కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చర్చిలో సంధ్యవార్చెను సాయబయ్య.
(నా ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. నడుమునొప్పి తగ్గింది. మూడురోజుగా ఉన్న జ్వరం, ఒంటినొప్పులు, నీరసం తగ్గలేదు. మందులు వాడుతున్నాను. నా స్వస్థతను గురించి పరామర్శించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.)
కులము మతమను పేరిట కలత లేల
రిప్లయితొలగించండివిశ్వ మంతట నిండిన వేలు పొకడె
చెలిమి గలిగిన మేలగు బలిమి మెండు
చర్చి లోసంధ్య వార్చెను సాయ బయ్య .
గురువులకు స్వస్థత చేకూరు తున్నందులకు సంతోషముగా నున్నది .త్వరలో పూర్తి ఆరోగ్యము పొందాలని ఆశీర్వదించి అక్క.
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండివేల్పు ఒక్కడే అనీ, అతన్ని చేరే సాధనాలు వేరువేరైనా భిన్న మతానికి చెందినవారి చెలిమి బలిమిని పెంచుతుందని చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మమతానురాగ హృదయము
తొలగించండిరమణీయము నేదునూరి రాజేశ్వరి! నీ
యమలిన భావముతోడన్
గమనీయము పూరణమ్ము గవయిత్రివి పో!
గురువుల అభిమానమునకు అర్హత పొందిన నేను అదృష్ట వంతురాలిని. ధన్యోస్మి .
తొలగించండికంది వారికి ,
రిప్లయితొలగించండిమీ ఆరోగ్యము మెరుగవు తున్నందు లకు సంతోషము ; తగినంత విశ్రాంతి తీసు కొనండి ;
వీలైన చో వాకింగ్ కి వెళ్ళండి ;
నాకు తెలిసిన విధము యిది :)
జేమ్సు యెచ్చట ప్రార్థన జేసె జెప్పు ?
బ్రాహ్మణుడు యేమి జేసెను ప్రథమ ముగను ?
మస్జిదు నెవరు దినము నమాజు జేయు ?
చర్చిలో, సంధ్య వార్చెను, సాయబయ్య !
సావేజిత
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి"జేంసు ప్రార్థన నెచ్చట జేసె చెప్పు " , "బ్రాహ్మణుండేమి చేసెను ? " అని వ్రాస్తే పూర్తి వ్యాకరణబద్ధ మౌతుంది. క్రమాలంకారం బాగున్నది.
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది.
ధనికొండవారు చెప్పిన సవరణలను స్వీకరించండి.
నా ఆరోగ్యం గురించి మీరిచ్చిన సలహాకు ధన్యవాదాలు.
పరమతాదరణము గల బ్రాహ్మణుండు
రిప్లయితొలగించండిరాము దర్శించె , చేసెను ప్రార్ధనలును
చర్చిలో , సంధ్య వార్చెను , సాయెబయ్య
చిత్తమును మెచ్చ నేగె మసీదు నకును
ధనికొండ రవిప్రసాద్ గారూ,
తొలగించండిపరమత సహనం కల బ్రాహ్మణుడి గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శతాబ్దాలుగా మతసహనం అనేది కేవలం హిందువుల్లోనే కన్పిస్తుంది. మనం దర్గాలకు వెళ్తాం, చర్చిలకు వెళ్తాం. కాని లౌకికవాదులం అని చెప్పుకొనేవాళ్ళు ఈమధ్య ‘అసహనవాదు’లని హిందువులకే పేరు పెట్టారు.
హిందూధర్మం అనే మహాసముద్రాన్ని వారికి తెలిసిన సెక్యులరిజం అనే ఇంగ్లీష్ వారి నుంచి ఎరువు తెచ్చుకున్న చిన్న చెంబులో ఇమడ్చుకోవటం వారికి చేత కాదు. కానీ కొందరు ముస్లిం లు , దూదేకులు హిందూ దేవతలకి మొక్కుకోవటం కూడా ఉంది. హిందువులకి అసలు శత్రువులు మైనారిటీలు కాదు. సూడో సెక్యులరిస్టులు.
తొలగించండిఈ సందర్భంగా నాకు కాశికి వెళ్ళినప్పుడు తటస్థించిన సంఘటన గుర్తుకు వస్తోంది. కాశి లో మేం ఓంకారేశ్వర ఆలయమునకు వెళ్లాం. అకారేశ్వర మహాదేవ, ఉకారేశ్వర మహాదేవ, మకారేశ్వర మహాదేవ అని మూడు శివాలయాలున్నాయి అక్కడ. మచ్చోదరి పార్క్ దాటాక పూర్తిగా ముస్లిం జనావాసాలు ఉండే ప్రాంతానికి వెనుకగా ఉన్నాయి. మేము సంధ్యాసమయంలో అక్కడికి వెళ్లాం. మూడు ఆలయాలు దర్శించు కొనేటప్పటికి చీకటి పడింది. మేం తిరిగి వస్తూంటే ఆ జనావాసాల దగ్గర ఒక ముస్లిం కుటుంబం లో ఏదో వేడుక జరుగుతోంది. వాళ్ళందరూ స్త్రీపురుషులు రకరకాల మేళతాళాలతో ఊరేగుతూ ఓంకారేశ్వర దేవాలయానికి వచ్చి ఏదో మ్రొక్కులు చేల్లిన్చుకొన్నారు. మాకు చాలా ఆనందం అనిపించింది. అక్కడి మతైకమత్యానికి.
తొలగించండిసరస సమస్యాపూరణ
తొలగించండిము రమ్యమిది మెచ్చినాఁడ ముదమున ధనికొం
డ రవిప్రసాద నీ కవ
న రసాబ్ధిన్ మున్గి తేలినాఁడను మునుపే.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ కాశీయాత్రలోని సంఘటనను తెలిపి ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
మాస్టరు గారూ ! మీ ఆరోగ్యము కుదుట బడినందుకు చాల సంతోషముగా నున్నది.
రిప్లయితొలగించండితినుట కేదియులేదని తిరుగుచుండ
గంజి వార్చుక త్రాగగ కడుపుకింత
పేదవాడని దయతోడ బియ్యమీయ
చర్చిలో సంధ్య, వార్చెను సాయబయ్య.
nice sir !
తొలగించండిthan Q sir
తొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిసంధ్య-వార్చెను అన్న విరుపుతో అద్భుతమైన పూరణ చెప్పారు. బాగున్నది. అభినందనలు.
తెలివిన్ సంధ్య యనెడి నె
తొలగించండిచ్చెలితో సహవాస మొనరఁ జేసిన పద్య
మ్మెలమిని జెప్పి మనమ్ముల
నలరారఁగఁ జేసినావు హనుమచ్ఛాస్త్రీ!
చాలా బాగుంది హనుమచ్చాస్త్రి గారూ మీ పూరణ.
తొలగించండిమాస్టరు గారికి, మిస్సన్న గారికి ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిమేరియెక్కడజేసెనుబ్రార్ధనమ్ము కామశాస్ర్రులుశుచిగానునేమిజేసె? నెవరుజేసెనమాజునానీదిగువన
నమల!వాటిసమాధానమలరెచూడు చర్చిలో,సంధ్యవార్చెను,సాయిబయ్య
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది.
మొదటిపాదంలో యతి తప్పింది. ‘మేరి యెటఁ బ్రార్థనమ్మును కోరి చేసె’ అందామా? కామశాస్త్రిని రామశాస్త్రి చేద్దాం. మూడు ప్రశ్నలకు ‘సమాధనము+అలరె’ అని ఏకవచనాన్ని ప్రయోగించారు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
క్రిస్టియన్ బిడ్డ లెచట. ప్రార్థి౦చు కొ౦ద్రు ?
రామశర్మ యుషోదయ మేమి చేసె ?
అరగజము గడ్డమునుపె౦చు"నాద్మి"యెవరు ?
| చర్చిలో | స౦ధ్యవార్చెను | సాయబయ్య |
{ ఆద్మి = హి౦ది పద౦. = మనిషి. }
ి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ ఒక సాయబు ఎన్నికలలో నిలబడి అ౦దరి
ఓట్లు స౦పాది౦చు కొరకు వేస్తున్న తిక్క వేషములు = =
" సబ్బి ఏక్ హై " యట౦చును చాటు కొరకు
బ్రాహ్మణుల తోడ హై౦దవ ప్రజల తోడ
చర్చి లో స౦ద్య వార్చెను "సాయ బయ్య"
నిజమదేమన :- వచ్చె నెన్నికల గోల |
యిపుడు తిక్క వేషములు చూపి౦చు గాని ,
గెలిచి యధికార మి౦క దక్కి౦చు కొనగ
మతదురభిమాన మతనిలో మాయ దెపుడు
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మొదటిపూరణ, ఎన్నికలకోసం మాయవేషాలు వేసే నాయకుల గురించిన రెండవపూరణ బాగున్నవి. అభినందనలు.
క్రమముగా క్రమాలంకార మమలుచేసి
తొలగించండిమాయవేషాల వారల మర్మము గొని
రెండు పూరణ లిచ్చితే! దండమయ్య!
సత్కవీ! గురుమూర్తి ఆచారి గారు!
రిప్లయితొలగించండిమరియ ప్రార్థించె నెచ్చట మహిని జెపుమ?
రామజోగయ్య పంతులు యేమి జేసె?
ఎవరు జేయునమాజును? వివరణముగ
చర్చిలో, సంధ్యవార్చెను, సాయబయ్య!!!
దేవుడొక్కడే యన్నది దెలుప శాస్త్రి
చర్చిలో సంధ్యవార్చెను,సాయబయ్య
ఆలయమున నమాజును నాచరించె
మేరి జేసెమసీదున ప్రార్ధనమ్ము!!!
శైలజ గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మొదటిపూరణ, మతసామరస్యాన్ని ప్రస్తావించిన రెండవ పూరణ బాగున్నవి.
మొదటిపూరణలో ‘పంతులు+ఏమి’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘రామజోగయ్య శాస్త్రి తా నేమి చేసె’ అందామా?
రెండవపూరణ చివరిపాదంలో యతి తప్పింది. ‘మేరి చేసె మసీదును జేరి స్తుతులు’ అందామా?
మీ ఆరోగ్యం కుదుటపడినందుకు చాలా సంతోషంగావుంది..మీరు సత్కవులను శ్లాఘిస్తు వ్రాసిన పద్యము లన్నియు చాలా బాగున్నవి..ధన్యవాదములు...
తొలగించండిమరియ ప్రార్థించె నెచ్చట మహిని జెపుమ?
రామజోగయ్య శాస్త్రి తానేమి జేసె?
ఎవరు జేయునమాజును? వివరణముగ
చర్చిలో, సంధ్యవార్చెను, సాయబయ్య!!!
దేవుడొక్కడే యన్నది దెలుప శాస్త్రి
చర్చిలో సంధ్యవార్చెను,సాయబయ్య
ఆలయమున నమాజును నాచరించె
మేరి జేసెమసీదును జేరి స్తుతులు!!!
నీ రెండు పూరణమ్ములు
తొలగించండిధారాశుద్ధి కలిగి కవితామాధురి తా
ధారాళమ్మై శైలజ
వారెవ్వా యనుచు మెచ్చబడు నేవేళన్.
క్రీస్తు దేవుని కొల్తురు క్రైస్తవు లట
రిప్లయితొలగించండిభూసు రోత్తము డుదయము భాసురముగ
యవన రాజ నగర గమ నాభి లాషి
చర్చిలో, సంధ్యవార్చెను, సాయబయ్య.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎనలేని పద్యరచనా
తొలగించండిఘనత గలుగు పోచిరాజు కామేశ్వర రా
వనఘునకు వందన శత
మ్మును గడు భక్తి నొసఁగెదను పూతాత్మునకున్.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పద్యరత్నమును గాంచి ఆనందాశ్చర్యసంభ్రమములుప్పొంగ నిశ్చేష్టుడ నైతిని. ఛందస్సున, వ్యాకరణమ్మున సూక్ష్మ ములను గఱుపిన గురువులు మీరు. మీకు నెల్లప్పుడు నేను పాదాభివందనములు సేయ నర్హుడను. మీ శతాశీస్సులు నాపై యనిశమ్ము ప్రసరింప జేయ గోర్తాను.
తొలగించండిగఱపిన
తొలగించండిక్రైస్తవము స్వీకరించిన కన్య "సంధ్య",
రిప్లయితొలగించండిఫ్రెంచి వ్యాపారి "వార్చెను" - ప్రేమ కథకు
కాపు "సాయబయ్య"! తరచు కలుసుకొనిరి
చర్చిలో సంధ్య, వార్చెను, సాయబయ్య!
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
తొలగించండివైవిధ్యమైన విరుపుతో ‘క్రైస్తవకన్య సంధ్య వ్యాపారి వార్చెనును చర్చిలో కలుసుకున్నదన్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
సాంద్రయశా! ఆచార్య ఫ
తొలగించండిణీంద్రా! త్వత్కవనసుధ గణింతును, సుకవుల్
మంద్రస్వరమున నినుఁ దా
మంద్రు గద కవీంద్రు డంచు ననవరతమ్మున్.
మీ అభిమానానికి ధన్యవాదాలు శంకరయ్య గారు!
తొలగించండిఏసుపాదము మిత్రుని యెచట జూచె
రిప్లయితొలగించండియేటి దాపున బ్రాహ్మడుండేమి జేసె
ప్రార్థన మసీదునందెవరాచరించె
చర్చిలో సంధ్యవార్చె సాయిబయ్య.
2క్ర్రిస్మసు రోజు యేసోబేగె క్రీస్తును గన
చర్చిలో;సంధ్యవార్చెను సాయిబయ్య
ప్రక్క నుండగ బ్రాహ్మడు వార్ధి చెంత
కనుడు భారతీయైక్యత కన్నులార.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ మొదటి పూరణ, విరుపుతో మీ రెండవ పూరణ బాగున్నవి.
మొదటిపూరణలో ‘మిత్రుని నెచట జూచె| నేటిదాపున’ అనండి.
రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘క్రిస్మసు దినాన జా నేగె...’ అనండి.
చేవగల పదములన్ మఱి
తొలగించండిభావమ్ములఁ గుమ్మరించి బల్లూరి ఉమా
దేవీ! చక్కని పూరణ
లే వంకలు లేనిరీతి నిచ్చెదవు కదా!
మీఆరోగ్యంకుదుటబడినందుకు సంతోషంగా వుంది.మిమ్మల్ని ఆదివారం కలవబోతున్నందుకు ఆనందంగా వుంది.
రిప్లయితొలగించండిమీసూచనలను చూశాను.సవరిస్తానన్నయ్యగారూ.
ఉమాదేవి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
ఆదివారం కలువబోతున్నామన్నారు... ఎక్కడ? ఎందుకు? జ్ఞాపకం రావడం లేదు. అది ఏ సమావేశమో కాస్త గుర్తు చేయండి.
శంకరయ్యగారూ...నమస్సులు! మనము అయుత కవితా యజ్ఞ సమావేశమునకు పోవలెననుకొన్నాము గదా! ఆ విషయమే బల్లూరివారు ప్రస్తావించినారు.
తొలగించండిసంతు నశియింప నామము సాయబయ్య
రిప్లయితొలగించండియనుచు పెట్టిరి విప్రు బాలునకతండు
సాంద్ర తీరాన నగర రాజమ్ము క్రిష్టు
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండి‘క్రైస్ట్‌చర్చ్’ నగరంలో బ్రాహ్మణుడైన సాయబయ్య సంధ్య వార్చాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు. (హిందువులకు తురకపేర్లు పెట్టడం సాధారణమే).
ఈ పగిది సంధ్య వార్చెడి
తొలగించండిబాపని నా క్రైస్టుచర్చు పట్టణమందున్
చూపితివి సాయబయ్యను
బాపురె మీ నేర్పు చెప్ప వశమే నాకున్!
గురువుగారి అభినందనలకు ధన్యవాదములు
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిబ్రాహ్మణుండయ్యుఁ దాఁ గ్రైస్తవమ్ముఁ గొనియు
మహ్మదీయుల పిల్లతో మనువునాడి
తన్మతమ్మునుం గొనియునుఁ దప్పి చనక
చర్చిలో సంధ్యవార్చెను సాయబయ్య!
గుండు మధుసూదన్ గారూ, అభినందనలు.
తొలగించండిముమ్మతముల నొక యింటను
నెమ్మదిగా నిల్పినట్టి నేర్పును గంటిన్
కమ్మని పూరణ మిది యని
సమ్మతిఁ దెల్పెదను గుండు సద్వంశమణీ!
ధన్యోఽస్మి శంకరయ్యగారూ! _/\_
తొలగించండిఏసుపాదము నకు పెండ్లి యెచట జరిగె ?
రిప్లయితొలగించండినే టియొడ్డున బ్రాహ్మణు డేమిచేసె ?
మాస్కు లోనను ప్రార్థించు మాన్యుడెవరు ?
చర్చిలో, సంధ్యవార్చె ను, సాయబయ్య
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మాస్కు Mosque’ అనడం ఇంగ్లీషులోనే కదా! ‘మరి మసీదులో ప్రార్థించు మాన్యు డెవరు’ అంటే ఎలా ఉంటుంది?
సకలాసద్గుణభంజను
తొలగించండినకు అన్నపరెడ్డి సత్యనారాయణ రె
డ్డికి స్నేహశీలి మధుర క
వికి నా వందనము లిడుదు వేయివిధములన్.
గురువర్యులకు నమస్సులు. మీ దీవెనెలే సదా కోరుకుంటాను.
తొలగించండిగురువర్యుల దీవెనలే
తొలగించండినిరతము నడిపించుచుండ, నిగమము నిడుచున్
కరమగునుత్సాహముతో
పరుగెత్తదె నాకలమ్ము పదములవెంటన్
ఆదివారము నేడిదే పోదు ప్రభుని
రిప్లయితొలగించండిజూచి వత్తును మీరిట వేచియున్న
ననిన స్నేహితురాలు తా జనిన వేళ
చర్చిలోసంధ్య వార్చెను సాయబయ్య.
(వార్చెను = వేచియుండెను)
మిస్సన్న గారూ,
తొలగించండివార్చు శబ్దానికి ప్రతీక్షించు అనే అర్థాన్ని గ్రహించి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
వార్చిన శబ్దార్థమ్మును
మార్చిన నైపుణ్యము గల మంచి కవీ! యే
మార్చెడి యీ విద్దె లెచట
నేర్చితి వయ్యా? పొగడుదు నిన్ మిస్సన్నా!
గురువులు నేర్పిన విద్యలు
తొలగించండిపరువును పెంచుచును శిష్యు బెద్దను జేయున్
సరి! మీరెరుగరె? మీరలు
సరిదిద్దిన విద్దె లివియ సారసనేత్రా!
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండిమీ ఆరోగ్యము మెరుగవుతున్నందులకు సంతోషము
బియ్యము గడిగి పోయ్యిపై పెట్టి నట్టి
మగువకూర్చుండె పనియంచు మరచి తాను
చర్చిలోసంధ్య, వార్చెను సాయబయ్య
ఉరికి గంజిని యతనిక యోర్వలేక.
అల్లరి పనులలో ఘనుడాకతాయి
సాయబై యుండి యొకనాడు శాస్త్రి నంచు
పిలక జంధ్యమ్ము ధరియించి వేగ వెడలి
చర్చిలో సంధ్యవార్చెను సాయబయ్య
గురువులు మెచ్చిన చాలును
తొలగించండిమురిసెను మామానసములు మోదము తోడన్
విరిసిన కుసుమము లయ్యె త
మరి యా రోగ్యమెఱగినను మామదు లెల్లన్
ఆంజనేయ శాస్త్రి గారూ,
తొలగించండివైవిధ్యముగాఁ జక్కని
భావమ్ములఁ బూరణముల పద్యమ్ములతో
నీవే మెప్పించితివి ర
సావిష్కృత! ఆంజనేయ శాస్త్రి! విరించీ!
‘అందరికీ శకునాలు పలికే బల్లి కుడితిలో పడిందట!’ అన్న సామెత మాదిరిగా మీ గురించి వ్రాసిన నా పద్యంలో రెండు గణదోషాలు దొర్లాయని గుండు వారు ఫోన్ ద్వారా తెల్పడంతో సవరించాను. మీరు ఆ దోషాలను గమనించకపోవచ్చు.
ప్రార్థనలు క్రైస్తవులు జేయు ప్రాంత మెచట?
రిప్లయితొలగించండిఏటి దరి నిల్చి బ్రాహ్మణుడేమి జేసె ?
"అల్లహో అక్బ " రని బిల్చు నతడెవండు ?
చర్చిలో, సంధ్యవార్చెను, సాయబయ్య.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సలలిత పద్యవిన్యాసము
నలరించెడి భావదీప్తి యద్భుతరీతిన్
వెలసెడి పూరణములతో
గెలిచితివయ భాగవతుల కృష్ణారావూ!
సాయభయ్యగ జీవించి శాస్త్రి గారు!
రిప్లయితొలగించండినాటకమ్మది ముగియంగ దాటి నంత
చర్చిలో సంధ్య, వార్చెను సాయభయ్య
వసతిఁ జూపఁ దనకుతానె వంటఁ జేసి!
ఆరోగ్యము కుదుటఁ బడగ
తొలగించండిపూరణల సమీక్షఁ జేయఁ బూనితివయ్యా!
పేరున కొక పద్యమ్మును
ధారగ రచియించి భుజముఁ దట్టెడు గురువా!
తారలు నాకాశమ్మున
హారతులిడుతున్న దాక యశమందుమయా!
గౌరీశుల దీవెనలవె
యారోగ్యమునంద జేయు నౌషధులగుచున్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
మెండగు సౌహార్దమ్మును
గుండెలలో నిల్పుకొను సుగుణ సంపదతో
నిండితివి నా మనమ్మున
గుండా సహదేవుడు! ఇదె గొను మభినుతులన్.
అయుతకవితాయజ్ఞము వారి సభకు వస్తున్నారని విన్నాను .నేను వద్దామనుకొంటున్నాను.అందుకే
రిప్లయితొలగించండినిజమే... మరిచిపోయాను. అప్పటికి ఆరోగ్యం సహకరిస్తే తప్పక వస్తాను.
తొలగించండిఅన్ని మతములు నొక్కటై యలరు వేళ,
రిప్లయితొలగించండిపేరుకే కాని భక్తికి భేద మచట
లేదనెడు వారి భావమ్ము లిటులె యుండు!
“చర్చిలో సంధ్య వార్చెను సాయిబయ్య!”
శ్రీధర రావు గారూ,
తొలగించండిభక్తికి భేదభావం లేదంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
భేదభావమ్ము భక్తికి లేదటంచు
చక్కనైనట్టి పూరణఁ జయ్యఁ జెప్పి
మేలు పద్యమ్ము నల్లఁగఁ జాలినావు
పల్కెద నిదె శ్రీధర రావు! భళి! సెబాసు!
మేరి నిన్నేరి కోరితి మీరబోకు
రిప్లయితొలగించండిచర్చియందున నుదయానచర్చ జరుప?
చర్చిలోసంధ్య-వార్చెను|సాయిబన్న
మతము వేరు|బ్రతుక?సన్నిహితమె ప్రేమ|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిభావం కొంత గందరగోళంగా ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కమ్మనైన పూరణమ్ముల నందించి
మోద మిచ్చెడి కవిముఖ్యుఁ డీవు;
సకలసౌఖ్యములను శాంతి సత్కీర్తిని
ఈశ్వరుఁ డిడు నీకు ఈశ్వరప్ప!
పద్యములో పూరణముల
రిప్లయితొలగించండిహృద్యముగా కవి వరులను హెచ్చగు నోర్పున్
పద్యములోనే మెప్పుల
నాద్యంతము మెచ్చినారహహ! గురువర్యా !
రిప్లయితొలగించండికందివరుల కొలువున నే
బొందితి ఆదరణ, నాదు పొడిపొడి పలుకున్
అందముగ జేసి నేర్పిరి
కందము, కవి శంకరయ్య కవనపు రాజుల్
గురువర్యుల దీవెనలే
రిప్లయితొలగించండినిరతము నడిపించుచుండ, నిగమము నిడుచున్
కరమగునుత్సాహముతో
పరుగెత్తదె నాకలమ్ము పదములవెంటన్
ధన్యవాదములు గురువుగారు.పద్యరూపంలో మీ అమృతాక్షరముల ఆశీస్సులు పొందినందుకు చాలా సంతోషించాను.. ఇంకా బాగా వ్రాయాలనే తపనని,ప్రోత్సాహాన్ని కల్గించారు .. సర్వదా కృతజ్ఞతలు..
రిప్లయితొలగించండినాయకజనహృదయజేత సాయబనుచు
రిప్లయితొలగించండిభాగ్యదాయకమతమెంచ బాప్టిసమని
గట్టి మతమార్పిడుల ట్రెండు ( దారి ) బట్టి ద్విజుడు
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య
కళ్యాణ్ గారూ,
తొలగించండిఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మర్చి పోవుచు వోట్లకు మతములెల్ల
రిప్లయితొలగించండిక్రైస్తవుండహ! వెడలెను కైలసమున
కర్చు కొనుచు మోడినహహ!గాఢముంగ...
చర్చిలో సంధ్యవార్చెను సాయబయ్య!