పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఈ పద్యంలోని విశేషం... ఎవరైనా పద్యం చదవడం ప్రారంభిస్తే కొద్దిగా వినగానే నేను అది ఏ పద్యమో చెప్పగలను. కాని ఈ పద్యాన్ని పూర్తిగా వినిపించినా ఇది ఆటవెలది అని గుర్తు పట్టలేను.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీరు చెప్పే వరకు నేను గమనించ లేదు. బహుశ అక్షరములు ఎక్కువ గా నుండుట వలన, పదములు తదుపరి పాదమున కొనసాగుట వలన నయియుండ వచ్చు.
మడిపల్లి రాజకుమార్ గారూ, మీ పూరణ బాగున్నది. మొదటిపాదంలో ‘ప్రాసయతి’ తప్పింది. ప్రాసముందున్న అక్షరాలు గురులఘు సామ్యం కలిగి ఉండాలి. అంటే ప్రాసయతిలో ప్రాసకు ముందున్న అక్షరం గురువైతే గురువు, లఘువైతే లఘువు రెండుచోట్ల ఉండాలి. అన్యదేశ్యమైనా అది ‘దవాఖానా’. దవఖానా అనడం గ్రామ్యం. నష్టాన్ని క్షౌరమనడం వ్యావహారిక జాతీయం. మీ పూరణలో మొదటి రెండు పాదాలను సవరించండి.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో ‘త్రాగ నారోగ్య మొదవును’ అనండి. మూడవ పూరణలో ‘కలసి+ఉన్న’ అన్నపుడు సంధి లేదు. ‘అంద రేకమైన..’ అనండి.
పాల వలన పుష్టి వచ్చు జనులకు, దీ
రిప్లయితొలగించుపాల వలన వెలుగు వచ్చును, మురి
పాల వలన ప్రేమ బంధము హెచ్చు, కో
పాల వలన వైరమే లభించు!!
జిగురు సత్యనారాయణ గారూ,
తొలగించువాహ్! అద్భుతమైన పూరణతో శుభారంభం చేశారు. పూరణలోని శబ్దాలంకారం అలరించింది. అభినందనలు.
గురువు గారికీ నమస్కారములు
రిప్లయితొలగించుసాటి జనుల పట్ల సఖ్యతనే కల్గి
మసలు కొన్న వాడు మాన్యుడగును
సహన మనుచు లేక అహముతో చూపుకో
పాలవనన వైరమే లభించు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించుమీ పూరణ బాగుంది. అభినందనలు.
వలన->వనన... టైపాటు.
తప్పు జేయ నేమి దండించ
రిప్లయితొలగించుబోవకు
మృదువచనము తోడ కృపను కలిగి
దిద్దవలెను గాని తీక్ష్ణత మరియు కో
పాలవలన వైరమేలభించు
విరించి గారూ,
తొలగించుమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
నోరుమంచిదైన నూరుమంచిదెయౌను
రిప్లయితొలగించుమాటజారరెపుడు మంచివారు
పరులపైన నెపుడు ప్రకటించునట్టి శా
పాలవలన వైరమే లభించు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాయబారంలో శ్రీకృష్ణుల వారు:
రిప్లయితొలగించుమామా! సత్యవతీ పౌత్రా!
పాండు సుతులు మిమ్ము పంచుమనిన సగ
పాల వలన వైరమే లభించు
ననిన నైదుగురకు నైదూళ్ల నిమ్మని
విన్నవించి నారువినగ మీరు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించుపుష్టికలుగునార్య!తుష్టిగామనిషికి
పాలవలన,వైరమేలభించు
కారణమ్ములేకకాంతనుదూషించ భూరిశాంతమెపుడుభూషణమ్ము
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కామముతో సంతత పర
రిప్లయితొలగించుభామిని వలలోన జిక్కి వ్రయ్యుట కంటెన్
క్షేమమగు నిజ గృ హిణిపై
కామాతురుడైన నరుడె గాంచున్ ముక్తిన్
Ninnati purana parisilimchamdi.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించుమీ (నిన్నటి) పూరణ బాగున్నది. అభినందనలు.
కాపురములు గూలు గార్చిచ్చు చెలరేగు
రిప్లయితొలగించుశాంతి మృగ్యమవును సంతతమ్ము
మమత లన్ని మాయు మనుజుల మధ్య కో
పాల వలన వైరమే లభించు!!!
శైలజ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శాంత గుణము వలన శత్రువే హితుడౌను
రిప్లయితొలగించుమాట కఱకు చేత మనసు విరుగు
మిత్రు డొక్కడైన మిగులడు తుదకు కో
పాల వలన వైరమే లభించు.
భాగవతుల కృష్ణరావు గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏల నీకు ప్రేమ యీశునిపై గౌరి
రిప్లయితొలగించుబూదిపూత మేన బుస్సుమనుచు
వేచియుండు కాటువేయుటకు సరీసృ
పాల వలన వైరమే లభించు.
శ్రీ మిస్సన్న గారికి హేట్సాఫ్..అందరం కోప,తాప,శాపాల దగ్గర ఆగిపోతే మీరు సరీసృపాలను పట్టుకొచ్చారు..చాలాబాగుంది పద్యం..
తొలగించుధన్యవాదాలు శైలజ గారూ.
తొలగించుమిస్సన్న గారూ,
తొలగించువైవిధ్యంగా, మనోరంజకంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
కోపము వలన కలుగు బహు దుఃఖమ్ములు
రిప్లయితొలగించుచెరచు గార్యములను శ్రీఘ్రమనవ
రతము వ్యర్ధములు నిరవథిక కోప తా
పాల వలన వైరమే లభించు
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ పద్యంలోని విశేషం... ఎవరైనా పద్యం చదవడం ప్రారంభిస్తే కొద్దిగా వినగానే నేను అది ఏ పద్యమో చెప్పగలను. కాని ఈ పద్యాన్ని పూర్తిగా వినిపించినా ఇది ఆటవెలది అని గుర్తు పట్టలేను.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీరు చెప్పే వరకు నేను గమనించ లేదు. బహుశ అక్షరములు ఎక్కువ గా నుండుట వలన, పదములు తదుపరి పాదమున కొనసాగుట వలన నయియుండ వచ్చు.
తొలగించుఅదే కదా నేను చెప్పింది. చూసి చదివితే ఆటవెలది... వింటే మాత్రం అది ఏ ఛందస్సా అని తికమకపడడం ఖాయం!
తొలగించుధనము కొరిగెడు దవఖానల నరక కూ
రిప్లయితొలగించుపాల వలన క్షౌరమే లభించు
చదువు" కొనగ" పాఠశాలల లోనిలో
పాల వలన వైరమే లభించు
మడిపల్లి రాజకుమార్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది.
మొదటిపాదంలో ‘ప్రాసయతి’ తప్పింది. ప్రాసముందున్న అక్షరాలు గురులఘు సామ్యం కలిగి ఉండాలి. అంటే ప్రాసయతిలో ప్రాసకు ముందున్న అక్షరం గురువైతే గురువు, లఘువైతే లఘువు రెండుచోట్ల ఉండాలి. అన్యదేశ్యమైనా అది ‘దవాఖానా’. దవఖానా అనడం గ్రామ్యం. నష్టాన్ని క్షౌరమనడం వ్యావహారిక జాతీయం. మీ పూరణలో మొదటి రెండు పాదాలను సవరించండి.
స్వాస్థ్యు కైన వైద్య శాలలు నరక కూ
తొలగించుపాలు కాగ, చావు జోల పాడు
చదువు" కొనగ" పాఠశాలల లోనిలో
పాల వలన వైరమే లభించు
ఇప్పుడు మీ పూరణ అన్నివిధాల బాగున్నది. అభినందనలు.
తొలగించుచీపురందియోర్తు చెత్తను నూడ్చుచు
రిప్లయితొలగించుదారి ప్రక్క దాని తగులబెట్టె
పచ్చి చెత్త నుండి చిచ్చది రామి,ధూ
పాల వలన వైరమే లభించు.
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
తొలగించుపొగ బెట్టి పోరు పుట్టించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆవు పాలు తాగ నారోగ్య మొదవేను
రిప్లయితొలగించుపెద్దవారి వల్ల ముద్దు తీరు
కలతలెక్కు వైన కడలేని శాప,కో
పాలవలన వైరమే లభించు.
పాలు నీరు వోలె బాలురెల్లరు చేరి
పాఠశాలకేగ బలము పెరుగు
చిన్ని చిన్ని కలతె చెరుపుబంధ మిల కో
పాలవలన వైరమే లభించు.
అందరుకలిసున్న ఐక్యత పెరిగేను
పోరు చున్న కొలది పుట్టు రగడ
అర్థమెరుగ నట్టి యావేశమేల,కో
పాలవల్ల వైరమే లభించు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించుమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘త్రాగ నారోగ్య మొదవును’ అనండి.
మూడవ పూరణలో ‘కలసి+ఉన్న’ అన్నపుడు సంధి లేదు. ‘అంద రేకమైన..’ అనండి.
పాలనమ్ము వాడు పాలనీరుగలుప
రిప్లయితొలగించుపాలనమ్ము చెడగ ప్రభుతకైన
పాలుపంచకున్న మేలువారసులకు
'పాల' వలన వైరమే లభించు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాలు నీరు, పాలుపంచు... సరే. కాని ప్రజా పాలమ్మునకు ‘పాల’కు సంబంధం?
అయితే వేరే పాలు పెడతానండీ...ధన్యవాదములు.
తొలగించుపాలనమ్ము వాడు పాలనీరుగలుప
పాలు సరిగనీక పంట రైతు
పాలుపంచకున్న మేలువారసులకు
'పాల' వలన వైరమే లభించు.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించుసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాలు జీర్ణ శక్తి,బలమును జేకూర్చు|
రిప్లయితొలగించుకాలమహిమ వలన కల్తిబెరుగ?
లేనిరోగాములను మానక బెంచుచు
పాలవలన వైరమేలభించు|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ పూరణ బాగుంది. అభినందనలు.
రోగము... రోగాము అయింది.
నాది యీ బలపము-కాదు నా బలపమ్ము
రిప్లయితొలగించునీది కాదు నాది- కాదు నాది
యనుచు వాదులాడు నాబాలురకు బల
పాల వలన వైరమే లభించు!!!
డా. విష్ణునందన్ గారూ,
తొలగించుమీ ‘బలపాల వైరం’ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించు* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(కొ౦ డ అ ద్ద మ ౦ దు కొ ౦ చె మై యు ౦ డ దా)
....... ......................... ......................
" ఉత్సాహము "
ఉనికి నీది కాని యెడల.
నూరకు౦ట మేలగున్
గనపడు గద ముకుర మ౦దు
క్ష్మాధరమ్ము చిన్నదై
వినుము నోరు మ౦చి దైన
వేయి శుభము ల౦దు గా
పనికి రాని పాల వలన
వైరమే లభి౦చు రా
ముకురము = దర్పణము • పాలు = రూపా౦తర౦ = ప్రాయి = పౌరుషము
పనికిరాని పాల వలన = పనికి రాని పౌరుష౦ వలన
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించుమీ ఉత్సాహం చక్కని నీతితో ఉరకలు వేసింది. కాని ‘పాల’కు పౌరుష మనే అర్థం?
శాంతము గల వారు సర్వజనాలితో
రిప్లయితొలగించుకలసి మెలసి యుంద్రు కక్ష లేక
ప్రేమ భావముడిగి పెంపెక్కినట్టి కో
పాల వలన వైరమే లభించు.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొగడితనను తానె పొంగిపోవు చు మది
రిప్లయితొలగించుతెగడిపరులనెపుడు తృప్తిపడెడు
మలిన హృదయుడైన మనుజుడు పల్కు గ
ప్పాల వలన వైరమేలభించు
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
తొలగించుమీ ‘గప్పాల’ పూరణ బాగున్నది. అభినందనలు.
రసిక రాజుననుచు రచ్చబండల నెక్కి
రిప్లయితొలగించుమెప్పు కోరు కొనగ ముప్పు తెచ్చు
వక్ర బుద్ధి చెలగు వ్యంగ్యపు బ్లాగు ట
పాల వలన వైరమే లభించు