16, ఏప్రిల్ 2016, శనివారం

పద్యరచన - 1196

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

30 కామెంట్‌లు: 1. క్షణమును తీరిక నివ్వక
  అనుదినపు కవితల హోరు నాతడు డస్సెన్
  వినుమా అయ్యరు జబ్బుకి
  తినవలె మందులు జిలేబి తిన్నగ నీవున్ :)

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   పాపం... మీ అయ్యర్‍ను మరీ అంతగా హింసిస్తున్నారా? పద్యం బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 2. మాటలు పాటలు రాతలు
  నీటుగ నానుండి వినక నీరస బడుచున్
  చీటికి మాటికి పరుగిడు
  నేటికి నాకేల మందు నీయుము పతికిన్
  రిప్లయితొలగించండి
 3. పలికెవైద్యుడునామెతోబావనాంగి!
  పూర్తివిశ్రాంతినిమ్ముమాభర్తకీవు
  నిద్రమాత్రలువాడుమునీవయివిగొ
  ననుచునిచ్చెనునామెకువినయముగను

  రిప్లయితొలగించండి
 4. ప్రక్కింటి కామాక్షి భర్తను చూడరో
  .......పట్టుచీరల గొను బెట్టు లేక
  ఎదురింటి వీరయ్య యింపుగా కొని తెచ్చె
  .......బంగారు గాజులు పండు గనుచు
  వెనుకింటి వెంకయ్య వింటిరా జీతమ్ము
  .......ప్రతినెలా పువ్వులా పడతి కిచ్చు
  మా చెల్లి మొగుడేమొ మారాజు దానిని
  .......వంట వద్దని హొటల్ వైపు సాగు

  అందరిండ్లలో మగవాళ్ళు హాయిగాను
  పెండ్లముల జూచుచుండిరి బెల్లము వలె
  నాదు కర్మము మీరేమొ యేది లేని
  యిట్టి దద్దమ్మ లైతిరి యేమి చేతు.

  ****

  భార్య పెట్టు పోరు భరియించ లేకను
  నిద్ర లేక భర్త నీరసించె
  పిచ్చి చూపు లాయె, పెండ్లాము పట్టుతో
  వైద్యు నొద్ద కేగె వనిత గూడి.

  ****

  వైద్యు డాతని దోడ్కొని వనిత నేమొ
  వేచి యుండుడు బయటని వెళ్ళె లోన
  భార్య పెట్టెడు గృహహింస భర్త చెప్ప
  వ్యాధి మూలమ్ము తెలిసెను వైద్యునకును.

  ****

  నిద్ర మాత్రల నిచ్చుచు నెలత కపుడు
  పూర్తి విశ్రాంతి కావలె భర్త కిపుడు
  మీర లీ మందు వాడుడు మెరుగు పడును
  వారి ఆరోగ్య మని పల్కె వైద్యు డంత.
  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   ‘గృహహింసా ప్రహసనము’ అని పేరు పెట్టదగిన మీ ఖండిక హాస్యరసస్ఫోరకంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. మీ ఖండిక ‘సంబరాల రాంబాబు’ సినిమాలో ‘ఎదురింటి మీనాక్షమ్మను చూశారా? వాళ్ళ ఆయన చేసే ముద్దూముచ్చట విన్నారా?” అన్న పాటను గుర్తుకు తెచ్చింది.

   తొలగించండి
  3. గురువుగారూ ధన్యవాదాలు. నాకు కూడా ఈ పద్యాలు వ్రాసేటప్పుడు ఆ పాట గుర్తుకు వచ్చింది.

   తొలగించండి
 5. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  డా క్ట ర్ :-----


  అమ్మ! నీ భర్తకు ప్రశా౦తి యవసర౦బు
  లిప్త కాలము బ్రతుకడు లేక యున్న
  నివిగొ! యీ నిద్రమాత్రల నీ విక. ప్రతి
  దినము మ్రి౦గుచు లేవ కొక నెల వరకు


  రో గి భా ర్య :----


  నేను నిద్రమాత్రలు మ్రి౦గి నిదుర వోవ
  అతని కున్న జబ్బెటుల నయ మగు చెపుమ. ?


  డా క్ట ర్ :---


  అమ్మ! విషము కన్న మిగుల హాని యైన
  తమ పలుకు లతని చెవి ర౦ధ్రముల దూరి
  తలకు చేరుకొనిన యట్టి తత్క్షణమ్మె
  నాశ మయ్యెను మస్తిష్క కణమ్ము లన్ని

  యతని యెదుట నిలిచి వాగు డాప లేవు
  నీవు నిద్రి౦ప యత డు౦డు నిర్మలముగ
  తగ్గు రోగము తప్పక దక్కు మగడు
  కొనుము బిల్లలు నోర్మూసు కొనుము నీవు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   ఇంకేమంటాం? నోర్మూసుకొని మీ ‘రోగిసతీ భిషక్సంవాదము’ అనబడు ఖండకృతి చాలా బాగుంది అన్నట్టుగా తలలూపుతాము.అభినందనలు.
   చివరి పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. ‘అతని యెదుట..’ అని ప్రారంభిస్తే సరి!

   తొలగించండి


 6. మావారలు కోలుకొనెడు
  దోవన్నదిఁ జూపక నను తూలమనెదవా?
  నీ వైద్యము జాలించుము
  పోవయ్యా పొరకలమ్మఁ బోలెదవీవున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం ముఖ్యంగా ‘వైద్యం మానేసి పొరకలమ్మ బొ’మ్మనడం బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 7. భరియింప లేక పోయెను
  తరణీ నీవాగుడింక తగ్గించుటయే
  సరియగు భేషజ మనుచును
  తెఱవకు నొకనిద్రమాత్ర తీసుకొనుడనెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ‘భరియించడు నీ వాగుడు| తరుణీ...’ అని మొదలుపెట్టి నా పద్యం వ్రాయలనుకున్నాను.మీ పద్యం చూసి ఆ ప్రయత్నం మానుకున్నా. :-)

   తొలగించండి
 8. రోగంబేమియు లేని రోగమిది|ఆరోగ్యంబె భాగ్యం బగున్
  సాగన్ జేయగసాధ్విగా పతికి విశ్రాంతుంచు|”వైద్యుండనెన్
  భాగంబైతివి భాద్యతా సతిగ లోపంబేమి లేనట్టుగా
  మూగై రాత్రికి నిద్ర మాత్రదినుమా|ముఖ్యంబు నీకేయనెన్”.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యం బాగుంది.
   ‘విశ్రాంతి+ఉంచు, మూగ+ఐ’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి
 9. హాస్యార్థంబునకైన ర
  హస్య విథిని చతుర వాచ్య హననము దగునే
  యాస్యప్రకటిత దుఃఖము
  తస్యాననమునగనుండు దయనీయముగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. తిట్టిన తిట్టును తిట్టక
  పెట్టుచు నాంక్షలను సతము పెనిమిటి కె పుడున్
  కట్టడి చేసిన ఫలమిది
  పెట్టెదమందులను నీకు ప్రియసఖు కావన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. భార్య కైత చదువ భర్తకు జబ్బొచ్చె
  వెజ్జు పల్కె తాను వెలదితోడ
  విసుగు వలన వచ్చె విశ్రాంతితో పోవు
  నిద్రమాత్రలిత్తు నిదురపొమ్ము.

  రిప్లయితొలగించండి
 12. విశ్రమింపకుండ విన్నవించితివీవు
  సొల్లు మాటలువిని సోలిపోయె
  మారు పల్కకుండ మంచిగా నిద్రించు
  పతియు చల్లగుండు పడతి వినుము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘వచ్చె’ను ‘ఒచ్చె’ అన్నారు. ‘భర్త జబ్బున పడె’ అనండి.

   తొలగించండి
 13. హాస్యార్థంబునకైన ర
  హస్య విథిని చతుర వాచ్య హననము దగునే
  యాస్యప్రకటిత దుఃఖము
  తస్యాననమునగనుండు దయనీయముగన్

  రిప్లయితొలగించండి
 14. అమ్మా! నీవీ మాత్రలు
  ముమ్మార్లిక మ్రింగ వలెను పూటకు మూడై...
  కమ్మగ వచ్చును నిద్దుర...
  గమ్మున నీ భర్త లేచి గంతులు వేయున్!

  రిప్లయితొలగించండి