శిష్ట్లా వి.ఎల్.ఎన్. శర్మ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. మూడవ పూరణలో ‘వదలుచు’ను ‘ఒదలుచు’ అన్నారు. ‘ఖర్మ’ శబ్దం సాధువు కాదు. ‘భ్రమ వదలుచు కర్మ యనక...’ అంటే సరి! నాల్గవ పూరణలో ‘సమరీతిని నన్వయించి’ అనండి.
కలుము లెన్ని యున్న కాని తనకు సంతు కలుగదేల యనుచు కలత పడక వెఱ్ఱి భావములకు వేసెను తాళపు కప్ప! సంతు కోరి కాళి గొలిచె!
మూడవ పాదంలో చిన్న మార్పుతో మరొక పద్యం,
కలుము లెన్ని యున్న కాని తనకు సంతు కలుగదేల యనుచు కలత పడక వెఱ్ఱి భావములను వెంటాడి తరిమె వెం కప్ప! సంతు కోరి కాళి గొలిచె!
గురువు గారికి నమస్కారములు. నిన్నటి సమస్యకు నేను వ్రాసిన పూరణ కూడా చదువ గోరుతాను. సమతను నిలబెట్టుటకై క్రమముగ చట్టముల లోని కడు మార్పులు నే రములను శిక్షించెడి సమ యము గని జనులెల్ల మోదమందెదరు భువిన్!
ధన్యవాదములు గురువుగారు.నేను ఇప్పుడే పురాణములను నేర్చుకుంటున్నాను. నా లాంటి కొత్తగా నేర్చుకోవలను కొన్నవారికి మీ శంకరాభరణం బ్లాగ్ బాగా ఉపయోగపడుతుంది. వర్గాలలో ఛందస్సు నందు మీరు పొందు పరిచినవి, క్రోడికరించిన విషయాలు బాగున్నాయి.
దాన ధర్మ మిడగ ధనమున్న చాలును
ప్రత్యుత్తరంతొలగించుతనయు డొకడు లేక తల్ల డిల్ల
దిగులు మాని తుదకు మిగులభ క్తినివెం
కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె
మీ ‘వెంకప్ప’ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకట్టుకున్న భార్య కడుపుపండకతాను
ప్రత్యుత్తరంతొలగించుతల్లడిల్లుచుండ నుల్లమందు
కాంక్షతోడను చని కలకత్త నగరి వెం
కప్ప సంతుగోరి కా ళి గొలిచె
వెంకప్పతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకాళికాంబ మనసు కరుణాసముద్రమ్ము
ప్రత్యుత్తరంతొలగించుకొల్చువారి కామె కొంగు పైడి
యనగ పెద్దవారు విని తాను రామున
కప్ప సంతు గోరి కాళి గొలిచె.
రామునకు అప్ప అయిన కాళిని గొలిచాడా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించులేక రాముడన్న వ్యక్తి యొక్క అప్ప కాళిని గొలిచిందా? సందిగ్ధం...!
తొలగించుబహుశా ఈ రెండవదే సరి కావచ్చు ననిపిస్తున్నది.
రెండవదేనండీ.
తొలగించురెండవదేనండీ.
తొలగించు
ప్రత్యుత్తరంతొలగించుకరుణకలుగుమాతకాళికామాతయే
జీవకోటికిభువిసేమమీయ
వెలసెధరను,గొలువవేవేగనపుడొక
కప్పసంతుగోరికాళిగొలిచె
‘కప్ప’ కాళిని కొలిచిందా? ‘వేవేగ నపుడు వెం|కప్ప...’ అంటే బాగుండేదేమో?
తొలగించుతమ దరి నెండల బాధల
ప్రత్యుత్తరంతొలగించుదమయిండ్లను నీరు లేని తాపము దీర్పన్
క్రమముగ వర్షములిడు సా
యముగని జనులెల్ల మోదమందెదరు భువిన్!
సమయము లేదను వారలు
క్రమ ఫలముల నందలేరు కాలము నందున్
సమయముతో సాగు నుపా
యము గని జనులెల్ల మోదమందెదరు భువిన్!
భ్రమనొదలుచు ఖర్మయనక
శ్రమదోడుత కర్మపథము సాగి చెలంగన్
సముదిత ఫలహిత సముదా
యము గని జనులెల్ల మోదమమదెదరు భువిన్!
అమరిన కోర్కెల వరుసను
సమరీతిని యన్వయించి జతగొని సాగన్
సమగూడిన దగ నాదా
యము గని జనులెల్ల మోదమందెదరు భువిన్!
..........శిష్ట్లా .వి.ఎల్.ఎన్.శర్మ
శిష్ట్లా వి.ఎల్.ఎన్. శర్మ గారూ,
తొలగించుశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణలో ‘వదలుచు’ను ‘ఒదలుచు’ అన్నారు. ‘ఖర్మ’ శబ్దం సాధువు కాదు. ‘భ్రమ వదలుచు కర్మ యనక...’ అంటే సరి!
నాల్గవ పూరణలో ‘సమరీతిని నన్వయించి’ అనండి.
స్వల్ప సవరణము లున్నను చక్కని పూరణముల నందించినారు శర్మ (శిష్ట్లా వెంకట లక్ష్మీ నరసింహ శర్మ) గారూ! శుభాభినందనలు!
తొలగించుధన్యవాదములు
తొలగించుశిష్ట్లా. వి.ఎల్.ఎన్. శర్మ గారి పూరణ....
ప్రత్యుత్తరంతొలగించుఆకసాన జలద మారాట పడెనేమొ
కప్ప యరుపు వినగ గొప్పగాను
అప్పుడొప్పు నట్టి యాకాశమును జూచి
కప్ప సంతు గోరి కాళి గొలిచె!
మీ పద్యం బాగున్నది. కాని సమస్యకు పరిష్కారం? ‘కప్ప’ కాళిని కొలిచిందా?
తొలగించు
ప్రత్యుత్తరంతొలగించుకప్పగూడ జీవియేగద యని నా అభిప్రాయము
నిజమే... కాని సంతానంకోసం కాళికను ప్రార్థంచదు కదా! అంతటి జ్జానం దానికి లేదు కదా!
తొలగించుఆకసాన జలద మారాట పడెనేమొ
ప్రత్యుత్తరంతొలగించుకప్ప యరుపు వినగ గొప్పగాను
కప్ప పెండ్లి జేసి కావిళ్ళ ద్రిప్ప నా
కప్ప సంతు గోరి కాళి గొలిచె!
.....శిష్ట్లా .వి.ఎల్.ఎన్.శర్మ
కొంత మార్చితిని..ఒప్పునేమో చూడండి
ఇప్పుడు కొంత వరకు ‘ఆ కప్పను కావిళ్ళలో త్రిప్పగా’ అనే అర్థంలో పరవాలేదు. బాగుంది. అభినందనలు.
తొలగించుగొప్ప ధనము బడసి కూడబెట్టగ దాని
ప్రత్యుత్తరంతొలగించుబంచుకొనెడి పిల్లవాండ్రు లేక
భార్యతోడ గూడి బరగనాశలతొ వెం
కప్ప సంతు గోరి కాళి గొలిచె!
బాగుంది ఈ పూరణ. అభినందనలు.
తొలగించుచిన్నలోపం... ‘ఆశలతొ’ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘...బరగ నాశలను’ (తృతీయార్థంలో ద్వితీయ) అనవచ్చు.
తమరి సూచనలు నాకు విశేష మార్గదర్శకములు....కృతజ్ఞతలు
తొలగించుతమరి సూచనలు నాకు విశేష మార్గదర్శకములు....కృతజ్ఞతలు
తొలగించు* గు రు మూ ర్తి ఆ చా రి *
ప్రత్యుత్తరంతొలగించు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వీధి లోన " కా ళి " వృక్షౌషధము లమ్ము |
వీర్య వృధ్ధి కై తపి౦చెడు " మొ ల -
క ప్ప " స౦తు గోరి కాళి గొలిచె | నాకు
పసరు త్రాగె , నాసుపత్రి జేరె ! !
మొలకప్ప = మొలకారెడ్డి మొలకారావు లా గా
మొలకప్ప యను పేరు కలదు ;
కొలుచు = సేవి౦చు , ఒక అవసరము కొరకు
ఆశ్రయి౦చు
హాస్యరస స్ఫోరకంగా వైవిధ్యంగా ఉన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుభోగ భాగ్యములకు పుట్టి నిల్లట యది
ప్రత్యుత్తరంతొలగించుసంతతి కఱవయ్యె సుదతి కకట
కాళి మాత గుడిని కాంచన ఛదమునం
గప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె.
కాంచన ఛదనాన్ని కప్పిన మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింప జేసినది. అభినందనలు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించులేరు పిల్లలన్న పోరుకు భార్యను
ప్రత్యుత్తరంతొలగించువిడిచి నడవిఁ జేరె వెర్రి వాడు
బిడ్డ కలుగు దాక వెడల నింటికని వెం
కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె
బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించు‘విడిచి యడవిఁ...’ అనండి.
కప్పపెండ్లి వర్ష కారకమని నమ్మి
ప్రత్యుత్తరంతొలగించుజనులుసేయ నింక ఫణులు తమకు
గ్రాసమొదవునంచు ఘనముగా నర్చించి
కప్పసంతు కొరకు,కాళి గొలిచే
కప్పలకు సంతానం కోసం పాములు కాళిని కొలిచాయా? బాగుంది మీ ఊహ. చక్కని పూరణ. అభినందనలు.
తొలగించుజరిగి పెండ్లి యేడు సంవత్సరాలాయె
ప్రత్యుత్తరంతొలగించుసంతు కలుగ లేదు చింత జెందె
మంత్ర మొకటి క్షుద్ర మాంత్రికుడనగ వెం
కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుయమపురి వాకిటఁ జని సా
ప్రత్యుత్తరంతొలగించుయమునకు నోచని యనాథలైన ముసలులన్
దమవా రని చేసెడు సా
యముఁ గని జనులెల్ల మోద మందెదరు ధరన్!
కాంతి కృష్ణ గారూ,
తొలగించుశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంతోషము మిత్రమా! మీ పూరణము చాల బాగున్నది. ఇటులనే మీ పూరణములచే మమ్మలరింపుఁడు.
తొలగించుకాళిదాసువంటి కవిరాజు సుతుడైన
ప్రత్యుత్తరంతొలగించుధన్యమనుచు బ్రతుకు ధరణి మీద
నమరశాస్త్రి మిగుల ననురాగఁపు భ్రములుఁ
గప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె!
భ్రమలు కప్పినవన్న మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
తొలగించుగురుదేవులకు ధన్యవాదములు.
తొలగించుటైపాటు సవరణతో:
తొలగించుకాళిదాసువంటి కవిరాజు సుతుడైన
ధన్యమనుచు బ్రతుకు ధరణి మీద
నమరశాస్త్రి మిగుల ననురాగఁపు భ్రమలుఁ
గప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె!
శ్రీరాం కవి గారి పూరణ...
ప్రత్యుత్తరంతొలగించుకోరి పిల్లవాండ్ర కొరతయు దీరంగ
సాధుపుంగవులను స్వామి తతిని
కొలిచి వారిమాట కాదనలేక వెం
కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించునల్లాన్ చక్రవర్తుల వేంకట నారాయణాచార్యులు గారి పూరణ....
ప్రత్యుత్తరంతొలగించుపెళ్ళి వైభవముగఁ బెద్దలు చేసిరి
కాయ కాయలేదు కాంతి లేదు
కాన వగచి వగచి కాళి గుడిని వెం
కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుసంతు లేని యోక్క జంట పూజలుచేసి
ప్రత్యుత్తరంతొలగించుతీర్థయాత్రలెన్నొ తీరుగాను
పడతితోడ తిరిగి ఫలము లేకపతి,వెం
కప్ప సంతు గోరి కాళి గొలిచె.
2కాళిమాతఁగొల్వ కల్గుసంతు యనగ
సాగెనొక్క పతియు సతిని గూడి
కాళిమందిరమ్ము కడ పతి యైన వెం
కప్ప సంతు గోరి కాళి గొల్చె.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించు‘సంతు+అనగ’ అన్నపుడు యడాగమం రాదు. ‘కల్గు సం తనగఁ దా’ అనండి.
వాని భాగ్యమనుచు అని చదువగలరు
ప్రత్యుత్తరంతొలగించువంశమనగ వారి పరివారమనుచును
ప్రత్యుత్తరంతొలగించుభావితరము వని భాగ్యమనుచు
మనిషి మనిషిలోన మహనీయభావనల్
గప్ప, సంతు గోరి కాళి గొలిచె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకృతజ్ఞుడను....ఈ వేదిక చాల ఆనందమిచ్చుచున్నది...ధన్యుడను
తొలగించుసంతోషము మిత్రమా...! మీ పూరణములచేఁ బ్రతిదినము మమ్మలరింపుఁడు.
తొలగించు. చెప్ప నార్యు డొకడు చింతను మాన్పగ
ప్రత్యుత్తరంతొలగించుభక్తిచేత భార్య భర్త గలసి
పూజ సేయమనెడి రోజులు గుడిన వెం
కప్ప|సంతుకొరకు కాళి గొలిచె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుగుడి...ఇకారాంతం. దీనితర్వాత ‘ని’ రావాలి.
🌺🙏🌺
ప్రత్యుత్తరంతొలగించుఅంబటి భానుప్రకాశ్.
గద్వాల.
ఆ**
కరువు లొచ్చి యెండె!చెరువుల న్నియుగూడ,!
జీవ జాల మంత !జేరె యముని,!
తనదు సంతు కొరకు! తపమును జేసెను,!
కప్ప సంతు గోరి !కాళి గొలిచె !!
అంబటి భానుప్రకాశ్ గారూ,
తొలగించుస్వాగతం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వచ్చి’ని ‘ఒచ్చి’ అన్నారు. ‘కరువు వచ్చి యెండె...’ అనండి.
కాంతి కృష్ణ గారి పూరణ....
ప్రత్యుత్తరంతొలగించుకాస్త వాన కొఱకు కళ్యాణ మెవరికి?
తపన జెందె నేల దశరథుండు?
వికటకవి యెవరిని విద్యకై కొలిచెను?
కప్ప; సంతుఁ గోరి; కాళిఁ గొలిచె?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅంబటి భానుప్రకాశ్.
ప్రత్యుత్తరంతొలగించుగద్వాల.
ఆ**
కరువు వచ్చి యెండె!చెరువుల న్నియుగూడ,!
జీవ జాల మంత !జేరె యముని,!
తనదు సంతు కొరకు! తపమును జేసెను,!
కప్ప సంతు గోరి !కాళి గొలిచె !!
ప్రత్యుత్తరంతొలగించుసంతు లేని యోక్క జంట పూజలుచేసి
తీర్థయాత్రలెన్నొ తీరుగాను
పడతితోడ తిరిగి ఫలము లేకపతి,వెం
కప్ప సంతు గోరి కాళి గొలిచె.
2కాళిమాతఁగొల్వ కల్గుసంతు యనగ
సాగెనొక్క పతియు సతిని గూడి
కాళిమందిరమ్ము కడ పతి యైన వెం
కప్ప సంతు గోరి కాళి గొలిచె.
3తలకు కొరవి బెట్టు తనయుని కోసమై
యతివ తోడ బెనకు డనెడి వ్యక్తి
దేశ మెల్ల తిరిగి దీక్షతో నా బెన
కప్ప సంతుకోరి కాళి గొలిచె.
ప్రత్యుత్తరంతొలగించుసంతు లేని యోక్క జంట పూజలుచేసి
తీర్థయాత్రలెన్నొ తీరుగాను
పడతితోడ తిరిగి ఫలము లేకపతి,వెం
కప్ప సంతు గోరి కాళి గొలిచె.
2కాళిమాతఁగొల్వ కల్గుసంతు యనగ
సాగెనొక్క పతియు సతిని గూడి
కాళిమందిరమ్ము కడ పతి యైన వెం
కప్ప సంతు గోరి కాళి గొలిచె.
3తలకు కొరవి బెట్టు తనయుని కోసమై
యతివ తోడ బెనకు డనెడి వ్యక్తి
దేశ మెల్ల తిరిగి దీక్షతో నా బెన
కప్ప సంతుకోరి కాళి గొలిచె.
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించు‘సంతు+అనగ’ అన్నపుడు యడాగమం రాదు. ‘సంతని చెప్ప’ అనండి.
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించుమిత్రులందఱకు నమస్సులు!
ప్రత్యుత్తరంతొలగించు[గత జన్మలో అప్సరసయైన మండోదరి పార్వతి శాప కారణమున కప్పయై, నారదుని స్పర్శచే శాపము దీరి, మండోదరి అనే పేరుతో హేమ మయులకు కుమార్తెగా జన్మించి, రావణునిచే సతిగా వరింపఁబడి, సంతానమునకై కాళినిఁ బూజించి, సంతు వడసిన కథను ఇక్కడ అనుసంధానించుకోవాలి]
శాప పూర్తిఁ గప్ప, ♦ సతిగ మండోదరి
రావణునకు నమరి, ♦ ప్రసవ మంద
కునికి నందెఁ జింత♦ను! నతి శీఘ్రముగ నా
కప్ప సంతుఁ గోరి ♦ కాళిఁ గొలిచె!
ఐతిహాసికాంశంతో మీ పూరణ వైవిధ్యంగా, మార్గదర్శకంగా ఉంది. అభినందనలు.
తొలగించుధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించుకలుము లెన్ని యున్న కాని తనకు సంతు
ప్రత్యుత్తరంతొలగించుకలుగదేల యనుచు కలత పడక
వెఱ్ఱి భావములకు వేసెను తాళపు
కప్ప! సంతు కోరి కాళి గొలిచె!
మూడవ పాదంలో చిన్న మార్పుతో మరొక పద్యం,
కలుము లెన్ని యున్న కాని తనకు సంతు
కలుగదేల యనుచు కలత పడక
వెఱ్ఱి భావములను వెంటాడి తరిమె వెం
కప్ప! సంతు కోరి కాళి గొలిచె!
గురువు గారికి నమస్కారములు. నిన్నటి సమస్యకు నేను వ్రాసిన పూరణ కూడా చదువ గోరుతాను.
సమతను నిలబెట్టుటకై
క్రమముగ చట్టముల లోని కడు మార్పులు నే
రములను శిక్షించెడి సమ
యము గని జనులెల్ల మోదమందెదరు భువిన్!
మీ రెండు విధాల పూరణ బాగున్నది. నాకు మొదటిది ఎక్కువగా నచ్చింది.
తొలగించుఇక నిన్నటి సమస్యకు పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
కోట్ల ధనము తోడ కోటలు పేటలు
ప్రత్యుత్తరంతొలగించుసంపదలు గలిగియు సంతులేక
తీర్ధములను మునిగి తిరుగుచున్నట్టి వెం
కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుబీటుకూరు శేషు కుమార్ గారి పూరణ....
ప్రత్యుత్తరంతొలగించుభానుని భగభగల భరియించగా లేక
తనువు మనసు రెండు తల్లడిల్ల
నీటిలోనె యుండ నిశ్వయించియును నా
కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుబీటుకూరు శేషుకుమార్ గారు సవరించిన పూరణము:
తొలగించుభానుని భగభగల భరియించగా లేక
తనువు మనసు రెండు తల్లడిల్ల,
నీటిలోనె యుండ నిశ్చయించియును నా
కప్ప సంతు గోరి కాళి గొలిచె!
ఇది శేషుకుమార్ గారు రచించిన పూరణమా, వారు సవరించిన పూరణమా, వారి రచిస్తే మీరు సవరించిన పూరణమా?
తొలగించువారి పూరణమే. మొదట ప్రకటించిన పూరణమున దోషము దొరలగా, వారే ఫోన్ ద్వారా సవరింపజేసి, వాట్సప్‍లో పెట్టిన పూరణము.
తొలగించుగురిజాల ప్రసాద్ గారి పూరణము
ప్రత్యుత్తరంతొలగించుసుమనస్కుల దోచి విదే
శముగాదెలు నింపినట్టి శనిగాండ్ల హతం
బమరిన ప్రధాని సుధ్యే
యముఁగని జనులెల్ల మోదమందెదరు భువిన్!
దీనిని నిన్నటి సమస్యలో పోస్ట్ చేశాను. అక్కడే వ్యాఖ్యానించాను కూడా.
తొలగించుసతిని గూడి పెక్కు సత్కార్యముల్ జేసె
ప్రత్యుత్తరంతొలగించుదాన ధర్మ ములను దండి గాను
కామితార్థి యగుచు కలకత్త జేరి వెం
కప్ప సంతు గోరి కాళి గొల్చె
పుత్రహీను డైన పున్నామ నరకమ్ము
తప్పదనుచు నెఱగి దాన ధర్మ
మొసగి భక్తితోడ ముడుపునే గట్టె వెం
కప్ప సంతుగోరి కాళి గొల్చె
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుశంకరాభరణము ఒక సమస్య తలచి
ప్రత్యుత్తరంతొలగించుకవులు నోట పలికితివి, పురాణ
మాట వెలది లోన, అంత్య పాదముగాను
"కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె"
పొలిమేర మల్లేశ్వర రావు గారూ,
తొలగించుశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. ‘శంకరాభరణము సై యనుచు సమస్య...’ అనండి.
ధన్యవాదములు గురువుగారు.నేను ఇప్పుడే పురాణములను నేర్చుకుంటున్నాను. నా లాంటి కొత్తగా నేర్చుకోవలను కొన్నవారికి మీ శంకరాభరణం బ్లాగ్ బాగా ఉపయోగపడుతుంది. వర్గాలలో ఛందస్సు నందు మీరు పొందు పరిచినవి, క్రోడికరించిన విషయాలు బాగున్నాయి.
తొలగించుశివుని పూజ జేసి సీట్లకు వోట్లకు
ప్రత్యుత్తరంతొలగించుకౌగలించి మోడ్ని కన్ను గొట్టె...
కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచెనంట
విశ్వదాభి రామ వినుర వేమ!