16, ఏప్రిల్ 2016, శనివారం

సమస్య - 2005 (కామాతురుఁడైన నరుడె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
కామాతురుఁ డైన నరుఁడె కాంచును ముక్తిన్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

42 కామెంట్‌లు:

  1. కామము జన్మకు సహజము
    కాముకునిగ మునిగి తుదకు కౌశికుడైనన్
    నీమము దప్పక గృహపతి
    కామాతురుఁ డైన నరుఁడె కాంచును ముక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర అక్కయ్యా,
      మీ పురణ బాగున్నది. అభినందనలు.
      ‘నీమముతో గృహపతియై’ అనండం. అన్వయం బాగుంటుంది.

      తొలగించండి
    2. కామము జన్మకు సహజము
      కాముకునిగ మునిగి తుదకు కౌశికుడైనన్
      నీమముతో గృహపతియై
      కామాతురుఁ డైన నరుఁడె కాంచును ముక్తిన్

      తొలగించండి
  2. భామిని భగమున బుట్టెను
    భామిని సరసన తెలిసెను భగమును జూడన్
    సామిని బొందన్ సతతము
    కామాతురుఁ డైన నరుఁడె కాంచును ముక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగుంది.
      సాధారణంగా చతుర్మాత్మా గణాలను చెప్పేటప్పుడు సగణం ప్రక్కన లఘువు చేరితే సలం (IIUI) అంటాం. అలాగే UIIU భగణం ప్రక్కన గురువు చేరించి కనుక ‘భగము’ అనాలి, కాని అశ్లీలార్థం వస్తుందని దానిని భలఘువు అంటారు. అలాగే మలము(UUUI)ను మలఘువు అంటారు. గమనించ ప్రార్థన.

      తొలగించండి

  3. కామముబలమైయుండియు కామినులనుజూడకుండకన్నెత్తియునున్ కామముముక్తియయగుచో కామాతురుడైననరుడెకాంచునుముక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘కన్నెత్తియు నా| కామము...’ అనండి.

      తొలగించండి
  4. భూమాతను కాపాడుతు,
    సామాన్యునిగా బ్రతుకుతు, సకల జనుల సం
    క్షేమమ్ము కోరు, వసుధై
    కా మాతురుఁడైన నరుడె కాంచున్ ముక్తిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మడిపెల్లి రాజకుమార్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని ‘వసుధైకామాతురుడు’ అంటే?

      తొలగించండి
    2. వసుధ+ఏక+మాతురుడు = నేల తల్లి ఒక్కతి మాత్రమే తల్లిగా కలిగిన నరుడని అంటే నేలపై నరులందరికి కన్నతల్లులు వేరువేరైనా నేల అందరి తల్లి. చెట్లన్నిటికి నేల మాత్రమే తల్లి అటువంటి భావన కలిగిన నరుడే ఈ నేలను కాపాడతాడని, సర్వజనుల పట్ల సౌభ్రాతృత్వ భావన కలిగి ఉంటాడన్న భావనతో పూరించాను.

      తొలగించండి
    3. ద్వైమాతురుడు= వినాయకుడు,త్రైమాతురుడు= లక్ష్మణుడు,షాణ్మాతురుడు= కుమారస్వామి

      తొలగించండి
    4. మీ వివరణకు ధన్యవాదాలు. నిజంగా అంత లోతుగా ఆలోచించలేదు.
      అద్భుతమూ వైవిధ్యమూ అయిన పూరణ మీది. అభినందనలు.

      తొలగించండి
    5. ఇందరి టపాలు చదివి,వారికి ప్రత్యుత్తరాలు రాసే మీ సహనానికి జోహార్లు.

      తొలగించండి
  5. కోమల హృదయము గల్గిన
    సామాన్యుండొకడిలనునసామాన్యముగన్
    కామమునకు లొంగక ని
    ష్కామాతురుడైన నరుడె కాంచున్ ముక్తిన్.

    రిప్లయితొలగించండి
  6. రాముని గొలుచుచు నిరతము
    నీమము దప్పక చరించు నిశ్చల మతితో
    ప్రేమగ తనసతిని వలచు
    కామాతురుడైన నరుడె గాంచున్ ముక్తిన్!!!

    రిప్లయితొలగించండి
  7. కోమల హృదయము గల్గిన
    సామాన్యుండొకడిలనునసామాన్యముగన్
    కామమునకు లొంగక ని
    ష్కామాతురుడైన నరుడె కాంచున్ ముక్తిన్.

    రిప్లయితొలగించండి
  8. కాముకు లీలాశుకు చి౦
    తామణి శ్రీకృష్ణ భక్తి,తత్వము తెలియన్
    శ్యామలదేహుని గొల్వడె
    కామాతురుడైన నరుడె కాంచున్ ముక్తిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పురణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. మిత్రులందఱకు నమస్సులు!

    నేమము విడచియు, వేశ్యా
    రామమ్మున కేఁగి, గేస్తురాలిం బితలన్
    బ్రేమ విడియు, రోసి, విగత

    కామాతురుఁ డైన నరుఁడె, కాంచును ముక్తిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండు మధుసూదన్ గారూ,
      విగత కామాతురుని గురించిన మీ పురణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. ఎన్.వి.ఎన్. ఆచారి గారి పూరణ....

    రామా! నీ పదసేవయె
    మా మా పాప హరణంపు మార్గం బనుచున్
    ఏమారక నెప్పుడు తత్
    కామాతురుఁడైన నరుఁడె కాంచును ముక్తిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్.వి.ఎన్. చారి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మా మా పాపముల నడఁచు మార్గంబని తా| నేమారక...’ అనండి. పద్యం మధ్య అచ్చులను విసంధిగా వ్రాయరాదు.

      తొలగించండి
  11. కామము ధర్మము నందున
    కామము హరి పదములందు కైవల్యమునన్
    కామ మ్మనఘము లం దీ
    కామాతురుఁ డైన నరుఁడె, కాంచును ముక్తిన్!

    రిప్లయితొలగించండి
  12. నేమము తప్పక నిరతము
    రాముని మది దలువ భవహరమ్మగు నిజమే
    రామాంకితుడౌ మోక్షపు
    కామాతురుడైన నరుడె కాంచును ముక్తిన్

    భామల పొందును గోరెడు
    కాముకు డొకరుండు వేశ్య కాంతల కొరకై
    గ్రామమ్మున వెదకగ నా
    కామాతురుడైన నరుడె కాంచెను ముక్తిన్

    (ముక్తి అనే పేరుగల వేశ్యను చూసాడని)

    నిన్నటి సమస్యకు నా పూరణ

    రుద్రుని యేడేండ్లకొడుకు
    భద్రుండు పరీక్షయందు వ్రాసెన్నిటులన్
    బద్రత నొసగెడు వాడగు
    భద్రాచలరాముడుండు బాసర యందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ మూడు పూరణలు (నిన్నటిదానితో పాటు) బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. ఈ మానవ జన్మమ్మున
    నేమారక దైవభక్తి నేర్పడినంతన్
    రామాశ్రితుఁడై మోక్షఁపు
    కామాతురుఁడైన నరుఁడుఁ గాంచును ముక్తిన్!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. . రామాయణ కృతి కర్తే
    కామాతురు డైన నరుడె|కాంచును ముక్తిన్
    రామామృత సారాంశము
    సామాన్యుడు భక్తిచేత సాధించె గదా {వాల్మీకి}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కర్త+ఏ’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘కృతికర్తయె’ అనండి. అలాగే ‘రామామృత పానమ్మున’ అనండి, అన్వయం కుదురుతుంది.

      తొలగించండి
  15. భామ సుమాలిసుత జనని
    తామరి ఖరదూషణాది దనుజుల కెల్లన్
    రామాస్త్ర హత ఖరుడు రా
    కా మాతురుడైన నరుడె? కాంచును ముక్తిన్
    ( నరుడె :కాదు రాక్షసుడు; రాక విశ్రవసుని భార్య)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      వైవిధ్యమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  16. శ్రీరాం గారి పూరణ....

    ఈ మేదిని వీక్షించగ
    కామమ్మొక మార్గ మగును; కైవల్యార్థుం
    డై మది ధర్మార్థోర్జిత
    కామాతురుఁడైన నరుఁడె కాంచును ముక్తిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరాం గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. నామస్మరణము మాత్రమె
    దామోదరు చెంత జేర్చు తననని, నిరతం
    బామోక్షమ్మును బొందగ
    కామాతురుఁ డైన నరుఁడె కాంచును ముక్తిన్.

    రిప్లయితొలగించండి
  18. కామముతో సంతత పర
    భామిని వలలోన జిక్కి వ్రయ్యుట కంటెన్
    క్షేమమగు నిజ గృ హిణిపై
    కామాతురుడైన నరుడె గాంచున్ ముక్తిన్

    రిప్లయితొలగించండి
  19. ఏమని చెప్పెద గోపన!
    నా మనమందున నొకటియె నందమ్మని శ్రీ
    రాముని పాదుక సేవను
    కామాతురుఁ డైన నరుఁడె కాంచును ముక్తిన్ :)

    రిప్లయితొలగించండి
  20. భామది వంటను తినకయె
    నీమమ్ముగ రోజురోజు నెల్లూరందున్
    కోమల విలాసు భోజన
    కామాతురుఁ డైన నరుఁడె కాంచును ముక్తిన్

    రిప్లయితొలగించండి