28, ఏప్రిల్ 2016, గురువారం

పద్యరచన - 2008

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

46 కామెంట్‌లు:

  1. అందము లొలికెడి నృత్యము
    చిందులు వేయుచు కలాపి చిలిపిగ పోరన్
    విందును జేయును తనకని
    బంధము నకులొంగె కేకి బహు మోదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. “కాంతపక్షి” యేకాంత నితాంత నృత్య
      హృద్య విన్యాస ములు నేత్ర ఖాద్య మగుచు
      తన్మయత్వము నొందురు తరచి తరచి
      జూడ చిత్ర విచిత్రము చూపరులకు.

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. Tbs శర్మ గారూ,
      మీ పద్యం హృద్యంగా ఉంది. అభినందనలు.
      ‘తన్మయత్వము నందించు’ అనండి. ‘ఒందురు’ సాధువు కాదు.
      (మీరు పొరపాటున అక్కయ్య గారి సామ్రాజ్యంలో అడుగు పెట్టారు. వారి పూరణ క్రింద ఉన్న ‘ప్రత్యుత్తరం’ క్లిక్ చేశారు. వారి పద్యంపై వ్యాఖ్యానించాలన్నా, వారి కేదైనా సందేశం ఇవ్వాలన్నా ఆ పని చేయాలి. మీ పూరణ పెడుతున్నారు కనుక అట్టడుగున ఉన్న ‘వ్యాఖ్యను జోడించండి’ అన్నదాన్ని క్లిక్ చేయాలి).

      తొలగించండి
  2. ఉత్తమనృత్యము చూడగ
    చిత్తము రంజిల్లుగాదె చేలో మధుకల్
    మెత్తగ యడుగులు వేయగ
    కొత్తగ మదిలో నిరతము కూరిమి నిండెన్.
    మధుక:నెమలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది.
      ‘మధుకల్’...? ‘మధుకము’ అంటే ఇప్పచెట్టు అని నిఘంటువు చెపుతున్నది.

      తొలగించండి
  3. అందములీనెడి నెమలుల
    బంధంబది జూడ నొప్పు, భాగ్యంబవగన్
    విందొనరించును కనులకు
    డెందమలరు దృశ్యమ్ము నటించెడివిధమున్!

    రిప్లయితొలగించండి
  4. అందములీనెడి నెమలుల
    బంధంబది జూడ నొప్పు, భాగ్యంబవగన్
    విందొనరించును కనులకు
    డెందమలరు దృశ్యమ్ము నటించెడివిధమున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు శిష్ట్లా వారూ మీ పద్యము మనోహరముగ నున్నది. నాలుగవ పాదంలో గణభంగమైనది.

      డెంద మలరు దృశ్య మిట నటించెడి విధమున్!

      అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. అవునండి...తొందరలో గమనించలేదు..ధన్యవాదములు....మధురకవీ!

      తొలగించండి
    3. అవునండి...తొందరలో గమనించలేదు..ధన్యవాదములు....మధురకవీ!

      తొలగించండి

  5. నెమలిజంటనుజూడుముకమల!నీవు నెంతయందముగానుండెనేమిహొయలు కనులపండువయాయెనుగనగనాకు నెమలిసొగసునువర్ణింపనేరితరము?

    రిప్లయితొలగించండి
  6. మధుక : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 Report an error about this Word-Meaning గ్రంథసంకేతాది వివేచన పట్టిక
    సం. వి. ఆ. స్త్రీ.
    తిప్పతీఁగ.
    అ. న. ము.
    అతిమధురము.
    పుం.
    1. ఇప్ప† ;
    2. నెమిలి.

    రిప్లయితొలగించండి
  7. పురియు విప్పి నెమలి పుడమిలో నాడంగ
    తడవ తడవ కమిత తమియు హెచ్చు
    నలువ సృష్టిలోని నైపుణ్యమంతయు
    పొందు పరచె నేమొ పుష్కలముగ/భూరిగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మధుక’ శబ్దం విషయంలో పొరబడ్డాను. నేను కేవలం ‘మధుకము’ గురించే చూశాను. మన్నించండి.

      తొలగించండి
  8. సఖి నెఱిచూపులకు వలచి
    శిఖినాట్యము జేయుచుండె సింగారముగ
    న్నఖిలమ్ము మరచి ప్రియముగ
    సఖుని గనుచు మురియుచుండె చంద్రకి యదివో!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘చంద్రకి’..? ‘చంద్రిక’ యా?
      ‘సఖి నెఱిచూపులు’ గుండమ్మకథ చిత్రంలోని ‘ప్రేమయాత్రలకు...’ పాటను గుర్తుకు తెచ్చాయి.

      తొలగించండి
    2. అవునండి. నాకు కూడా గుర్తుకువచ్చింది యాపాట. చలనచిత్ర సాహిత్యానికి పరవా లేదేమో కానీ "సఖినెఱిచూపుల" దుష్ట సమాసమేమోయని నా యనుమానము.

      తొలగించండి
    3. ‘సఖీ నెఱిచూపులు’ అంటే దుష్టసమాసం. అక్కడ సఖి తెలుగుపదం అయిపోయింది. సీత మగడు (సంస్కృతంలో సీతాపతి) వలె ‘సఖి నెఱిచూపులు’లో దోషం లేదని నా అభిప్రాయం.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణతో సందేహము తీరినది. ధన్యవాదములు.

      తొలగించండి
  9. బర్హిపింఛమెత్తి బాగనాట్యము చేయ
    నెమలికూన చూచు నేర్చుచుండె
    కంటికింపుగొలుపు కమనీయదృశ్యము
    కనగ రండు జనులు కన్నులార/కాంక్ష తోడ

    రిప్లయితొలగించండి
  10. బర్హి సుదర్శన తర్పిత
    బర్హిణ రాజాతిశయ విభవ జిత ఘన ప
    త్యర్హతుడు సఖీ సహితున్
    గార్హస్థ్యాచరణ రతుల గనుడట బ్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రీతిన్ రసానందాన్ని పొందజేసే మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. పోచిరాజు కామేశ్వర రావుగారూ!నమస్తే. చాల మనోహరమైన పద్యాన్ని వెలయించారు.మిక్కిలి అభినందనలు.

      తొలగించండి
    4. నమస్కారము శర్మ గారు. మీకు నచ్చినందులకు చాలా సంతోషము. ధన్యవాదములు.

      తొలగించండి
    5. నమస్సులు....వర్ణన అద్భుతంగానున్నదండీ

      తొలగించండి
    6. నమస్సులు....వర్ణన అద్భుతంగానున్నదండీ

      తొలగించండి
  11. నేలనొక్క కేకి నింగిని వేఱొండు
    పూలతోటచెంత పురినివిప్పి
    మధురమధుర గరిమ మమతలు రేగంగ
    నయన మోహనముగ నాట్యమాడె.

    రిప్లయితొలగించండి
  12. కంటి ద్రవము ద్రావి గార్హస్థ్యధర్మమున్
    పాటి సేయునట్టి పన్నగారి
    తనదు నాథుజేరి తాదాత్మ్యముంబొంది
    మదనరాజ్యమేలె మమతలొలుక.

    రిప్లయితొలగించండి
  13. కంటి ద్రవము ద్రావి గార్హస్థ్యధర్మమున్
    పాటి సేయునట్టి పన్నగారి
    తనదు నాథుజేరి తాదాత్మ్యముంబొంది
    మదనరాజ్యమేలె మమతలొలుక.

    రిప్లయితొలగించండి
  14. సుమముల వంటి ఈకలను సుందర మౌ రచనా కృతందునా
    నెమలి మనోజ్ఞ భావనలు నేర్పుగ, కూర్పుగ గంతు లేయగా?
    సమతల మైన సంతసము సర్వ విధాలుగ సాయమివ్వగా
    అమరిన జంట కంటబడ నాశ నిరాశను దూర ముంచుగా|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘ఆకృతి+అందు’ అన్నపుడు సంధి లేదు. ‘రచనాకృతుల్ గనన్’ అందామా?

      తొలగించండి
  15. అమలిన శృంగారమునకు
    నెమలులె సరిజోడటంద్రు నిక్కము జూడన్!
    కమలాక్షుడు మెచ్చెనదియె
    ప్రముఖమ్ముగ శిరముఁ దాల్చె బర్హము నెపుడున్!

    రిప్లయితొలగించండి
  16. వేళయు పాళయు లేదుర!
    వేళాకోళమ్ము కాదు...వీధిని విడుచున్
    కళ్ళు చెదరించెడి పనుల
    నిళ్ళల్లో చేయుడు నిక...యింపుగ నుండున్!

    రిప్లయితొలగించండి