‘అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట!’ అలా అయింది నా పరిస్థితి... మీ వ్యాఖ్య చూశాక విపరీతంగా నవ్వుతుంటే మా ఆవిడ కంగారు పడింది. సవరించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు...
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణ చాలా బాగుంది. “స్తిమిత” అని మీ యభిప్రాయమనుకుంటాను. పొరపాట్లు మానవ సహజమే. ఎవరి పొరపాటు వారికి తెలియదెన్ని సార్లు చూసిన.
గుండు మధుసూదన్ గారూ, మీ ఆరు పూరణలు దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటూ వైవిధ్యాన్ని చాటుతూ మీ కవితాపాండితికి దర్పణాలై శోభిస్తున్నాయి. అభినందనలు. అమృతమును జిందు భావన లమృతాక్షర మౌక్తిక నిభ♦మౌ పదయుతమై సుమశోభిత దీపిత ప ద్యములన్ రచియించు ఘనుఁడ వని నుతియింతున్. ఒక్క సందేహం... సమస్య ‘యముఁ గని’ కదా! కాయము, గేయము, న్యాయము, తోయము వంటి పదాలనే కాకుండా సంధిగత సంయుక్తాక్షరంతో (ఉద్యద్యముఁ గని) వ్రాయవచ్చు. కాని సహజ సంయుక్తాక్షరాలైన గద్యము పద్యము, కావ్యము, అంకాస్యము తదితర పదాలను పూరణలకు వినియోగించవచ్చునా? నియమభంగం కాదు కదా! రెండు వేలకు పైగ సమస్యలకు పూరణలను సమీక్షించిన తర్వాత ఇప్పుడీ సందేహం కలిగింది. నాకు అందుబాటులో ఉన్న పుస్తకాల ద్వారా సందేహ నివృత్తికి ప్రయత్నిస్తాను. ఈలోగా మీరు కూడా వివరణ ఇస్తే బాగుంటుంది. గతంలో జరిగిన ప్రసిద్ధ అవధానాలలో పూరణలను పరిశీలించి ఏవైనా అటువంటి ఉదాహరణలు లభిస్తే ఇస్తాను.
మధుసూదన్ గారు మీపూరణా సముచ్చయమత్యంత ప్రశంసనీయముగా యున్నది.
ఆస్యము, కావ్యము మున్నగు వాటి విషయములో నాకును సందేహము వచ్చినది. ఇచ్చిన పదము “య” కద దాని బదులు స్య , వ్య, లు మొదలగునవి య కి యన్యములైనవి వాడవచ్చునా యని. సంధి వలన వస్తే పరవా లేదు. సంధి విడదీసినపుడు “య” యథాతథము గా ఉంటుంది కదాయని.
మిత్రులు శంకరయ్యగారు వెలుబుచ్చిన అనుమానాన్ని మా మావయ్యగారు శ్రీప్రసాద్ గారితో చర్చించాను.
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
ఈ సమస్యలో ప్రథమాక్షరం య అన్నది పద్యము గద్యము కావ్యము వంటి మాటల్లో ఉన్న య కారం కావచ్చునా అన్నది ప్రశ్న అంటే ప్రసాద్ గారు 'అలా పూరించుట సరి యైనదే' అని వివరించారు.
గుండువారి మరొక విడతపూరణలు చూసి అమితాశ్చ్యర్యానందాలు కలిగాయి.
సహజ సంయుక్తాక్షరమందు నిక్షిప్తమైన సమస్యలోని పాదాద్యక్షరం విషయంలో మా అందఱికీ ఉన్న సందేహాన్ని పటాపంచలు చేసినందులకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. కృతజ్ఞతలతో...
శిష్ట్లా వి.ఎల్.ఎన్. శర్మ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. మూడవ పూరణలో ‘వదలుచు’ను ‘ఒదలుచు’ అన్నారు. ‘ఖర్మ’ శబ్దం సాధువు కాదు. ‘భ్రమ వదలుచు కర్మ యనక...’ అంటే సరి! నాల్గవ పూరణలో ‘సమరీతిని నన్వయించి’ అనండి.
విమలము ధ్యేయము, భయము క్ష
రిప్లయితొలగించండియమగును రయమున జయ విజయ చయంబులు సా
యము వచ్చుట ఖాయమిక ప్రి
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘ఖాయము’ అని అన్యదేశ్యాన్ని ప్రయోగించారు.
కమలాసముల్ ముసురుచు
రిప్లయితొలగించండితిమిరము వ్యాపించినపుడు దినమే రేయై
న మరుదినము సాకిరి చా
యముఁ గని జనులెల్ల మోదమొందెదరు భువిన్
కమలాసనములు = మేఘములు
సాకిరి చాయముడు = సూర్యుడు
2.
శ్రమయనక కేంద్ర సర్కా
రమాత్యులన్ బం పుచు పలు రాష్ట్ర జనుల క్షే
మము కొరకై చేయుసహా
యముఁ గని జనులెల్ల మోదమొందెదరు భువిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి‘రేయి+ఐ’ అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘నిశియై’ అనండి.
విరించి గారు "కమలాసముల్" లో "న" పోయింది చూడండి.
తొలగించండిగురువు గారికి పోచిరాజు కామేశ్వర రావు గారికీ ధన్యవాదములు ఔనండి తొందరపాటు ఫలితం అనుకుంటాను
తొలగించండిNVN చారి గారి పూరణ...
రిప్లయితొలగించండిభ్రమయే భౌతిక మంతయు
క్రమమున నశియించుచుండు కాలక్రమమున్
గమనించి దైవకృప నభ
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
నల్లాన్ చక్రవర్తుల వేంకట నారాయణాచార్యులు గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినిమిషమువమ్మునుజేయక నమశ్శివాయనమయనుచునతులనునీయ న్జముడేగనిపించగనట యముగనిజనులెల్లమోదమందెదరుభువిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘నిమిషమును వమ్ము జేయక’ అంటే పద్యం నడక సాఫీగా ఉంటుంది కదా!
సమయమిది యాదుకొనవలె
రిప్లయితొలగించండిసమయించుచునుండ్రి జనులు సలిలము లేకన్
సమర స్థితి జేయు సహా
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
ప్రస్తుత పరిస్థితులకు దర్పణంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికమలాప్త కరోష్ణ తపన
రిప్లయితొలగించండిసమధిక తప్తాతి ఘోర సమయము లందున్
విమలము మేఘచ్యుత తో
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
మేఘచ్యుత తోయముతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
తొలగించండిసుకవులు కామేశ్వర రావు గారూ... నిదాఘమున శీతల జల స్పర్శ వలె మనస్సు నాహ్లాద పరిచెడు పూరణ మందించినారు! శుభాభినందనలు!
తొలగించండిమధుసూదన్ గారు ధన్యవాదములు. పండితజనానందకరమైనపుడే కవనానికి సార్థకత. ధన్యోస్మి.
తొలగించండికమనుడు రావణు నన్యా
రిప్లయితొలగించండియముపై ధర్మమ్మొనర్చు నాభీలపు టా
లములో శ్రీరాముని విజ
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
అద్భుతం. చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండికం**
రిప్లయితొలగించండిసమయము నెంచక పనులను,
విమలమ నస్కుడ యిజేయు విడపరి గానే!
గమనము దెలిసిన యతని ప్రి
"యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్"
విడపరి=త్యాగశీలుడు,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాముని నామముఁ దలచుచు
రిప్లయితొలగించండిభూమిజకై వెదుకఁ జూచు పూనిక తోడన్
ధీమాంచిత హనుమత్కా
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రాస దోషాన్ని సవరించిన పద్యం:
తొలగించండిరమణీయ నాముఁ దలచుచు
శ్రమయెరుఁగక వెదుక జూడ సాధ్వీ సీతన్
సమయోచిత హనుమత్కా
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్!
ఏమిటో... పెద్దవాణ్ణి అయిపోతున్నాను. మీ పద్యంలోని ప్రాసదోషాన్ని గమనించలేదు (నేనూ ప్రాసదోషంతో పద్యం వ్రాశాను). సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్షేమంకరు లొనరించెడు
రిప్లయితొలగించండిసమాజ హితమూల కార్య సాఫల్య రతి
స్థేమజ సత్కార్య నికా
యముఁ గని జను లెల్ల మోద మందెదరు భువిన్.
(పోచిరాజు కామేశ్వరరావు గారి ఆమోదం పొందితే ధనుణ్ణి!)
అద్భుతమైన పూరణం. చాలా బాగున్నది. శుభాభినందనలు!
తొలగించండిధన్యవాదాలు. స్నేహాతిశయం వల్ల దోషాలనూ గుణాలుగా భావించి ఉపేక్షిస్తారన్న శంకతో మీ ఆమోదం అడగలేదు. అదీ సంగతి!
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణ నాలస్యంగా గమనించినందులకు క్షంతవ్యున్ని. ఆమోదించ గల్గినంతటి వాన్ని కాదు నేను. శరీరబలము కార్యసాధనోత్సాహములతో చేయు సత్కార్యసమూహములు ప్రస్తావించిన మీ పూరణ నిజముగ నాణిముత్యమే.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చిన్న సందేహము న్నది మీ పూరణలో. దత్తపాదారంభము లఘువు. కానీ మీ మొదటి , మూడవ పాదాలు గురువుతో ప్రారంభమైనవి.
తొలగించండి‘అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట!’ అలా అయింది నా పరిస్థితి... మీ వ్యాఖ్య చూశాక విపరీతంగా నవ్వుతుంటే మా ఆవిడ కంగారు పడింది. సవరించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు...
తొలగించండిఈ సవరించిన పూరణ ఎలా ఉందో కామేశ్వర రావు గారు కానీ, గుండు మధుసూదన్ గారు కాని చెప్పేదాక నాకు నిద్ర పట్టదు....
తొలగించండిసమధిక లోకహితైశులు
సమాజ హితమూల కార్య సాఫల్య రతి
స్థిమిత లసత్కార్య నికా
యముఁ గని జను లెల్ల మోద మందెదరు భువిన్.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణ చాలా బాగుంది. “స్తిమిత” అని మీ యభిప్రాయమనుకుంటాను. పొరపాట్లు మానవ సహజమే. ఎవరి పొరపాటు వారికి తెలియదెన్ని సార్లు చూసిన.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు. నేను ‘స్థిమిత’ శబ్దమే శుద్ధమన్న భ్రమలో ఉన్నాను. మీ సూచనతో నిఘంటువులను పరిశీలిస్తే సాధువేదో తెలిసింది.
అల్పజ్ఞుడ నే నెవ్వరుఁ
దెల్పిన మద్దోషములను దిద్దుకొనెడి సం
కల్పము గలవాఁడ ననుచు
దెల్పితి మన్నింపవలెను ధీవరు లెల్లన్.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిమిత్రులు శంకరయ్య గారూ...కామేశ్వర రావు గారూ...నమస్సులు!
తొలగించండిశంకరయ్యగారూ...మీరు సవరించిన ప్రథమ, తృతీయ పాదములు మనోహరముగా ఉన్నాయి. స్తిమిత పద విషయమున మీరు స్తిమితపడినందులకు ఆనందముగనున్నది. "ప్రమాదో ధీమతా మపి" :-)
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిచెమటలు గ్రక్కుచు వేఁడిమి
నమితముగా నుక్కపోయ ♦ నడలి జలము కో
సము గగనమున జలద నిచ
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
సత్కవితా జలద నిచయ నినద భరితమై మీ పూరణ రసామృతాన్ని వర్షించింది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు శంకరయ్యగారూ!
తొలగించండినా రెండవ పూరణము:
రిప్లయితొలగించండిసముచిత పాత్రా సుపరిచ
యము సేయఁగఁ దొడఁగినట్టి♦దౌ నటి వేదిన్
బ్రముదిత యయి యిడు నంకా
స్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
నా మూఁడవ పూరణము:
రిప్లయితొలగించండిరమణీయ దృశ్య వర్ణిత
సముచిత పాత్రానుగుణ్య ♦ సత్కథను ప్రకా
శమిడు సుగుణైక యుత కా
వ్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
నా నాలుఁగవ పూరణము:
రిప్లయితొలగించండిఅమృతమును జిందు భావన
మమృతాక్షర మౌక్తిక నిభ♦మౌ పదయుతమై
సుమశోభిత దీపిత ప
ద్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
నా యైదవ పూరణము:
రిప్లయితొలగించండిభ్రమలఁ గలిగించు సంసా
ర మను భుజగ దంష్ట్రులకును ♦ భ్రమ డుల్పను శ
క్యమగు తిరుమలేశుని గ
ద్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
నా యాఱవ పూరణము:
రిప్లయితొలగించండిగమకిత మనోజ్ఞ సంగీ
తముచే నలరారఁ జేయు ♦ తత్రత్యుల వే
దము గోపాలుని దౌ గే
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ ఆరు పూరణలు దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటూ వైవిధ్యాన్ని చాటుతూ మీ కవితాపాండితికి దర్పణాలై శోభిస్తున్నాయి. అభినందనలు.
అమృతమును జిందు భావన
లమృతాక్షర మౌక్తిక నిభ♦మౌ పదయుతమై
సుమశోభిత దీపిత ప
ద్యములన్ రచియించు ఘనుఁడ వని నుతియింతున్.
ఒక్క సందేహం... సమస్య ‘యముఁ గని’ కదా! కాయము, గేయము, న్యాయము, తోయము వంటి పదాలనే కాకుండా సంధిగత సంయుక్తాక్షరంతో (ఉద్యద్యముఁ గని) వ్రాయవచ్చు. కాని సహజ సంయుక్తాక్షరాలైన గద్యము పద్యము, కావ్యము, అంకాస్యము తదితర పదాలను పూరణలకు వినియోగించవచ్చునా? నియమభంగం కాదు కదా! రెండు వేలకు పైగ సమస్యలకు పూరణలను సమీక్షించిన తర్వాత ఇప్పుడీ సందేహం కలిగింది. నాకు అందుబాటులో ఉన్న పుస్తకాల ద్వారా సందేహ నివృత్తికి ప్రయత్నిస్తాను. ఈలోగా మీరు కూడా వివరణ ఇస్తే బాగుంటుంది. గతంలో జరిగిన ప్రసిద్ధ అవధానాలలో పూరణలను పరిశీలించి ఏవైనా అటువంటి ఉదాహరణలు లభిస్తే ఇస్తాను.
మధుసూదన్ గారు మీపూరణా సముచ్చయమత్యంత ప్రశంసనీయముగా యున్నది.
తొలగించండిఆస్యము, కావ్యము మున్నగు వాటి విషయములో నాకును సందేహము వచ్చినది. ఇచ్చిన పదము “య” కద దాని బదులు స్య , వ్య, లు మొదలగునవి య కి యన్యములైనవి వాడవచ్చునా యని. సంధి వలన వస్తే పరవా లేదు. సంధి విడదీసినపుడు “య” యథాతథము గా ఉంటుంది కదాయని.
సుకవి మిత్రులు శంకరయ్యగారూ...కామేశ్వర రావుగారూ...నమస్సులు!
తొలగించండిమీరు తెలిపిన తరువాత నాకును సందేహము కలుగుచున్నది. సంధివలన కాకుండా సహజ సంయుక్తంగా రాయవచ్చునా అని అనుమానము ఇప్పుడు కలుగుచున్నది.
అవధానములలో ఇటువంటి ప్రయోగము లేవైన కలవో లేవో....తాము పరిశీలించి తెలిపినచో మరియొక సారి ఇటువంటివి జరుగకుండ జాగ్రత్తపడగలను. ధన్యవాదములతో...
భవదీయుఁడు
గుండు మధుసూదన్
మధుసూదన్ గారు మీ సహృదయతకు ధన్యవాదములు.
తొలగించండినా పూరణములలో స్వల్ప సవరణములు చేసితిని.
తొలగించండిసముచిత పాత్రాదుల నిల
యము సేయఁగఁ దొడఁగినట్టి ♦ యా నటియు నటున్
బ్రముఖాంకాస్యాఖ్య పరిచ
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
రమణీయ దృశ్య వర్ణిత
సముచిత పాత్రానుగుణ్య ♦ సత్కథను ప్రకా
శమిడెడి సన్మధుర కవీ
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
అమృతమును జిందు భావన
మమృతాక్షర మౌక్తిక నిభ♦మౌ పదవాక్యో
ద్యమ శోభిత కావ్య శ్రే
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
భ్రమలఁ గలిగించు సంసా
ర మను భుజగ దంష్ట్రులకును ♦ భ్రమ డుల్పను శ
క్యము తిరుమల విభు పద తో
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
అయ్యా, మీరు సవ్యసాచి అని గతంలోనే చెప్పాను. చేతులెత్తి నమస్కరించడం తప్ప ఇంకేం చెప్పలేను. అభినందనలు
తొలగించండిధన్యవాదములు శంకరయ్యగారూ!
తొలగించండిగుండు మధుసూదన్ గారు కళంక రహిత పరిపూర్ణ శుద్ధ సిద్ధికి మీ తపన ప్రశంస నీయము.
తొలగించండిధన్యవాదములు కామేశ్వర రావు గారూ!
తొలగించండి
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ కృష్ణపరమాత్ముని పాద పద్మముల గడిగిన
యమునా నదీ పవిత్ర జలమును గా౦చిన జనులు మోద మ౦దెదరు }
…………………………………………………
ప్రమదమ్మున. గోపీ గజ -
గమనేష్టుని పద కమలయుగళి గడిగిన. యా
యమునా నదీ విమల తో
యము గని జను లెల్ల మోద మ౦దెదరు భువిన్
{ గజ గమన = స్త్రీ ;
గోపీ గజ గమన + ఇష్టుని = గోపీ స్త్రీ
ప్రియుడైన కృష్ణుని }
ీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీరాం కవి గారి పూరణ....
రిప్లయితొలగించండిరమణి ధరణిజ నయనముల
రమణుడు రాఘవుడు నిండె రాగముతోడన్
మమత నిడు వీరల పరిణ
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
శ్రీరాం కవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమిత ధనాఢ్యుడె యైనను
రిప్లయితొలగించండిక్రమ శిక్షణ, ధర్మయుక్త కార్యోన్ముఖునిన్
సమయ స్ఫూర్తియు తగు విన
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
వినయశీలుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి.రాముడు లంకాదిపుడౌ
రిప్లయితొలగించండికాముకునే సంహరించ కౌతుక మందున్
ధీమా బెరుగ ప్రజకుసా
యముగని జనులెల్ల మోద మందెదరు భువిన్.
మీ పూరణ బాగున్నది.
తొలగించండి‘ధీమా పెరుగ కపుల సా|యము గని...’ అంటే బాగుంటుందేమో?
మొదటి మూడు పాదాల్లో లఘువును మొదటి అక్షరంగా మరచారు.
తొలగించండిక్షమ తాపమధికమయ్యెను
రిప్లయితొలగించండిసమయమ్మాసన్నమాయె స్వసువును కావన్
సమయోచితంబులౌ కా
ర్యముగని జనులెల్ల మోదమొందెదరు భువిన్
స్వసువు, క్షమ: భూమి
బాగుంది మీ పూరణ. కాని ‘కార్యము’లో ర్య సహజ సంయుక్తాక్షరము కదా! పైన గుండు వారి పూరణలపై చర్చ చూడండి.
తొలగించండివిమలముగా నెలగొల్పెడు
రిప్లయితొలగించండిఅమరావతి రాజధాని యద్భుత రీతి
న్నమరుట గనుచున్ నా నిల
యము గని జనులెల్ల మోదమందెదరు భువిన్!!!
తమ మ్రొక్కులు దీర్చుటకై
శ్రమనంతయు మరచి పోయి సప్తగిరులపై
సమకొను శ్రీపతి సంస్త్యా
యము గని జనులెల్ల మోద మందెదరు భువిన్!!!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి1.అమలంబగు మది తోడను
రిప్లయితొలగించండిసముచిత సేవా నిరతిని సద్భావనతో
సమముగ చేయ దలచు సా
యము గని జనులెల్ల మోదమందెదరు భువిన్.
2.భ్రమతో మెలిగెడి వారికి
రమణీయంబుగ వేలిగెడి రాముని జూపన్
భ్రమలు దొలగన్ సతతని
యముగనిమజనలెల్ల మోద మందెదరు భువిన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘భ్రమలు దొలంగన్ సతత ని...’ అనండి.
మిత్రులు శంకరయ్యగారు వెలుబుచ్చిన అనుమానాన్ని మా మావయ్యగారు శ్రీప్రసాద్ గారితో చర్చించాను.
రిప్లయితొలగించండియముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
ఈ సమస్యలో ప్రథమాక్షరం య అన్నది పద్యము గద్యము కావ్యము వంటి మాటల్లో ఉన్న య కారం కావచ్చునా అన్నది ప్రశ్న అంటే ప్రసాద్ గారు 'అలా పూరించుట సరి యైనదే' అని వివరించారు.
గుండువారి మరొక విడతపూరణలు చూసి అమితాశ్చ్యర్యానందాలు కలిగాయి.
సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.
తొలగించండిసుకవి మిత్రులు తాడిగడప శ్యామలరావు గారికి నమస్సులు...!
తొలగించండిసహజ సంయుక్తాక్షరమందు నిక్షిప్తమైన సమస్యలోని పాదాద్యక్షరం విషయంలో మా అందఱికీ ఉన్న సందేహాన్ని పటాపంచలు చేసినందులకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. కృతజ్ఞతలతో...
భవదీయ మిత్రుఁడు
గుండు మధుసూదన్
క్షమ తాపమధికమయ్యెను
రిప్లయితొలగించండిసమయమ్మాసన్నమాయె స్వసువును కావన్
సమయోచితమైన యుపా
య ముగని జనులెల్ల మోదమం దెదరు భువిన్
స్వసువు, క్షమ: భూమి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశిష్ట్లా. వి.ఎల్.ఎన్. శర్మ గారి పూరణలు....
రిప్లయితొలగించండి(1)
తమ దరి నెండల బాధల
దమయిండ్లను నీరు లేని తాపము దీర్పన్
క్రమముగ వర్షములిడు సా
యముగని జనులెల్ల మోదమందెదరు భువిన్!
(2)
సమయము లేదను వారలు
క్రమ ఫలముల నందలేరు కాలమునందున్
సమయముతో సాగు నుపా
యము గని జనులెల్ల మోద మందెదరు భువిన్!
(3)
భ్రమనొదలుచు ఖర్మయనక
శ్రమదోడుత కర్మపథము సాగి చెలంగన్
సముదిత ఫలహిత సముదా
యము గని జనులెల్ల మోదమమదెదరు భువిన్!
(4)
అమరిన కోర్కెల వరుసను
సమరీతిని యన్వయించి జతగొని సాగన్
సమగూడిన దగ నాదా
యము గని జనులెల్ల మోదమందెదరు భువిన్!
శిష్ట్లా వి.ఎల్.ఎన్. శర్మ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణలో ‘వదలుచు’ను ‘ఒదలుచు’ అన్నారు. ‘ఖర్మ’ శబ్దం సాధువు కాదు. ‘భ్రమ వదలుచు కర్మ యనక...’ అంటే సరి!
నాల్గవ పూరణలో ‘సమరీతిని నన్వయించి’ అనండి.
శంకరయ్య గారికి నమస్సులు.....ఖర్మ అనేపదం లేనప్పటికి వాడుక పదముగా వాడితిని
తొలగించండిమీ వివరణలకు గృతజ్ఞుడను
తొలగించండిశర్మ గారూ,
తొలగించండిమనం సంప్రదాయ పద్య కవిత్వాన్ని వ్రాస్తున్నపుడు వ్యావహారికాలు, మాండలికాలు, అన్యదేశ్యాలు వాడకుండా ఉండడం మంచిది.
ఆకసాన జలద మారాట పడెనేమొ
రిప్లయితొలగించండికప్ప యరుపు వినగ గొప్పగాను
అప్పుడొప్పు నట్టి యాకాశమును జూచి
కప్ప సంతు గోరి కాళి గొలిచె!
.....శిష్ట్లా .వి.ఎల్.ఎన్.శర్మ
కప్ప గూడ జీవియే గదాయని నాయభిప్రాయము
రిప్లయితొలగించండికప్ప గూడ జీవియే గదాయని నాయభిప్రాయము
రిప్లయితొలగించండిగురిజాల (BVV) ప్రసాద్ గారి పూరణ...
రిప్లయితొలగించండిసుమనస్కుల దోచి విదే
శము గాదెలు నింపినట్టి శనిగాండ్ర హతం
బమరిన ప్రధాని సుధ్యే
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికవులందరూ "యము" ని "ప్రియము", "చాయము", "సహాయము", "అభయము", "తోయము", "విజయము", "కాయము", "నికాయము", "నిచయము", "పద్యము", "గద్యము", "గేయము", "పరిణయము", "వినయము", "కార్యము", "నిలయము", "ఉపాయము", "ఆదాయము", "ధ్యేయము" వగైరాలుగా మార్చివేస్తే "అకవి" నైన నాకింకేమి మిగిలింది...
రిప్లయితొలగించండిఅయ్యయ్యో!!!
అమలుడు భగ్గున నగవుచు
కమనీయపు డింపులనిట క్రమ్మించిన నా
సమయమ్మున నయ్యయ్యో!!!
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్ :)
రిప్లయితొలగించండిసముచిత ముగా ననుదినము
సమూహమున కైపదముల సంహారము జే
యుము పొలతి, జిలేబీ సా
మ్యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్ :)
జిలేబి
రమణిని చంపిన క్రూరుల
రిప్లయితొలగించండిసమరము జేయు నెపమందు జంకక పోలీస్
విమలపు రీతిని తెచ్చిన
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్