22, ఏప్రిల్ 2016, శుక్రవారం

పద్యరచన - 1202

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

24 కామెంట్‌లు:

 1. కండగలిగిన మామిడి పండు గాంచి
  చిలుకల జత యొక్కటి చేరి చెట్టుపైకి
  ఆను చుండె దానిని కడు నాత్రముగను
  కన్నులకు నిడె దృశ్యము కరముతృప్తి

  రిప్లయితొలగించండి
 2. చక్కని చిలుకల జంటకు
  చిక్కెను గద చూత ఫలము చిన్మయి! గనుమా
  గ్రక్కున దినుచుండెనవియె
  పక్కకు మరి జూడకుండ ప్రహ్లాదముగన్!!!

  రిప్లయితొలగించండి

 3. మామిడిపండునుజిలుకలు గోముగనటగొరుకుచుండెగొడవలిముకుతో న్యేమిటిమరియాయందమ
  యామురహరివరముగాదె!యార్యా!తలపన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘ముకుతో| నేమిటి’ అంటే సరికదా! ‘ముకుతో న్యేమిటి’...?

   తొలగించండి

 4. ఆమని యరుదెంచంగన్
  మామిడి ఫలములు తరువుకు మంచిగ కాయన్
  కోమలముగయాఫలముల
  రామచిలుకకొరుకుచుండె రమణీయముగన్.

  చూతఫలము తినెడు శుకము చూడగరండు
  గుజ్జునంత గ్రోలి గుట్టుగాను
  కడుపు నింపుకొనుట కమనీయమౌగదా
  ప్రకృతి లోని ఫలము పక్షి కొరకె/పాలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘కోమలముగ నా ఫలముల’ అనండి.

   తొలగించండి
 5. మావి పండు జూచి మనసైన కీరముల్
  తీపి మరగి దాని తినుచునుండె
  కలికి ప్రక్కనుండ కమ్మగ నుండదే
  మధుర మధురమగుచు మ్రాని పైన.

  రిప్లయితొలగించండి
 6. .చిత్ర విచిత్ర మైనదిల చేర్చిన ప్రకృతి రంగుహంగులున్
  చైత్రము పువ్వు నవ్వులును సాకుచు|మామిడి పళ్ళుజూపగా?
  ఆత్రుత యందుగాంచి తగునాశగ వచ్చియు పండురూపు,ఆ
  పత్రిని రూపు మాపగ సవాలుగ గైకొనె రామ చిల్కలున్|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘ప్రకృతి’ నగణమే, మీరు భగణంగా చూపారు.

   తొలగించండి
 7. దోరమాగిన ఫలమన్న కీరములును
  వదల బోవంటు యెరుగరే పాదపమున
  చిలుక కొరికిన చాలదే ఫలములకును
  తీయదనముయె చేరును తెలుసు కొనుము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘అంటు’ అనడం గ్రామ్యం. ‘వదల బోమని..’ అనండి.

   తొలగించండి
 8. తరుణార్క కిరణ సన్నిభ
  సురుచిర చూత ఫల సార చోదిత శుక రా
  జ రవశ్రవణానంద మ
  మర సుఖముల కన్న మిన్న మనుజుల కెల్లన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దీర్ఘసమాసంతో మీ పద్యం శ్రవణానందదాయకమై ఒప్పుతున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 9. మామిడి చిగుళ్లు మేయుచు
  నామని కోయిలల సుమధురాలాపనలే
  పామిన మాధుర్యములన్
  రామచిలుకలెంత మెచ్చె రసఫలమందున్!

  రిప్లయితొలగించండి
 10. చిలుక కొరికినంత పలకమారును క
  ద చిలుక కొట్టిన దని ముదమునను
  ఆదరమొప్పగ ఆరగింతురు మ
  ధుర ఫలమైనట్టి మామిడి ఫలము

  రిప్లయితొలగించండి
 11. తను పూర్తిగ తినజాలదు
  తినకుండను నుండ లేదు తృప్తియు లేదే
  పనికిన్ మాలిన పక్షిది
  వనములకున్ శత్రువిదియె...వన్నెల చిలుకే!

  రిప్లయితొలగించండి