26, ఏప్రిల్ 2016, మంగళవారం

పద్యరచన - 1206

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

36 కామెంట్‌లు:

 1. గిట్టుబాటులేక కొట్టుకొనుచురైతు
  కందిపంటవేయు కాంక్షవీడె
  కందిపప్పురేటు గగనము జేరగ
  బడుగు వారి బ్రతుకు భారమయ్యె

  రిప్లయితొలగించండి
 2. పప్పులు నుప్పులు పెరిగెను
  చెప్పులు యరిగిన దొరకదు చేబదు లైనన్
  గుప్పెడు మనసుకు సాంత్వన
  మెప్పుడు లభియించు నేమొ నెవ్విధి నైనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘చెప్పులు+అరిగిన’ అన్నపుడు యడాగమం రాదు. ‘చెప్పులె యరిగిన’ అనండి.

   తొలగించండి
  2. పప్పులు నుప్పులు పెరిగెను
   చెప్పులె యరిగిన దొరకదు చేబదు లైనన్
   గుప్పెడు మనసుకు సాంత్వన
   మెప్పుడు లభియించు నేమొ నెవ్విధి నైనన్

   గురువులు మన్నించాలి " అక్కయ్యా ! " అన్నపిలుపు లేకుండా ప్చ్ ! చాలా వెలితిగా{...} ఉంది.

   తొలగించండి

 3. కందిపప్పునుజూడుముకాంత!యచట కనులకింపయ్యెబంగరుకాంతితోడ ధరనుజూడగమిన్నునుదాకెమరిని కొనకదప్పదుగామనకుబ్రదుకుటకు

  రిప్లయితొలగించండి
 4. బందువులింటికి వచ్చిన
  విందునకై కంది పప్పు వెలదియె కోర
  న్నాందోళన పడనిదెవరు?
  నిందీవర శ్యాముడైన నిబ్బంది పడున్!
  (మండే ధరల వల్ల)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘ఎవరు+ఇందీవర=ఎవ రిందీవర’ అవుతుంది. నుగాగమం రాదు. ‘...న్నాందోళన నెవ్వరు పడ| రిందీవర...’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:బందువులింటికి వచ్చిన
   విందునకై కంది పప్పు వెలదియె కోర
   న్నాందోళన నెవ్వరు పడ
   రిందీవర శ్యాముడైన నిబ్బంది పడున్!
   (మండే ధరల వల్ల)

   తొలగించండి
 5. పప్పు దినుసులవి కొనలే
  మప్ప నిజము ముత్యములకు నవి సాటి యిలన్
  తిప్పలు తప్పవు కొనినం
  గొప్పలకుం బోయి యప్పు గోరిన వేళన్

  రిప్లయితొలగించండి
 6. కంది పప్పు తినని కానన ముండదు
  కంది పప్పు మిగుల కమ్మనుండు
  కంది పప్పు ధర గగనమై యిపుడు చేతి
  కందకుండ నుండె నాకసమున.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘తినని కాపుర ముండదు’ అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 7. కందిపప్పు జూడ గడు రమణీయంబు,
  అంది, కొనగనెక్కె నందలంబు,
  అందునెపుడు విపణి నందరి దాపులో
  సగటు మానవునకు చౌక ధరకు?!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘అందుకొనగ నెక్కె’ అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 8. కంది వారి పంట కవితలో దీపించి,
  పప్పువారి ప్రతిభ వ్యాప్తి జెంది
  ఆర్ణవమ్ము దాటి అమెరికా జేరెను
  కంది పప్పు నెటుల నందగలము?

  రిప్లయితొలగించండి
 9. పప్పులలో ప్రథమము పై
  కప్పులనంటిన ధరలతొ కాలెను కందుల్
  అప్పుల పాలైన జనుల
  తిప్పలు ఎప్పుడు ముగియును తిరుమలవాసా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తంగిరాల రఘురామ్ గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   పద్యం బాగుంది. కొన్ని లోపాలు...
   ‘ధరలతొ’ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాశారు. ‘కందుల్+అప్పుల, తిప్పలు+ఎప్పుడు’ అని విసంధిగా వ్రాశారు. మీ పద్యానికి నా సవరణ...
   పప్పులలో ప్రథమము పై
   కప్పున కంటిన ధరలకు కందులఁ గొనఁగా
   నప్పుల పాలైన జనుల
   తిప్పల కెప్పుడు ముగింపు తిరుమలవాసా!

   తొలగించండి
 10. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  { క్షమి౦చాలి.ి మా౦స భక్షణము అనా
  రోగ్య కరమని మాత్రమే నేను నుడువు
  చున్నాను . దయ చేసి నా పై ఎవరు కినుక
  చె౦దవలదని మనవి.


  మా౦స కృత్తులు జ౦తు మా౦సమ్ము లోననే
  . . ను౦డు న౦ చనకు మూర్ఖు౦డ వగుచు

  కోడిమా౦సమ్మును గొర్రెమా౦సమ్మును
  . . మేకమా౦సమ్మును మెక్క కోయి

  వట్టి మా౦సము రుచి౦ పదని మీ యావిడ
  . . చెక్క.యాల్క.లవ౦గ. చేర్చి వ౦డు

  ఆమ్లము కడుపు లో నధిక మౌ | ఒడల౦త
  . . క్రొవ్వు వట్టును | బుధ్ధి కొ౦చె మగును  " రక్త పో " టధిక మగుచు రట్టు సేయు

  గు౦డె పోటు తొ౦దరగ. నిన్ గు౦త కీడ్చు

  మా౦స కృత్తుల కై జ౦తు మా౦స. మేల ?

  క ౦ ది ప ప్ప మెసగుము సు ఖ ౦ బు క లు గు
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
  ి
  { రక్త పోటు = దుష్ట సమాస మైనను వాడుక పద మని వాడాను. " క్షమి౦చాలి " }

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  రిప్లయితొలగించండి
 11. గుంత కీడ్చే మాంసాహారం కంటే కందిపప్పు మేలన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. రిప్లయిలు
  1. ప్రయోగాలతో మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   కాని ప్రయోగాల పట్ల ఆసక్తితో కొన్ని లోపాలు... ‘లోకం, ఏకం దిగ్బంధ’ ముప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘నిజపోటు’ అనడం దోషం.

   తొలగించండి
 13. అంబటిభానుప్రకాశ్.
  ఆ*
  ఉప్పు లేని కూర !యుండదు రుచిగాను,!
  పప్పు లేని తిండి !యొప్పు గాదు,!
  నప్పు జేసి యైన.! పప్పునే దినవలె,!
  కంది పప్పు కొనగ !ముందె యుండు !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘..గాదు+అప్పు’ అన్నపుడు నుగాగమం రాదు. ‘పప్పునే తినవలె నప్పు జేసియునైన’ అనండి.

   తొలగించండి
 14. అంబటిభానుప్రకాశ్.

  ఉప్పు లేని కూర !యుండదు రుచిగాను,!
  పప్పు లేని తిండి !యొప్పు గాదు,! పప్పునేదినవలె,!నప్పు జేసియునైన,!
  కంది పప్పు కొనగ !ముందె యుండు !!

  🌺(సవరించిన పద్యం .ధన్యవాదములు సర్)🙏🌺

  రిప్లయితొలగించండి
 15. కందిపప్పు వెలయు గగనాని కెగసినా
  నసలు డబ్బు రాక యన్న దాత
  కుమిలి కుమిలి యేడ్చి కొండలా పెరిగిన
  అప్పు తలచు కొనుచు కుప్ప కూలె.

  కంది పప్పు ధరయు గణనీయముగ పెర్గె
  అప్పు దీరు నంచు నవని లోన
  మురిసి పోయి మదిని మొక్కులు చెల్లించి
  సంబరపడిపోయె సగటు రైతు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘గగనాని కెగసిన| నసలు...’ అనండి.

   తొలగించండి
 16. శ్రీ గౌరవీయులగుకంది శంకరయ్య గురువుగారికివందనములు తప్పుగలిగిన పద్యాన్ని మార్చివేరుపద్యాన్ని వ్రాయడమైనది నాపోరపాటునుమన్నింతురనికోరుతూ నిజపోటును
  మార్చి తగుపోటుయగునుఅనిసవరణజేయడ మైనది

  26.4.16. కందిపంటలేక కందిపోయెనురైతు|
  కంది ధరలు బెరుగ?కలత ప్రజకు
  పప్పుచారు లేక అప్పుజేయగ బోక
  ఇంటి వారిరుచులు కంటకంబె|
  2.బీదవారి కైన పెద్ద వారికినైన
  కందిపప్పు లేక కాదుతిండి
  ఆలుమగల రీతి అన్నము పప్పుండు
  ధరలు వేరుబరచ ధర్మ మేన?
  3.కంది రీగ లట్లు కరువగ వెంటాడి
  దినము ధరలు గరువ?దిగులునందె
  పప్పు ధాన్య మనిన ?ప్రజలకు భయము|ని
  ప్పు,నడక యగుట తగు పోటుయగును| {పద్యపాదాదిఅక్షరములుకందిపప్పు}

  రిప్లయితొలగించండి
 17. కందిపప్పు జూడ కలవారి దినుసయ్యె
  భారమయ్యె పేద వారి కదియు
  వంట లోన జేర్చ కంటనీరును దెచ్చె
  కలిమి బాని సయ్యె కందిపప్పు

  కందిపప్పు ధరయె గగనాని కెగయుచు
  తారకలను మించి తళుకు లీనె
  పేదజనుల కదియు పెనుభార మయ్యెను
  పప్పు చారు రుచియె వగరు కెక్కె

  కల్పమందు జూడ కందిపప్పు ధరలు
  వినిన జాలు మనకు స్వేదమలరు
  కలత బెంచె నదియు కర్మసాక్షిగమారి
  భగభగమని మండి సెగలు గ్రక్కె

  రిప్లయితొలగించండి
 18. కష్ట పడెడు రైతు కలతచెందెను తాను
  గిట్టుబాటు గాక గింజుకొనుచు
  నప్పు తీర్చ లేకనతులకుతలమౌచు
  దిక్కు లరసె వేరు దిక్కులేక.

  2కంది పంట వేసి కనులార గాంచుచు
  భార్యతోడ పల్కె భాధలెల్ల
  తీరు చూడు మింక దేవుని దయతోడ
  నప్పు లెల్ల దీరు నవని లోన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘లేక యతలకుతల మయి’ అనండి.

   తొలగించండి
 19. కంది పప్పుకు చారుకు వందనాలు
  కంది పప్పు పులుసు కభినందనాలు
  కంది శంకరు కవితకు కారణాలు
  కంది గుండకు పేరిల గన్ను పౌడ్రు :)

  రిప్లయితొలగించండి