేసవిఁ గ్రమ్మెను మంచు తెరలు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అగ్ని గుండము గా మార నాంధ్ర భూమి
రిప్లయితొలగించండిమండు వేసవిఁ గ్రమ్మెను మంచుతెరలు
కురియ గా జేయ హిమమును '' కులు '' '' మనాలి ''
నరసి నవవధూవరు లందు నాట్య మాడ
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘గ్రమ్మెను’ తరువాత కామా పెడితే బాగుండేది.
రిప్లయితొలగించండిఎండలెప్పుడెక్కుడగునొ నెరుగ వోయి
చలియు మిక్కుటంబవ్వనేమిసంభవించు
కాలధర్మంబు కనులార గాంచవోయి
మండు వేసవందు మంచు గురియు.
తాప మధికమవును గను దారి నడువ
మండు వేసవందు :మంచు గురియు
గనుము హేమంత ఋతువందు కస్తి పడగ
చలికి వణకుదు రిలయందు జనులు నతిగ.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మొదటి పూరణ క్రమాలంకారంలో బాగుంది. ‘...డగునొ యెరుగవోయి’ అనండి.
రెండవపూరణ మొదటిపాదంలోని ‘గను’..? రెండవపాదంలో గణదోషం. పద్యం పూర్వార్ధంలో అన్వయం లోపించింది. సవరించండి.
అన్నయ్యగారూ నమస్తే.నిన్నటి పద్య పూరణమోసారి చూడగలరు.
రిప్లయితొలగించండిఅనయము మండెడి వేసవి
జనగణ బాధాకరము వసంతము వచ్చెన్
తనువునకుపశాంతి కల్గి తాపము
మనమున తగ్గగ ముదమది మంచిగ హెచ్చెన్
ఉమాదేవి గారూ,
తొలగించండిబాగుంది. కాని మూడవపాదంలో గణదోషం.
నవవసంతపు సంతను భవిత కొసగు
రిప్లయితొలగించండిమండువేసవి|”గ్రమ్మెను మంచుతెరలు
చెట్లనీడన చెంతన చెలియ గలియ
కుసుమ గంధాల బంధాన కునుకుదీయ|”
2.ప్రేమజంటను విడ దీయ?కాముకులకు
మండువేసవి| గ్రమ్మెను మంచు తెరలు
మల్లెపువ్వుల నవ్వుల మమతలందు
పల్లెపడచుల పలుకుల పరవశాన|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘సంతను’..? అది ‘సంతును’ అయి ఉంటుంది.
రిప్లయితొలగించండితాప మధికమవును గను దారి నడువ
మండు వేసవి,గ్రమ్మెను మంచు తెరలు
గనుము హేమంత ఋతువందు,కస్తి పడగ
చలికి వణకుదు రిలయందు జనులు నతిగ.
'తాపమధికమగును గను'(చూడు)అనేఅర్థంలో వ్రాశాను.
సరిపోదాండీ.
ఉమాదేవి గారూ,
తొలగించండి‘తాప మధిక మగు గనుము దారి నడువ’ అనండి.
వట్టి వేళ్ళతో పరదాలు కట్టి నారు,
రిప్లయితొలగించండిమట్టి కుండలో నింపిరి మంచి నీరు ,
పడక గదిలోన చలినింపి వరుసగాను
మండు వేసవి c గ్రమ్మెను మంచు తెరలు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
రాధాకృష్ణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరయ కాశ్మీరమందున నహరహమ్ము
రిప్లయితొలగించండికాల్పు లిరు పక్షముల రేగి కదన మనెడి
మండువేసవి గ్రమ్మెను. మంచు తెరలు
నలు దిశల హిమశైలమ్ము నలము కొనగ
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మంచు దుప్పటి మాటున మహిని జూడ
రిప్లయితొలగించండిపారవశ్యము కలిగించె ప్రతిదినమ్ము
శీతగాలులు వణికించి చిత్రముగను
మండువేసవి గ్రమ్మెను మంచుతెరలు
లంబసింగిన జూడంగ సంబరమయి
ఆంధ్ర కాశ్మీరమనిపించె నద్భుతముగ!!!
లంబసింగి (కొర్రుబయలు) = వైజాగ్ దగ్గర నున్న ఏజెన్సీ గ్రామం (వేసవి విడిది) దీనినే ఆంద్రా ఆంధ్రాకాశ్మీరు అంటారు..
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గ్రీష్మతాప ముపశమింప కేసరి చనె
రిప్లయితొలగించండికందరంబుల, గొనెను సుఖమ్ము; మనకు
తమిళదేశస్థమౌ "ఊటిఁ" విమలవాటిఁ
మండువేసవి గ్రమ్మెను మంచు తెరలు
దండివీరులై యుండియు పాండవాళి
రిప్లయితొలగించండివిధికి తలవంచి యోర్పుతో వేచినారు
కౌరవుల పని పట్టెడి కాలమునకు
మండు వేసవిఁ గ్రమ్మెను మంచుతెరలు.
ఎండ మావుల నీరము దండి గుండు
రిప్లయితొలగించండికొండ చరియల వంపున కొలను లుండు
పండు వెన్నెల కురియును నెండ లోన...
మండు వేసవిఁ గ్రమ్మెను మంచుతెరలు :)