7, ఏప్రిల్ 2016, గురువారం

సమస్య – 1996 (పరసతీగమనము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పరసతీగమనము బాగు బాగు.

55 కామెంట్‌లు:

  1. తీగల వలె మూగు తిరునాళ్ళకు జనము
    సాగిలబడి మ్రొక్కు స్వామి ముందు
    భక్తి భావమందు పరవశమయ్యెడి
    పరస తీగ మనము బాగు బాగు!!

    పరస - తీగ >> తీగ పాకినట్టు తిరునాళ్ళకు వచ్చె జనము

    రిప్లయితొలగించండి
  2. భార్య పుట్టినిలుకు పయనమై వెళ్లిన
    స్వేచ్ఛ నొందు మగఁడు, చింత తొలగు
    బ్రహ్మచారి బ్రతుకు బాగుబాగని తల
    పర,
    సతీగమనము బాగు బాగు!!


    గమనము = ప్రయాణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి కవిమిత్రుల ప్రశంసలకు పాత్ర మయ్యాయి. సంతోషం! అభినందనలు.

      తొలగించండి
    2. మీ పూరణలు ఔత్సాహిక కవులకు మార్గదర్శకాలు.

      తొలగించండి
  3. రావ ణుండు తలచె రాముని సాధ్విని
    పరసతీ గమనము బాగు బాగు
    హితము బలికె భార్య హతము జేయనెంచె
    చేటు దెచ్చు కొనెను మాట వినక

    ఇక్కడ " గమనము " = ఇష్టము , తలపు ,భావన

    రిప్లయితొలగించండి
  4. గురువర్యులకు,కవిమిత్రులకు నమస్సులు. నేనీరోజు 7 AM అమెరికా వెళుతున్నాను. మే 10 న తిరిగి వస్తాను. మిల్ పిటాస్ లో ఉంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శుభాభి నందనలు సత్యనారాయణ రెడ్డిగారు

      తొలగించండి
    2. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీరు అమెరికా వెళ్ళేలోగా ఒకసారి కలవాలనుకున్నాను. మీరు కూడా నా ఆరోగ్యం గురించి బాధపడుతూ ఫిజియో థెరఫీ కోసం మీ దగ్గరకు రమ్మన్నారు. కాని ఆరోగ్యం సహకరించక రాలేకపోయాను. మన్నించండి.
      మీ ప్రయాణం సుఖంగా జరగాలని, అమెరికానుండి కూడా బ్లాగులో పద్యాల వ్రాస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. శుభమస్తు!

      తొలగించండి


  5. శుభోదయం !

    మా జిలేబి పాక మధువును కలగలు
    ప, రసతీగ మనము బాగు బాగు
    యని సుకవులు చేయి నందివ్వ, పూరణ
    జేయ, పద్య మిటుల చేవ గొనియె

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      కాని రసతీగ అని సమాసం చేయరాదు. ‘బాగు+అని’ అన్నపుడు యడాగమం రాదు. ‘బాగ| టంచు...’ అనండి.
      మీ పద్యరచనాభ్యాసంలో చేయూత నివ్వడానికి అందరమూ సిద్ధమే. విజయో౽స్తు!

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. ఆలు మగలుఁ గూడి యన్యోన్య దాంపత్య
      సుధలఁ బంచు కొనుటె సొగసు భువికి!
      చిర్రుబుర్రు లాడ శ్రీమతి కినుక నో
      పర, సతీ గమమము బాగు!!బాగు!!!

      తొలగించండి
    2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. సత్యనారాయణ సోదరా! మీప్రయాణముసుఖమయమగుగాక!

    రిప్లయితొలగించండి
  8. నెలలునిండియుండ నెలతకే తానింక
    పుట్టినింటికేగు బుద్ధి గలుగ
    అడ్డుచెప్పకుండ నతి శీఘ్రముగనుపం
    పర, సతీగమనము బాగు బాగు.

    రిప్లయితొలగించండి
  9. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    అనుభవి౦చె నకట , యనయము లెన్నియో

    కాని , పతుల నెపుడు గౌరవి౦చె > >

    కృష్ణ సోదరి యగు - కృష్ణ. | యానాటి ద్వా

    పర - సతీ గమనము = బాగు బాగు !
    ………………………………………………………

    { ద్వాపర - సతీ గమనము =

    ద్వాపరయుగము నాటి సాద్వి యైన

    ద్రౌపదివర్తనము }
    ి

    రిప్లయితొలగించండి

  10. సుఖమయమగుగాత!సోదరా!పయనము మమ్ముమరువకుండయిమ్మునీదు దర్శనమ్మునుమనదగుశంకరాభర
    ణమునరెడ్డిసామి!సములదనుప

    రిప్లయితొలగించండి
  11. గురువు గారికి ప్రణామములు

    పరమ నీచ మదియు పరసతీ గమనము
    బాగు బాగనుచును పలుక డెవడు
    పుడమి లోన స్త్రీని పూజింప వలెనురా
    తరుణి లేని నాడు ధరణి లేదు.

    రిప్లయితొలగించండి

  12. సాగునంతవరకుసానుకూలమయయి పరసతీగమనముబాగుబాగు
    పట్టువడినవానిబాధలనూహించ దరముగాదుమనకు,దప్పవవియ

    రిప్లయితొలగించండి
  13. బ్రహ్మ గారు విష్ణు మూర్తి తో దక్ష యజ్ఞానికి వెలుతున్న యుమా దేవిని గురించి పలుకుతున్న సందర్భము:

    దక్షుడు ధరఁ గినిసి దర్పంబు తోడ ని
    రీశ్వరముగ జన్న మెట్లు సేయు
    వింత సుమి పిలువని పేరంట మది పరా
    త్పర సతీ గమనము బాగు బాగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ప్రస్తుతం పోతన తెలుగు భాగవతం.ఆర్గ్ వారికి భాగవతంలోని ‘దక్షయజ్ఞ’ ఘట్టానికి చెందిన పద్యభావాలను టైపు చేస్తున్నాను. (ఆనారోగ్యం వల్ల పని మందకొడిగా సాగుతున్నది).

      తొలగించండి
  14. పాపమంటునుగదభాగవతునకును
    బరసతీగమనము,బాగుబాగు
    కంటికిగనిపించుకాంతలనందర
    గన్నతల్లివోలెగాంచునెడల

    రిప్లయితొలగించండి
  15. మురళి జేత బట్టి మోహన రాగాన
    రమణుల మురిపించె రాధ గెలిచె
    అష్ట భార్య లున్న యనఘుడౌ కృష్ణుని
    పరసతీ గమనము బాగు బాగు

    రిప్లయితొలగించండి
  16. ఆలు లేని యిల్లు అంధకారము సుమ్ము
    తగవు లెన్ని యున్న వగవ బోకు
    కలసి మెలసి యుండు, కడదాక ప్రేమ జూ
    పర! సతీ గమనము బాగు బాగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. ధరణిజను దలంచి దానవు డనుకొనె
    పరసతీగమనము బాగు బాగు
    కామ పీడితుడయి కలియజూడ దలంచె
    కులసతిని ; తుదకట గూలిపోయె

    నిన్నటి పూరణ : -

    పది తలల వాని ద్రుంచిన
    సదమల హృదయుండు శేష శయనుడు హరి తా
    నిదురనెరుంగడు ; నటనను
    నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్

    పదిలము ధనపేటిక యన
    కుదురుగ నిధి గాచి భటుడు కూనీకాగా
    పదవిని కోశాధిపతిగ
    నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ నేటి పూరణ, నిన్నటి పూరణలు అన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. పిలుపు రాని వేళ పేరటమ్మున కేగ
    పుట్టినింటి కైన ముప్పు దెచ్చు
    వినవొ నాదు మాట? ప్రియసఖీ! దేవి! అ-
    పర! సతీ! గమనము? బాగు బాగు!

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    [అహల్యా జారుఁడై యింద్రుఁడు శాపముం గొనిన ఘట్టము]

    కని యహల్యను హరి కామదృష్టిని నాఁడు,
    "పరసతీ గమనము బాగు బా" గ
    టంచు, మాయఁ బన్ని, యట గౌతముని శాప
    మంది, వేయి కనులఁ బొందెఁ దుదకు!!

    రిప్లయితొలగించండి
  20. పరసతీ గమనము బాగుబాగనువాడు
    లంకరాజువోలె రాలు తుదకు
    చెడుతలంపు లెల్ల చేటును దెచ్చని
    సాక్ష్యమిచ్చె గాదె చరిత భువికి!!!

    రిప్లయితొలగించండి
  21. . పరసతీ గమనము బాగుబాగుయనగ?
    పూర్వకథలువినగ పుట్టుభయము
    ఆలిలేక పోయె ఆషాడ మాసాన
    కాలగమన మెంత కఠిన మౌర?
    2.తే.గీ. పరసతీగమనముబాగుబాగు యనెడి
    నీచతత్వము నందునే నీల్గిరిలను
    రావణాసుర రాజ్యంబు రయముగాగ|
    రాజరాజుకు యేగతిమోజులుంచె?
    3.ఉత్చాహ. పరసతీ గమనము బాగుబాగుయనుచునే
    కరుణ లేక కాంత చెంత కావరాన మెలుగగా
    వరములెన్ని యున్నఫలమ?వారకాంత మోజులో
    కరిగిపోవ?కాలమహిమ కాలరాయకుండునా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి.
      ‘బాగు+అనగ, బాగు+అనెడి, బాగు+అనుచునే’ అన్నపుడు యడాగమం రాదు. ‘బాగనంగ, బాగటంచు, బాగటంచునే’ అనండి.

      తొలగించండి
  22. చుప్పనాతియైన శూర్పణఖ పలుకు
    లాలకించి నట్టి యసురవరుడు
    తరుణి నపహరించి తలచె మనమునందు
    పరసతీగమనము బాగు బాగు

    2.పంక్తికంఠుడపుడు భామరూపునుగని
    పరసతీగమనము బాగు బాగు
    యనుచు దుష్టబుద్ధిఁనతివ నపహరించి
    రాము చేత జచ్చె రణము నందు

    3.చెడుతలంపులున్న చేటుతప్పదెపుడు
    'పరసతీగమనము బాగు బాగు'
    యనెడి వాడు పొందు నవని యందు నఘము
    తెలిసి మసలుకొమ్ము తెలివి తోడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘బాగు+అనుచు’ను ‘బాగటంచు’ అనండి.

      తొలగించండి
  23. వరము లున్న రావణుండు వనిత వలన జచ్చెరా
    ఉరసుడైన కీచకుండు నుర్వి వీడి పోయెరా
    చరిత లోన రాజరాజు జఱభుడుగను నిల్చెరా
    పరసతీ గమనము బాగు బాగు కాదురా ధరన్!!!

    రిప్లయితొలగించండి
  24. తాపమొందుచుండి తపము జేయుట కన్న
    కైటభారి కొలువు పూట పూట
    రమ్యముంగ నొంద రావణాసుర! నీకు
    పరసతీగమనము బాగు బాగు!

    రిప్లయితొలగించండి