17, ఏప్రిల్ 2016, ఆదివారం

ఖండకావ్యము – 3 (శ్రీరామనామ వైశిష్ట్యము)

శ్రీరామనామ వైశిష్ట్యము
రచన : గుండా వేంకట సుబ్బ సహదేవుడు
మత్తకోకిల.     
ప్రేమఁ బంక్తిరథుండు  పుత్రుని పేరుఁ బెట్టగ గోరినన్
రామనామము శ్రేష్టమంచును ప్రాజ్ఙులెన్నుచుఁ బల్కిరే!
తామసమ్మును జీల్చు నట్టిది ధాత్రిఁ దారకమంత్రమై
సేమమిచ్చును దల్చినంతనె చేరి గొల్వఁగ జెప్పిరే!

కం.     సకలము పాలించ దగన్
కారమష్టాక్షరినిదె ప్రకటించునటుల్
నికరపు పంచాక్షరినిన్
కార మొలికించ రామమహితాత్మకమౌ!

సీ.      పత్రమ్ము పైనుండ పరమాత్మ నామమ్ము
ముల్లోకములనది మురిసి తిరిగె!
వారధిఁ గట్టగ వానరమ్ములుఁ దీర్చ
రామనామము నీళ్ల రాల్లు దేలె!
రామనామముఁ బల్క రామబాణమ్మైన
హనుమంతుఁ దాకక వెనుదిరింగె!
ముమ్మారుఁ బల్కిన పుణ్యము వేమారు
లగునంచు శివుఁడన నగజ తెలిసె!
ఆ.వె.   రామనామ మహిమ రాముఁడే దెలియగన్
కీర్తనమ్ములల్లి యార్తి తోడ
చెరను వీడి మోక్షసిద్ధి సాధించిన
‘రామదాసు’ చూపె రాచబాట

29 కామెంట్‌లు:


  1. రామునిమహిమనుబొగడిన
    నోమహితుడ!నేనుకూడనోపికకొలది న్రామునిసేవనుజేతును నిమ్ముమయాశీసులిపుడయీచట్టునకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      ధన్యవాదాలు.
      నాల్గవపాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. బ్రేమనునాశీసులిమ్మువేంకటసుబ్బా!

      తొలగించండి
    3. పెద్దలు సుబ్బారావుగారికి ధన్యవాదములు.

      అయ్యా!
      నాకన్నను పెద్దలు నే
      మీకెటులాశీసులిడుదు? మీకున్ నాకున్
      శ్రీకరుడు రామ చంద్రుడు
      ప్రాకటముగ శక్తినొసఁగు వాత్సల్యమునన్!

      తొలగించండి
  2. రామ నామ విశిష్టత చాలా బాగా వ్రాసారు...

    రిప్లయితొలగించండి
  3. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మీ రు వి శ దీ క రి ౦ చి న అ ఖ ౦ డ య తి గూ ర్చి చ ది వా ను . దా ని ని ప్ర యో గి ౦ చు
    దై ర్య ము మా లా ౦ టి వా రి కి
    ఉ ౦ డ దు

    గు రు వు గా రి కి న మ స్క రి ౦ చి
    గు రు మూ ర్తి ఆ చా రి చే సు కొ నే మ న వి =

    నా శ్రీ రా మ స్తు తి ప ద్యా లు చూ చి న
    శ్రీ యు త మ ధు సూ ద న్ గా రు స ౦ తృ ప్తి
    చె ౦ దా రు. కా నీ 4 వ ప ద్య మై న. త రు వో జ య ౦ దు తృ తీ య పా దో త్త ర
    భా గ ము న ఒ క ల ఘు వు లో పి ౦ చి
    గ ణ భ ౦ గ మై న ద ని అ న్నా రు

    నే ను వె ౦ ట నే స వ రి ౦ చి ఆ య న కు
    తె లి య జే శా ను .

    క్లే శ కా ర క సు రా రి గ ణ భీ మ. ను

    క్లే శ కా ర క సు రా రి స మూ హ భీ మ. గా √

    మా ర్చా ను .

    ఈ స వ ర ణ ను
    ………………………
    బ్లా గు లో ని ప ద్య ౦ న ౦ దు.…………………………………………
    చే య వీ ల వు తు ౦ దే మో
    ……………………………………………
    ద య చే సి చే య మ ని ప్రా ర్థ న ి
    ……………………………………………………

    రిప్లయితొలగించండి

  4. ి



    ఖ ౦ డ కా వ్య ము

    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మనోహర మైన మీ పద్యాలను చదివి
    ఆన౦ది౦ చాను.

    పద్యాలను ఖ౦డకావ్యము న౦దు ఎలా
    ప౦పి౦చాలో దయచేసి నాకు తెలియ జేస్తారా

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సహదేవుడు గారూ, పద్యాలు బాగున్నాయి , సీస పద్యంలో "రామ నామము నీళ్ల రాలు దేలె అంటే చాలును. అరసున్న అక్కర్లేదు.
    "ఖైదు వీడి ----" అనే మాట తెలుగు పద్యంలో ఇమడడం లేదు,అంతేకాక "మహిని కైవల్యమందడం" అనడం వలన అన్వయం ప్రమాదంలో పడుతుంది కనుక , "చెరను వీడి మోక్ష సిద్ధి సాధించిన..." అంటే బాగుంటుంది.


    ఇలాగే ఈ శీర్షికలో పద్యాలు మరిన్ని రచించండి, కలానికి పదును పెరుగుతుంది, ఇతోధికమైన కవిత్వ రచన చేయగలరని ఆశంసిస్తూ ----

    అహరహము వాణి కరుణా
    సహకారము కొనలుసాగ సహదేవ! సదా
    విహరింపుము సారస్వత
    విహాయసములోన సుకవి పికమై ! శుకమై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు ధన్యవాదములు.
      తమరి సవరణలను గురువర్యులు శ్రీశంకరయ్యగారలు బ్లాగున పొందుపరచ ప్రార్థన.

      తొలగించండి
    2. డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు. ‘అరసున్న’ నావల్ల జరిగిన పొరపాటు. మీరు సూచించిన సవరణలు చేశాను.

      తొలగించండి
  6. శ్రీరామ నామ స్మరణము
    పోరాములనెల్ల ద్రుంచి పున్నెము దెచ్చున్
    రారా! మిత్రమ! పోదము
    వారాంతపు సెలవులన్ని వాడగవచ్చున్.

    రిప్లయితొలగించండి
  7. హనుమ చాటి చెప్పె ఆలనాటి పోరులో
    రామశక్తి కన్న నామ మహిమ
    గొప్పదంచు బలికి గుండెను జీల్చుచు
    దశరథాత్ము జూపె ధన్యుడగుచు!

    రిప్లయితొలగించండి
  8. హనుమ చాటి చెప్పె ఆలనాటి పోరులో
    రామశక్తి కన్న నామ మహిమ
    గొప్పదంచు బలికి గుండెను జీల్చుచు
    దశరథాత్ము జూపె ధన్యుడగుచు!

    రిప్లయితొలగించండి
  9. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మీ రు వి శ దీ క రి ౦ చి న అ ఖ ౦ డ య తి గూ ర్చి చ ది వా ను . దా ని ని ప్ర యో గి ౦ చు
    దై ర్య ము మా లా ౦ టి వా రి కి
    ఉ ౦ డ దు

    గు రు వు గా రి కి న మ స్క రి ౦ చి
    గు రు మూ ర్తి ఆ చా రి చే సు కొ నే మ న వి =

    నా శ్రీ రా మ స్తు తి ప ద్యా లు చూ చి న
    శ్రీ యు త మ ధు సూ ద న్ గా రు స ౦ తృ ప్తి
    చె ౦ దా రు. కా నీ 4 వ ప ద్య మై న. త రు వో జ య ౦ దు తృ తీ య పా దో త్త ర
    భా గ ము న ఒ క ల ఘు వు లో పి ౦ చి
    గ ణ భ ౦ గ మై న ద ని అ న్నా రు

    నే ను వె ౦ ట నే స వ రి ౦ చి ఆ య న కు
    తె లి య జే శా ను .

    క్లే శ కా ర క సు రా రి గ ణ భీ మ. ను

    క్లే శ కా ర క సు రా రి స మూ హ భీ మ. గా √

    మా ర్చా ను .

    ఈ స వ ర ణ ను
    ………………………
    బ్లా గు లో ని ప ద్య ౦ న ౦ దు.…………………………………………
    చే య వీ ల వు తు ౦ దే మో
    ……………………………………………
    ద య చే సి చే య మ ని ప్రా ర్థ న ి
    ……………………………………………………

    రిప్లయితొలగించండి
  10. శ్రీరామ నామ మహిమల
    సారాంశము బంచినట్టి సహదేవుడవై|
    కోరక బంచిన రాముని
    పారాయణ పద్యరచన?బ్రహ్మాండమ్మే| {గుండావెంకటసుబ్బ సహదేవుడి గారికివందనచదనాలు రచయుతకి శ్రీరామునకు

    రిప్లయితొలగించండి
  11. ఖ౦డ కావ్యము
    ............ ...... గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    GVS. సహదేవుడు గారూ

    చక్కని మీ పద్యాలు అలరి౦చాయి

    రిప్లయితొలగించండి
  12. ఈశ్వరప్పగారికి మరియు గురుమూర్తి గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  13. ఈశ్వరప్పగారికి మరియు గురుమూర్తి గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. రామనామ మహిమ రమ్యమ్ముగాజెప్పి
    రాటుదేలినారు వ్రాయుటందు
    ఖండకావ్యమిటనఖండ కీర్తినిగన్న
    వానిగూర్చిజెప్ప వాసికెక్కె.

    రిప్లయితొలగించండి
  15. ఘనతన్నది నాది కాదయ!
    మనసున కొలువైన రామ మహితాత్మునిదౌ!!
    గొనుమయ్య ధన్యవాదము
    హనుమచ్చాస్త్రీ! పలికిన నభినందనకున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటిపాదంలో గణదోషం. ‘ఘనత యది (గన) నాది కాదయ’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:

      ఘనతఁ గన నాది కాదయ!
      మనసున కొలువైన రామ మహితాత్మునిదౌ!!
      గొనుమయ్య ధన్యవాదము
      హనుమచ్చాస్త్రీ! పలికిన నభినందనకున్!!

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:

      ఘనతఁ గన నాది కాదయ!
      మనసున కొలువైన రామ మహితాత్మునిదౌ!!
      గొనుమయ్య ధన్యవాదము
      హనుమచ్చాస్త్రీ! పలికిన నభినందనకున్!!

      తొలగించండి
  16. ఖ౦డ కావ్యము
    ............ ...... గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    GVS. సహదేవుడు గారూ

    చక్కని మీ పద్యాలు అలరి౦చాయి

    రిప్లయితొలగించండి
  17. చాలా చక్కటి రచన. ముఖ్యంగా సీసపద్యంలో విష్ణుసహస్రనామాల్లోని శ్లోకభావం చివరిపాదంలో చేర్చడం విశేషంగా ఉంది.

    రిప్లయితొలగించండి