కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్.
(ద-ధ-థ ప్రాస నిషేధం! ‘అధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర వైభోగముల్/భోగమ్ములన్’ అని మత్తేభ పాదంగా ప్రసిద్ధమైన ఈ సమస్యను కందపాదంగా మార్చాను)
(జ్వరం వల్ల నీరసం ఇంకా ఉంది. సంపూర్ణ ఆరోగ్యం చిక్కగానే ‘పద్యరచన’ శీర్షికను ప్రారంభిస్తాను)
బుధులగు వారలు నిరతము
రిప్లయితొలగించండివిధులను సక్రమము గాను వేయి విధమ్ముల్
పదుగురి మెప్పును పొందగ
అధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిబధిరుడొకడు తీవ్రముగా
విధిగన యేండ్లన తపస్సు విరివిగ జేయన్
అధిపుడయినాడు కలిగెను
అధికా రాంతమున జూడ నగు భోగమ్ముల్
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘విధిగన+ఏండ్లన’ అన్నపుడు యడాగమం రాదు. ‘విధిగా పెక్కేండ్లు తపసు విరివిగ...’ అనండి.
అధములు కొందరు పరిపరి
రిప్లయితొలగించండివిధముల వంచనలు చేసి విజయములందన్
బుధులగు వారలు తమతమ
యధికారాంతమున జూడనగుభోగమ్ముల్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి నమస్కారములు
రిప్లయితొలగించండిబుధులగు వారలు పోలీ
సధికారులుగాను జేరి సమయము నంతన్
విధినిర్వహణము జేసిన
యధికారాంతమున జూడనగు భోగమ్ముల్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘...జేసిన| నధికారాంతమున...’ అనండి.
రిప్లయితొలగించండివిధులనునేమియుజేయరు అధికారాంతమున,జూడనగుభోగమ్ము ల్లధికారముండునెడలను
నధికారములేనియెడలనన్నియుసున్నే
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది.
‘...జేయరు+అధికారాంతమున’ అన్నపుడు సంధి నిత్యం కదా! ‘...జేయరె| యధికారాంతమున...’ అనండి.
ద-ధ-థ ప్రాస నిషేధం!.......ఇదేమిటో అర్థం కాలేదండీ.
రిప్లయితొలగించండిసుకవి మిత్రులు మిస్సన్న గారికి మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఇచ్చిన సమస్యలో ప్రాసాక్షరము ’ధ’ మాత్రమే యుపయోగించవలెను. ఇతరములైన ద-థ లను వాడరాదు.
స్వస్తి.
ధన్యవాదములు మధుసూదన మిత్రమా.
తొలగించండిఅధికారములో వెలిగెడు
రిప్లయితొలగించండియధికారులు సుఖము లనక నార్జించుచు నా
విధులన్నిర్వర్తించిన
నధికారాంతమునజూడనగు భోగమ్ముల్
అధికారమున్న చాలు వి
విధరూపమ్ముననధములు విత్తము నొందన్
విధులలొ మునిగిన నేమిక
అధికారాంతమున జూడ నగు భోగమ్ముల్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ తాజా పూరణలు బాగున్నవి.
రెండవపూరణలో ‘విధులలొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘విధులను మునిగిన (షష్ఠ్యర్థంలో ద్వితీయ)’ అనండి.
శ్రీ శంకరయ్యగారికి నమస్సులు .ఆరోగ్యం సహకరించకున్నా, పద్యరచన పై మీకుగల మక్కువతో
రిప్లయితొలగించండివివిధ కవుల పద్యరచనలను సమీక్షిస్తున్న, అభినందనలిడుతున్న మీకు ధన్యవాదాలు .
పద్యరచనల సమీక్ష
న్నుద్యమముగ జరిపి నిరతముప్పొంగంగా
హృద్యమ మయ్యెను కద, కవి
కాద్యంతము కంది శంకరార్యా గనుమా !
నా పూరణ
అధికారము గలదని, తమ
విధి నిర్వహణము జరుపక, వివిధరకములన్
వ్యధలకు గురి చేయు, కుమతి
కధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్.
మిత్రులు భాగవతుల వారూ...మీరు ప్రయోగించిన ’వ్యధ’ అసాధువు. సాధువు...’వ్యథ’. ఇందులో ద-థ-ధ ప్రాస నిషేధింపబడినది. కావున ...సవరించగలరు. అన్యథా భావింపవలదని మనవి.
తొలగించండిమిత్రులు భాగవతుల వారూ...మీరు ప్రయోగించిన ’వ్యధ’ అసాధువు. సాధువు...’వ్యథ’. ఇందులో ద-థ-ధ ప్రాస నిషేధింపబడినది. కావున ...సవరించగలరు. అన్యథా భావింపవలదని మనవి.
తొలగించండిభాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మధుసూదన్ గారూ,
తొలగించండివ్యధ, వ్యథ రెండూ సాధువులే. ‘వ్యధ’ శబ్దాన్ని ‘శబ్దరత్నాకరం, వావిళ్ళ వారి సంస్కృతాంధ్ర నిఘంటువు’ పేర్కొన్నాయి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅధికార దుర్మదమ్మున
తొలగించండివిధి వంచిత నరు లనాథ విహ్వల మతు లి
వ్విధి బాధించిన దుష్టుల
నధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్.
విధి కృత్యమ్ములు సర్వ సమ్మతముగన్ వీక్షింప నేర్వంగకన్
బధిరుండై జనవాక్య సంహతికి వ్యాపారాకృతిం దాల్చియు
న్నధికాదాయము సంతతమ్ము గొను భ్రష్టాచార సందోహము
న్నధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర భోగమ్ములన్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వృత్తంలో పూరించినందుకు ప్రత్యేక ప్రశంసలు.
‘నేర్వంగకన్’ శబ్ద ప్రయోగమే చింత్యం. ‘వీక్షింపగా నోడియున్’ అంటే ఎలా ఉంటుంది?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణకు ధన్యవాదములు. నేర్వకన్; నేర్వంగ కు వ్యతిరేకార్థములో నేర్వంగకన్ వాడవచ్చనుకున్నాను.
తొలగించండివిధి కృత్యమ్ములు సర్వ సమ్మతముగన్ వీక్షింప గానోడియున్
బధిరుండై జనవాక్య సంహతికి వ్యాపారాకృతిం దాల్చియు
న్నధికాదాయము సంతతమ్ము గొను భ్రష్టాచార సందోహము
న్నధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర భోగమ్ములన్
విధిగా పోవు విభవములు
రిప్లయితొలగించండిఅధికారాంతమునఁ, జూడ నగు భోగమ్ముల్
అధికారము లో నుండగ
మధుసూధన! బొందునయ్య మానవుడిలలో!!!
విధులను నెరవేర్చుటలో
అధికారులు తాము కీర్తి నార్జించంగా
విధిగా దక్కును వారికి
అధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
మొదటిపూరణలో ‘విభవములు అధికార’మని విసంధిగా వ్రాశారు. ‘పోవును విభవము| లధికారాంతమున...’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిధి వెక్కిరించి నట్లగు
రిప్లయితొలగించండిసుధ చేజారిన విధమ్ము సోలును తనువున్
వ్యధ పెరిగెడి నెద బరువై
యధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్!!
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బుధులగు వారలు కొందరు
రిప్లయితొలగించండివిధులందు ప్రతిభను జూపి విజయంబంద
న్నధిపులమెప్పుల బడయుచు
నధికారాంతమున జూడనగగు భోగమ్ముల్.
బుధులగు వారలు కొందరు
రిప్లయితొలగించండివిధులందు ప్రతిభను జూపి విజయంబంద
న్నధిపులమెప్పుల బడయుచు
నధికారాంతమున జూడనగగు భోగమ్ముల్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
విధి నాల్కన్ బయలుంచి మాటికిని వెవ్వే యంచు కేరున్ గదా
రిప్లయితొలగించండిసుధలం జుర్రెడి వేళ పాత్ర నెవరో చూఱాడి నట్లే సదా
వ్యధతో గుండెలు మండిపోయి జనముల్ వైరాళియౌ సర్వదా
అధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర వైభోగముల్
మిస్సన్న గారూ,
తొలగించండివృత్తంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వ్యధలే తప్పవునింటన్
రిప్లయితొలగించండివిధిగా పరుగెట్టి రాదు పెళ్లామైనన్
మధురములాడరు మనుమలు
నధికారాంతమున జూడనగు భోగమ్ముల్!!!
మిత్రులు గుండా వారూ...నమస్సులు! వ్యధ సాధువుకాదు. సరియైన రూపము వ్యథ. కావున ప్రాసనియమ భంగమగును. సవరించగలరు.
తొలగించండిమిత్రులు గుండు వారికి నమస్సులు మరియు ధన్యవాదములు. సవరించిన పద్యము:
తొలగించండివిధములు మారున్ గృహమున
విధిగా పరుగెట్టి రాదు పెళ్లామైనన్
మధురములాడరు మనుమలు
నధికారాంతమున జూడనగు భోగమ్ముల్!!!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు విధాల పూరణ బాగున్నది. అభినందనలు.
‘వ్యధ, వ్యథ’ రెండూ సాధువులే.
జ్వరమును మాన్పెడి మందే
రిప్లయితొలగించండిపరిశీలన,పద్యరచన|పత్యము జేయన్?
దరిజేరక పరుగెత్తును
శరవేగము నందుకొనుచు శారద కృపచే|
అధిపతి నేనను అహమున
రిప్లయితొలగించండిబుధుడను కొనె |”బుద్దిలేని పుట్టుక విడువన్
నిధులగు నిర్మల తత్వము
అధికారాంతమున జూడ నగుభోగమ్ముల్|”.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వ్యధలే తప్పవు నింట గోపములు శాపమ్ముల్! సదా మౌనమే!
రిప్లయితొలగించండివిధిగా తా పరుగెట్టి రాదు సతి! నీవీడేర్చ లేదేమిటన్
విధమున్ , పౌత్రులు మేలమాడుదురు , ప్రావీణ్యమ్ము లంతంతలే!
నధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర వైభోగముల్
పెద్దలు శ్రీ సుబ్బారావు గారికి మరియు గుండు వారలకు ధన్యవాదములతో సవరించిన పూరణ:
తొలగించండిబధిరత్వమ్మున నింట గోపములు శాపమ్ముల్! సదా మౌనమే!
విధిగా తా పరుగెట్టి రాదు సతి! నీవీడేర్చ లేదేమిటన్
విధమున్ , పౌత్రులు మేలమాడుదురు , ప్రావీణ్యమ్ము లంతంతలే!
నధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర వైభోగముల్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రాసస్ధానములో ద-ధ-థ లువాడరాదు.అన్నిప్రాస స్ధానములలో"ధ"యే ఉండవలెను
రిప్లయితొలగించండిఅధికార విధులు సమ్య
రిప్లయితొలగించండిగ్విధమున నిర్వహణ సేయ భృతిగొని నాపై
నిధి ధనమును పింఛను తో
నధికారాంతమున జూడనగు భోగమ్ముల్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిప్రస్తుతం నేను అనుభవిస్తున్న పింఛను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అధికారాన్ధులు, పదవుల
రిప్లయితొలగించండిబధిరులు కని వినగ లేని పాలకు లేలే
విధిలేని జనులు, వీరల
అధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అధికార విధులు సమ్య
రిప్లయితొలగించండిగ్విధమున నిర్వహణ సేయ భృతిగొని నాపై
నిధి ధనమును పింఛను తో
నధికారాంతమున జూడనగు భోగమ్ముల్
విధురుండై పెండ్లికి జన
రిప్లయితొలగించండివధువే రోయగ పొగాకు పదుగురి లోనన్
మధురపు మాటలు కరువగ
నధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్!