మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటి పద్యంలో ‘వారికిన్+అండగ’ అని విసంధిగా వ్రాయరాదు. ‘వారికే యండగ’ లేదా ‘వారికి న్నండగ’ అనండి. అలాగే లాగుచున్+ఎండకు... లాగుచు న్నెండకు... అనండి. ‘అనైతిక బట్ట’ అని సమాసం చేయరాదు. అక్కడ యతి కూడ తప్పింది.
మీ నాలుగు పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యంలో ‘...నొకతె యెండ నొకతె’ అనండి. నాలుగవ పాదంలో గణదోషం. ‘గనుండు’ అంటే సరి. మూడవ పద్యం మూడవపాదంలో గణదోషం. ‘ధనము లున్నవారు దారి చూపించక| పేదల బ్రతుకిలను...’ అనండి. నాల్గవ పద్యం మొదటి పాదంలో గణదోషం. ‘పసి ప్రాయమున యందె’ అనండి.
భాను తాపము నోర్వక బాట సారి
రిప్లయితొలగించండిచేరి కూర్చుండె గమ్యము చేర గాను
బ్రతుకు బండిని లాగగ భామ యొకతె
లాగు చుండెరిక్షానంత లాఘవముగ.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅక్షరము రాకపోయిన
రిప్లయితొలగించండికుక్షిం భరిత్వమునకని కూలీ కంటెన్
రిక్షా లాగుటె నయమని
అక్షయ మగుశక్తి కరుగు నానందమగున్
అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో ‘భరిత్వ’ గణదోషం. ‘కుక్షింభరణత్వమునకు...’ అనండి.
అక్షరము రాకపోయిన
తొలగించండికుక్షిం భరణత్వ మునకు కూలీ కంటెన్
రిక్షా లాగుటె నయమని
అక్షయ మగుశక్తి కరుగు నానందమగున్
బ్రతుకు చక్రమ్ము నీడ్చగ ప్రాపుగోరి
రిప్లయితొలగించండివెతలనెడబాయ తనదగు విధమెరింగి
ఇంతి లాగెను రిక్షాననంతమైన
బ్రతుకు భారమునోపెడు భావమెరిగి!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంబటిభానుప్రకాశ్.
రిప్లయితొలగించండిచిత్రానికి తగిన పద్యం.
**ఆ**
తాగు బోతు మగడు తాగుడు మానక,
కష్ట మనగ బెట్ట, కాంత యపుడు,!
పిల్ల పాప బెంచ మెల్లగ తానుయె,
రిక్ష లాగ నేర్చె రీతి నెరిగి !!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘తాను+ఎ’ అన్నపుడు యడాగమం రాదు. ‘మెల్లగ తాఁ బూని’ అనండి.
రిప్లయితొలగించండిపొట్టకూటికికొరకుగాచిట్టితల్లి మూడుచక్రాలబండినిముదముతోడ లాగుచుండెనునచ్చట,లబ్ధధనము తోడబ్రదుకుచుండెనుసంతోషముగను
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిత్రాగి తనపతి నిత్యము తూగుచుండ
రిప్లయితొలగించండిపొట్టకూటి కోసము తాను పట్టుబట్టి
త్రొక్కుచుండె రిక్షాను తొయ్యలొకతి
చెయ్యలేనిపనికలదె చేడియలకు
త్రొక్కు చుండెను
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘తొయ్యలి+ఒకతి’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘తోయజాక్షి’ అందామా?
ప్రగతి పథాను గమన దే
రిప్లయితొలగించండిశ గరిమ మిదియె? సుకుమార శాతోదరియే
విగత ధన పీడిత హృదయ
గగన సదృశ కార్య భార కాంతను గనుడీ
మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఅంబటిభానుప్రకాశ్.
రిప్లయితొలగించండిచిత్రానికి తగిన పద్యం.
**ఆ**
తాగు బోతు మగడు తాగుడు మానక,
కష్ట మనగ బెట్ట, కాంత యపుడు,!
పిల్ల పాప బెంచ మెల్లగ తానుయె,
రిక్ష లాగ నేర్చె రీతి నెరిగి !!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘తాను+ఎ=తానె’ అవుతుంది. యడాగమం రాదు. ‘తానుగా’ అనండి.
వేళకు నన్నముఁ గావలె!
రిప్లయితొలగించండితాళిని గట్టిన మగండు తాగుడు బోతై
యాళి ననాదగఁ జేయన్
తోలుచు రిక్షా, బ్రతుకదె తోయలి యైనన్!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ప ౦ చ. చా మ ర వృ త్త ము
.………,………...............
{ జ ర జ ర జ గ. యతి 10. వ. అ" }
....................................................
{ రిక్షా లోని వ్య క్తి ఆ ల యా ర్చ కు డు }
త్రిచక్ర వాహనమ్ము ద్రొక్కి
. . గ్రీష్మ మ౦దు నన్ శ్రమి౦
చు చాన వైపు జాలి తోడ
. . చూచి విష్ణు రూప శ
ర్మ చెన్న కేశ వాలయాన
. . మ౦చి వృత్తి నిచ్చె నా
హ ! చేరదీయు స్వామి దీను
. . లైన వారి నెప్పు డున్
{ వృత్తి = ఉపాధి. స్వామి = భగవ౦తుడు }
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
తొలగించండిచిన్నతనమునఁ బెండ్లయెఁ; జిన్న యింట
మగఁడుఁ బిల్లలు వృద్ధులు మనుచు నుండ్రి!
రోగి యా పేద, రోగఘ్నయోగ విరహ
కలిత విధి లిఖితముఁ గని, కస్తి పడెడి
మగఁడు, నుద్యోగ మెద్ది యెఱుఁగఁడు; తానె
యింటి పోషణ బాధ్యత నెత్తి కెత్తి,
రిక్ష లాగుచు, సంసార రక్షణ మిడు;
నబల కాదామె సబలయే యనఁగ నిలిచి!!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండికండలు లేనిదౌవనిత కామిత సిద్దిగ యింటివారికిన్
రిప్లయితొలగించండిఅండగ నిల్చి పౌరుష-ప్రయాసల కోర్చియు రిక్ష లాగుచున్
ఎండకు కండువా యను ననైతికబట్ట తలందు గప్పుచున్
నిండుమనస్సు నన్ గడుప?నేర్పరి తత్వముజూడ గొప్పయే|
2.వయసునచిన్నదైన తనవారికి రక్షగ సంతసంబునన్
భయమును వీడి వేడిమి సవాలుగ గైకొని”వచ్చు వారికిన్
పయనపు నీడ నిచ్చి తగు బాధ్యత యందున రిక్ష-ద్రొక్కుచున్
జయమును బంచు సాధ్వి మనజాలగ?యెండను లెక్కజేయునా?
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పద్యంలో ‘వారికిన్+అండగ’ అని విసంధిగా వ్రాయరాదు. ‘వారికే యండగ’ లేదా ‘వారికి న్నండగ’ అనండి. అలాగే లాగుచున్+ఎండకు... లాగుచు న్నెండకు... అనండి. ‘అనైతిక బట్ట’ అని సమాసం చేయరాదు. అక్కడ యతి కూడ తప్పింది.
తండ్రి గతించె, పాప మిక తల్లియె కూలికిఁబోయి నిత్యమి
రిప్లయితొలగించండిబ్బండ్రగు సంతుఁ సాకినది, వార్థక మౌటను డస్సె, నామెకౌ
నీండ్రము బాప బెద్ద యగు నీమె త్రిచక్రికి సాది యాయె తా
వేండ్రము లెక్క జేయకను వీటను త్రోలుచు నుండె వాహనం,
బండ్రు బుధుల్ లతాంగులకు పంతముతో గరపంగ విద్యలౌ
వెండ్రుక భాతి యల్పమని, వీరి స్వశక్తికి చేతు జోతలన్.
మీ ండ్రాప్రాసతో కూడిన పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిబతుకు బండి వోలె పడతిలాగుచునుండె
రిప్లయితొలగించండిరిక్షయొకటి తాను లక్షణముగ
పొట్ట కూటి కొరకు పుడమిపై కష్టాలు
తప్పవెవరి కైన దలచి చూడ.
2.ఎండ వేళలందు నింతులిర్వురి జూడ
నీడలోన నొకతె నెండ నొకతె
చేతకాక యొకరు జీవనము కొరకొ
కరు నిదియె గనుడు కాలమహిమ.
3.తాపమొకరి దిచట తపన యింకొకరిది
ధనము కొరకు నడుపు తరుణి రిక్ష
ధనములున్మ వారు దారి చూపకున్న
పేదల బదుకిలను పిగిలి పోవు.
4.పాలుగారు చున్న పసి వయసునందె
రిక్షలాగుచున్న రీతి చూచి
యతివ కెంత గలదొ నాత్మబలమటంచు
జనులు చూచు చుంద్రు చోద్యముగను.
మీ నాలుగు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పద్యంలో ‘...నొకతె యెండ నొకతె’ అనండి. నాలుగవ పాదంలో గణదోషం. ‘గనుండు’ అంటే సరి.
మూడవ పద్యం మూడవపాదంలో గణదోషం. ‘ధనము లున్నవారు దారి చూపించక| పేదల బ్రతుకిలను...’ అనండి.
నాల్గవ పద్యం మొదటి పాదంలో గణదోషం. ‘పసి ప్రాయమున యందె’ అనండి.
అంబటిభానుప్రకాశ్.
రిప్లయితొలగించండిచిత్రానికి తగిన పద్యం.
**ఆ**
తాగు బోతు మగడు తాగుడు మానక,
కష్ట మనగ బెట్ట, కాంత యపుడు,!
పిల్ల పాప బెంచ మెల్లగ తానుగా ,
రిక్ష లాగ నేర్చె రీతి నెరిగి !!
భారమనక బాధ్యత మోయు వనితవీవు
రిప్లయితొలగించండిలాగుచుంటివి రిక్షాను లాఘవమున
పురుషులమను గర్వోన్నత పుంగవులకు
ధీటుగాను నిల్చితివట తెగువ గలిగి
ఏల త్రొక్కెదవమ్మ నీ కాలు నొచ్చు!
రిప్లయితొలగించండిఆటొ నొకటిని గొనుమమ్మ దీటు గాను
బ్యాంకు లిచ్చును లోనులు భారి గాను
ఓల జేరుము ముదమున నోల లాడి!