రాజేశ్వరి అక్కయ్యా, మంచి విషయాన్నే ఎత్తుకున్నారు. బాగుంది. ‘కానినేయుడు’ అంటే? ఈ శబ్దం నిఘంటువులో దొరకలేదు. ‘సోమువరము’నకు అన్వయం లేదు. మూడవపాదంలో ‘కౌంతేయు’డన్నచోట గణదోషం. అంతేకాదు కర్ణుణ్ణి ‘రాధేయుడు’ అనడంతో తల్లులు కూడ ఇద్దరు.
నమస్కారములు " కానినేయ " అని నిఘంటువులో లేదు కానీ " చాగంటివారి ప్రవచనాల్లో ఆయన " కానినేయుడు = కన్యకు పుట్టినవాడు " అని విన్నట్టు గుర్తు .ఇక తల్లులు కుడా ఇద్దరౌతారని అనుమానం వచ్చినా [కర్ణుని గురించి రాయాలన్న ఇష్టంతో ] ఎలాగో మీరు సవరిస్తారు కదా అని రాసేసాను .అదన్నమాట .అసల్ సంగతి .క్షంతవ్యు రాలిని .[మన్నించ గలరు ]
కవిమిత్రులందరికి వందనములు. రెండువేల పూరణలు పూర్తైన సందర్భంగా బ్లాగు ఆరుసంవత్సరములు పూర్తైన సందర్భంగా శంకరాభరణం సభను ఏర్పాటు చేసి గురువర్యులు శంకరయ్య గారిని సత్కరిస్తే బాగుంటుంది. అందరు కవిమిత్రులు మనసులో ఆలోచించి ప్రదేశము, వేదిక నిర్ణయించ ప్రార్థన . మన కవిమిత్రులు వ్రాసిన పద్యాలను, సమస్యాపూరణలను, దత్తపదులను మనమే ఒకపుస్తకంగా ప్రచు రిస్తే బాగుంటుంది.
మడిపల్లి రాజ్‍కుమార్ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మంచి అంశాన్ని ఎన్నుకొని పూరణ చేయడానికి ప్రయత్నించారు. ప్రశంసనీయం. సమస్యపాదం ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు. ‘న్యాయస్థాన’ మన్నపుడు స్థా వల్ల య గురువై గణదోషం. మూడవపాదంలో యతి తప్పింది. మీ పూరణకు నా సవరణ...
నాకు తండ్రి వనెను న్యాయపోరాటాన కాదనుచు తివారి వాదులాడె తుదకు గెలుపు రోహితుని వరించ ననిరి తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.
ఆర్యా!సత్యనారాయణరెడ్డిగారు! నమస్కారములు.మీసూచన చాల బాగున్నది.సన్మాన కార్యక్రమము గురువుగారియూరులోనే వేదిక చూసి జరిపుకొనిన బాగుంటుంది అనునది నాయభిప్రాయము.వారినివేరేచోటికి రమ్మనమని యిబ్బందిపెట్టడంకంటె మనమే వారియొద్దకువెళ్ళడంసమంజసముకదా,
మాన్యులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారూ నమస్కారములు మీ సూచన అద్భుతం ......అందుకు వలయు యోజన చేసి సాధ్యమైనంత త్వరలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూర్తి సహకారము నందించ సంసిద్ధుడను నమస్కారములతో.
అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచనను కార్య రూపము దాల్చుటకు అందరు సహకరిస్తారని భావిస్తున్నాను. ఇది శ్రీ కంది శంకరయ్య గురువుగారికి శంకరా భరణ కవుల ఇచ్చే అపూర్వ గౌరవము
శర్మ గారూ, రెండవపాదంలో గణదోషం. ‘దుష్టచతుష్టయా రచిత’ అన్నచోట ‘చతుష్టయ’ అని హ్రస్వమే ఉండాలి. ‘దురభిమాన కౌరవ రచిత వ్యూహాన బాలుడైనను పసి ప్రాయమందు నసువులు విడినట్టి యభిమన్యునకు పెద...’ అంటే ఎలా ఉంటుంది?
విద్య నేర్పి, నంత విజయాల దరి చేర్చి కన్న తల్లి తండ్రి కన్న నధిక ప్రేమ జూపు గురుని పితరునిగ దలచ తండ్రులిద్దరతని తల్లి యొకతె! గురువు గారికి నమస్కారాలు. నా నిన్నటి పూరణను కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాను. దయ చేసి చూడవలసిందిగా కోరుచున్నాను. అనుదిన మొక పూరణతో మనమున ఘర్షణ పడుచును మార్పుల నొందన్! ఘనమగు పద్యపు రుచి జూ పిన వానికి జూడ రెండు వేలొక లెక్కా?
పుట్టె సుతుడు వదిలె పురుషుడు తల్లిని
రిప్లయితొలగించండికాల గతిన తల్లి కరుణ జూపి
నతని బెండ్లి యాడ నప్పెను జూడను
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘గతి’ ఇకారాంతం. కనుక ‘గతిని’ అనాలి.
గురువు గారికి కవిమిత్రులకు నమస్కారములు
రిప్లయితొలగించండివాయు పుత్రుడంచు భక్తులు కొలిచెడు
అంజన సుతుడవని యందు జూడ
కేసరితనయుడనుచు వాసికెక్కె, కపికి
తండ్రు లిద్దఱతని తల్లియొకతె
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మూడవపాదంలో గణదోషం. ‘కేసరి తనయుడని వాసికెక్కె...’ అనండి.
గురువు గారికి ధన్యవాదములు
తొలగించండిమూడవపాదంలో గణదోషం పరధ్యానంలో జరిగినది నేను గమనించనే లేదు సరిచేయగలను
వాయు పుత్రుడంచు భక్తులు కొలిచెడు
అంజన సుతుడవని యందు జూడ
కేసరితనయుడని వాసికెక్కె, కపికి
తండ్రు లిద్దఱతని తల్లియొకతె
కాని నీయు డనుచు కర్ణుని గాంచిన
రిప్లయితొలగించండిసూత పుత్రు డనిరి సోము వరము
కౌంతే యుడని బిలువ కుంతిత నయుడంచు
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమంచి విషయాన్నే ఎత్తుకున్నారు. బాగుంది.
‘కానినేయుడు’ అంటే? ఈ శబ్దం నిఘంటువులో దొరకలేదు. ‘సోమువరము’నకు అన్వయం లేదు. మూడవపాదంలో ‘కౌంతేయు’డన్నచోట గణదోషం.
అంతేకాదు కర్ణుణ్ణి ‘రాధేయుడు’ అనడంతో తల్లులు కూడ ఇద్దరు.
నమస్కారములు
తొలగించండి" కానినేయ " అని నిఘంటువులో లేదు కానీ " చాగంటివారి ప్రవచనాల్లో ఆయన " కానినేయుడు = కన్యకు పుట్టినవాడు " అని విన్నట్టు గుర్తు .ఇక తల్లులు కుడా ఇద్దరౌతారని అనుమానం వచ్చినా [కర్ణుని గురించి రాయాలన్న ఇష్టంతో ] ఎలాగో మీరు సవరిస్తారు కదా అని రాసేసాను .అదన్నమాట .అసల్ సంగతి .క్షంతవ్యు రాలిని .[మన్నించ గలరు ]
రిప్లయితొలగించండితండ్రులిద్దరతనితల్లియొకతెగద
వాసుదేవునకిలవరలెసుమ్ము ఇంకచాలమందియిటులుగలరుభువి
నీశ!వారికిత్తునిపుడునతులు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిపద్యం బాగుంది.
వసుదేవుడు, నందుడు ఇద్దరు తండ్రులైనపుడు దేవకి, యశోద ఇద్దరు తల్లులు కదా!
అవునండి.నాబుర్రకు తట్టనేలేదు.మరల వేరేగా వ్రాస్తాను
తొలగించండికవిమిత్రులందరికి వందనములు. రెండువేల పూరణలు పూర్తైన సందర్భంగా బ్లాగు ఆరుసంవత్సరములు పూర్తైన సందర్భంగా శంకరాభరణం సభను ఏర్పాటు చేసి గురువర్యులు శంకరయ్య గారిని సత్కరిస్తే బాగుంటుంది. అందరు కవిమిత్రులు మనసులో ఆలోచించి ప్రదేశము, వేదిక నిర్ణయించ ప్రార్థన . మన కవిమిత్రులు వ్రాసిన పద్యాలను, సమస్యాపూరణలను, దత్తపదులను మనమే ఒకపుస్తకంగా ప్రచు రిస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు సత్యనారాయణరెడ్డిగారు..నా మనసులో ఎప్పటినుంచో అనుకుంటున్నాను గురువుగారిని సత్కరించే అదృష్టం మనందరికీ కలిగతే బాగుండునని....గురువుగారి అనుమతితో మన కవిమిత్రులందరూ తలచుకుంటే కార్యరూపం దాల్చడం ఎంతసేపు..ఈ విషయమై మన కవిమిత్రురందరూ ఆలోచించ మనవి...
తొలగించండిచక్కని ఆలోచన ...నేను సిద్ధం....రెడ్డిగారూ !
తొలగించండిభర్త కోరినంత పాచలుని దలచి
రిప్లయితొలగించండికుంతి వేడుకొనగ కూర్మితోడ
భీముడు జనియించె నామె కపుడు గాన
తండ్రులిద్ద రతని తల్లి యొకతె!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సూర్యసుతునకు .యమసుతునకు. వాయు పు
త్రునకు. నా బిడౌజ తనయు నకును :--
ప్రతి నొకరికి గూడ భారత గాధలో
త౦డ్రు లిద్ద రతని తల్లి యొకతె ! !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
TBS శర్మ గారి పూరణ....
రిప్లయితొలగించండిదురిత దురభి మాన దుష్ట చతుష్టయ
పన్ను గడకు పసిమి ప్రాయ మందు
అసువు లంత వీడు నభిమన్యునికి పెద
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
‘చతుష్టయ పన్నుగడ’ దుష్టసమాసం కదా!
శ్రీ సత్యనారాయణ రెడ్డిగారితో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. గురువుగారికి సత్కారము మన పూర్వజన్మ సుకృతము
రిప్లయితొలగించండిశ్రీ సత్యనారాయణ రెడ్డిగారితో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. గురువుగారికి సత్కారము మన పూర్వజన్మ సుకృతము
రిప్లయితొలగించండిపాండు రాజు, వజ్ర పాణి పార్థునకును
రిప్లయితొలగించండితండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె
పాండు రాజు పత్ని పరమ సాధ్వీకుంతి
వజ్ర పాణి గోర వరము నిచ్చ.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తండ్రివనె రోహి తుడు న్యాయ స్థానమందు
రిప్లయితొలగించండికాదని తివారి యెంతయో వాదులాడె
గెలువ తుదకు రోహితుని లోకులను కొనిరి
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె
మడిపల్లి రాజ్‍కుమార్ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మంచి అంశాన్ని ఎన్నుకొని పూరణ చేయడానికి ప్రయత్నించారు. ప్రశంసనీయం.
సమస్యపాదం ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు. ‘న్యాయస్థాన’ మన్నపుడు స్థా వల్ల య గురువై గణదోషం. మూడవపాదంలో యతి తప్పింది. మీ పూరణకు నా సవరణ...
నాకు తండ్రి వనెను న్యాయపోరాటాన
కాదనుచు తివారి వాదులాడె
తుదకు గెలుపు రోహితుని వరించ ననిరి
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.
తొందర పడ్డాను.
తొలగించండిమీ సవరణలకు నెనరులు.
ఆర్యా!సత్యనారాయణరెడ్డిగారు! నమస్కారములు.మీసూచన చాల బాగున్నది.సన్మాన కార్యక్రమము గురువుగారియూరులోనే వేదిక చూసి జరిపుకొనిన బాగుంటుంది అనునది నాయభిప్రాయము.వారినివేరేచోటికి రమ్మనమని యిబ్బందిపెట్టడంకంటె మనమే వారియొద్దకువెళ్ళడంసమంజసముకదా,
రిప్లయితొలగించండిమీరు అమెరికానుండి వచ్చినపిదప తేది,సమయము,వేదిక,సన్మానవిధానములు ఖరారుచేయుదము
తొలగించండితరలె నొకడు తనదు పరివారము నుగూడి
రిప్లయితొలగించండిసప్తగిరులనెక్కి స్వామిజూడ
భార్యయు సుతు లున్ను పడతివెంటను తల్లి
దండ్రులిద్ద ఱతని తల్లియొకతె
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
భార్య యొక్క తల్లిదండ్రులను, తన తల్లిని తీసుకువెళ్ళాడన్న మాట! కొద్దిగా తికమక పడ్డాను.
శంకరార్యునినేరుగాసత్కరించ
రిప్లయితొలగించండిశంకరాభరణునిమరిసత్కరించు
నటులెమదినియగునుగదయార్యులార!
కార్యసఫలతకొరకుగాకలసిరండు
మాన్యులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారూ నమస్కారములు
రిప్లయితొలగించండిమీ సూచన అద్భుతం ......అందుకు వలయు యోజన చేసి సాధ్యమైనంత త్వరలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూర్తి సహకారము నందించ సంసిద్ధుడను
నమస్కారములతో.
అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచనను కార్య రూపము దాల్చుటకు అందరు సహకరిస్తారని భావిస్తున్నాను. ఇది శ్రీ కంది శంకరయ్య గురువుగారికి శంకరా భరణ కవుల ఇచ్చే అపూర్వ గౌరవము
రిప్లయితొలగించండితండ్రులిద్దరతనితల్లియొకతెయట
రిప్లయితొలగించండియేవగింపుగలిగెయీవచనము
భారతంబునందుభావ్యంబెయిటులుండ
పొరుగుదేశమునకుబోలునిదియ
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది.
‘..గలిగె నీవచనము’ అనండి.
శ్రీ గురువుగారి సూచనానుసారము చిన్నిమార్పుతో
రిప్లయితొలగించండిదురిత దురభి మాన దుష్ట చతుష్టయా
రచిత వ్యూహంబున పసిమి ప్రాయ మందు
అసువు లంత వీడు నభిమన్యునికి పెద
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.
శర్మ గారూ,
తొలగించండిరెండవపాదంలో గణదోషం. ‘దుష్టచతుష్టయా రచిత’ అన్నచోట ‘చతుష్టయ’ అని హ్రస్వమే ఉండాలి.
‘దురభిమాన కౌరవ రచిత వ్యూహాన
బాలుడైనను పసి ప్రాయమందు
నసువులు విడినట్టి యభిమన్యునకు పెద...’ అంటే ఎలా ఉంటుంది?
కంది శంకరార్య యిచ్చె కఠిన ప్రశ్న
రిప్లయితొలగించండిచేత గాదు పూరణ మున్ చేయ గాను
అయిన చెప్పెద నోచెలీ అందముగను
కర్ణు నకు దేవ మానవా కార “ తండ్రు
లిద్ద ఱతని తల్లి యొకతె” యిందు వదన.
సురవరపు ప్రసాద్ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం!
ఆటవెలది పాదమైన సమస్యను తేటగీతిలో చక్కగా పూరించారు. బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘కంది శంకరార్యు డొసంగె గఠిన ప్రశ్న’ అనండి.
నాయనమ్మ కున్న నలుగురు కొడుకులు
రిప్లయితొలగించండిపెళ్లి జేసుకొనిరి పిల్ల లైరి
నాన్న కూతురైన నాకిట పిన
తండ్రు లిద్దఱ తని తల్లియొకతె| {పినతండ్రులిద్దరు+నాన్నతల్లినొకతెఅన్నభావనచే నాపూరణ}
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదాన్ని ‘నా సహోదరుండు నారాయణకు పిన|తండ్రు...’ అనండి. అన్వయం కుదురుతుంది.
యాత్ర జేయ జనెను యాదాద్రి కీవేళ
రిప్లయితొలగించండిరామమూర్తి, తోడు రాజు కూడ.
వారి వెంట జనిరి వత్తుము మేమని
దండ్రులిద్ద ఱతని తల్లియొకతె.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తండ్రియస్తికలను తనయుడు చేపట్ట కాశికేగి వాటి గంగగలుప పయనమైరియపుడు భద్రమ్ముగా పిన తండ్రులిద్దరతని తల్లియొకతె
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు.ఫొన్ ద్వారా పంపిన దానిని పాదాలు సరిచేసి పంపుచున్నాను.
తొలగించండితండ్రియస్తికలను తనయుడు చేపట్ట
కాశికేగి వాటి గంగగలుప
పయనమైరియపుడు భద్రమ్ముగా పిన
తండ్రులిద్ద ఱతని తల్లియొకతె.
విద్య నేర్పి, నంత విజయాల దరి చేర్చి
రిప్లయితొలగించండికన్న తల్లి తండ్రి కన్న నధిక
ప్రేమ జూపు గురుని పితరునిగ దలచ
తండ్రులిద్దరతని తల్లి యొకతె!
గురువు గారికి నమస్కారాలు. నా నిన్నటి పూరణను కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాను. దయ చేసి చూడవలసిందిగా కోరుచున్నాను.
అనుదిన మొక పూరణతో
మనమున ఘర్షణ పడుచును మార్పుల నొందన్!
ఘనమగు పద్యపు రుచి జూ
పిన వానికి జూడ రెండు వేలొక లెక్కా?
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండి1.యముని యంశతోడ నతివయౌ కుంతికి
తనయుడై జనించె ధర్మజుండు
పాండు సుతుడు గానె వాసికెక్కెనుగదా!
తండ్రు లిద్దరతని తల్లి యొకతె.
2.ఇంద్రు కరుణచేత యింతికి తనయుడై
పాశు పతము నందె పార్థుడపుడు
పదియు పేర్లతోడ ప్రఖ్యాతి నొందెను
తండ్రులిద్దరతని తల్లి యొకతె.
3.మునియు వరము నొసగె ముదితకు యలనాడు
వరము బలిమి చేత వసుధలోన
వేడ వాయు వంశ భీముడుదయమొందె
తండ్రులిద్దరతని తల్లి యొకతె.
4.తండ్రి మరణమొందె తనయుండు పుట్టంగ
మాత చేసుకొనియె మారుమనువు
పెంచి ప్రేమతోడ పెద్ద చేసె నపుడు
తండ్రులిద్దరైరి తల్లి యొకతె.
5పతియు మరణమొంద పడతి దుఃఖము చేత
చంటి బిడ్డతోడ చావ దలచె,
పెద్దమనసుతోడ పెండ్లి యాడె నొకడు
తండ్రు లిద్దరైరి తల్లి యొకతె.
చివరి రెండుపద్యాలలో
రిప్లయితొలగించండిరతని బదులుగా రైరి అని వ్రాశాను మన్నించండి
డా. బల్లూరి ఉమాదేవి గారు,
తొలగించండిమీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవపూరణలో ‘ముదితకు నలనాడు’ అనండి.
పడతి యొకతె గాగ పతులేవురుండిరి;
రిప్లయితొలగించండిపతుల నిద్దర గొని పడతి మురియ
ప్రసవ మొందె నొక్క పండంటి బాలుని
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.
తల్లి కడుపు లోన తనయు డుండంగనె
తండ్రి పోవ గానె తల్లి మరల
పట్టె నొకని పతిగ ; ప్రసవము నైనంత
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తండ్రిపిదప తాను తండ్రిగా భావించు
రిప్లయితొలగించండిరాముడు పితృసముడు లక్ష్మణునకు
తండ్రు లిద్దరతని తల్లి యొకతె సుమిత్ర భూ
జా త తనద్వితీయ మాతసుమ్మ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం తప్పింది సరిచేస్తాను.
తొలగించండితండ్రిపిదప తాను తండ్రిగా భావించు
తొలగించండిరాముడు పితృసముడు లక్ష్మణునకు
తండ్రు లిద్దరతని తల్లి యొకతె మరి
సీత తనద్వితీయ మాతసుమ్మ
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిసవరించింన మీ పూరణ బాగున్నది. అంతకుముందు మీ పద్యంలోని గణదోషాన్ని నేను గమనించలేదు.
కాన్పు కష్టమగుచు కనుమూయ పత్నియె
రిప్లయితొలగించండికవల సుతులఁ బెంచెఁ గన్నతల్లి!
మురిపెమిడెదరింట ముద్దులొల్కెడు బుజ్జి
తండ్రులిద్దరతని తల్లియెకతె!
కాన్పు కష్టమగుచు కనుమూయ పత్నియె
రిప్లయితొలగించండికవల సుతులఁ బెంచెఁ గన్నతల్లి!
మురిపెమిడెదరింట ముద్దులొల్కెడు బుజ్జి
తండ్రులిద్దరతని తల్లియెకతె!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉండ్ర పృచ్ఛకుండ! తండ్రులెందరు నీకు?
రిప్లయితొలగించండిగంద్ర గోళ మిచట కాన రాదె!
శుభకరముగ గాన నభిమన్యునకు పిన
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె!