15, ఏప్రిల్ 2016, శుక్రవారం

పద్యరచన - 1195

కవిమిత్రులారా,
శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

34 కామెంట్‌లు: 1. ఒక తండ్రి మువ్వురమ్మలు
  నికరము నాల్గన కొమరులు నిచ్చట జూడన్
  ఒక నీశుడు మూడు గుణము
  ల గరిమ వేదంబు నాల్గు లచటన గంటిన్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి


 2. ఒక తండ్రి మువ్వురమ్మలు
  నికరము నాల్గన కొమరులు నిచ్చట జూడన్
  ఒక నీశుడు మూడు గుణము
  ల గరిమ వేదంబు నాల్గు లచటన గంటిన్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం బాగుంది.
   నాల్గవపాదంలో ప్రాస తప్పింది. ‘గుణము|లకళంక నిగమ చతుష్టయం బట గంటిన్’ అనండి.

   తొలగించండి
 3. తల్లులు ముగ్గురు తండ్రియు
  పిల్లల నలుగురి నిడోల ప్రీతిగ నూపన్
  ఉల్లము రంజిల దశరధు
  డుల్లాసమున పుత్రుల గని డోగాడె నిలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగుంది.
   నాల్గవపాదంలో గణదోషం. ‘...డుల్లసిలగ సుతులను గని డోగాడె...’ అనండి.

   తొలగించండి

 4. తల్లిదండ్రులుముదమునదమనుజూడ బాలురైనట్టిరాముడుభరతుడికను లక్ష్మణుండుశత్రుఘ్నులులాస్యరీతి నాడుకొనుటనుజూడగహర్షమయ్యె.

  రిప్లయితొలగించండి
 5. ముగ్గురమ్మలకట మురిపెంబు తోడను
  పుత్రులు జనియింప పుడమిరేడు
  సంబరమ్మునంది సలిపె నామకరణ
  మవని జనులు జూచి హర్షమొంద
  వనిజ

  రిప్లయితొలగించండి
 6. నిన్నటి పూణలొకపరి చూడండి అన్టినయ్యగాఖరూ.
  1. తాటి ముంజలివియు తాపము తగ్గించు
  చలువ చేసి మదికి శాంతి యొసగు
  వేసవందు జూడ వీటి వెలయుహెచ్చు
  తీయనైన ముంజ తినగ రండు.

  2.మక్కువతోడను తొనలను
  చక్కగ పైపొట్టు దీసి చవిచూడంగన్
  లెక్కకు మించియె తిందురు
  నక్కర తోడను జనములు నవనిన్ గనుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మన్నించాలి. నిన్నటి పద్యాల నన్నిటినీ సమీక్షించా ననుకున్నాను. ఇప్పుడు చూస్తే చూడని పద్యాలు ఇతరులవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తాను.
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘వేసవి+అందు’ అన్నపుడు సంధి లేదు. అక్కడ ‘వేసవిని గనంగ’ అనండి.

   తొలగించండి

 7. శ్రీరామ జయరామ జయజయ రామ.
  అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.


  తేటగీతి:

  కైకమగనిమాట విని లోకైక పతియె
  వనమునందున కలసి జీవనము సేయ
  నవనిసుతతోడ వెడలెతా నవని మెచ్చ
  దండకారణ్యమునకు కోదండమంది.

  కోదండ రామా !

  కందము:
  జనకుని పలుకులు నిలుపగ
  జనకునిసుత గలిసి వనికి సరివెడలితివే!
  అవనిని జనుడొకడనెనని
  యవనిజ గలువక నడవికి నటెబనిపితివే!

  కందము:
  మాటయె ముఖ్యముగా మో
  మాటములేకుండ ధరను మసలితివయ్యా !
  దీటగు ధర్మపు రూపుగ
  నీటుగ మా మదిని రామ ! నిలచితివయ్యా!


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ శ్రీరామ స్తుతి బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. ఒక్క పుత్రకామేష్టిని యోగమబ్బె,
  రెండు చేతుల ప్రాప్తించె దండి ఫలము.
  మువ్వురు సతులకొసగగ మురిపెముగను,
  నల్వురదొ సుతులు జనించినారు కనుఁడు.

  రిప్లయితొలగించండి
 9. పడకగ నుండెడు శేషుడు
  పడుకొన హరి ప్రక్క రెండు ప్రక్కలగను చొ
  ప్పడుశంఖము చక్రంబును
  పడుకొన నుయ్యాలలూగె పసిబాలురుగా.

  రిప్లయితొలగించండి
 10. ముద్దుల మూటలౌ సుతుల మువ్వురు పత్నుల గూడి రాజు తా
  హద్దుల మీరు ప్రేముడిని హాయిగ నూయల నూపుచుండగా
  సద్దును చేయకన్ గనెడి శైశవమై నరబాలురో యనన్
  గద్దరి దైవబాలకులు కాచుత లోకములెల్ల నిత్యమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   ఆ బాలరాముడు మిమ్మల్ని బలరాముణ్ణి చేయగాక! చక్కని పద్యం. అభినందనలు.

   తొలగించండి
 11. భువనైక మోహ నాతీ
  త వరాంగ విలాస చేష్ట తన్మయ రూపుల్
  ఛవి మత్కంకణ కర రా
  ఘవ వంశోధ్ధారకానఘాత్ముల గనుడీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   హృన్మోహన పద్యాన్ని అందించారు. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీ మనస్సునకానందము కల్గినందులకు చాల సంతోషముగ నున్నది.

   తొలగించండి
 12. . దశరథ తనయుల తత్వము
  దశవిధ లాభంబుగూర్చు ధరణీతలమున్
  దశదిశ వెలుగుల రీతిగ
  శిశువుల నూయలకు దెలుసు శీలురటంచున్|
  2.రామ,లక్ష్మణ,భరతుల రక్ష కొరక?
  తమ్ము డైన శత్రుఘ్నుల నమ్మకమ్మ
  ఊయ లందున నూగిరి యూహ లట్లు
  శాశ్వితంబుగ కీర్తి విస్వాస ముంచ|
  3.ఊహల నుయ్యాల నూగేటి పాపలు| లోకాలునిదురించ శోకమేల?
  తల్లుల తహతహ పిల్లల నవ్వులు తండ్రి సంతోషంబు తరుగ దిచట
  చిరుగాలి నూపున మరుగాలి మాటతో?తల్లులాశీస్సుల చల్లదనము
  దశరథ మహరాజు దశలనే మార్చగ?పుట్టిన నల్వురి పుట్టుకేల?
  నాల్గు దిక్కుల వెలుగుకై నల్గు రైరి
  మూర్తు లట్లుగ తల్లులు ముగ్గు రైరి
  దశరతుండిట గర్వమే విశద పరచ?
  సమయ మట్లుగ నూయల సరసనుండె|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘శాశ్వతంబుగ కీర్తి విశ్వాస ముంచ’ అనండి.

   తొలగించండి
 13. మొదటి కందం లో మూడు, నాలుగు పాదాలలో దోషాన్ని ఇలా మార్స్తున్నాను.

  జనుడొక డనెనని యవనిని
  వనముల గలవక యవనిజ బనిపితివటగా !

  రిప్లయితొలగించండి
 14. పుత్రులు కలుగ దక్కును మోక్షమనుచు
  పుత్రకామేష్టి సలుపగ ముదముతోడ
  సతులతో దశరథుడు తా సదనమందు
  పుట్టిరి నలుగురు సుతులు పుడమి పతికి
  రాజ్యమందలి ప్రజలంత రంజిలంగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. తనయులను జూచి మురియుచు
  అనునయముగ నూయలూపి హ్లాదము తోడన్
  జనకుడు దశరథుడదివో
  తనసతులను గూడి యచట తన్మయుడయ్యెన్!!!

  రిప్లయితొలగించండి
 16. గురుదేవులకు బ్లాగునందలి కవిమిత్రులకు మరియు వీక్షకులకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు.

  కోరి యాగము జేసినంతనె గూరె సంతతి వారికిన్
  చేరె పంక్తిరధుండు దారలఁ జిన్నవారల నూపగన్
  వారె శ్రీహరి, యాదిశేషుడు పాంచజన్యము చక్రముల్
  దారుణమ్ముల నాపనెంచెడు ధర్మమౌ యవతారముల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ మత్తకోకిల బాగున్నది. అభినందనలు.

   తొలగించండి