14, ఏప్రిల్ 2016, గురువారం

పద్యరచన - 1194

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

38 కామెంట్‌లు:

  1. పంకజ ముఖివండి పెట్టెను
    వంకాయను వివిధ రుచుల వల్లభున కటన్
    వంకలు లేకను ప్రీతిగ
    శంకింపక తినెను మెచ్చి శాకము కడకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      తాటికాయలను వంకాలుగా భావించి వ్రాసిన పద్యం బాగున్నది.
      మొదటిపాదంలో గణదోషం. ‘పంకజముఖి వండి యిడెను’ అనండి.

      తొలగించండి

  2. వంకాయల బెట్టి రిటన్
    శంకరులయనన్ ఘుమఘుమ సాంబారు గనన్
    చెంగున జిలేబి వచ్చెన్
    దంగుడు షడ్రుచి నమరెగ దానిట జూడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      ఎంతైనా మీ నాయర్ గ్రేట్... తాటికాయలతో వంకాయల కూర చేశాడు.
      ‘దానిని నిట జూడన్’ అనడం సాధువు. ‘దానిని జూడన్’ అనండి.

      తొలగించండి

  3. తాటిముంజలజూడుముదనరెనచట దానిగుంజునుదినినచోదాపమణగు పండ్లగుంజునుగాల్చుకుపల్లెటూరు వారుతిందురుమరియునునారసమును నెండబెట్టుదురెండలోనెండువరకు
    తాండ్రయనబడుదానినితనివిదీర
    తింద్రు,తింటినినేనునుదీపియగుట
    తిందుననినచోమీకునుదెత్తుసామి!

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా, జిలేబీ గారూ,
    చిత్రాన్ని ‘పరిశీలించి’ పద్యం వ్రాయమన్నాను. మీరు సరిగా పరిశీలించలేదు. అవి వంకారయలు కావు. ‘తాటికాయలు’. వాటిలోని ముంజలు ఈ వేసవికాలంలో విరివిగా దొరుకుతాయి. చలువ చేస్తాయంటారు. మీ సౌలభ్యంకోసం ఆ కాయల్లోని ముంజల చిత్రాన్ని కూడా చేర్చాను.
    పోచిరాజు సుబ్బారావు గారు వాటిని టక్కున గుర్తుపట్టారు.

    రిప్లయితొలగించండి

  5. కలకంటి కంట పడినది ఏదైనా
    కలకండ యే గదా కంది వారు :)


    ఆడు వారికి తెలియును వంట రుచులు
    తాటి చెట్టుల ఘనతలు తరుణి నరయు ?
    వనిత జూచెను గదవాటి వంక నయ్య !
    తాటి ముంజలు వంకాయ తరము నయ్యె !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.
      రెండవపాదాన్ని ‘తాటి ఘనతలు తరుణుల తరమ తెలియ’ అనండి. బాగుంటుంది.

      తొలగించండి
  6. ముంజలు తాటివి జూడుడు
    రంజుగ నేనీరు కొబ్బరందున గలవే
    గుంజును నీరును తోడుగ
    నంజుకు తిన్నట్టివారి నంటును చలవే.

    రిప్లయితొలగించండి

  7. ముంజను జిలేబి జూచెను
    టంచనుగా వచ్చె నిచ్చట గదా! కల్లున్
    గాంచెను వలదని వంకా
    యంచు కవితను వినిపించి యవనిక వేసెన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      అప్పుడే తెర దించేస్తే ఎలా? ఇంకా కవిమిత్రులు శంకరాభరణం వేదికపై తమ పద్యాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు.
      ముచ్చటగా వాసిన మూడవపద్యం కూడ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  8. పంజా విసరగ హరియే
    నంజలు పడమంటు జనుల నల్లాడించన్!
    కంజదళాక్షుండైనన్
    ముంజలుఁ దిన పరగుదీసి ముందున నిలుచున్!

    రిప్లయితొలగించండి
  9. వేసవి కాలపు దాహపు
    త్రాసము దీర్పంగ లేతతాటి ఫలములున్
    వీసపు ధరలం దొరుకును
    దోసము సేయవవి త్రాగ తోషము నిచ్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      అయినా ‘వీసానికి’ ఎక్కడ దొరుకుతున్నాయండీ? పది రూపాయలకు మూడో, నాలుగో ఇస్తున్నారు..

      తొలగించండి
  10. వంకాయ వంటి రూపము
    టెంకాయగ నీళ్ళు నింపి |ఠీవిగముంజై
    శంకయు లేకన్ తెల్లటి
    బింకమ్మునతాటి కాయబిగువున నిలచెన్|
    2.తాటిముంజల శక్తి?తలదించు నట్లుగా వాడి,వేడినిగూల్చు వైనమందు|
    చెట్టు లాకున దాగి-పట్టుదప్పక యుండి|పక్షుల కందని ప్రతిభయందు
    వైశాఖ మందున వైరుధ్య బంధమై తక్కువ ధరలతోమక్కువైన
    కత్తిగాట్లకునగ్గి చిత్తంబు రీతిగా నీటి నిల్వలబంచు నేర్పు గలిగి
    మానవాళికి రుచికర మైన ఫలము|
    ప్రకృ తందించు పరమార్థ సుకృతంబు|
    నారికేళంబురీతిగా నాణ్య మైన
    శక్తి,యుక్తులు గలిగిన సత్తి,గుత్తి|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె.ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      సీసం ఎత్తుగీతి రెండవపాదంలో గణదోషం. ‘ప్రకృతి యందించు పరమార్థ...’ అనండి.
      (ప్రకృ అన్నపుడు ప్ర లఘువే. ప్రకృతి+అందించు అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

      తొలగించండి
  11. తాటి కాయలు జూడగ నేటి కైన
    ఒడలు పులకించు, నోట నీరూరుచుండు!
    తాకినంత చేజారెడి తాటి ముంజ
    చిన్న నాటి గురుతులను చిలుకరించు!

    రిప్లయితొలగించండి
  12. చెలిచెక్కిలి వంటి ముంజెలు
    చలువని వేసవిని తినగ జల్లను ఎదలో
    మిలమిల మెరయుచు తెల్లగ
    కలకల మునురేపు నంట గాంచగ ముదమున్

    క్షమించాలి నాకు కొంచం డౌటు వచ్చింది ఇవి వంకాయలు కాదేమో అని .ఎన్నిసార్లు చూసినా ఎవరు రాయలేదు .ఇంకసరె అనిరాసేసాను .జిలేబి గారుకుడా సరే అనుకుని ఉంటారు.పోద్దున్న చూస్తె పైన కనిపించాయి .అదన్నమాట అసల్ సంగతి .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మొదటిపాదంలో గణదోషం. ‘చెలిచెక్కిలి సరి ముంజెలు...’ అనండి.

      తొలగించండి
  13. చక్కని తీయని ముంజలు
    మక్కువతో దినని వారు మహిలో గలరే
    మిక్కిలి మేలొసగుననుచు
    పెక్కురు తినుచుంద్రు వీని వేసవి లోనన్!!!

    రిప్లయితొలగించండి
  14. తాటి ముంజలివియు తాపము తగ్గించు
    చలువ చేసి మదికి శాంతి యొసగు
    వేసవందు జూడ వీటి వెలయుహెచ్చు
    తీయనైన ముంజ తినగ రండు.

    2.మక్కువతోడను తొనలను
    చక్కగ పైపొట్టు దీసి చవిచూడంగన్
    లెక్కకు మించియె తిందురు
    నక్కర తోడను జనములు నవనిన్ గనుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘వేసవందు జూడ’ అన్నదానిని ‘వేసవిని గనంగ’ అనండి.

      తొలగించండి
  15. వేసవి తాపము దీర్చుచు
    వాసిగ నారోగ్యమిచ్చి వరుధను జనులన్
    తాసంరక్షించు నదియె
    భేషజముగ తాటిముంజ భేషుగ నిల్చున్

    రిప్లయితొలగించండి
  16. వేసవి తాపము దీర్చుచు
    వాసిగ నారోగ్యమిచ్చి వరుధను జనులన్
    తాసంరక్షించు నదియె
    భేషజముగ తాటిముంజ భేషుగ నిల్చున్

    రిప్లయితొలగించండి
  17. చిన్నతనమునందు చే రి మాపొలమున
    తాటిముంజలగని తనివితోడ
    కొడవలి దొరకకను కొరికి మాపండ్లతో
    తిన్నరోజులు మరి తిరిగిరావు

    రిప్లయితొలగించండి
  18. సరియైనకత్తి / కొడవలి దొరకక చెట్టుపైనుండి గెలలను కాళ్ళతో తన్ని పడగొట్టి తాటికాయలను పండ్లతో చీల్చి ముంజలను తిన్నరోజులు గుర్తుకొస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      నా చిన్నతనంలో మీలాగా సాహసాలేం చేయలేదు కాని, మా అమ్మమ్మ ఊరికి వెళ్ళినపుడు తాటివనానికి వెళ్ళి గౌడులను బ్రతిమిలాడి కాయలు ఇంటికి తెచ్చుకొంటే మా మామయ్య కోసి ఇచ్చేవాడు.

      తొలగించండి