6, ఏప్రిల్ 2016, బుధవారం

సమస్య – 1995 (నిదురించెడువాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్.

40 కామెంట్‌లు:

  1. గురువు గారికి కవిమిత్రులకు ప్రణామములు


    చెదపురుగు జాతికి సదా
    నిదురించెడు వాడు, ధారుణిన్ యశమందున్
    వదలక తలచిన పనులను
    ముదముగ సాధించుకొనుచు మురిసెడు వారల్

    రిప్లయితొలగించండి
  2. సదనము వెలువడి భక్తిగ
    యుదయంబున సంధ్య వార్చి యుష్ణుని గొలువన్
    సదమల హృదయము గలిగిన
    నిదురించెడు వాఁడు ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
  3. బెదురక దేనికి చెదురక
    అదురక మనసున ప్రభువుని నారాధనమున్
    కుదురుగ పనులను జేయుచు
    నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బెదరక.. చెదరక.. యదరక.. అనండి.

      తొలగించండి
  4. విధిలో తప్పులు తప్పవు
    పదిపనులను చేసినపుడు, ప్రాప్తించు వెతల్
    పదిలము పనిదొంగలెపుడు
    నిదురించెడు వాడు ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ద-ధ ప్రాస వేశారు.

      తొలగించండి

  5. ఉదరపుబాధనునొందును
    నిదురించెడువాడుధారుణిన్యశమందున్ చదువులుబాగుగజదువుచు పదిమందికిమేలుసేయబవలునురేయిన్

    రిప్లయితొలగించండి
  6. సదయుడు సత్కార్యంబులు
    వదలక చేయుచు ముదమున వాసిని గనుచున్
    హృదయము పైకరమిడుకొని
    నిదురించెడివాడు ధారుణిన్ యశమందున్.

    2.సదమల మతితో సతతము
    పదములుపాడుచు తిరుగుచు భక్తిన్ జూపుచున్
    ఉదయపు వేళల,నిశిలో
    నిదురించెడి వాడు ధారుణిన్ యశమందున్.

    3.కుదురుగ పనిలేక చెడును
    నిదురించెడి వాడు,ధారుణిన్ యశమందున్
    బెదరక తా కష్టపడుచు
    పదుగురికిట సాయపడుచు బ్రతుకును గడుపున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. వదలక మది భూతముల మ
    హదంచి తానురతి పెద్దలం దుంచక కిం
    చిదగౌరవమ్ము సుఖముగ
    నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. బెదరక నన్యాయమ్ముల
    నెదిరించుచు దుష్టజనుల నెల్లప్పుడు దా
    వదలక గుండల లోనన్
    నిదురించెడు వాడు ధారిణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
  9. వదలక కార్యము లన్నియు
    పదిలముగా పూర్తి చేసి పంతము తోడన్
    తదుపరి యలసట తోడన్
    నిదురించెడువాడు ధారిణన్ యశమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. . అదరక,బెదరక గాంధీ
    వదలని స్వాతంత్ర్య దీక్ష పరిపక్వతయే
    కుదరగ ?భువినే విడచియు
    నిదురించెడు వాడు ధారుణిన్ యశమందున్.
    2.చదివిన సంస్కరణంబులు
    పదిలముగా బద్రపరచి భారత విధులన్
    నిధులను అంబేద్కరునిడి
    నిదురించెడు వాడు ధారుణిన్ యశమందున్.

    రిప్లయితొలగించండి
  11. .శ్రీకంది శంకరయ్యగురువుగారికితొందరగాసుస్తిబాగుపడాలనికోరుకుంటూ
    కందిశంకరయ్యగారి కలమునుండి పద్యముల్
    వంద,వేలు జాలువార పంద్యమట్లు ముందుగా
    అందుకున్న సంతసాన హాయి బొందు చుండగా?
    నిందలందు సుస్తి వెళ్లు|నిత్య సౌఖ్య మివ్వగా|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      నేను పద్యాలు వ్రాయించే వాడినే కాని వ్రాసే వాడిని కాదు. ధన్యవాదాలు.

      తొలగించండి
  12. వదలగ శారద జిహ్వను
    నెద దలచెను కుంభకర్ణు డిటు "నే బ్రహ్మన్
    నిదురను వరముగ కోరెద
    నిదురించెడు వాడు ధారుణిన్ యశమందున్".

    రిప్లయితొలగించండి
  13. పద పదమున సరిహద్దున
    నెదిరించుచు శత్రు సేన నెల్లప్పుడు తా
    బెదరక వారల యెదలో
    నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్.

    రిప్లయితొలగించండి
  14. ముదమారగ, శ్రీసతి,తన
    పదముల నొత్తంగ శేష ఫణి పానుపుపై
    సదయను లోకము లేలుచు
    నిదురించెడు వాడు ధారుణిన్ యశమందున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. Timmaji Rao Kembai గారు "ఫణి పానుపు" బదులు "ఫణి తల్పము" సాధు సమాసమనుకుంటాను.

      తొలగించండి
    3. నిజమే సుమా.. నేను గమనించలేదు. ధన్యవాదాలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  15. మదిలో మాధవుని దలచి
    పదిమందికి సాయపడుచు ప్రత్యక్షముగన్
    కుదురుగ జనహృదయమ్ముల
    నిదురించెడివాడు ధారుణిన్ యశమందున్!!!


    పొదలిక గడించ లేడుగ
    నిదురించెడివాడు, ధారుణిన్ యశమందున్
    విద నార్జించుచు దానిని
    పదిమందికి పంచు ఘనుడె ప్రద్యోతించున్!!!

    పొదలిక = అభివృద్ధి, విద= జ్ఞానము

    రిప్లయితొలగించండి
  16. సొదలన్నియు వదలించుకు
    మదినంతయు భృకుటి నంచి మౌనము దాల్చన్
    గుదురుటె ధ్యానము! స్పృహతో
    నిదురించెడు వాడు ధారుణిన్ యశమందున్!

    రిప్లయితొలగించండి
  17. గురుదేవులకు ప్రణామములు. నా పూరణ తర్వాత సవరించడం జరిగిందండీ. ఇపుడు చూస్తే నా పోస్టింగే కనబడుటలేదు. ఆశ్చర్యంగా యుంది. అందుకే మరోసారి ఇపుడు పోస్ట్ చేశాను. పరిశీలించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      పొరపాటు నాదే... అలసటలో ఏదో తొలగించబోయి మీ పూరణ తొలగించాను. మన్నించండి.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘భృకుటి నుంచి’ టైపాటు వల్ల ‘భృకుటి నంచి’ అయింది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:సొదలన్నియు వదలించుకు
      మదినంతయు భృకుటి నుంచి మౌనము దాల్చన్
      గుదురుటె ధ్యానము! స్పృహతో
      నిదురించెడు వాడు ధారుణిన్ యశమందున్!

      తొలగించండి
  18. మదిలో సుఖ శాంతులతో
    కదలక మెదలక కునుకుచు కమ్మని కలలన్
    సదమలముగ లోక సభను
    నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్!

    రిప్లయితొలగించండి
  19. సదమల చిత్తము నందున
    కుదురుగ కూర్చొని సతతము కూడగ రమణున్
    చెదరక లోకపు యతలన్
    నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి