గురువులు శ్రీ శంకరయ్య గారికి నమస్సులు... మీ సవరణలకు కృతజ్ఞతలు.... కొన్ని టైపింగ్ తప్పు లు దొర్లాయి....సవరించిన పద్యం పంపుతున్నాను పోటీ తత్త్వములో నా నాటికి మన చదువులందు నాణ్యత దరుగన్ ధాటికి నిలబడలేకను పాటుబడిన, వారికెట్లు ఫలితము దక్కున్!
గురువులు శ్రీ శంకరయ్య గారికి నమస్సులు... మీ సవరణలకు కృతజ్ఞతలు.... కొన్ని టైపింగ్ తప్పు లు దొర్లాయి....సవరించిన పద్యం పంపుతున్నాను పోటీ తత్త్వములో నా నాటికి మన చదువులందు నాణ్యత దరుగన్ ధాటికి నిలబడలేకను పాటుబడిన, వారికెట్లు ఫలితము దక్కున్!
మోటుగ మారగ సేద్యముఁ,
రిప్లయితొలగించండినాటల నాడగ రుతువులు నాశలుఁ గూలన్,
మాటలదే రాజ్యమవగఁ
బాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్?
మీ పూరణ బాగున్నది.
తొలగించండి‘సేద్య| మ్మాటల నాడగ ఋతువులు...’ అనండి.
బీటలు వారిన భూమిని
రిప్లయితొలగించండియేటికి యెదురీది బలిమిగ యెవ్విధి నైనన్
తోటలు వేయుచు పంటకు
పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
రెండవపాదంలో గణదోషం. ‘భూమిని| నేటికి నెదురీది బలిమి నెవ్విధి...’ అనండి.
బీటలు వారిన భూమిని
తొలగించండినేటికి నెదురీది బలిమిగ నెవ్విధి నైనన్
తోటలు వేయుచు పంటకు
పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్
ముందు ఇలాగే రాసి,మళ్ళీ ఏదో సందేహించి,పనిగట్టుకుని తప్పురాసాను .అదేనేమొ శని తెత్తిమీదంటే
NVN చారి గారి పూరణ....
రిప్లయితొలగించండినీటుగ నుండుట నేర్చియు
సూటును బూటును ధరించి సోమరు లగుచున్
సీటున కూర్చొను చును కూ
ర్పాటు బడిన వారి కెట్లు ఫలితము దక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....
రిప్లయితొలగించండిధాటిగ పూజల జేయుచు
వాటముగా శివునిసొమ్ము వాటా(భాగము)గొనుచున్
చాటుగ స్వార్థమునకు నగ
పాటుబడిన వారికెట్లు ఫలితముదక్కున్
(అగపాటు = చిక్కు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాటల గోటలు దాటుచు
రిప్లయితొలగించండివాటి నమలు జేయంగల వైనము లేకన్
వేటిం జేగొన కిట, నగు
బాటు బడిన వారికెట్లు ఫలితము దక్కున్
మాటల గోటలు దాటుచు
రిప్లయితొలగించండివాటి నమలు జేయంగల వైనము లేకన్
వేటిం జేగొన కిట, నగు
బాటు బడిన వారికెట్లు ఫలితము దక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాటల నమృతపు తునకల
రిప్లయితొలగించండిసాటిగ వెలిబుచ్చి తనదు స్వార్ధము కొఱకై
చేటుగ బడుగుల నడచగ
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినాటుచు విత్తులు మెట్టన
రిప్లయితొలగించండివాటముగా నీరు బెట్ట వారటమునకున్
నీటికి యెద్దడి వచ్చిన
పాటు బడిన వారికెట్లు ఫలితము దక్కున్!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటలపాటలయందున
నేటికియేడాదిగడిపియిప్పుడుచేత
న్దీటుగబొత్తమునునిచియు పాటుబడినవారికెట్లుఫలితముదక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిచేటును దెచ్చెడి పనులను
బోటియుఁ బడి చేయు తపనఁ బో నాడక, నే
నాఁటికిఁ దప్పెఱుఁగక, పొర
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్?
చిన్న సవరణము చేసిన తదుపరి నా పూరణము:
రిప్లయితొలగించండిచేటును దెచ్చెడి పనులనుఁ
బోటియుఁ బడి చేయు తపనఁ బో నాడక, యే
నాఁటికిఁ దప్పెఱుఁగక, పొర
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచాటగ ముస్లిము ఘనతను
రిప్లయితొలగించండిపోటీగ గట్టగ మహలును; పోయెను కరముల్
కటకట! రాజుల మోసము!
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్?
(తాజ్మహల్ కట్టినవారు ఫలితము దక్కక పోగా చేతులూ పోగొట్టుకున్నారని భావము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘పోటిగ’ టైపాటు వల్ల ‘పోటీగ’ అయినట్టుంది. లేకుంటే గణదోషం.
correct sir.పోటిగ
తొలగించండినా రెండవ పూరణము:
రిప్లయితొలగించండి(2)
పోటీ పరీక్ష జరిగెడి
నాఁటికి పది దినము లుండ నపు డా శంకా
కోటులఁ దీర్చఁగఁ బూనఁగఁ
బాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్?
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపోటీ తత్త్వములోఁ న్నా
రిప్లయితొలగించండినాటికి చదువులలో నాణ్యత దరుగంగా
ధాటికి నిలబడలేకను
పాటుబడిన, వారికెట్లు ఫలితము దక్కున్!
పోటీ తత్త్వములోఁ న్నా
రిప్లయితొలగించండినాటికి చదువులలో నాణ్యత దరుగంగా
ధాటికి నిలబడలేకను
పాటుబడిన, వారికెట్లు ఫలితము దక్కున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘తత్త్వములో నా|నాటికి...’ అనండి. అరసున్న ఎందుకు?
రెండవపాదంలో గణదోషం. ‘...నాటికి మన చదువులందు నాణ్యత దరుగన్’ అనండి
గురువులు శ్రీ శంకరయ్య గారికి నమస్సులు... మీ సవరణలకు కృతజ్ఞతలు.... కొన్ని టైపింగ్ తప్పు లు దొర్లాయి....సవరించిన పద్యం పంపుతున్నాను
తొలగించండిపోటీ తత్త్వములో నా
నాటికి మన చదువులందు నాణ్యత దరుగన్
ధాటికి నిలబడలేకను
పాటుబడిన, వారికెట్లు ఫలితము దక్కున్!
గురువులు శ్రీ శంకరయ్య గారికి నమస్సులు... మీ సవరణలకు కృతజ్ఞతలు.... కొన్ని టైపింగ్ తప్పు లు దొర్లాయి....సవరించిన పద్యం పంపుతున్నాను
తొలగించండిపోటీ తత్త్వములో నా
నాటికి మన చదువులందు నాణ్యత దరుగన్
ధాటికి నిలబడలేకను
పాటుబడిన, వారికెట్లు ఫలితము దక్కున్!
పిన్నక నాగేశ్వరరావు గారి పూరణ.... (వాట్సప్ ద్వారా...)
రిప్లయితొలగించండిమాటలు కోటలు దాటెడు
కూటికి గతిలేనివారి కుటిలత్వము నా
నాటికి హద్దులు దాటగ
పాటుపడిన వారికెట్లు ఫలితము దక్కున్ ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేటొనరించెడి పనులను
రిప్లయితొలగించండిధాటిగ చేయుచు జనులకు తగవుల నిడుచున్
కాటికి చేరన్ యిటు పొర
పాటుబడినవారికెట్లు ఫలితము దక్కున్.
వేటాడునటుల జనముల
ఘాటగు మాటల చులకన గా చూడంగన్
చేటగు నిజమిది యరయుము
పాటుబడిన వారి కెట్లు ఫలితము వచ్చున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణలో ‘చేరన్+ఇటు’ అన్నపుడు యడాగమం రాదు. ‘చేరగ నిటు’ అనండి.
శ్రీరాం కవి గారి పూరణ... (వాట్సప్ ద్వారా...)
రిప్లయితొలగించండిపోటున యుదధికి చేపల
వేటకు పోయినఫలితమువాటముగుండున్
పాటునవేటకుజని పొర
పాటుబడినవారికెట్లుఫలితముదక్కున్
(సముద్రానికి పోటుపాట్లు ఉంటాయి.పోటుకాలంలో చేపలు ఎక్కువగాదొరుకుతాయి)
చేపూరి శ్రీరామారావు (శ్రీరామ్) గారి రెండవ పూరణ:
తొలగించండిపోటిగ మధుసూదనుతో
పాటవముగ పద్యములను ప్రకటన లిడ మా
బోటి కుకవుల కలవె? గ్రహ
పాటుపడినవారికెట్లుఫలితముదక్కున్??
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణలో ‘పోటున నుదధికి’ అనండి. ‘వాటముగ+ఉండున్=వాటముగ నుండున్’ అవుతుంది. అక్మడ ‘వాటమ్మగులే’ అనండి.
NVN చారి గారి (వాట్సప్) పూరణ....
రిప్లయితొలగించండిధీటుగ సకలము జదివెను
సూటిగ నాన్సర్లు రాసి స్పూర్తిని నింపెన్
ధాటిగ దుష్ట గ్రహంబుల
పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్
అన్యదేశ్యాలున్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘రాసి’ని ‘వ్రాసి’ అనండి.
నాటులు వేయు తరుణమని
రిప్లయితొలగించండిసేటుల కడనప్పు జేసి సేద్యము చేయన్
కీటక బాధలు గ్రమ్మిన
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధనము కురియవలెనింటయు
రిప్లయితొలగించండిదనమదియుకలిగి విత్తును ధరపైన వేయన్
దనభూమికి జలము లేకయె
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్
"శ్రీను, దువ్వూరు, కడప జిల్లా ".
పూరణ బాగున్నది. రెండవ మూడవ పాదాలలో గణదోషం. సవరించండి.
తొలగించండి1,2,3 పాదములలో ప్రాసనియమము పాటించలేదు. దయతో గమనించండి.
తొలగించండిచాటున మెక్కియు లంచం
రిప్లయితొలగించండిధీటుగ పనిజేయక మరి దినములు గడిపిన్
ఘాటుగ పరులను తిట్టియు
పాటు పడిన వారి కెట్లు ఫలితము దక్కున్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'లంచము... గడిపెన్' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి🌺🙏🌺
రిప్లయితొలగించండిఅంబటి భానుప్రకాశ్,
దుప్పల్లి.
కం**
ఆటల నాడుచు తూలుచు,
మాటల ప్రేలుచు యెపుడును మంచిని గనకన్ !
చేటును దెచ్చుకు గడిపిన,
బాటు బడిన వారికెట్లు ఫలితము దక్కున్, !!
*** **** ***
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాటుపడక సుంతైనను
రిప్లయితొలగించండిమాటల మాయల జనులను మభ్య పరచినన్
చేటగు కార్యము లెల్లం
బాటుబడిన, వారి కెట్లు ఫలితము దక్కున్?
[పాటుబడిన= ఆపదలందు చిక్కిన; పాటుపడు= శ్రమపడు]
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండిపాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్
పూరణ
బండికాడి అంజయ్య గౌడ్ గారి పూరణ...
మేటి బలాఢ్యుడు కీచకు
సాటెవ్వరు లేరటంచు సైరంధ్రి నటన్
కూటమికై రమ్మనె పొర
పాటు పడినవారికెట్లు ఫలితము దక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితోటకు నీరుయు పదిలంబు
రిప్లయితొలగించండిమాటకు పదిలంబు జిహ్వయు మనుజునకిలయున్
ఆటకు నేర్పుయు లేకయె
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్
"శ్రీను, దువ్వూరు, కడపజిల్లా ".
తోటకు నీరుయు పదిలంబు
రిప్లయితొలగించండిమాటకు పదిలంబు జిహ్వయు మనుజునకిలయున్
ఆటకు నేర్పుయు లేకయె
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్
"శ్రీను, దువ్వూరు, కడపజిల్లా ".
మీ పూరణ బాగున్నది. నా సవరణ చూడండి.....
తొలగించండితోటకు నీరే పదిలము
తొలగించండిమాటకు పదిలంబు జిహ్వ మనుజున కిలలో
నాటకు నేరుపె లేకన్
పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్.
కోటి పనులు సక్రమముగ
రిప్లయితొలగించండివాటమ్ముగ జేయు చుండి భద్రతకై నే
ర్పాటున నిర్లక్ష్యముతో
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్
కోటి పనులు సక్రమముగ
రిప్లయితొలగించండివాటమ్ముగ జేయు చుండి భద్రతకై నే
ర్పాటున నిర్లక్ష్యముతో
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నై పు ణ్య ము లే కు ౦ డా ఎ ౦ త శ్ర మ
ప డి న ను వా రి కి ఫ లి త ము ల భి ౦ చ దు
నీ రు పో య కు ౦ డా ఎ ౦ త మ ౦ ట పె ట్టి నా బి య్య ము అ న్న ము కా దు
…………………………………………………….………………………………………………………
పాటవము లేక నూరక
పాటుపడిన వారి కెట్లు ఫలితము దక్కున్ ?
నీటిని పోయక , మ౦టను
గాటముగా బెట్ట . ప్రాలు కా దన్న మికన్
{ పాటవము = నైపుణ్యము. గాటముగా =
అధికముగా. ప్రాలు = బియ్యము }
ఓటును నోటులతోగొని
రిప్లయితొలగించండిమాటకు విలువివ్వ కున్న మనుజుల మదిలో
చోటేది మంచికొరకై
పాటు బడిన వారికెట్లు ఫలితము దక్కున్
మీ పూరణ్ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో విలువీయకున్న అనండి.
తొలగించండినీటుగ ధరించి వలువల
రిప్లయితొలగించండిపాటుపడెడు గుణము లేక పనిలో తనకున్
పాటవమందకనె కునుకు
పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్!
పోటీ పరీక్ష లందున
రిప్లయితొలగించండిధాటిగ చదువక సతతము తిరుగుచు నుండన్
మాటల చేతల తొందర
పాటు బడినవారి కెట్లు ఫలితము దక్కున్?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూటికి లేదని యెరిగియు
రిప్లయితొలగించండిబోటింటను బాధనొంద పోకిరి వారై
బాటల వెంటఁ దిరుగు పొర
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్?
పాటిల్లెడి కలవరముల
రిప్లయితొలగించండిపాటిగొనగ లేనివారు భాసిలబో రే
పాటవ మందక జనులిట
పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్!
🔴
తొలగించండిసాటి మనుషులను నిరతము
మేటిగ గమనించిగూడ మేదిని లోనన్
వాటిగ రమణుల నెఱుగక
పాటు బడినవారికెట్లు ఫలితము దక్కున్
🔴
కాటిక బోవగ యెవరును
మాటున దాగియు నుగాని మార్కొన గలరా
పాటిగ రమణుల నెఱుగక
పాటు బడిన వారి కెట్లు ఫలితము దక్కున్
🔴
వీరా గుడిపల్లి
🔴
తొలగించండికోటలు బీటలు వారిన
పేటలు వెలసిన నునేడు వెత్తనమింకా
పీటగ మారెను మూర్ఖుల
పాటు బడిన వారికేలఫలితము దక్కున్
🔴
ఏటి కొక మారు వచ్చెడి
రిప్లయితొలగించండిపోటీ కూడిన పరీక్ష వుసి గొలుపంగా,
ధాటిగ వ్రాయుటలో పొర
పాటు పడిన వారికెట్లు ఫలితము దక్కున్!
బీటుకూరు శేషుకుమార్ గారి పూరణ:
రిప్లయితొలగించండిమాటల తూటా వదలుచు
ఘాటగు చేటగు పనులను ఘనమగు కొంపన్
పాటున గూల్చి తొలగి వే
ర్పాటు పడిన వారి కెట్లు ఫలితము దక్కున్?
గురిజాల ప్రసాద్ గారి పూరణ:
రిప్లయితొలగించండిమాటల, తంత్రపు మాయల,
నోటులు మందిడియు గెల్వ నోర్తురు వోట్లన్!
నీటుగ నిస్వార్ధముతో
పాటుపడినవారికెట్లు ఫలితముదక్కున్?
[20:16, 30/04/2016] Kanthi Krishna: మోటను దున్నెను గతమున
రిప్లయితొలగించండిమోటరు యెవుసముతొ నేడు ముందుకు సాగన్
చీటరు చేతిన బతుకగు
పాటుపడిన వారికెట్లు ఫలితము దక్కున్
[20:16, 30/04/2016] Kanthi Krishna: నీటుగ డ్రెస్సింగు జేసి
మాటలతో మభ్యబెట్టు మనుషుల మధ్యన్
మోటుగ బతికెడు వారలు
పాటుపడిన వారికెట్లు ఫలితము దక్కున్
[20:18, 30/04/2016] Kanthi Krishna: చాటుగ మోసము జేయుచు
నేటుగ వినయము నటించు
నిర్దయులున్డన్
పూటలు దెలియక నిరతము
పాటుపడిన వారికెట్లు ఫలితము దక్కున్
పోటీ పరీక్షలు రాయ
రిప్లయితొలగించండిబాటుల బడుచును జదివియు పరుగుల బెడుతూ
లేటుగ హాలుకు జనిపొర
బాటుపడిన వారికెట్లు ఫలితము దక్కున్
దీటుగ థీసిసు వ్రాసియు
రిప్లయితొలగించండినీటుగ టైపిస్టు కిచ్చి నిదురించంగన్
టైటిలు లోనే చెడు టై
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్?
టైపాటు = టైపులో పొరపాటు (typo)
Example:
A fat and great book by TP Das in the 1970s had this title:
"Relativistic Theory of Elections"
("Electrons" was what the poor author wrote)